ఉయ్యాలలో పడుకున్న మా పాపకు ఎల్లుండి తొలి "ఉంగా"ది. ఈ ఉగాది- మా పాప ముఖంలో కనిపించే ప్రశాంతత, ఓ చిన్ని చిఱునవ్వు అందరికీ సమకూరాలని మనసారా అభిలషిస్తూ -
ఉగాదికి స్వాగతం. (పద్యాలకు ప్రోత్సాహం, సరస్వతీ పుత్రులు చింతా రామకృష్ణారావు మాస్టారు)
ఆరు రుచుల తోడ ఆమని నీకును
నయముగనిల తోరణములు గట్టి
ఊయల నిదురించు "ఉంగా"ది పాపతో
స్వాగతింతుమమ్మ సస్య లక్ష్మి!
ఇక్కడ మరో రెండు.


My best wishes to the little angel!
ReplyDelete"అందాల ఆమనీ ఆనంద దాయిని
ReplyDeleteఅరుదెంచినావటే అప్సరా భామినీ
పువ్వులే నవ్వులుగా పులకించి పోదువా
నవ్వులే పువ్వులుగా నన్ను మురిపింతువా"
ఎప్పుడో రేడియోలో విన్న ఒక ఉగాది గీతంలోని పంక్తులు. పాప కోసం!
మీ చిన్నారికి తొలి ఉగాది శుభాకాంక్షలు/ఆశీస్సులు.
ReplyDeleteవాం వాం బాలాయై చ నవవర్షశుభాకాంక్షాః :)
ReplyDelete@జీడిపప్పు : ThanQ.
ReplyDelete@సుజాత : కోకిల కూజితం లా చక్కగా ఉంది మీ గీతం. ధన్యవాదాలు.
@నాగమురళి : మీ చిన్నారికి కూడాను. లేటుగా స్పందిస్తున్నందుకు ఏమనుకోకండి.
@రాఘవ : ధన్యోస్మి.