Tuesday, July 10, 2012

తామరశ్రీ మోసరి రామాయణరావు ధిషణా హేల

రామాయణరావు వ్యక్తి కాదు సుత్తి. అవును. మీరు సరిగ్గానే చదివారు. రామాయణరావు ఒక మహాసుత్తి. ఆ సుత్తి తాలూకు ప్రస్థానమే ఈ కథనం.

ఒక వ్యక్తి కి ఎన్ని పార్శ్వాలుంటాయి? సాధారణంగా రెండు. రామాయణరావులో అనేక పార్శ్వాలున్నాయి.
ఒక పత్రికాధిపతి
ఒక నటుడు
ఒక దర్శకుడు
ఒక నిర్మాత
ఒక పాటల రచయిత
ఒక మాటల రచయిత
ఒక రాజకీయనాయకుడు
ఇన్ని పార్శ్వాలను పూర్తిగా ఖర్చుపెట్టే సరికి సారం అంతా పోయి, అతడు నాలుగేళ్ళు వరుసగా బ్లాగులు రాసేసిన తెలుగు బ్లాగర్ లా నిస్సారంగా తయారయ్యాడు. ప్రేక్షకులకు అతని సంగతి తెలిసి, అతని సినిమాలు ఎప్పుడో చూడ్డం మానేశారు. ఇక మిగిలిన పార్శ్వాలూ అరిగిపోయాయి. దాంతో అతని పైశాచికత్వం బయటపడింది. చలనచిత్ర సీమలో ఎక్కడ మీటింగు జరిగితే అక్కడ దాపురించి, శ్రోతల మెదళ్ళను కబళించడం అతనికి కొంతకాలంగా అలవడిన రాక్షసవిద్య. ఇది ఎప్పుడు అంతమవుతుందో తెలుగు టీవీ ప్రేక్షకులు, శ్రోతలు దీనికి ఎన్ని త్యాగాలు చెయ్యాలో అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.

**********************************************************

అది 1980 వ దశాబ్దం. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే - హీరో తాలూకు ఫ్యామిలీ ని విలన్ చంపడం, విలన్ ముసలి వాడై, ఇంకో రెండు రోజుల్లో వాడంతట వాడే ఛస్తాడనగా హీరో అతనిపై పగ సాధించడం - అని మాత్రమే తెలిసిన ఒక అమాయకమైన కాలం.

ఆ కాలంలో రామాయణరావు దర్శకుడిలా మారాడు. క్లీనర్ రాముడు, సర్కార్ పేష్వారాయుడు, బొబ్బిలిభల్లూకం, కామాభిషేకం, దాహసందేశం, శ్రీవారి కుంపట్లు వంటి చిత్రాలతో తెలుగు తెరపై ఒక మాయాజాలాన్ని సృష్టించాడు. అతడికి రె. కాఘవేంద్రరావు పోటీ. కాఘవేంద్రరావు కంటే ముందే ఈతను దర్శకరాట్న అనిపించుకున్నాడు.

ఇలా దర్శకరాట్న గా మారి తన రాట్నం తిప్పసాగాడు రామాయణ్. కాలక్రమంలో అతనికోసం అతని వెనుక పనిచేసిన పిశాచులకు (ఘోస్టులు) మోక్షం కలిగి దిక్కులకొక్కరుగా వెళ్ళిపోయి ఇతణ్ణి ఒంటరివాణ్ణి చేశారు. రామాయణ్ నిరాశ చెందలేదు. 

తరువాతి తరం వచ్చింది. దర్శకరాట్న కు సరికొత్త ఛాలెంజ్.

