ఇక్కడ ఆంధ్రామృతం గ్రోలి రండొకసారి.
ఆతుకూరి మొల్ల ఓ మహా కవయిత్రి. ఈ కవయిత్రి శ్రీ కృష్ణ దేవరాయల ఆశ్రయం పొందగోరి, రాయల వారిని స్తుతిస్తూ ఆయనపై ఈ పద్యం చెప్పిందట.
సీ || అతఁడు గోపాల కుండితఁడు భూపాలకుం
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు పాండవ పక్షుఁడితఁడు పండిత రక్షుఁ
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు యాదవ పోషి యితఁడు యాచక పోషి
యెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు కంసధ్వంసి యితఁడు కష్టధ్వంసి
యెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
గీ || పల్లెకాతఁడు పట్టణ ప్రభువితఁడు
స్త్రీలకాతఁడు పద్మినీ స్త్రీలకితఁడు
సురలకాతఁడు తలఁప భూసురులకితఁడు
కృష్ణుడాతండు శ్రీమహా కృష్ణుఁడితఁడు.
ఎంత సరళంగా ఉంది కదా. (పల్లె అంటే రేపల్లె అని ఇక్కడ అర్థం అనుకుంటాను)
ఆ సమయంలో రాయల పక్కనున్న రామకృష్ణయ్యకు ఆవిడ రాయల వారిని పొగడటం నచ్చలేదో, లేక ఆ పద్యం నచ్చలేదో, మరింకే కారణమో మరి, వెంటనే ఈ పద్యం చెప్పాడుట.
సీ || అతడంబకు మగఁడు ఈతఁడమ్మకు మగ
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు శూలము ద్రిప్పు నితడు వాలము ద్రిప్పు
నెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడమ్మున నేయు నితఁడు కొమ్మునఁ డాయు
నెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతని కంటను జిచ్చు నితని కంటను బొచ్చు
ఎలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
గీ || దాత యాతఁడు గోనెల మోత యితఁడు
దక్షుఁడాతండు ప్రజల సంరక్షుడితఁడు
దేవుడాతఁడు కుడితికి దేవుఁడితఁడు
పశుపతి యతండు శ్రీమహా పశువితండు.
ఇలా నందిని గురించి పద్యం చెప్పాడట. వికటకవి అని ఊరికే అన్నారా?
ఇంతకూ ఈ పద్యం విన్న తర్వాత రాయల వారికి కోపమొచ్చిందో, నవ్వొచ్చిందో? రాయల వారు ఆ కవయిత్రిని
మాత్రం అనుగ్రహించినట్టు లేదు. ఈ పద్యాలు రెండూ చాటువులు.
పై టెంప్లేటు (మూస) మనమూ వాడుకుంటే?
(ధీరు డతడు ఇప్పటి మగధీర యితడు
చిరు యతడు వెండితెర పై చిరుత యితడు)
Sunday, August 2, 2009
Subscribe to:
Post Comments (Atom)


బాగుంది సరదాగా! ఐతే వాళ్ళిద్దరూ సమకాలికులన్న దానిపై చాలా వివాదాలున్నాయి. నిజానికి రాయల కాలానికి చెందినవారా అనే దానిపై కూడా. వాదాలను పక్కనబెట్టి చూస్తే, కవిత్వ ఔచిత్యాలపై ఇతరులు వ్యంగంగానో, కటువుగానో విమర్శించడం, వాటిని ఆయా కవులు గౌరవంగా స్వీకరించడం కనిపిస్తుంది.
ReplyDeleteపెద్దనను కూడా "ఎమితిని సెపితివి కపితము..." అని విమర్శించాడని కథనం ఉంది.
:)
ReplyDelete:)
ReplyDeleteఆ పైదే కాదు ఆఖరులో మీ couplet కూడా బాగుంది :)
ReplyDeleteపద్యం, దాని వెనక కథ కూడా బావుంది
ReplyDelete