Thursday, February 7, 2013

పాండిత్యం = జ్ఞానాభాస


ఆధ్యాత్మికప్రపంచంలో - ఎంచేతనో తెలియదు కానీ కొన్ని శబ్దాలను నిర్వచించి, వాటి గురించి నిర్దుష్టమైన అర్థంలో ఉపయోగించి మనవాళ్ళు తప్పు చేశారా అనిపిస్తుందొక్కొక్కసారి. అటువంటివాటిలో రెండు శబ్దాలు - జ్ఞానం, ఆత్మ.

జ్ఞానం - అని దేన్నయితో ఆధ్యాత్మికవాదులు అంటున్నారో అది నిజానికి తెలియదగింది కాదు. అంటే బుద్ధితో , మెదడు అనే పరికరంతో అంచనా వేయవలసినది కాదు. బుద్ధి చేత తెలియదగింది సమాచారం. ద్వంద్వాలకు లోబడినది మాత్రమే సమాచారం వల్ల తెలియదగింది. భావనాత్మక ప్రపంచం సంగతి వేరు. ఉదాహరణకు దుఃఖం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం - ఒక సమాచారం వల్ల తెలిసేది కాదు. ఒకవేళ అది సమాచారమే అయితే ఆ సమాచారాన్ని , అది ఎంత పెద్దదయినా సరే తెలుసుకుని దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు. అలా జరగడం లేదే. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని తీసిస్ లు చదివినా మనిషికి దుఃఖం అన్నది పోవట్లేదు. ఏదో కొద్దో గొప్పో కొంతకాలం పోతుంది, మళ్ళీ వచ్చి తగులుకుంటూ ఉంది. ఆ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం కావాలంటే - కనుక్కోగలిగే  జవాబు ప్రశ్నకు బాహ్యమైనది అవకూడదు. అంటే ఆ ప్రశ్నకు సమాధానం - దుఃఖం అంటే ఎమిటి? ఆ ప్రశ్న అంతరించడంలోనే ఉంది తప్ప మరొక విధమైన ప్రక్రియలో లేదు.

ప్రశ్న అంతరించడమంటే ఏమిటి? బుద్ధి లేదా మెదడు జవాబు కోసం వెంపర్లాడకండా మూలమట్టంగా తనలో తానే annihilate కావడం. అంటే మెదడు తను నిర్వర్తించే వ్యాపారాలను తనే ఏ విధమైన choice లేకుండా గమనించే ఒక స్థితి. ఆ స్థితిలో దుఃఖం అన్నది ఉండకపోవచ్చు.

ఈ స్థితి ఒక మనిషిలో స్వతఃసిద్ధంగా ఏర్పడగలిగితే అది నిర్వాణం అని బుద్ధుడి నిర్వచనం. ఆ స్థితిలో మనిషికి , ప్రపంచానికి భేదభావం కనిపించదట. చూచేవాడు, చూడబడేది, చూచుట అన్నీ నశించి, జగత్తు అణువణువునా తనూ, తనలో జగత్తూ స్పష్టంగా కనిపిస్తూ, ఏ విధమైన ద్వంద్వమూ ఏర్పడని దశ. ఆ వాక్యంలో - స్వతఃసిద్ధంగా - అన్నది ఎందుకంటే - ప్రయత్నపూర్వకంగా మెదడు వ్యాపారాలను గమనించడం అసంబద్ధం. ఎందుకంటే - ఆ ప్రయత్నం అన్నది బుద్ధిలో అంతర్భాగం కాబట్టి.  కానీ ధ్యానం మొదలు పెట్టాలంటే ఎక్కడో ప్రయత్నం తప్పనిసరి. అదే ఆ ప్రయత్నమే ఆ తర్వాత ప్రయత్నరహితమైన ’అలవాటు’ గా మారవచ్చు. బుద్ధిని ఏ మాత్రం వికల్పాలకు తావివ్వనీయకుండా అలా శాంతంగా కూర్చుని దాని తాలూకు వ్యవహారాలను గమనించడం చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పని పేరు విపశ్యన. (విశేషంగా చూచుట). ఇలా గమనిస్తూ ఉంటే కొంతకాలానికి ఆలోచనలు స్థంభించి, ఆ పని తనంతట తానే జరగడం మొదలు అవుతుంది. దాన్నే ధ్యానం అన్నారు. ఈ ఆలోచనలు స్థంభించి, ఆలోచనల మధ్య ఖాళీలు ఏర్పడే దశను ’సతోరి’ అని జెన్ బౌద్ధులు అన్నారు. అ సతోరి ముదిరితే సమాధి అవుతుందని వాళ్ళంటారు.

ఈ వ్యవహారాన్ని అట్నుంచి నరుక్కొస్తే - దుఃఖం ఎందుకు వస్తుంది? అంటే కోరిక వల్ల అని బుద్ధుడు. (అష్టావక్రుడు కూడా) కోరిక తీరితే - ఓస్ ఇంతేనా అని దుఃఖం, తీరకపోతే తీరి ఛావలేదని దుఃఖం. కోరిక అన్నది ఎలా కలుగుతూంది? ఎంపిక (choice) వల్ల. నాకు సంతోషమే కావాలి. సుఖమే కావాలి, సెక్యూరిటీయే కావాలి, బాధలొద్దు, తనకలాట వద్దు అన్న బుద్ధి తాలూకు ప్రేరణ వల్ల. అలాగని కోరికలను చంపేసుకునో, వైరాగ్యపు పాటలు వినో వైరాగ్యం కొని తెచ్చుకుంటే - అది భారం అవుతుందే తప్ప అందువల్ల root cause సమిసిపోదు. ఈ choice - బుద్ధి వల్ల కలుగుతా ఉంది. బుద్ధికి ఇలా జీవితంలో ప్రతీక్షణం ఒక choice కోసం వెంపర్లాడే ప్రవృత్తి ఎలా వచ్చింది అంటే దాని లక్షణమే అంత. దాని స్వభావమే అలాంటిది. ఆ స్వభావాన్ని దాటి ఆవల ఏముందో తెలుసుకోవాలంటే - choice-less awareness కావాలి. అదే ఇందాకటి విపశ్యన. ఆ విపశ్యనకు అంతిమప్రస్థానమే బుద్ధాదులు పొందిన సమాధి. దీన్నే జిడ్డు కృష్ణమూర్తి అన్న ఆధునిక బుద్ధుడు Mutation of brain cells అన్నాడు.

సరే మనం మామూలు మనుషులం. అలాంటి స్థితి పొందలేం. ఊరికే మాట్లాడుకుని అలాటిదొకటుందని ఫిక్స్ అవచ్చు. అయితే ఇక్కడ చర్చ ఆ స్థితి ఎలా కొనితెచ్చుకోవడం అని కాదు. ’జ్ఞానం’ అనే ఒక పదం గురించి.

