మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి దగ్గర రాక్షసులకు చదువు చెప్పటానికో గురువు పని చేస్తుంటాడు. ఆ "గురువు" గారి పేరు "చిన్నమయ్య". ఆ చిన్నమయ్య పాత్ర పోషించినాయన పొడుగ్గా, గెడకర్రలా ఉన్న రమణారెడ్డి! సదరు రాక్షస శిష్యులకు మాత్రం "గురువులు" , సంయుక్తాక్షరాలు పలకవు! "దుష్ట చతుష్టయము" అని పలకడానికి "దుషట చతుషటయము" అని అంటుంటారు. అలాగే అస్మదీయులు అనడానికి అసమదీయులు. అలానే "తసమదీయులు"...
ఇక్కడ "తసమదీయులు" అన్న పదం గురించి చెప్పుకోవాలి. సంస్కృతంలో "అస్మద్" శబ్దం ఉన్నది, అలానే "యుష్మద్" శబ్దమూ. అంటే అస్మదీయులు అన్న పదానికి వ్యతిరేకపదం యుష్మదీయులు అవాలి. కానీ ఆ సినిమాలో "తసమదీయులు" అన్న పదం ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి!
ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పుడు మాత్రం ఈ "తసమదీయులు" అన్నపదం మన మన రాజకీయ నాయకులకు బాగా సరిపోతుందనుకుంటాను. మొన్న ఎన్నికల ముందు వరకు గాంక్రెస్ అంటే, అసహ్యమూ, రోత అన్న రిచంజీవి గారు ఇప్పుడు తమకు 100 సీట్లు వస్తే గాంక్రెసు మద్దతు స్వీకరించేట్టు, అంతకన్న తక్కువ సీట్లు వస్తే, మద్దతు ఇచ్చేట్టు రహస్య ఒప్పందాలు చేసుకున్నట్టు వార్త. అంటే, రాజకీయాల్లో అస్మదీయులు, యుష్మదీయులు ఇద్దరూ లేరు, ఉన్నదంతా తసమదీయులే.
ఇదిలా ఉంటే, అలాంటి ఒప్పందం జరగలేదని డ్రామాను మరింత రక్తి కట్టించే ప్రయత్నం ఇంకో పక్క సాగుతోంది.
ఏతావతా, "యాక్టరు ముదిరితే రాజకీయ నాయకుడు" అన్న న్యూనుడి సార్థకమయేట్లు ఉంది.
Sunday, May 10, 2009
Thursday, May 7, 2009
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నా నివాళి.
గ్రీష్మం. హేమంతం, శిశిరం, వసంతం, వర్షర్తువు, శరత్తు - ఈ మిగిలిన ఋతువులన్నీ ఎందరో కవులను ఆకర్షించాయి. వసంతంలో కోకిల కూజితం ఓ కవికి ప్రణవమై, కవితా గానాన్ని ప్రేరేపిస్తే, శరజ్జ్యోత్స్నలు మరో కవిలో ప్రణయభావాలను మేల్కొలుపుతాయి. హేమంతం నీహారికలను అందిస్తే, ప్రావృష మేఘమాలలు మరోకవి, ప్రియురాలికి సందేశాన్నంపడానికి ప్రేరేపిస్తాయి.
మరి గ్రీష్మం?
గ్రీష్మానికి అచ్చట్లు ముచ్చట్లు లేవా?అలాఎండుతూ, మండుతూ కూర్చోవలసిందేనా?
..................
..................
పూర్తి వ్యాసం ఇక్కడ.
Subscribe to:
Posts (Atom)

