Sunday, March 1, 2009

దాన వీర మూర్ఖ కేసీ ఆర్ (ఏక పాత్రాభినయము)



ముందుగా ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దానవీర శూరకర్ణ అభినయము చవిచూసి రండు.

ఇందలి
పాత్రలు పాత్రధారులు.
సుయోధనుడు
: చంద్రబాబు నాయుడు
కర్ణుడు
: కేసీఆర్
ద్రోణుడు
: ఓ సగటు ఓటరు మహాశయుడు
భీష్ముడు
: ప్రజాస్వామ్య వాది, గాంధేయ వాది అయిన ఒక అనుభవజ్ఞుడైన ఓటరు
ఇంకా
దుశ్శాసన (సీపీఐ), శకుని (బాలకృష్ణ) మున్నగు వారు పాల్గొన్నారు.

నేపథ్యము
: ప్రజాస్వామ్యమున ముఖ్య ఘట్టమైన ఎన్నికలు దగ్గర పడినవి. ఎన్నికలన - ఇవి ప్రజాస్వామ్యమునకు, అప్రజాస్వామిక పోకడలకు మధ్య జరిగెడు పరీక్షలేయని చెప్పవచ్చును. ఎన్నికలలో పొత్తులు (పార్టీల యొక్క భావస్వారూప్యమున చేసుకొనెడి ఎంపికలు) సర్వసాధారణము.ఓటరు మహాశయుడు ఎంపిక చేసుకున్నపార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేయును.

ఈ
నేపథ్యమున - వేర్పాటు వాద బీజములతో అంకురించిన తెలంగాణా ప్రముఖునకు, తెలుగు వారి ఉమ్మడి గౌరవభావములను నిలబెట్టుటకవతరించిన తెలుగుదేశ పక్ష అధినేతకు మధ్య పొత్తు నిలువదని ఓటరు మహాశయుడు ఆక్షేపించుచూ -

ద్రోణ
(ఓటరు) : వేర్పాటు వాద భావ సంజాతుడు, జాతి గౌరవమను అంశమున స్థాపించిన, తెలుగు దేశ పక్షమునతో పొత్తు కలుప అనర్హుడు.

(
కేసీఆర్ నిరాశగా వెనుకకు మళ్ళుచుండగా)

సుయోధనుడు
(చంద్రబాబు) : ఆగాగు.
ఓటరు
దేవా! ఏమంటివి ఏమంటివి.
ఓటు
నెపమున టీఆరెస్ సుతునకిందు నిలువ అర్హత లేదందువా? ఎంతమాట? ఎంతమాట?
ఇది
ప్రభుత్వ ఏర్పాటే కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కాదే! కాదూ, కాకూడదు, ఈ ఎంపిక అక్రమమని యందువా?
అయినచో
, అతి జుగుప్సాకరమైన నీ ఎంపిక (selection) ఎట్టిది?
తొట్టి కాంగ్రెస్ నకు పట్టముగట్టితివి కదా, నీది ఏ ఎన్నిక?
ఇంత
యేల? అస్మద్ శ్వసురుడు, నందమూరి కుల వృద్ధుడు అయిన ఆ రామారావు, లాలూ, ములయంలతో ప్రత్మామ్నాయ ఫ్రంట్ కు నాంది పలుకలేదా? ఆయనదే రకమైన పొత్తు?
నాతో
జెప్పింతువేమయ్యా? మన ప్రజాస్వామ్యమునకు మూలస్థంభమైన కాంగ్రెస్, తీవ్రవాద పుత్రిక ముస్లిం లీగ్ తో సంధి కలుపలేదా? ఆ ముస్లిం లీగ్ ఛండాలముగా తెల్లదొరలతో పొత్తును, ఆ పొత్తు పర్యవసానముగా పాకిస్తానము ను, ఆ పాకిస్తాను, తిరిగి బంగ్లా దేశమును, ఆ పిమ్మట కాశ్మీరమును మన దేశమునుండీ వేర్పరిచ లేదా? ఈ రకముగా సందర్భావసరములను బట్టి, క్షేత్ర, బీజ ప్రాధాన్యములతో సంకరమైన ప్రజాస్వామ్యము ఏనాడో కలుషితమైనది. అయిననూ, ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యము అని వ్యర్థ వాదమెందులకు?