ఇందాకటి స్థితి - అనుభవానికి మాత్రమే లోబడగలిగినది. అది సమాచారం కాదు - అంటే సమాచారం ద్వారా తెలిసే వాస్తవం కాదు. That is not a knowable entity. అంటే - Unknowable cannot be known. It will be only realized as - unknowable, after mind annihilates itself by getting out from the realms of known and unknown. దీన్నే జిడ్డు కృష్ణమూర్తి ’సత్యం’ గా ప్రవచించాడు. ఇందాక అన్నట్లు ఇది స్పష్టంగా ఇతమిత్థమని చెప్పలేనిది, కానీ సూచించగలిగేది మాత్రమే. అది ఒక ఆలోచనలకు ’అభావ’ మైన స్థితి. అంటే శూన్యస్థితి.

పరిస్థితి ఇలా ఉంటే జ్ఞానం అన్నదాన్ని - సమాచారం అన్న అర్థంలో చెప్పడం వల్ల - పండితులు జ్ఞానులై కూర్చునే ఒక పరిస్థితి ఏర్పడింది. జ్ఞానం అంటే తెలియదగింది అని నిర్వచనం చెప్పారు కాబట్టి తెలియదగిందంటే ఏదో ఒకటుండాలి కాబట్టి భగవంతుడు అన్న object వచ్చి చేరింది. భగవంతుడంటే? - ఇల్లా తెల్లబట్టలు చుట్టుకుంటాడు, ఇలా నడుస్తాడు, అలా ఆలోచిస్తాడు. ఎక్కడో ఉంటాడు, వాడికి కోపం వస్తుంది. వాడు పిల్లవాడిలా ప్రవర్తిస్తాడు. వాడికి లడ్డూ ఇష్టం వగైరా వగైరా వగైరా. ఇందువల్ల జ్ఞానం అనేది ఎందుకు కావాలో అన్న ప్రశ్న నశించింది. మొత్తం వ్యవహారం పక్కదారి పట్టింది. పండితులు బయలు దేరారు. వారికి అనుసరణీయులు తయారయ్యారు.

ఈ జ్ఞానం మెల్లగా చాప కింద నీరులా ’మతం’ క్రిందికి చేరింది. ఏదో చాలా నిగూఢమైనది, కష్టపడి అర్థం చేసుకోగలిగినది, ’సంస్కృత’ భాషలో ఉన్నది అయిన ’సమాచారం’ మన మహర్షులు మనకు ఇచ్చి పోయారు. అది తెలుసుకుంటే మనం జ్ఞానులు అవుతాం. అది తెలియని వాడు అజ్ఞాని. అది ఒక ముక్క తెలిసి, అంతా తెలిసినట్టు మాట్లాడే వాడు కూడా జ్ఞానమార్గంలో ఉన్నాడు కాబట్టి ఏ మాత్రం తక్కువ తినలేదు. వాడి గురించి మాట్లాడ్డమా? అమ్మో? - తప్పు కదూ? ఈ భావాలు మనలో రక్తంలో, అణువణువునా ఇంకి పోయాయి.

ఇక్కడ ఒక విషయం. ఈ మాట్లాడుతున్నదంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో అని గుర్తు చేస్తున్నాను. లౌకికం వేరు, ఆధ్యాత్మికం వేరు. లౌకికంగా ఆలోచిస్తే - వైద్య విద్య (లేదా జ్యోతిషం/నిరుక్తం, వ్యాకరణం ఏదైనా) అని ఒకటుందనుకుందాం. లౌకికంగా ఆ విద్యను ఎవరో అందించిపోయారు కనుక వారి మార్గాన ప్రయాణించడం అవసరం. ఆ విద్యకు రూపకర్తలను గుర్తించడం ఒక విధి. ఆ విద్య బుద్ధి పరిధికి చెందినది కాబట్టి బుద్ధితో సమగ్రంగా తెలియదగింది కాబట్టి అక్కడ విద్యను, కర్తలను ఆరాధించడం మానసిక అవసరం. అలాగే దైవభక్తి. దేవుడున్నాడా అన్న శంక ఒకపక్క పీడిస్తున్నా, దైవభక్తి మాత్రం - మనిషికి మానసిక అవసరం. దేవుణ్ణి నమ్మడం మనిషికి బలహీన క్షణాలలో మానసిక బలాన్ని, సాంత్వననూ, చిత్తశాంతిని ప్రసాదిస్తుంది. పైగా ఈ విశ్వాసమే బలమయిన ఉపకరణంగా లౌకికంగా, ఆధ్యాత్మికంగానూ ఉపకరించగలదు. ఆధ్యాత్మికమంటే - నాస్తికత్వం కానవసరం లేదు.ఆధ్యాత్మికమంటే బౌద్ధిక దృష్టికి అందని నమ్మకానికి చెందినదనీ పొఱబాటు పడనక్కర లేదు. ఇది రెంటికీ మధ్యసంగతి. పూర్తిగా వ్యక్తిగతమైనది, వ్యవస్థాగతానికి భిన్నమైనదీనూ.

కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో, existential dilemmas ఎందుకొస్తున్నాయి అన్న విషయానికి సంబంధించి ఒక ఆలంబన - ’crutch’ ఎందుకు కావాలి? ఆసియా నుండి యూరోపుకు వెళ్ళడానికి భౌతికంగా విమానం కావాలి. దుఃఖం అన్నది తెలియడానికి ఎక్కడికి వెళ్ళాలి? దుఃఖాన్ని noun గా కాక, verb గా realize అవగలగాలి. అంతే. అంటే గతం, భవిష్యత్తు నశించి, శుద్ధమైన వర్తమానంలో జీవించడం తెలియాలి. అదే అసలైన జ్ఞానం. ఇది సమాచారం కాదు, ఎఱుక మాత్రమే అని మళ్ళీ మరోమారు జిడ్డుకృష్ణమూర్తి ఉవాచ. (మనకు ఆ దృశ్యం లేదు. ఇలా సొల్లు మాట్లాడుకుంటే ఒక ఊరట)

ఇప్పుడు మన కర్తవ్యం ఏమంటే - జ్ఞానం అన్నవెంటనే అది పండితుల గుత్తసొమ్ము అన్న మాటను అంగీకరించకపోవడం. ఒకడెవడైనా జ్ఞానాగ్నిదగ్ధకర్ముణ్ణి, బ్రాహ్మీమయమూర్తిని అంటే అతడికి అనుభవజ్ఞానం ఉందని పొఱబాటు పడనవసరం లేదు. అతనికి గౌరవం ఇయ్యవచ్చు, తప్పులేదు. అయితే అతడు ఆధ్యాత్మికమార్గంలో అనుసరణీయుడు కానవసరం లేదు. అతడు చెప్పేదంతా ’జ్ఞానం’ అని సర్దిపుచ్చుకుని ’మహత్త్వం’ ఆపాదించెయ్యడం పొఱబాటని గుర్తెరగాలి. ఇది ఒక అవసరం.

