Sunday, September 2, 2007

సీమ నుండి సూడాన్ వరకు !!

సాఫ్ట్ వేర్ పక్షులు మామూలుగా US కు వెళతారు, కొండొకచొ UK, Germany, France గట్ర..అధమపక్షం Brezil. కంపనీ తరఫున నా మొదటి విదేశ ప్రయణం మాత్రం సూడాన్ (ఆఫ్రికా) కు జరిగింది. సూడాన్, ఆఫ్రికా లో అతి పెద్ద దేశం. మన దేశానికన్న బీదది. భయంకరమైన లంచగొండి దేశం.సివిల్ వార్ ఒక అదనపు ఆకర్షణ.మా వీసా కూడ ఒక విచిత్రం,ఎంట్రీ పర్మిట్ ఇచ్చారు అంతే. ఆ ఎంట్రీ పర్మిట్తో ముంబాయి ఎయిర్ పోర్ట్లొ అడుగు పెట్టాము. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ మా వంక అసహ్యంగ ఒక చూపు చూసి ముందుకు సాగనంపాడు. సూడాన్ లొ దిగ గానె సంచలనం. మమ్మల్ను పిక్ అప్ చెయడానికి వచ్చిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్ దాటుకుని వచ్చి మమ్మల్ను కలిసాడు. తర్వాత మా చెకింగ్ గట్ర లేకుండానె బయటకు తీస్కెల్లాడు. స్కానింగ్ మిషిన్ కూడా అతనె on చెసి, రన్ చెయదం ఇంకొ హై లైట్.


తర్వాత బయటకు అడుగు పెట్టగానే ఇంకో షాక్. కారు బదులుగా ఒక ట్రక్కు లాంటిది వుంది. ఆంటే వెనుక భాగం ఓపెన్. ముందు ఇద్దరు మాత్రమే కూర్చోవచ్చు. మేము నలుగురము. చేసేది లేక నేను ఇంకో కొలీగ్ వెనుకనె ఎక్కాము. నాకు బాల్యంలొ మేము బస్సుల మీద ఎక్కి కూర్చున్న ఙాపకాలు గుర్తుకొచ్చాయ్. మాకిచ్చిన అపార్ట్మెంట్ లో అన్నీ రివర్స్. తాళం వేయాలంటే యెడమకు తిప్పాలి. తీయాలంటే కుడికి. వగైరా వగైరా.

అయితే ఒక చిన్న రిలీఫ్.మా ఇంటి యెదురుగా ఒక తమిళాయన వుంటున్నాడు. ఆయన యేదొ పబ్లిక్ సర్వెంట్ అట.

అలా మా మొదటి రోజు గడిచింది.


రెండవ రోజు. 9 గంటలకు బయటకు రాగానే బయట ఇసుక తుఫాను. పొద్దున మంచు ఎలా కురుస్తుందో అలా దుమ్ము కురుస్తోంది.ఆ దుమ్ము లొనే ఆఫీసు కు వెళ్ళాము. సాయంత్రం ఇంటికి వచ్చి మా రూం మేటు స్నానం చేయాలని నాబ్ యెడమ (మనకు కుడి) వైపు తిప్పడానికి బదులుగా కుడి (మనకు యెడమ) వైపు బలంగా తిప్పాడు. అంతే. నాబ్ విరిగి నీళ్ళు ప్రవహించడం మొదలెట్టాయ్. ఇక అందరం ఆ నాబ్ ను ఫిట్ చేయడం లో పడ్డాం......

ఇక మూడవ రోజు. సడెన్ గా ఆఫీసు బయట పారా మిలిటరీ దళాలు. కాల్పులు, భాష్ప వాయు ప్రయోగం! ఎందుకో తెలీదు! మేము బాల్కనీ లో నుంచుని చూస్తున్నాము. మా కళ్ళల్లో కూడా నీళ్ళు కారాయ్. లోపలకు వెళ్ళి పోయాము.

ఇంకా కొన్ని ఙ్ఞాపకాలు.

