ఏదో మారుమూల పల్లెటూళ్ళో
నేలను తప్ప ఏదీ ఎరుగని మమ్మల్ను
మా కన్నతల్లి లాంటి నేలకు దూరం చేసి
భూమి శిస్తులు పెంచి వ్యవసాయమంటేనే భయంపుట్టేలా చేసి
మా చదువులను మాకే కొత్తగా నేర్పి
మా పురాణాలు, చరిత్రను అర్థం లేనిదని ఎద్దేవా చేసి
మా తోటి వృత్తి పనివాళ్ళ
కడుపు కొట్టి, వాళ్ళ అమ్మల్ని వేశ్యల్ని చేసి
మా సొత్తు దోచుకుని, మమ్మల్ని పేదల్ని చేసి
తిరిగి మా పేదరికాన్నే అవహేళన చేసి
మాలో జాతివైషమ్యాలను నింపి
మా సమస్యలను మమ్మల్ని పరిష్కరించుకోనీకుండా
మీరు కొత్త పరిష్కారాలను కనుక్కుని
వాటిని మాపై రుద్ది
చివరికి పోతూ పోతూ కూడా మా
గుండెలను చీల్చి
మాకో కొత్త జీవితం ప్రసాదించిన తెల్లవాడా
మేమేమయినా పర్లేదు,
నీవు బావుండాలి. చల్లగా ఉండాలి. తెల్లగా ఉండాలి.
మా క్షమయే మిమ్మల్ని మీకు
కొత్తగా పరిచయం చేసే స్వాతంత్ర్య దినమౌతుందన్న
ఆశతో - మా స్వాతంత్ర్య దినం రోజు
నీకోసం ఓ అమాయకుడు చేస్తున్న విన్నపం.

చాలా బాగుంది. క్షమను, ప్రేమను మించిన ఆయుధాలు మరొకటి లేవు.
ReplyDeleteజై హింద్ :)
ఇంతటి ఔన్నత్యం కాబట్టే, భారత సంస్కృతికి ప్రపంచం నీరాజనాలర్పిస్తోంది. మీకు హృదయపూర్వక స్వాతంత్ర్య శుభాకాంక్షలు.
ReplyDeletevaadu challagaa vuntaadu,thellagaa kuuda vuntaadu,manamenduku itlaa vunnamani mana paalakulanu kaneesam prashninchadam nerchukundaamu
ReplyDelete