మనం జ్ఞానం ఏదో తెలుసుకోకపోయినా పర్వాలేదు. ఏది జ్ఞానం కాదో దానిని తెలుసుకుంటే అదే ఏదో ఒక రోజు మనకు మార్గం చూపించవచ్చు. అంతే కాక, ఒక పొరబాటు విషయానికి మహత్వం ఆపాదిస్తే ఆ మహత్వం చేసే కీడు బయటికి కనిపించనిది. పండితులను ఆరాధించడం కూడా అటువంటిదే.

అదీ సంగతి.

మరొకటి ’ఆత్మ’. దీన్ని కూడా మనవాళ్ళు పాజిటివ్ టెర్మ్స్ లో నిర్వచించి కష్టపెడుతున్నారు. సాంఖ్యయోగంలో గీతాకారుడంటాడు - ఆత్మ నాశనము లేనిది, ఆత్మ అన్నదానికి ఉత్పత్తి, వ్యయము, ,వృద్ధి, విపరిణామం, క్షయం ఇలాంటివి లేవు. దీన్ని అగ్ని కాల్చదు, నీరు తాకదు, దీన్నెవరు చీల్చలేరు, అసలు దీన్ని గురించి బుద్ధితో కూడా తెలుసుకోలేరు, దీనికి పుట్టుక లేదు, మరణం లేదు......ఈ తీరుగా కొండవీటి చేంతాడంత లిస్టు లక్షణాలు వెతికి పట్టుకొచ్చి వాటిల్లో ఒక్క లక్షణమూ ఆత్మకు లేదు అని ’ఆత్మ’ కు అనిర్వచనీయమైన నిర్వచనం చెప్పేశారు మనవాళ్ళు. ’ఫలానాది ఏదీ లేదు’ - ఈ వాక్యం ఎంత అసమంజసంగా ఉందో, అలానే ఏదీ లేని, అసలు ’తెలుసు’కోలేని ఆత్మ గురించి ’తెలియ’ జేసే ప్రయత్నం ఎందుకు? (అర్జునుడు మహాభక్తుడు కాబట్టి అనుకోవచ్చా?).

మరొకటి - ’అచ్చేద్యోయమచింత్యోయమవ్యక్తోయం’ అయినది ఆత్మ. అది శరీరం బట్టలు విప్పి కొత్త బట్టలు కట్టుకున్నట్టుగా దేహాన్ని విడిచి మరో దేహాన్ని పొందుతూ ఉంటుంది అన్నారు. అంటే ఒక్కో మనిషికి ఒక్కో ఆత్మ representative గా ఉంటుందా? లేక మానవులందరికీ కలిపి ఒకే ఆత్మ నా? ఆ శ్లోకం ప్రకారం అయితే ఒక్కోమనిషికి ఒక్కో ఆత్మ అనుకోవలసి వస్తున్నది. అంటే ఆత్మల జనాభా - ప్రపంచజనాభాతో సరిసాటి. ఇంకా జంతువులకూ ఆత్మలు ఉంటే వాటి ఆత్మలూ పరిగణనలోకి వస్తాయి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో జీవరాశులు. (ఇన్ని ఆత్మలను maintain చేసి మరణానంతరం appraisals చేయడం సామాన్యమైన పని గాదు.)

లేదు ఒకటే ఆత్మ అంటే - ఆ ఆత్మకు లక్షణాలు లేవు కాబట్టి అదొక pure witness కు ప్రతీక అనుకోవచ్చు.

ఈ వికృత వాఖ్యానం ఎవరినో బాధపెట్టడానికి చేయటం లేదు. క్షమించాలి. అమంగళం ప్రతిహతమగుగాక. ఆధ్యాత్మిక విషయాలలో ’బుద్ధి’ అన్న దాని గురించిన పరిధిని గురించి ప్రతీకాత్మకంగా ఊహించడానికి ఈ తపన. భగవంతుడయినా సరే, అల్పులయిన మన బోటి మానవులకు విషయాలు చెప్పాలంటే - దానిని ఏదో భాషలో చెప్పవలసిందే. భాష - అనగానే దానికున్న పరిధి దానిది. అది జ్ఞానాన్ని పూర్తిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పలేదు. అందుకనే కొందరు గొప్ప జ్ఞానులు, కవులు కూడా అయిన వారు - భగవంతుడి భాష మౌనం అన్నారు.

సరే మళ్ళీ మొదటికి వస్తే - మహాత్ముడు బుద్ధుడు ఆ witnessing ను అలానే ఉంచేశాడు. ఆయన ’ఆత్మ’ అనే ఒక entity ఉనికిని చెప్పలేదు. ’అనాత్మ’ అంటాడాయన. మరి శాశ్వతంగా ఏదీ ఉండదా? మరి శాశ్వతంగా ఏదీ లేకపోతే ఇక ఆనందాన్ని అనుభవించేది యేది?

ఆనందాన్ని అనుభవించేది, ఆనందానుభవం, ఆనందమూ ఇవేవీ లేదు. నిర్వాణం అంటే - Total annihilation. అదే వ్యక్తమూ, అవ్యక్తమూ అయిన జగత్తు తాలూకు యథాతథ స్థితి. భౌతికంగా అన్ని వస్తువులూ నాశనం కావలసిందే. ఆధ్యాత్మికంగా కూడా ఏదీ మిగలదు. ఆ స్థితిని ’తథాథ’ అని ఆయన సూచించాడు. అష్టావక్రగీత దాదాపుగా బుద్ధబోధ లాగానే ఉంటుంది.

ఇంతకూ నా బాధ యేమంటే - ’ఆత్మ’ ఫలానా అని చెప్పడం వల్ల - మళ్ళీ పండితులు బయలు దేరారు. వివరణలు మొదలయ్యాయి. కొన్ని లౌకిక వ్యవహారాలకు - ఆధ్యాత్మిక రంగంలో ఆలోచించవలసిన ’ఆత్మ’ ను వాడుకున్నారు. ఆ ’ఆత్మ’ను - వర్ణవ్యవస్థ తాలూకు వ్యాఖ్యానాలకు ఉపయోగించి కలుషితం చేశారు. పాండిత్యంతో మభ్యపెట్టారు. పాండిత్యాన్ని ’జ్ఞానం’ గా వ్యాపింపజేశారు. నిజానికి ’ఆత్మ’ - అచింత్యం అన్నా కూడా దానిని ’చింత్యం’ గా మార్చారు.