భీష్మ
(గాంధేయ, ప్రజాస్వామ్య వాది) : నాయనా, చంద్రబాబు! నువ్వన్నట్టు ఇది ముమ్మాటికీ ప్రభుత్వపు ఎన్నికయే. చిహ్నమున్నవారందరూ పార్టీ నాయకులే. అందులో భావసారూప్యమున్న వారే పొత్తునకు అర్హులు.

సుయోధనుడు
(చంద్రబాబు) : ఓహో! భావ సారూప్యమా, అర్హతను నిర్ణయించునది?
అయినచో
తెలుగు దేశమున, సస్యశ్యామలమై, సంపద్విరామమై వెలుగొందు తెలంగాణమునకు నేడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించెద.
కమ్యూనిష్టు
సోదరా, అనర్ఘ నవరత్నశ్శక్త కిరీటమును వేగముగ దెమ్ము.
బావా
, నటరత్న బాలకృష్ణా, సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును దెప్పింపుడు.
పరిజనులారా
, పుణ్య ’మూసీ ’ నదీ తోయాధికములనందుకొనుడు.
కల్యాణ
భక్తులారా, మంగళ తూర్యారావములు అపస్వరంబుగ మ్రోగనిండు.
వంధిమాగధులారా
, కేసీఆర్ కు కైవారములు గావింపకుడు.
పుణ్యాంగనలారా
, వీరాలాకృత కృపాల ఫాల భాగమున, కస్తూరీ తిలకము తీర్చి దిద్ది, బహుజన సుకృత పరీపాక, సంలబ్ధ సహజ వేర్పాటు వాదికి వాంఛలు చెలరేగ, వీరగంధము దిద్ది తోడుకుని రండు.
నేడీ
శాసనసభా మధ్యమున, సకల రాజకీయ నాయకుల సమక్షమున, శతథా, సర్వథా, బహుధా, సహస్రథా, ప్రజాస్వామ్య విలువలను శాశ్వతముగా ప్రక్షాళన కావించెదను.

శతపరివార
సహిత, సహజ ప్రాజాస్వామ్య వ్యతిరేక మానస, మంజీరా తటనివాస, కేయూర కిరీట హార మణీవలయా, దుర్జన మిత్ర, సముజ్జృంభణ ఝర్జాఝర్జరిత సముపాద్య సమగ్ర అశౌర్యధరా, మిత్రీకృత చంద్రబాబు నాయుడా, మూర్ఖా పరావతరా, తెలంగాణారాజ్య రమా మనోవల్లభా, విజయీభవా, దిగ్విజయీ భవా!

చంద్రబాబు
: సొబగు సొబగు.

కేసీఆర్
: దాతా! నా రక్తము రంగరించి, నీ అరుణారుణ శుభ పాద పద్మ యుగళమునకు సంలేపనము గావించిననూ, నీ ఋణమీగు వాడను గాను. ఎచ్చటా నీతిని పాటించని ఈ తెలంగాణీయుడు తమ సర్వ అసమతా దృష్టికి దాసానుదాసుడు. నా తుది రక్తపు బిందువు కూడా, మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము, అహర్నిశము, అవిశ్వాసబద్ధుడనై, అహితుడనై ప్రవర్తింతునని, సర్వ సామంత మహీపాల మండలాధిపతులు, సమస్త ప్రజానీకము విచ్చేసిన, ఈ సభామధ్యమున శపథము గావించుచున్నాను.