నటబ్రహ్మాండ కొడుకు సర్పార్జున తెలుగుపరిశ్రమలో అడుగుపెట్టి కొన్నేళ్లే అయింది. సర్పార్జున కళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది. అవి దైన్యాన్ని తప్ప మరోభావాన్ని పలికించవు. ఆ విషయం గ్రహించాడు దర్శకరాట్న. అతనితో గుజ్ను అనే కళాఖండాన్ని తీశాడు. అలాగే మురుగెశ్ తో కొన్ని సినిమాలు తీశాడు. శిశుకృష్ణ తోనూ కొన్ని సినిమాలు తీశాడు. ఇలా ఒక్కొక్కరినీ తన రాట్నానికి బలి చేస్తూ తన అద్భుత ప్రతిభతో రిచంజీవి తో సింహళేశ్వరుడు సినిమా తీశాడు. ఆ సినిమా ఆంధ్రదేశంలో స్కైలాబ్ లా పడింది. ప్రేక్షకులు విలవిలలాడిపోయారు. ఆ సినిమాలో - చెల్లెలు చచ్చిపోతే హీరో బ్రేక్ డేన్సు చేసినట్టు చూపడం దర్శకరాట్న ప్రతిభాపైశాచికత్వానికి పరాకాష్ట. తర్వాత ఒక సభలో మాట్లాడుతూ దర్శకరాట్న ఒక అపూర్వమైన విషయం చెప్పాడు. "రిచంజీవి సినిమాలో కథ ఉండరాదు. నేను ఈ సినిమాలో మంచి కథ చెప్పాను. అదే జరిగిన పొఱబాటుకు కారణం".

ఇతని దెబ్బ కాచుకోవడానికి, ఇతణ్ణి పడగొట్టడానికి పథకానికి బీజాలు పడినయ్.

**********************************************************

1990 దశాబ్దం మొదట్లో, అప్పట్లో తెలుగు సినిమా నటుల్లో ప్రముఖులు సర్పార్జున, గిగాస్టార్ రిచంజీవి, దగ్గుబాటి మురుగేశ్, శిశుకృష్ణ తదితరులు ఒక చోట చేరారు. ఆ సమావేశం అజెండా రామాయణరావును ఎదుర్కోవడం ఎలా?

సమావేశం ఆరంభిస్తూ మురుగేశ్ చెప్పాడు. మురుగేశ్ , సర్పార్జున అప్పుడప్పుడే తెలుగులో వత్తులు నేర్చుకుని చిత్రపరిశ్రమలో పైకొస్తున్నారు. కాబట్టి వారి మాటల్లో వత్తులు పలుకవు. శిశుకృష్ణకు ఆవేశం ఎక్కువ. ఒక పదం పూర్తి చెయ్యకముందే మరో పదానికి పరుగులు తీయిస్తుంది ఆ ఆవేశం. అంచేత మాటల్లో చివర్లు సరిగ్గా ఉండవు.

"సబ్యులందర్కీ నమస్కారం.  ఇవ్వాళ మనం ఇక్కడ కలుసుకున్నది రామాయణరావును ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై ఒక తీర్మానానికి రావడానికి. ఈ విషయంపై ఒక స్ట్రాటెజీని మనం తయారు చేసుకోవాలని నా ఆకాంచ". చెప్పాడు మురుగేశ్.

"రామాయణరావు మనపాలిట శాపంగా మారాడు. ఎప్పుడు సినిమా తీస్తానంటాడో తెలీదు. వద్దు అందామంటే మొహమాటం. మొన్న సింహళేశ్వరుడు సినిమా తీసి నా పరువు తీశాడు." - వాపోయాడు రిచంజీవి.

"నాకూ అంతే. గుజ్ను సినిమా తీశాడు. అది హిట్ అయినప్పటి నుండి ఇంకో సినిమా తీస్తానని వెంట బడుతున్నాడు. ఇప్పుడు నాకు వతులు వచ్చేశాయి. అతనితో నేనెందుకు సినిమా తీయాలో నాకర్దం కావట్లేదు" - చెప్పాడు సర్పార్జున. సర్పార్జున కంఠం పాము బుసకొట్టినట్టు ఉంది.

"అహ, అతణ్ణి ఎదుర్కోవాలంటే మనం అతణ్ణి ఉబ్బేయాలి. అదే చక్కగా పనిచేస్తుంది." - శిశు కృష్ణ చెప్పాడు.

చివరికి శిశుకృష్ణ చెప్పిన దానితో అందరూ ఏకీభవించారు. అతణ్ణి ప్రతి సమావేశానికి పిలవాలి. ప్రతి పత్రికలోనూ పొగడాలి. అతడు సినిమా తీస్తానంటే మీరు ఆస్కార్ స్థాయి దర్శకులని, మాకు ఆ స్థాయి లేదని తప్పించుకోవాలి.