కనుక మన కర్తవ్యం ఏమిటంటే - తెలియని విషయాల గురించి మనకు తెలియదని ఒప్పుకోవడంతో బాటు - ఎవరైనా తెలియజెప్పబోతే వారి ఉద్దేశ్యం ఏమిటో జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు తెలియనిది తెలియనిది గానే ఉండడంలో తప్పేమీ లేదని గుర్తెరగాలి. ఏ విషయమూ తొందరపడి జ్ఞానంగా ఎంచడం తప్పని మనకు అర్థమవాలి. జ్ఞానం - సమాచారం కాదు. వంద పుస్తకాలు రాశాడనో, అనేక సంగతులు తెలుసుననో ఒక ’పండితుణ్ణి’ - జ్ఞానిగా చెయ్యటం మహాప్రమాదం. పండితుడంటే వందల కొలదీ విషయాలు తెలిసిన వాడు కాదు. అది కెపాసిటీకి చెందిన విషయం. అన్ని విషయాలకు మూలకందమైన దాని స్ఫూర్తిని ఎఱిగినవాడు పండితుడు.

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శునిచైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః ||

పండితుడంటే - వినయసంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి, శునకమాంసం తినే వాడిని సమంగా చూడగలిగినవాడు. ఈ స్ఫూర్తి లేకుండా ’జ్ఞానం’ ’గురించి’ పేజీల కొద్దీ వివరణలు చేసిన వాణ్ణి పండితుడుగా గుర్తించటం చాలా పెద్ద పొఱబాటు.

కాబట్టి పండితుడికి, టన్నుల కొద్దీ సమాచారం సేకరించిన లేదా మాట్లాడగలిగిన మేధావికీ పొంతన లేదు.

అదీ సంగతి.

(ఈ టపా నా సొల్లు మాత్రమే. దీనికి ఎవరైనా బాధపడితే - నా పూచీకత్తు లేదు.)

26 comments:

 1. I am typig in English what I remember because typing in telugu takes time and translation is not easy.

  excerpt from Swami Satyananda Saraswati's book - Letters to visvaprem..

  "You have asked a good question about existence of God. You see a man who has heard a lot about Rishikesh. He tells you how to go and what to do becuase he heard all these things and know for certain Rishikesh exists and how to get there. But you ask a man who has really seen Rishikesh and he can tell you the same exact thing. Who should you beleive? You should believe both becuase the first man, though has not seen Rishikesh, has heard a lot about Rishikesh and can tell you about it. The second man has actually seen Rishikesh. He can give more details and his experience of how to get there. But please remember that neither of these two can take you to Rishikesh. You have to go there yourself. The same goes for God too. The first one is called Brahma srOtriya and the second one is Brahma nishta. The first one has heard about God but the second one has actually realized God."

  In the same vein he says in the book..."Does God exist? Why should I assume He does? OK, let us do this small math. In the first grade you are told that if you have to get to the result of a sum initially you have to assume something and then at the end of calculation you arrive at the result and feel good to have solved the problem. If even for solving a trivial math problem you have to assume something, why you feel hesitation to assume when you are solving the equation of God and His creation? So one assumes there is God and when we realize we know what we assumed."

  My thoughts....

  Swamiji was explaning about existence of God and who to beleive. There seems to be a realm where mind ceases to function and the intellect does not question. That realm is full of peace and happiness becuase once the mind ceases, actions cease and the wheel of Karma stops. Whatever you are then required to do will be collected from you like the taxes and you are out of the wheel of birth and death.

  And about the atma in each being.. We already have the sloka "pUrnamadah pUrnamidam.." It appears there is one atma. It is so microcosmically small we cannot even imagine how small. May be smaller than the Higgs Boson. How to imagine that all these combine together and make bigger atom? Dont imagine anything. Why because, the atma is said to be 'avyaktam." not something you can explain; it is so because anything you can express is dependent on the intellect and buddhi and mind. But Atma is beyond all these. So how does it feel when you recognize Atma? Speechless. :-) How to become speechless is in our own hands.

  This is what I read in books. On practice side, my worth is a zilch of course.

  Sorry this has become more than I wanted to type at first.

  (Not editing again after typing all this.. so mistakes are all mine.)

  ReplyDelete
  Replies
  1. Beautiful introspection. But personally my vote is for saying there is no atma. Why we need to define something as achintya, which eventually provokes everybody to make it chintya? It is like secret door in 'chandramukhi' movie. but in this case - Inside the door nothing exists, but everybody talks about that door, which is made exploitable.

   Delete
  2. It is everybody's knowledge that 'He' is different from 'his' body. Then who is this 'He'? You can have some idea about 'You' in deep sleep (sushupti). The whole advaita vedanta is built on this. That is why Adi Shankara, in His Brahmasutra Bhashya, starts with 'yuShmad asmad pratyaya gOcharayO, viShaya viShayiNO......'. Here it is shown that 'He' as jeevatma or prAgna only to finally to prove it as pure Atman.

   Delete
 2. ఏదీలేని, అసలు తెలుసుకోలేని ఆత్మగురించి చెప్పేదెందుకు?
  ఏదీ లేకపోవడం అంటూ లేదు. ఏదైతే ఉందో దానికి ఏ గుణాలు, లక్షణాలు లేవని కదా చెప్పబడింది. ఉంది. ఒక్కటే ఉంది. అదే సత్యమైనది.
  అసలు తెలుసుకోలేకపోవడం అనేది మన స్థాయికి నిజమే. కానీ అందరిలో ఉన్న పదార్థం ఒక్కటేనని, తనది అని చెప్పబడే శరీరం తను కాదని తెలుసుకున్న వాళ్ళు రమణ మహర్షి లాంటి కొన్ని ఉదాహరణలు మనకు ఉన్నాయి. మనం స్వయంగా చూడకపోయినా, నమ్మకపోయినా నమ్మదగ్గవి అని ఒప్పుకోగలిగే సంఘటనలు ఉన్నాయి అలాంటి వారికి సంబంధించినవి. కోట్లలో ఒకరో ఇద్దరో, పదిమందో ఖచ్చితంగా "తెలుసుకోగలగటం" అనేది జరుగుతుంది.
  తరగతి గదిలో ఉన్న అందరికీ ఆల్జీబ్రా అర్థం కాకపోయినా అర్థం చేసుకునే స్థాయి ఒకరిద్దరికైనా తప్పకుండా ఉన్నట్టు.
  అర్జునుడు మహా భక్తుడు కాబట్టి కాదు. జ్ఞాన స్వరూపులయిన నరనారాయణుల్లో నరుడే అర్జునుడుగా వచ్చినాడుకాబట్టి తెలియజేస్తే తెలుసుకునే స్థాయి అతనికి ఉందని గీత చెప్పినవానికి తెలుసుకాబట్టి చెప్పినాడు.
  ఒక్కోమనిషికి ,ప్రాణికి ఒక్కో ఆత్మ ఉంటుందా?అందరికీ ఒక్కటేనా?
  అందరిలో అన్నిటిలో ఉన్న ఆత్మ ఒక్కటే. ఒకే విషయాన్ని ప్రింట్ చేసి, లక్షలు, కోట్ల నకళ్ళు తీసినా, అందులో ఉన్న విషయం ఒక్కటే అయినట్టు.
  లౌకిక వ్యవహారాలకు ఆత్మని జోడించి చెప్పే, సమాచార జ్ఞానాన్ని "జ్ఞానం"గా చెప్పే పండితులనే వాళ్ళు బయలుదేరడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇందువల్లే అసలు అన్వేషణ నుంచి మనిషి దారితప్పి అభ్యున్నతి చేరకుండా పోతున్నాడు.
  మీరు చెప్పిన దాంట్లో వికృతాలు, అమంగళాలు ఏవీ లేవు. ఇవన్నీ ఇంకా లోతుగా ఆలోచించే వేదాలు, వాటి వ్యాఖ్యానాలు ఎన్నో వెలువడ్డాయి. శ్రీ శంకరాచార్యుల వారు, ఇంకా ఎందరో వీటికన్నీ సమాధానాలు వ్రాసియున్నారు.
  ఇంక మీరు ఆఖర్న చెప్పిన శ్లోకం అన్నీ చెపుతున్నది. అంతకంటే ఏమీ అవసరంలేదు.