చంద్రబాబు
: హితుడా! అప్రతిహత ’మూర్ఖ ’ వరేణ్యుడగు నీకు, తెలంగాణా రాజ్యమే కాదు, నా హోం శాఖనిచ్చి గౌరవించుచున్నాను.

************************************************************************

ఇది
కేవలం నవ్వుకోవటానికి మాత్రమే. అసంబద్ధాలు, ఇతర పొరబాట్లు పట్టించుకోవద్దని మనవి.

Wednesday, February 25, 2009

కల - నిజం

ఒకానొకప్పుడు "చెంగ్" రాజ్యానికి చెందిన ఓ వ్యక్తి కట్టెలు కొట్టుకుంటుండగా, ఓ బెదిరిన జింక తనున్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అతడు దాన్ని వేటాడి చంపాడు. ఆ తర్వాత అతడు ఓ గోతిని తవ్వి, చచ్చిన జింకనందులో పూడ్చి, పైన ఆకులతో కప్పి,ఆపైన మట్టితో కప్పేశాడు. ఆ తర్వాత కట్టెలు కొట్టటంలో మునిగిపోయి, ఆ పని పూర్తి చేసి, సాయంత్రం వేళకు ఇంటికి బయలుదేరబోతూ, తను చంపిన జింక కోసం వెతికాడు. అయితే అతడు హడావిడిలో జింకను పూడ్చిన స్థలం మరువటం వల్ల, నిరాశగా ఇంటిదారి పట్టాడు. తను జరిగిన విషయమంతా కలలా ఉందని గొణుక్కుంటూ వెళ్ళటం రెండవ వ్యక్తి విన్నాడు.

ఈ రెండవ వ్యక్తి, ఆ ప్రదేశం వెతికి, గోతిని తవ్వి, జింక కళేబరంతో సహా ఇంటికి చేరుకుని, తన భార్యతో చెప్పాడు."ఒక కట్టెలు కొట్టుకునే అతను జింకను చంపినట్టుగా కలకన్నాడు. అయితే తనకా జింక దక్కలేదు.నాకు దక్కింది.అతను కల అనుకున్నది నిజంగా జరిగింది."

దానికి రెండవ వ్యక్తి భార్య ఇలా అంది. "పగటి కల కన్నది నువ్వు. ఎవరైనా జింకను చంపి దాన్ని ఎక్కడ దాచారో మర్చిపోగలరా? కట్టెలు కొట్టుకుంటున్న వ్యక్తి నీకు కనిపించినట్టు, జింకను చంపినట్టుగా, ఇలా నీలో నువ్వే ఊహించుకుని కలగన్నావు. జింక మనకు దొరికింది. అతనెవ్వరో కల కంటే, అది నువ్వు నిజమని ఎలా భావిస్తావు?"

"నా భార్య చెప్పిందీ నిజమే. అయినా ఎవరు కల కంటేనేం? నాకు జింక దొరికింది. నేను దాన్ని వండుకుంటాను" అనుకున్నాడు రెండవ వ్యక్తి.

ఇక కట్టెలు కొట్టుకునే మొదటి వ్యక్తి, తీవ్రమైన నిరాశతో ఇంటికి చేరి, ఆ రాత్రి జరిగిన విషయాలను మొత్తం - అంటే రెండవ వ్యక్తి తన పక్కన నడుస్తూ, తన గొణుగుడును వినటాన్ని కూడా - కలగన్నాడు. పొద్దున లేచేటప్పటికి తన కలలో జరిగిన సంఘటనలు అన్నీ కళ్ళముందు ప్రత్యక్షం అయాయి. తన కలలో కనిపించిన జింకను పూడ్చిన గోతి తాలూకు ఆనవాళ్ళను వెతుకుతూ వెళ్ళి, అక్కడ ఉన్న అడుగుజాడలననుసరించి రెండవ వ్యక్తి ఇల్లు కనుక్కుని, జరిగింది గ్రహించి, న్యాయమూర్తి దగ్గర అర్జీ పెట్టుకున్నాడు!