**********************************************************

ఆ కుట్ర చక్కగా పనిచేసింది. రామాయణరావు పీడను చిత్రపరిశ్రమ అగ్రనటులు అలా సమర్థంగా ఎదుర్కున్నారు. దర్శకరాట్న తన ప్రయత్నాలు మానలేదు. మొన్నతరం నటి భాగమతితోనూ, నిన్నటితరం అపజయశాంతి తోనూ సినిమాలు తీశాడు. ఆ పైన తన సుపుత్త్రుణ్ణి వెండితెరకు పరిచయం చేస్తూ సినిమా తీసి, తను కూర్చున్న కొమ్మను తనే విరుగగొట్టుకున్నాడు.

రామాయణరావుకు ఆఖరుగా హిట్ వచ్చిన చిత్రం ’ఏమేవ్ నారాయణమ్మ".

ఆ తర్వాత అతడు సినిమాకళాకారుల సంఘానికి అధ్యక్షుడయాడు. కానివ్వకపోతే అతడితో సినిమా తీస్తానని వెంటబడతాడని అందరి భయం. ఆ తర్వాత సినిమా ఫంక్షన్ లలో ప్రసంగాలు ఇవ్వడం రామాయణరావుకు అలవాటుగా మారింది. ప్రతి సినిమా ఫంక్షన్ కూ హాజరై తన పురాణం వినిపిస్తూ శ్రోతల్లో గుండెల్లో నిద్రపోవడం అతనికి కొత్తగా అలవడిన విద్య.సంచలనాలు అన్నీ ఎప్పుడో వెళ్ళిపోయాయి కాబట్టి అప్పుడప్పుడూ ఈయన తన మాటలతో సంచలనం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మధ్య ఎన్నో యేళ్ల తర్వాత శిశుకృష్ణతో సినిమా తీశాడు. ఆ సినిమాకు తుస్కార్ అవార్డు వస్తుందన్న స్థాయిలో రామాయణరావు ఆశపడ్డాడు. పరిశ్రమవర్గాలూ ఆ మాటే అన్నాయి (అనకపోతే జరిగేది తెలుసు కాబట్టి).

ప్రస్తుతం .... రామాయణ రావు సినిమా ఫంక్షన్ లలో స్పీచులిస్తూ ప్రశాంతంగా ప్రజల గుండెల్లో నిద్రపోతున్నాడు. ఇతడివి 140 సినిమాలయాయి. మరో తొమ్మిది సినిమాల వరకూ టైముంది. ఆ తర్వాత తన 150 వ చిత్రం ఎవరితో తీయబోతాడో! అప్పుడు సునామీలా ఎవరిమీద విరుచుకుపడనున్నాడో దానికి కాలమే సమాధానం చెప్పాలి.

19 comments:

 1. ఇరగదీశారండి. కంగ్రాట్స్.

  ReplyDelete
 2. ఎంతటి సృజనాత్మక కళాకారుడికైనాఏదో ఒక సమయంలో భావదారిద్ర్యం వచ్చితీరుతుంది.(menopause లాంటిది).బుచ్చిబాబువంటి గొప్పరచయిత చివరకుమిగిలేది నవల వ్రాసి తాను పదేళ్లు వట్టిపోయానంటాడు.ఈ సత్యాన్ని కవులూ కళాకారులూ సరైన సమయంలో గుర్తిస్తే అపకీర్తి మూటకట్టుకోకుండా బయట పడతారు.మీ రామాయణరావు గారూ అంతే.మన నట సమ్రాట్టులూ నటరత్నల విషయమూ ఇంతే.మొదట్లో చక్కని నటులైన వీరు 70లనుంచీ జనాన్ని తమ నటనతో చిత్రహింసల పాల్జేసారు.మీది చక్కని సెటైరు.కంగ్రాట్స్.

  ReplyDelete
 3. super sir.. Ekabigina chadivinchesaaru. intakannaa churakalu emainaa untaayantaaraa!? haayigaa navvukunnam.

  ReplyDelete
 4. రవి గారు.. బ్లాగాడిస్తా..అంటే ఏమిటో..ఇప్పుడు తెలిసింది నాకు.
  చాలా బాగా బ్లాగాడించారు.
  హాయిగా నవ్వుకున్నాం. ఇంకా తొమ్మిది సినిమాలు భరించాలా?నూట ఏభై కి గేన్తుడు ఉంటే సగటు ప్రేక్షకుడు రక్షింపబడతాడు అని నా అభిప్రాయం.
  ధన్యవాదములు.