  భగవంతుడు ఇట్లా ఉంటాడని, చేస్తాడని చెప్పడం ఎందుకు అంటే ఎక్కడ్నించో ఒకక్కడ్నించీ మనిషి అన్వేషణ మొదలు పెట్టాలని వాని దృష్టి అటువైపు మళ్ళించాలనే ఉండవచ్చు. అది మొదటి మెట్టు మాత్రమే. అదే గమ్యస్థానం కాదు. దాన్ని దాటుకునే వెళ్ళాలి, నిరాకార నిర్గుణమైన సత్యాన్ని అందరూ పట్టుకోలేరు. వేగం, కాలం గుణించేటప్పుడు ఒక రైలునో, గుర్రాన్నో తీసుకోవడం ఒక సాధనం మాత్రమే. మన ఊహకు అందాలనే. అది లేకుండానే వేగం కాలం గుణించాలంటే అందరికీ ఆ స్థాయి ఉండదు.
  నేను మీకన్నా ఖచ్చితం గా తక్కువే "చదివి"నానని నాకు బాగా తెలుసు. కానీ నాకు తెలిసినంతలో ఈ విషయాల గురించి మాట్లాడకుండా ఉండలేక వ్రాస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. మీ ఆలోచనలు బావున్నాయి. తీరిగ్గా ఆలోచించాలి. చక్కటి కంటెంట్.

   Delete
  2. There is something called arundhati nyAyam. In that, the newly married couple, while being shown the arundhati nakShatram, will be directed to a branch of a tree and then to a bright star and then finally say the twinkling star next to that bright star is arundhati.

   Delete
 3. //ఆ ’ఆత్మ’ను - వర్ణవ్యవస్థ తాలూకు వ్యాఖ్యానాలకు ఉపయోగించి కలుషితం చేశారు.// ఎక్కడ?

  ReplyDelete
 4. విషయాల గురించి సొంతంగా ఆలోచించడం, ఒక అవగాహన ఏర్పరచుకోవడం; చదివిన విషయాలు (అవి ఎంత గొప్పవాళ్ళు చెప్పినవైనా సరే) దానికి దోహదం చేస్తే స్వీకరించడం, లేకపోతే పట్టించుకోకపోవడం; కలిగిన అవగాహనని ఆస్వాదిస్తూ క్రమంగా దాని పరిమితులు తెలిసేదాకా ప్రయాణం చెయ్యడం; పరిమితులు తెలిసాక కొత్తరకమైన‌ అవగాహనకోసం ప్రయత్నించడం; ఒకే రకమైన అవగాహనలో చిక్కుకుపోకుండా ఉండడం కోసం పరస్పరం పూర్తిగా వ్యతిరేకమైన విషయాలని తెలుసుకోడానికి ప్రయత్నించడం - ఈ రకమైన ప్రయాణంలో మనకి రుచి కుదిరితే, మరొకరెవరో తప్పుడు భావనలతో ఉన్నారని బాధ పడడం ఎందుకు? మన అవగాహన‌ మనకి తృప్తిని ఇస్తే సరిపోదా??

  లేక ఎవరైనా మిమ్మల్ని బాగా చికాకు పెడుతున్నారా?

  ReplyDelete
  Replies
  1. >>మరొకరెవరో తప్పుడు భావనలతో ఉన్నారని బాధ పడడం ఎందుకు? మన అవగాహన‌ మనకి తృప్తిని ఇస్తే సరిపోదా??

   వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మీరన్నది నిజమేననుకోండి. నిజానికి లాప్ టాప్ లేకపోతే నాకిలాంటి ఆలోచనలు రావు. బ్లాగులు మానేస్తే యే గొడవా ఉండదు. అయితే ఈ బ్లాగు అని ఒకటున్నది కాబట్టి, ఇట్లాంటివి రాసేటప్పుడు నాకై నేను కల్పించుకున్న సాకులు ఒకట్రెండు. ౧. ఈ రాసిన దానిలో ఏదైనా కాస్త విషయం ఉంటే - ఈ విషయం ఎవరికో ఏ మూలో పనికొస్తుందేమోనని లేదా ఎంటర్ టయిన్ మెంట్ అయినా అవుతుందని మొదటి సాకు. పనికి రాలేదనుకోండి. వారెలాగూ విసుక్కుంటారు. వాళ్ళు విసుక్కుంటే నాకు కొత్తగా ఏదైనా రాయాలంటే విముఖత ఏర్పడుతుంది. అది పెరిగితే ఆ వంకతో బ్లాగు, నెట్టూ మూసేసుకోవచ్చు. ఇది రెండో సాకు. ఈ రెండూ కాకపోయినా నాతో నేను మాట్లాడుకున్నదానికి ఒక అక్షరరూపం - అలా పడుండనీ అని ఒక కారణం.

   Delete
 5. పండితుడు అన్న పదానికే జ్ఞాని అన్నది పర్యాయం. ’పండాః’ నుంచు పండితః అన్నది వచ్చింది. వారు బ్రహ్మవిదులై బ్రహ్మముగా ఉంటారు అని. అటువంటివారిని పండితులంటారు. నిజమే మీరన్నట్లు చేతలలోలేక కేవలం నోటితోనో, వ్రాతలవల్లో పొందేది జ్ఞానం కాదు అది పొందడానికి ఉపయోగపడే పనిముట్టవగలదేమో.

  మీరు చెప్పిన విషయం ముఖ్యంగా పండితులకీ, మేధావులకీ తేడా తెలిపేదిగా తెలుసుకునేదిగా ఉన్నా మీ వ్యాసం బౌద్ధాన్నీ, వేద ధర్మాన్నీ కలిపి చూస్తున్నట్లుందండీ,

  ఆత్మ అచింత్యం, ఆత్మానుభూతి కలగడానికి చింతనే సాధనం.