న్యాయమూర్తి పూర్వాపరాలు విచారించిన మీదట తీర్పు చెప్పాడు. " కట్టెలు కొట్టుకునే వ్యక్తి - నిజమైన జింక, అబద్దపు కలతో ఆరంభించి, నిజమైన కల, అబద్దపు జింకతో ముగించేడు. రెండవ వ్యక్తికి దొరికిన జింక మొదటి వ్యక్తి కల తాలూకుది. అతని భార్య వాదనా పరిగణనలో తీసుకుంటే,, మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి ఇద్దరిదీ కలే. కాబట్టి జింక ఎవరికీ చెందరాదు. అయితే జింక తాలూకు కళేబరం నిజంగా కనిపిస్తూంది. కాబటి ఇద్దరూ జింక మాంసాన్ని చెరి సగం పంచుకోవాలి."

ఈ తీర్పు వివరాలు ఆసాంతం విన్న చెంగ్ రాజ్యపు రాజు, ఇలా అనుకొన్నాడు. " ఇది న్యాయమూర్తి కన్న కల మాత్రమే."


****************************************************************

12.

"What language is thine, O sea?"
"The language of eternal question."

"What language is thy answer, O sky?"
"The language of eternal silence."

రవీంద్రుడి సుభాషితం ఇది. ఇక్కడ "Thy" అన్నదాన్ని సత్యానికి అన్వయించుకుంటే - సత్యాన్ని ఎవరూ నిర్వచించలేరు. (నిర్వచించలేరు - అన్న నిర్వచనం తో సహా). ఏది సత్యం కాదో దాన్ని చెప్పగలరు మహా అయితే. దాన్ని ఓ శంకరుడో, ఉపనిషద్దర్శనికుడో, "నేతి" , "నేతి" పద్దతిలో, కనిపించిన ప్రతి వాదాన్ని ఆక్షేపిస్తూ వెళ్ళి, చివరకు ఓ శూన్యం (eternal silence) లో దాన్ని వెతుక్కుంటాడు. కృష్ణమూర్తి అయితే - Truth is the highest form of negative understanding- అంటాడు,

దాదాపు 2500 యేళ్ళ క్రితం, బుద్ధుడికి సమకాలికుడిగా ఓ దార్శనికుడు, ఓ ఋషి చైనాలో జన్మించాడు(ట). ఆయన పేరు లావు త్సు. బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చుని ధ్యానంలో ఉన్నప్పుడు నిర్వాణం చెందితే, ఈ మహానుభావుడు ఓ పండుటాకు చెట్టుపై నుంచీ రాలి పడటం తదేక దీక్షగా గమనించి, ధ్యానమగ్నుడై సత్యాన్ని ఆవిష్కరింపజేసుకున్నాడట. ఆ వ్యక్తి భావజాలం "తావోఇజం" గా చెప్పుకోబడింది. Tao - అంటే మార్గం. ఎలాంటి మార్గం? ఓ పక్షి గగనంలో ఎగురుతూ వెళ్ళింది. ఆ పక్షి మార్గాన్ని ఎవరూ అనుసరించలేరు.

ఎందుకంటే, గగనంలో ఆ పక్షి తాలూకు నడకల ఆనవాళ్ళు లేవు కాబట్టి. మార్గం అన్నది ఎవరికి వారు ఆవిష్కరించుకోవలసిన పరమ సత్యమే. (Truth is a pathless land). ఆ taoism లో జీవితాన్ని, సత్యాలను చెప్పటానికి ఉపయోగించుకున్న విధానం - anology. తెలుగు లో ఏమంటారో ఈ పదాన్ని? జీవితం లో శూన్యతను analogy సహాయంతో వివరించిన taoism తాలూకు కథ ఇది. ఇలాంటి కథ ఒకటి ఇక్కడ చూసి ఇదంతా వా(బ్లా)గాలనిపించింది.


****************************************************************