  ReplyDelete
 5. పై కామెంట్ లో గెంతుడు అని చదవవలసినదిగా మనవి.

  ReplyDelete
 6. హహ్హహ్హ ..టపా మొత్తం బాగా వ్రాసి చివర్న పప్పులో కాలేశారు రవి గారు.దర్శక రాట్న గారి 150వ సినిమా పరమవీరచక్ర గత సంవత్సరం సంక్రాంతికి విడుదలయ్యి సింహ ఘనవిజయంతో మంచి ఊపు మీదున్న శిశుకృష్ణ కెరీర్‌కు శుభం పలికినంత పని చేసింది. మనవడు మాస్టర్ రాముడుతో కూడా తియ్యాలని ముచ్చటపడ్డాడు కానీ అతను బాబాయి శిశుకృష్ణలా భోళాశంకరుడు కాదు కాబట్టి తెలివిగా తప్పించుకున్నాడు.

  ReplyDelete
 7. This comment has been removed by the author.

  ReplyDelete
 8. Amazing!

  I don't know the factual accuracy of the content but the way this blog is written is simply superb.
  అయినా TV లో రామయణరావు గారిని, వారి ప్రసంగాల పరమార్థాన్నీ చూస్తుంటే పైన రాసినది అంతా నమ్మాలనిపిస్తుంది.

  ReplyDelete
 9. Ravi Garlapati గారు:ఇది పేరడీ మాత్రమే. ఇందులో వ్రాసిన వాటికి factual base లేదు. :)
  హరేకృష్ణ గారు, జలతారు వెన్నెల గారు, వనజవనమాలి గారు, హితైషి గారు,తేజస్వి గారు, వంశీకృష్ణగారు: ధన్యవాదాలు.
  రంగరాజు గారు: నిజంగానే ఆ విషయం తెలీదు. పోనీలెండి ఏదో చిన్న సటైర్ :)
  గోపాలకృష్ణగారు: బాగా చెప్పారు. ఇది అందరికీ వస్తుంది. పోగొట్టుకొనే ప్రయత్నంలో ego ఎక్కువవుతుందని అనిపిస్తున్నది. ధన్యవాదాలండి.

  ReplyDelete
 10. pure fun......gud one....
  andaru shobhan babu garila undaru .....undaleru...
  emm chestham ...ilanti blogs chadivi santhosha padali..

  ReplyDelete
 11. బాగా ఆడుకున్నారుగా! కాని ఇందులో మీరొక పెద్ద పొరపాటు చేసారు. ఆ రాట్నం వడికిన ఒక, సారీ, ఒకేఒక లెజెండుని మీ టపాలో పేర్కొనడం మరిచిపోయి మీరు చెయ్యరాని నేరాన్ని చేసారు. ఇది కాని ఆ లెజెండు కంటపడితే అతని డవిలాగుల సునామీతో మీ మీద విరుచుకుపడడం ఖాయం. :-)

  ReplyDelete
 12. కామేశ్వరరావు గారు: లెజిబ్రిటీ గుర్తొచ్చాడండీ. మళ్ళీ ఎందుకులే అని రాయలేదు. ఇది చాలా పాత పోస్టు. డ్రాఫ్టులో పడి ఉన్నది వెలుగు చూసింది. :)

  ReplyDelete
 13. బ్లాగాడించారు, భలే సరదాగా ఉంది.

  ReplyDelete
 14. రవి గారు,

  పిశాచాలు ప్రయోగం సూపర్! రెండు రోజుల్లో చచ్చే విలన్ని చంపడం ఇంకా సూపర్.

  ఐతే రె. కాఘవేంద్ర రావు, రిచంజీవి పేర్లు వాడి మీరు కాపీ రైట్ ఉల్లంఘించారు.

  మీ మీద సివిల్ చర్యలో క్రిమినల్ చర్యలో ఏవో ఒకటి తీసుకుంటా.

  -మురళి

  ReplyDelete
 15. :)) తీసుకోండి. రామాయణరావు గారిని నాకు వత్తాసిమ్మని పిలుస్తా.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.