  //ఆనందాన్ని అనుభవించేది, ఆనందానుభవం, ఆనందమూ ఇవేవీ లేదు// - ఇది బౌద్ధుల శూన్య వాదం వేల సంవత్సరాల క్రితమే పూర్వ పక్షమైపోయింది. అన్నీ లయమైన తరవాత అన్నీ దేంట్లోకి చేరుతున్నాయో ఆ ఉన్న బ్రహ్మమేదో దానియందది రమిస్తూ ఉంటుంది. మీరన్న ఆనందం, ఆనందానుభవం, ఆనందాన్ననుభవించేది అన్నీ ఆ బ్రహ్మమే . అవ్యక్తమైనప్పుడు పరబ్రహ్మముగానూ వ్యక్తమైనప్పుడు మనం, మనచుట్టూ ఉన్న అన్ని రూపాలలోనూ (జగత్తుగా) ఉన్నది.

  ReplyDelete
  Replies
  1. నా సమర్థన శూన్య ’వాదానికి’ కాదండి. బ్రహ్మం - అని చెప్పి, తదేజతి, తన్నేజతి - ఇలా బ్రహ్మం అని పేరు పెట్టి దానికి యే లక్షణమూ లేదు అని ఆయాసపడేకన్నా, ఏదీ లేదు అన్న భావన వల్ల పండితుల గొడవ లేదు. అదేదో ఉంది అన్నప్పుడు - దాని లక్షణాలు చెప్పడానికీ, ఆ లక్షణాలు లేవని చెప్పడానికీ పండితుల అవసరం పడుతూంది.

   అయితే మీ వివరణ బహు చక్కగా ఉన్నది.

   Delete
  2. In Rama Charita Manas, Goswami Tulasidasji gives a beautiful simile to gNAna without vairAgya. It is like wearing jewelry without cloths.

   Delete
 6. రవిగారూ,
  మీకు సమాధానమిచ్చే ఓపికుంటే నావి కొన్ని సందేహాలు:

  1. "సరే మనం మామూలు మనుషులం. అలాంటి స్థితి పొందలేం."
  ఇక్కడ మీ ఉద్దేశం "ఎక్కువమంది మనుషులు యీ స్థితిని పొందలేరు" అనేదే అనుకుంటున్నాను. అంతేనా? లేక అలాంటి స్థితిని పొందడం ఒక రకమైన మనుషులకే సాధ్యమని మీ భావనా? పొందక ముందు అందరూ మామూలు మనుషులే కాదా?
  2. సమాధిస్థితిని పొందేందుకు ఏవిటి మార్గాలు? భక్తి మార్గం, యోగ (కుండలినీ) మార్గం గురించి మీ ఆలోచనలేమిటి?
  3. సమాధిస్థితిని పొందాలనేది కూడా కోరికేనా? ఆ కోరిక లేకపోతే ప్రయత్నం ఉండదు కదా? ఆ కోరిక సమాధిస్థితి కలిగేందుకు ఆటంకం అవుతుందా అవ్వదా? మీరన్న ప్రయత్నం అలవాటుగా మారితే యీ కోరిక పోతుందా? ఈ కోరిక ఉండగానే ప్రయత్నం అలవాటుగా మారే అవకాశం ఉందా?
  4. ఈ సమాధిస్థితి అనేది కేవలం మరొక రకమైన మనోవికారం, పచ్చిగా చెప్పాలంటే పిచ్చి, అయ్యే అవకాశం ఉందా? అంటే నా ఉద్దేశం - "ఆ స్థితిలో మనిషికి , ప్రపంచానికి భేదభావం కనిపించదట. చూచేవాడు, చూడబడేది, చూచుట అన్నీ నశించి, జగత్తు అణువణువునా తనూ, తనలో జగత్తూ స్పష్టంగా కనిపిస్తూ, ఏ విధమైన ద్వంద్వమూ ఏర్పడని దశ" - అని మీరు చెప్పినది కేవలం చిత్తభ్రాంతి, అంటే ఆ స్థితి తనకు కలిగిందని బుద్ధి తనకి తాను నమ్మించుకొనే స్థితి. నా ప్రశ్న స్పష్టంగా లేదేమో. మరో ప్రయత్నం చేస్తాను. ఈ సమాధిస్థితి అనేది బుద్ధిలో అంతర్భాగమైనదా దానికి బాహిరమైనదా అని కచ్చితంగా చెప్పగలమా? లేదా అది బాహిరమైనదే అన్నది ఒక నమ్మకమేనా?

  నాగమురళిగారూ,
  "ఈ రకమైన ప్రయాణంలో మనకి రుచి కుదిరితే, మరొకరెవరో తప్పుడు భావనలతో ఉన్నారని బాధ పడడం ఎందుకు? మన అవగాహన‌ మనకి తృప్తిని ఇస్తే సరిపోదా?"

  మీరన్నది ఆ ప్రయాణిస్తున్న వ్యక్తి విషయంలో నిజమే అయ్యుండొచ్చు కానీ, అలాంటి తపన/వ్యథ, మిగతా వాళ్ళకి ఎంతోకొంత మేలు చేసే అవకాశం తప్పకుండా ఉంది! :)

