
అప్పి గాడు: ఏంది విశేషాలు?
సుబ్బి గాడు: అదేదో ఊర్లో టీచర్లు "తెలుగు మాట్లాడను అని పలకల మీద రాయించి పిలకాయల మెడకాయలకి యేలాడగట్టినారంట".
అప్పి గాడు : ఏమంటవ్ నువ్వు?
సుబ్బి గాడు : ఆ టీచర్ చెంపకు ఒక్కటి జవిరితే, అప్పుడు నెప్పికి "అమ్మా" అని అరుస్తదో, "ఓ మై గాడ్" అని అరుత్తదో సూడాల్నుంది.
అప్పిగాడు : నెప్పెడితే తెలుగు గుర్తొస్తది, కోపమొస్తే, ఎవున్తోనయినా వాదులాటకి దిగాల్నంటే మాత్రం ఇంగిలిపీసు గావల్న మన తెలుగోల్లకు.
సుబ్బిగాడు : అదేమన్నా, అట్లంటివి?
అప్పిగాడు : అవును మల్ల, ఏదైనా విషయం సాధ్యమైనంత స్పష్టంగా చెప్పాల్నంటే, లేదా, అది నాకు బాగా తెలుసు అని చెప్పాల్నంటేనో, మనోల్లకు తెలుగు మరుపొచ్చేస్తది.
సుబ్బి గాడు : ఎట్టేట్టా అర్థం గాలే.
అప్పిగాడు : ఈ సారి యాదైనా బ్లాగులో వాదులాట, సారీ, చర్చ జరిగేప్పుడు ఎల్లి సూడు, కొట్టుకోడం ఎక్కువయే కొద్దీ ఇంగ్లీసలాగ ధారగా కారిపోతా ఉంటది.
సుబ్బి గాడు : ఏందో అర్థం గాలే.
అప్పిగాడు : If the discussion gets deepened, You know you tend to choose ...
సుబ్బి గాడు : ఇంగ జెప్పద్దు. అర్థమయెలే!


కొట్టుకోడం ఎక్కువయే కొద్దీ ఇంగ్లీసలాగ ధారగా కారిపోతా ఉంటది.
ReplyDeleteవాస్తవం చెప్పారు.
భలే నవ్వొచ్చింది. వాస్తవికతని అద్దం పడుతూ సరదాగా చురకంటించారు కదా!..
ReplyDeleteమా ఊర్లో అలాంటివేమీ లేవండోయ్... ఎంత పెద్ద బూతులైనా తెలుగులోనే తిట్టుకుంటారు :-)
ReplyDeleteHow does a cosmopolitan Bangalorean ridicule the English language?
ReplyDeleteహిహి..తగిలింది.
ReplyDeleteఆంగ్లంలో ఎదుటివారు వ్యక్తిగతదాడి అనుకోలేని విధంగా విషయాన్ని బలంగా చెప్పటం సులభం అండీ (నాకు). తెలుగులో అలా చెయ్యాలంటే ఇంకా ఎదగాలి (నేను) :)
Look at that sentence ... That itself is grammatically incorrect :-)
ReplyDelete"ఇంగిలి పీసూ" అనేదానికన్నా "ఎంగిలి పీసు" అనవచ్చేమో!! పైకి సరదాగా అనిపించినా... అవేదన ధ్వనించింది... మంచి టపా....
ReplyDelete@విజయమోహన్ గారు, @మురారి గారు: నెనర్లు.
ReplyDelete@రవిచంద్ర గారు: మన ఊర్లలో అలానే లెండి. పెద్దగా డెవలప్పు కాలే కదా, అందుకు.
@యోగి గారు: నేను కూడా అలాంటోణ్ణే. అయితే పూర్తిగా కాదు. (మనలో మాట : దానిక్కారణం నాకు ఇంగ్లీషు వచ్చి సావదు)
@Anonymous: I want to screw english language.
@శివ : ఎంగిలిపీసు. బాగా చెప్పారు.
@Praveen Sarma : నేను చదువుకున్నది తెలుగు మీడియం. ఇంట్లో మాట్లాడేది తెలుగు. ఆఫీసు పని మీద 5 దేశాలలో తిరిగాను. ఆ ఐదు దేశాల్లోనూ ఎక్కడా ఇంగిలిపీసు లేదు, ఉపయోగపడే కాస్త ఇంగిలిపీసు, మామూలుగా ఎవడికైనా వచ్చుద్ది.
:D
ReplyDeleteమీడియావాళ్ళ కన్నా మన బ్లాగర్లు వెయ్యి రెట్లు మేలేనండీ.
ReplyDeleteఇదిగో ఇక్కడ చూడండి అసలైన కామే(ట్రాజే)డీ!
http://apmediakaburlu.blogspot.com/2009/10/blog-post_27.html
@ఆదిలక్ష్మి గారు : నెనర్లు.
ReplyDelete@కామేశ్ : టీవీ చూడ్డం మానేసి కొంతకాలమయింది. మానెయ్యడం ఎంత మంచిదయ్యిందో తెలుస్తూంది.
హ హ హా.... నవ్వీ నవ్వీ కళ్లల్లో నీళ్లు తెప్పించారు....
ReplyDeleteమీ దైన తరహాలో చాలా చక్కగా చురకేశారు :)
సూపరు :-)
ReplyDeleteSiva Kolanukuduru
ReplyDeletegaaari maate naa maata..
baaga raasaaru.
..
Hypocritical verses
ReplyDelete>>>>>>>>>>
I eat Telugu
I drink Telugu
I breath Telugu
I live with Telugu
But I don't want to admit my child in Telugu medium school"
>>>>>>>>>>
హి హి హి భలే చెప్పారు
ReplyDelete