అక్కడ కొంత మంది ఇండియన్స్ పని చెస్తున్నారు. వాళ్ళను కలిసాము. వాళ్ళలో ఒకతను చెప్పిన కథ. మామూలుగా మనం యెండ లొ తిరిగితే నల్లబడతాం. కానీ అక్కడ విపరీతమైన యెండ. ఒక్కో సారి కొంచెం చలి. ఇతను చలి లో తిరిగి యెందుకో యెమో నల్లబడ్డాడట (అలర్జీ కాబోలు). డాక్టరు వద్దకు వెళితే అతను అన్నాట్ట, నేనే నల్లగా వున్నాను (ఆఫ్రికా లో అంతా నల్ల వాళ్ళే). నేనెవరికి చెప్పుకోవాలి అని అడిగాడట.

ఇలా మా ప్రస్థానం 20 రోజులు సాగింది. మాకు కొన్ని మధురమైన ఙ్ఞాపకాలు కూడా వున్నాయి. నైలు నది (ప్రపంచం లో అతి పొడవైన నది) సూడాన్ నుండి ప్రవహిస్తుంది యెక్కువ భాగం. రాజధాని ఖార్తూం లో 2 నదులు (బ్లూ నైలు , వైట్ నైలు) కలిసి ఒకే నది గా ఈజిప్టు వైపు గా సాగుతుంది. సాయంకాలం ఆ నది అందాన్ని చూడ్డం మరపు రాని అనుభూతి.

అలాగే అక్కడ మనుషులు. బయట సివిల్ వార్ అదీ ఇదీ అని చదివి ఏదో వూహించుకుంటాం కానీ మేము కలిసిన వ్యక్తులు మంచివారు, స్నేహపాత్రులూను.

అలాగే ఇంకో సంగతి. పిరమిడ్ లు అనగానే ఈజిప్టు గుర్తొస్తుంది మనలో చాలా మందికి.అయితే ఎక్కువ పిరమిడ్లు, పైగా పురాతన పిరమిడ్ లు సూడాను లో వున్నాయి. ఇది ఆశ్చర్య కరమైన నిజం.

ఇవండీ నా ఙ్ఞాపకాలు. మీకు నచితే తెలియజేయండి.
వుంటాను,మీ రవి.

4 comments:

 1. బాగుందండీ మీ అనుభవం! నేను టెన్నెస్సీ లో ఉన్నపుడు మా ఇంటి పక్కన అతను సూడాన్ నుండి అన్నమాట. ఒకసారి వాళ్ళ ఇంటికి భొజనానికి వెలితే మాకు సమోస, దోస, ఇడ్లీ లాంటివి పెట్టాడు. ఇవి మీకు ఎలా తెలుసు అంటే చెప్పుకు వచ్చాడు, సూడాన్ లో భారతీయులు బాగా ఉంటారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం అని చెప్పాడు. సరదాగా ఉండేవాడు.

  ReplyDelete
 2. బాగున్నాయి మీ సూడాన్ అనుభవాలు. ఫారిన్ ప్రయాణం అనగానే యూఎస్ గుర్తొస్తుంది చాలా మందికి, ఇలాంటి ప్రదేశాలకి కూడా ఆన్సైట్ ఉంటుంది మరి :)

  ReplyDelete
 3. భలే! ఇంకా కొన్ని మీకు తప్పకుండా గుర్తుండేవుంటాయి. ఆలోచించి అవికూడా చెప్పండి. మీ భోజనం, వాళ్లభోజనం, అక్కడి శుభ్రత ... ఇరవైరోజులంటే చాలానే గమనించి ఉంటారు. మీ ఆఫీసులో పనిచేసేవారి నాగరితక, బయటిజనాల నాగరికత ...

  ReplyDelete
 4. శ్రీ గారు, మీరన్నట్టు సూడాన్ లో ఇండియన్ ఇంఫ్లుయన్స్ వుంది. మాకు కొంత మంది ఇండియా లో చదువుకున్న వాళ్ళు పరిచయం అయారు. వాళ్ళు మాతో హింది లో మాట్లాడారు కూడా.

  ప్రవీణ్, ఇంకో సంగతి చెప్పడం మరిచాను. నా రెండవ ఆన్సైట్ కూడా సూడానే. (మూడవది మాత్రం వేరే లెండి !)

  రానారె గారు, ఇంకా రాయచ్చు. లెంగ్త్ ఎక్కువ అవుతుందేమో అని . గుర్తు తెచ్చుకుని మళ్ళీ (పార్ట్ 2) రాయడానికి ప్రయత్నం చేస్తాను.

  రవి .

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.