  ReplyDelete
  Replies
  1. కామేశ్వరరావు గారు,
   Answers inline :)
   1.
   >>ఎక్కువమంది మనుషులు యీ స్థితిని పొందలేరు" అనేదే అనుకుంటున్నాను. అంతేనా?
   - కాదు. పొందగలిగినా ఎక్కువమంది ఈ స్థితి లో ఉన్నట్టు కనిపించడం లేదని..
   >>లేక అలాంటి స్థితిని పొందడం ఒక రకమైన మనుషులకే సాధ్యమని మీ భావనా?
   కాదు.
   >>పొందక ముందు అందరూ మామూలు మనుషులే కాదా?
   అవును.
   2.సమాధిస్థితిని పొందేందుకు ఏవిటి మార్గాలు?
   మార్గం - అనేది (How) అనేది బుద్ధి తాలూకు function అని నా భావన అండి. Passive awareness వల్ల సాధ్యమని నాకు తట్టిన సూచన. ఇక్కడ ఒక విషయం. మీరు ఆఫీసుకు వెళుతూ వెళుతూ ఏదో మర్చిపోయినట్టు అనుకుంటారు. తీరా వెళ్ళిన తర్వాత మీకు పెన్ను మర్చిపోయినట్టు తెలుస్తుంది. మీకు ’అనిపించిన’ దానికి కారణం ఏమిటి? - అది మీ బుద్ధి కాదు. Some sort of intuition. That intuition will let you know the method.
   >>భక్తి మార్గం, యోగ (కుండలినీ) మార్గం గురించి మీ ఆలోచనలేమిటి?
   కుండలినీ మార్గం - నాకు తెలీదు. భక్తి - ఇది నాకు తెలియదు కానీ, చిత్తం ఆర్ద్రంగా కావడం వల్ల ఇది ధ్యానమార్గానికి ఉపకరించవచ్చు.
   3.
   >>సమాధిస్థితిని పొందాలనేది కూడా కోరికేనా?
   అవును. కోరికే.
   >>ఆ కోరిక లేకపోతే ప్రయత్నం ఉండదు కదా?
   ఆ కోరిక కోసం కాదు ప్రయత్నం. దుఃఖం ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి ఉపక్రమించడం వల్ల మనం ఇక్కడికి వచ్చాం.
   >>ఆ కోరిక సమాధిస్థితి కలిగేందుకు ఆటంకం అవుతుందా అవ్వదా?
   అవుతుంది.
   >>మీరన్న ప్రయత్నం అలవాటుగా మారితే యీ కోరిక పోతుందా?
   ప్రాక్టికల్ గానే తెలుసుకోవాలి.
   >>ఈ కోరిక ఉండగానే ప్రయత్నం అలవాటుగా మారే అవకాశం ఉందా?
   ఇక్కడ మీరు - కోరిక అన్న మాట ఉపయోగిస్తున్నారు. ఇది కాస్త అసమంజసం. సమాధిస్థితి అన్నది కోరిక కాదు. That could be the only possible solution which mind comprehends to get over existential dilemmas. One is not intended to pursue that state, but his intention is to find the end of sorrow. So, he eventually arrives here.
   4.
   >>పచ్చిగా చెప్పాలంటే పిచ్చి, అయ్యే అవకాశం ఉందా?
   ఏమో తెలియదు. ఉందనుకుంటున్నానండి.
   >>ఈ సమాధిస్థితి అనేది బుద్ధిలో అంతర్భాగమైనదా దానికి బాహిరమైనదా అని కచ్చితంగా చెప్పగలమా?
   మీరడిగిన ప్రశ్నకు నిజానికి యోగులు సమాధానం చెప్పగలరు. నాలాంటి వాళ్ళు కాదు. బుద్ధి పరిధి గురించి బుద్ధితో ఆలోచించి సమాధానం చెప్పమంటున్నారు.:) ఇది బహుశా ఇక్కడ కాంటెక్స్టులో అసమంజసం.

   బానే ఉంది కానీ మీరీ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కాలేదు. :)

   Delete
  2. >>బానే ఉంది కానీ మీరీ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కాలేదు. :)
   "జిజ్ఞాస" తప్ప మరే ఉద్దేశమూ లేదు. వాదన చేయలనే ఉద్దేశం అసలే లేదు. :) మీ పోస్టులో మీరు చెప్పదలుచుకున్న దానికీ నేనడిగిన ప్రశ్నలకీ పెద్ద సంబంధం లేదని కూడా నాకు తెలుసు. మీరు చెప్పదలుచుకున్న విషయమ్మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు. అంచేత మీ పోస్టులో నాకు ఆసక్తి అనిపించిన వాటి గురించి నాకున్న సందేహాలని వెళ్ళగక్కుతున్నానంతే.

   >>మార్గం - అనేది (హౌ) అనేది బుద్ధి తాలూకు function అని నా భావన అండి.
   అవును. నిర్వాణం అనేది "స్వతస్సిద్ధంగా" ఏర్పడే స్థితే అయినా, బుద్ధిలో భాగమైన ప్రయత్నంతో మొదలుపెట్టడం తప్పదని మీరన్నారు కదా. ఆ ప్రయత్నం ఎలా చెయ్యాలన్నదే నా ప్రశ్న. ఆలోచనా ప్రమేయం లేకుండా కలగాల్సిన విషయం అనేంత వరకూ మీరు చెప్పిన Intuition పోలిక సరిపోతుంది. అయితే మీరిచ్చిన ఉదాహరణలోని intuition నిజానికి బుద్ధిజనితమే (మనం బుద్ధిపూర్వకంగా ఆలోచన చేయకపోయినా) అని కొందరు scientists అంటారు. బహుశా అది నిజమేనని నేనూ అనుకుంటాను. ఇంతకీ అసలు ప్రశ్న, ప్రయత్నం అంటూ చేయాలన్నప్పుడు, అది బుద్ధి ద్వారానే అయినప్పుడు, ఆ మార్గం ఏమిటి అన్నది. మీరన్న Passive Awareness, నాకర్థమైనంత వరకూ, ఒక స్థితే కాని మార్గం కాదు కదా?

   >">ఇక్కడ మీరు - కోరిక అన్న మాట ఉపయోగిస్తున్నారు. ఇది కాస్త అసమంజసం. సమాధిస్థితి అన్నది కోరిక కాదు. That could be the only possible solution which mind comprehends to get over existential dilemmas. One is not intended to pursue that state, but his intention is to find the end of sorrow. So, he eventually arrives here."

   సమాధిస్థితి అనేది కోరిక కాదు నిజమే. మీరన్నట్టు దుఃఖం అంతు చూసేందుకు చేసే అన్వేషణలో చేరే గమ్యం. దుఃఖం ఎందుకు వస్తుంది? కోరిక వల్ల. అవి రకరకాల కోరికలు కావచ్చు కదా. నేనంటున్నది, సమాధిస్థితిని చేరుకోవాలన్నదే ఆ కోరిక అయితే ఏమిటవుతుందని. నిత్య జీవితంలో ఉండే కోరికలు నాకేమీ లేవనుకోండి. ఉన్నా వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోననుకోండి. అప్పుడు వాటివల్ల వచ్చే తాత్కాలికమైన దుఃఖం నన్ను పెద్దగా బాధించదు. దాని అంతు చూడాలనీ, మళ్ళీ తలెత్తకుండా ఉండాలనీ నేను తపన పడను, ఎందుకంటే అవెలాగూ అంతమైపోయేవే కాబట్టి. కాని నిరంతరం పీడిస్తున్న దుఃఖం, జ్ఞానం సంపాదించాలన్న కోరిక అనుకోండి. ఇప్పుడీ కోరిక, అందులోంచి పుట్టే దుఃఖం, అంతు చూడ్డం ఎలా?

   Delete
  3. >>మీరన్న Passive Awareness, నాకర్థమైనంత వరకూ, ఒక స్థితే కాని మార్గం కాదు కదా?

   The one and only method/education every human has to get by himself is meditation అని ఒక వ్యాఖ్య. Passive awareness అనేది ఒక మార్గమేనని నా భావన. ఇది intellectual పద్ధతి.

