తేదీ - జులై 12 వ తేదీ!
ఓ పల్లెలో.
ఆ రోజు ఆషాఢ మాసారంభం! తొలకరి జల్లు మొదలయింది. ఆ ఊరిపక్కన కొండ ఇలా ఉంది.
తస్సిన్నద్రౌ కతిచిదబలావిప్రయుక్తస్స కామీ
నీత్వా మాసాన్ కనకవలయభ్రంశరిక్తప్రకోష్టః
ఆషాఢస్య ప్రథమదివసే మేఘమాశ్లిష్టసానుం
వప్రక్రీడాపరిణతగజప్రేక్షణీయం దదర్శ.
ప్రేయసి విరహము అనుభవిస్తూ, ముంజేతి కంకణము లేని వాడయిన యక్షుడు ఆ పర్వతమందు కొన్ని మాసాలు గడిపి, ఆషాడమాసం మొదటి రోజు వప్రక్రీడలో నిమగ్నమైన ఏనుగులా కొండను ఆక్రమిస్తూన్న ఓ మేఘాన్ని చూశాడు.
పంటపొలం ఇలా ఉంది.
మా పాపాయి ఇలా అంది.
మా ఇంటి ముందు ఓ చెట్టిలా..
ఊరినుండి తిరిగి వస్తుంటే -
సూర్యకాంతం పూలు కూడా ’రవి’ ని చూడటం లేదు.
గత స్మృతులలో మునిగిన మధుగిరి కోట. ఆ కోట వివరాలిక్కడ.
జరిగి అప్పుడే ఎన్ని రోజులయ్యింది?


చిరంజీవీ!(భా)రవీ!
ReplyDeleteనిజంగానే నీవు బ్గాడిస్తానంటూ చక్కగా ఆడిస్తున్నావని ఇప్పుడే ఇక్కడ చూసి తెలుసుకొన్నాను.
ఇంతకీ మీ బుజ్జి పాపాయిని చూపించావు కాని నీవెప్పుడు మాకు కనిపిస్తావు?
అంతవరకూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడడమేనా మాలాంటి వాళ్ళూ?
శుభమస్తు.
చిన్నారికి శుభాశీస్సులు.
పాపాయి అక్షరాభ్యాసానికి హైదరాబాదు రావాలి. అప్పుడు తప్పక మిమ్మల్ని కలుస్తానండి. మీవంటి పెద్దల ఆశీస్సులే కావాలి పాపకు.
ReplyDeleteచాలా బాగున్నాయండీ ఫొటోలు. మీ ఊరొచ్చి చూడాలనిపిస్తోంది ఈ దృశ్యాలన్నీ.
ReplyDeleteబాగు బాగు.
ReplyDeleteమా ఊరి ఆషాఢ మేఘాలనిక్కడ చూడొచ్చు.