నాకు కొన్ని నెలల ముందు ఓ మైల్ వచ్చింది. పోకిరి టెస్టర్ అని. నిన్న పాత మైల్స్ చెక్ చేస్తుంటే మళ్ళీ కనిపించింది. ఇది పాత మైల్ అయినా, బక్నర్ కు అన్వయించుకుంటే ఎలా వుంటుంది అన్న వూహ వచ్చింది.
1. ఎవ్వరు అంపైరింగ్ చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, వాడే బక్నర్ గాడు. వాణ్ణి నేనే.
2. ఒక్క సారి కమిట్ అయితే, నా మాట నేనే విన్ను. (థర్డ్ అంపైర్ మాట కూడా వినడు)
3. ఒకరు ఔట్ ఇవ్వమంటే ఇవ్వను. ఆస్ట్రేలియా వాళ్ళు అప్పీల్ చేస్తేనే ఔట్ ఇస్తాను.
4. మీ ఇండియా లో వుండే వెంకట్రాఘవన్ అనుకున్నావా? ఎలా సెలెక్ట్ అయానో చెప్పనా ?
5. నేనెంత గుడ్డి వెధవనో నాకే తెలీదు.
6. (గంగూలీ తో)..రేయ్, ఇది నువ్వు ఒక్క సారి నా మీద రిపోర్ట్ ఇచ్చినందుకు. ఇంకా యేదైనా చేసావో...ఆడలేవ్..
ఇక శృతి .. శృతి గా మార్క్ బెన్సన్..
1. ఒహ్ గాడ్ నా పరిస్థితి ఇంక ఎవరికీ రాకూడదు., బక్నర్ తో..నీలో యేదో తెలీని గుడ్డి తనం వుంది. అదే నాకు నచ్చింది.
2. టెండూల్కర్ బ్యాటింగ్ చేసేటప్పడికన్నా నువ్వు అంపైరింగ్ చేసేటప్పుడే భయం వేస్తూంది. బట్ ...స్టిల్ ఐ లవ్ యూ...
పోకిరి బక్నర్ శృతి తో...
1. ఇచ్చింది , ఇచ్చినట్లుగా ఓ అని ఇండియన్స్ ని ఔట్ ఇచ్చి పారేస్తున్నావ్ కానీ, నా గురించి పట్టించుకున్నావా యెప్పుడైనా? అరే గుడ్డోడు, చెవిటోడే... కనీసం ఒక డెసిషన్ అయినా వదిలేద్దాం అని ఆలోచించావా ఎప్పుడైనా?


haha ha... good one
ReplyDeleteబావుంది కానీ గుడ్డి వెధవ అనటం అందులో బక్నర్ ను అనటం చాలా అవమానం వాళ్ళకు
ReplyDeleteఎక్సలెంట్ బాసూ...డైలాగులు అదిరాయి..కాదు పేలాయి
ReplyDelete- నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com
ఔట్ చేశారా లేదా అన్నది కాదండయ్యా, వేలు ఎత్తానా లేదా!
ReplyDeleteచాలా బాగుంది, అలాంటివాడిని ఎంత తిట్టినా తప్పులేదు,
ReplyDeleteనేనే టెండుల్కర్ స్థానంలో గాని, గంగూలి స్థానంలో గాని ఉంటే, మంచి షాట్ తో వాడి బుర్రపగలగొట్టేవాన్ని..
http://gv-world.blogspot.com/
sUpar
ReplyDeleteRavi too good
ReplyDelete