   మరొకటి intuitive పద్ధతి. ఠాగూర్ ను, అతని జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం కనిపిస్తుంది. అతని జీవితపు చివరి రోజుల్లో వ్రాసిన కవితల్లో అపూర్వమైన మార్మికత కనిపిస్తూ ఉండేది(ట). అలాగే అతని పెయింటింగ్స్ లోనూ. చిత్రాలు గీసేప్పుడు ఒక్కోసారి అతను నిద్రాహారాలు మాని గదిలో తన్మయత్వంతో ఉండిపోయేవాడట. అప్పుడు కలిగే స్థితి బహుశా ’సతోరి’ - బహుశా వాళ్ళు చెప్పే సమాధి స్థితి కి మొదటి మెట్టు.

   Passive awareness అంటే దేవుని ఎదుట దీపాన్నో, మేడపైన కూర్చుని ఉదయించే సూర్యుణ్ణో ఆలంబనగా తీసుకుని మొదలు పెట్టడంలో వచ్చేది ఒక పద్ధతైతే ఠాగూర్/సంగీతంలో మునగడం అనే పద్ధతి మరొకటి. పద్ధతి అన్నది ఎవరికి వారు కనుక్కోవలసిందే.

   >>కాని నిరంతరం పీడిస్తున్న దుఃఖం, జ్ఞానం సంపాదించాలన్న కోరిక అనుకోండి. ఇప్పుడీ కోరిక, అందులోంచి పుట్టే దుఃఖం, అంతు చూడ్డం ఎలా?

   బహుశా elimination పద్ధతి ద్వారా. Futility ని గుర్తించటం ద్వారా. చాలా పుస్తకాలు చదివిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రోజు ఒక అనుమానం రావాలి. ప్రయత్నం నిజాయితీగా ఉంటే వస్తుంది కూడానూ. ఇంతా చదివి ఒరుగుతున్నదేమిటి? అని. బయట ఎవరో గొప్పవాడని, తెలివైన వాడని మెచ్చుకోవడం తప్ప, నిజానికి తనకంటూ ఒరుగుతున్నదేమీ లేదని తెలుసుకోవడం ద్వారా. అదే బీజమని నా అనుకోలు.

   Delete
  4. >>Passive awareness అనేది ఒక మార్గమేనని నా భావన.

   పై వాక్యం కాస్త Tricky statement. అది స్థితి, మార్గమూ కూడా. బుద్ధి పరిధిని దాటి వెళ్ళాలంటే బుద్ధితోనే వెళ్ళాలి. ప్రయత్నపూర్వకంగా మొదలెడితే అది మార్గం. స్వతఃసిద్ధంగా ఏర్పడితే అది స్థితి. రెంటికీ అనుభవప్రమాణమే సాక్ష్యం.

   Delete
 7. " వాళ్ళు విసుక్కుంటే నాకు కొత్తగా ఏదైనా రాయాలంటే విముఖత ఏర్పడుతుంది. అది పెరిగితే ఆ వంకతో బ్లాగు, నెట్టూ మూసేసుకోవచ్చు." .. అమ్మా ఆశ .. ఆ పప్పులేం ఉడకవు. ఈ టపాకొచ్చిన వ్యాఖ్యలే సాక్ష్యం :)

  ReplyDelete
 8. ఈ తోవలో నేను విన్న, నాకు నచ్చిన, నాకు తట్టిన కొన్ని ఆలోచనలు ..
  1) ఇంద్రియానుభవానికి మించినది ఇంకేదో ఉంది. అది అనుభవైక వేద్యం.
  2) ఒకడి పద్ధతి ఇంకోడికి పనికి రాదు. ఎవడి తిప్పలు వాడు పడాల్సిందే.
  3) #2 వల్ల రెడీమేడ్ సొల్యూషన్లు పని చెయ్యవు.
  4) ఆ అనుభవపు రుచి కొంత సంగీతంలో ఉన్నదని అనిపిస్తుంది నాకు.

  ReplyDelete
  Replies
  1. అవును. సంగీతం, ఇంకా వెళ్ళగలిగితే నాట్యంలో ఆ అనుభవపు రుచి ఖచ్చితంగా ఉండాలి. అది ఒక Feminine touch ఉండి, సున్నితపు హృదయులకు చెందినది. intellect ను ఆలంబనగా చేసుకున్న వారికి ఆ పద్ధతిలో రుచి బహుశా తెలియకపోవచ్చు.

   Delete
 9. చండీదాస్ శశాంక భాషలో చెప్పాలంటే ఇదంతా మెటా ఎంఫరికల్. నా స్థాయికి అంత త్వరగా అందనిది. (భాష కాదు, భావం) ఓ కోతి ప్రశ్న... ఇంతకీ ఎవరా బ్రాహ్మీమయమూర్తి... మీ మాజీ స్నేహితుడేనా? :)

  ReplyDelete
  Replies
  1. ఇక్కడ స్థాయి అదీ ఏదీ లేదండీ. ఇదంతా సొల్లు మాత్రమే. ఇదొక సొల్లు టపా అని ఎవరైనా అంటే అదొక పెద్ద కాంప్లిమెంట్. బ్రాహ్మీమయమూర్తులు చాలామంది అండి. ఈ మధ్య ఎక్కువగా ఆ ఒక్కరు. అయితే వ్యక్తులతో విభేదం కాదండి ఇది. భావనలతోనే.

   Delete
 10. బాగుందండీ. ఈ ఆధ్యాత్మిక అనుభవాలగురించి నే రాసుకొన్న సొల్లు. ఇక్కడ..
  http://wp.me/pGX4s-K2
  వీలైతే చదవండి:

  ReplyDelete
 11. ఊరికే.. చదివి, ఆనందించాను. ధన్యవాదములు.

  ReplyDelete
 12. ---------------------------------------------------------------------------------------------------------------------------------------
  పండితుడంటే వందల కొలదీ విషయాలు తెలిసిన వాడు కాదు. అది కెపాసిటీకి చెందిన విషయం. అన్ని విషయాలకు మూలకందమైన దాని స్ఫూర్తిని ఎఱిగినవాడు పండితుడు.

  విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
  శునిచైవ శ్వపాకే చ పండితాస్సమదర్శినః ||

  పండితుడంటే - వినయసంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి, శునకమాంసం తినే వాడిని సమంగా చూడగలిగినవాడు. ఈ స్ఫూర్తి లేకుండా ’జ్ఞానం’ ’గురించి’ పేజీల కొద్దీ వివరణలు చేసిన వాణ్ణి పండితుడుగా గుర్తించటం చాలా పెద్ద పొఱబాటు.

  కాబట్టి పండితుడికి, టన్నుల కొద్దీ సమాచారం సేకరించిన లేదా మాట్లాడగలిగిన మేధావికీ పొంతన లేదు.
  ----------------------------------------------------------------------------------------------------------------------------------

  అద్భుతంగా వ్రాశారు. రంధ్రాన్వేషణ అనుకోకపోతే పైన ఉన్న వాక్యాల్లో పండితుడు అని ఉన్నప్లేసెస్‌లో జ్ఞాని అని వుండాలనుకుంటున్నాను. కరక్ట్ అయితే సరిదిద్దుకోగలరు.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.