Sunday, February 26, 2012

తిండి నుండి తిమిరాంధకత్వం వరకూ...టూకీగా...

"కోన్నిచివా? ఓ గెంకి దెసుకా?" (జపనీసు భాష పలకరింపు)

"శుభోదయం. ఏరా, బలిశావా?"

మొదటి జపనీసు పలకరింపుకు స్వేచ్ఛానువాదం రెండవ లైను. స్వేచ్ఛానువాదమే కాదు విశృంఖలానువాదం కూడాననుకోండి. అయితే మాటర్ మాత్రం ఆరోగ్యం గురించి. పలకరింపు ప్రాంతపు సంస్కృతిని పట్టిచ్చేస్తుంది.

కోన్నిచివా - శుభోదయం ఇది చాలాచోట్ల కామనే అనుకుంటాను.

సెలామత్ బాగీ - శుభోదయం
సెలామత్ షియా - శుభ మధ్యాహ్నం
సెలామత్ మలామ్ - శుభరాత్రి

పై మూడు ఇండోనేషియన్ భాష పలుకరింపులు.

"రాం రాం", "నమస్కారం", వీటికి అంతర్లీనంగా ఉన్న అర్థం నీలో దైవత్వాన్ని చూస్తున్నాను. అని చెప్పడమే తప్ప ఇంకొకటి కాదు. వేల సంవత్సరాలు తనగోలలో తాను ఉంటూ, ఒకానొక అంతర్ముఖమైన దేశం భారతదేశం. ఇక్కడి పిలుపులో సూక్ష్మమైన అంతఃపరిశీలనా, నిరాడంబరత్వం కనిపించడంలో విడ్డూరమేమీ లేదు.

అలాగే జపాను వారికి ఆరోగ్యం ప్రధానం. ఇప్పటి అమెరికా ఎలాగో, ఒకప్పుడు జపాను అలాంటిదేశమట. సంపద, యౌవనత్వం, కొత్త ఆలోచనలు, కొత్త అన్వేషనలు, రంగురంగుల దుస్తులూ, కళాకృతులు...భారతదేశం అంతర్ముఖమైతే, (Introvert) జపాను తద్భిన్నంగా పూర్తీగా బహిర్ముఖం (Extrovert).

గౌతమ బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత, బుద్ధుని బోధ ఇంతపెద్ద దేశంలో నిలబడలేకపోయింది. ఇందులో భయంకరమైన కుట్ర అంటూ ఏదీ లేదు. ఎంత కుట్రపన్నినా, పాలకులందరూ కూడగట్టుకుని బౌద్ధాన్ని తొక్కినా, ప్రజలకు అర్థం కాని మతం, అర్థం కాని తత్వసారాంశం నిలబడదు. మెట్టవేదాంతంలా కాలగర్భంలో కలిసిపోవలసిందే. అది ఆ రోజూ ఈ రోజూ కూడా నిరూపించబడుతూనే ఉంది. నేడు కూడా కృష్ణమూర్తి తత్వం జిడ్డుగా ప్రచారమవుతూంది తప్ప అందులో ఉత్కృష్టత, మహత్వపూర్ణత్వమూ సామాన్యుడికి అర్థమయే అవకాశం లేదు, కృష్ణమూర్తి నిర్వాణం పొంది సత్యదర్శనం చేసినట్టు నిదర్శనాలున్నప్పటికీ.

అయితే ఇంత పెద్దదేశంలో మనలేని బుద్ధబోధ పొఱుగున ఉన్న చైనాలో వేళ్ళు తొడిగింది. ఆ నేలలో సారాన్ని తీసుకుని మహా వృక్షంగా ఎదిగింది. అలా చైనాలో ఎదిగిన వృక్షం జపానులో పూలు పూసింది!

ఒక అంతర్ముఖమైన దేశంలో తొడిగిన విత్తు మరొక సారవంతమైన, సామాన్యమైన (అంటే అటు పూర్తిగా ఐశ్వర్యవంతము, లేదా పూర్తిగా దరిద్రమూ కానిది), భూమిలో వేళ్ళూనుకొని ఒకానొక బహిర్ముఖమైన దేశంలో పూలుపూచింది.

అదే జెన్.

ధ్యానము చాన్ గా మారి జెన్ గా రూపు దాల్చింది. పిలుపు వెనుక ఇంత అర్థం లాగాం.

**************************************************************************************

నేను ఎప్పుడు టీవీ ముందు కూర్చున్నా మా ఆవిడకు తలనొప్పి. ఆమెది "సొగిలి రేకులు", "గోరింట్టాక్కూ, గోరింట్టాక్కూ" స్టాండర్డు అయితే నాది ట్రావెల్ అండ్ లివింగూ, డిస్కవరీ వగైరా. ఇద్దరికి భావసారూప్యం క్రికెట్ లో మాత్రమే.

ఆమె టీ ఎల్ సీ గురించి ఓ డిస్కవరీ చేసింది. ఆ చానెల్ లో వచ్చే ఎక్కువభాగం ఎపిసోడ్లు తిండి మీదే ఉన్నాయట. అందుకని ఆమె ఆ చానెల్ కు పెట్టిన పేరు - ఫుడ్ అండ్ లివింగ్ చానెల్.  అంటే మింగుడు-పడుకొనుడు చానెల్ అన్నట్టు.

మనిషికి కడుపు నిండా తిండి దొరికిన తర్వాత ఆలోచించేది ఎంటర్ టైన్మెంట్ గురించేనేమో! ఎంటర్టైన్మెన్ట్ - ఇది ముదరాలంటే మటుకు జీవితకాలం సరిపోదు.

5 comments:

 1. 'కొంబావా !'

  బుద్ధుడి బౌద్ధేయం రాజుల ఆదరణ పొందిందే కదండీ ఒక వెయ్యి సంవత్సరాలు దాక? ఆ పై కాలం చెల్లి, మూర్తి వద్దనుకున్న బుద్ధుడే మూర్తీ భవించడం తో నే కదా , అదీ మరీ కాలం చెల్లిన వేద కాలం అయ్యింది?

  జెన్ బతికి ఉంది. కాం జపాన్ ఒక దేశం గా బతుకు ఈడుస్తూ వుందేమో అనిపిస్తుంది, నీ రసమై ఇప్పుడు.

  మంచి ఆలోచన తో మంచి గ్యాపు తరువాయ్ వచ్చారు. స్వాగతం బేక్!!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 2. జిలేబీ గారు, అవునండీ నిజమే. జపాన్ నీరసమే ఇప్పుడు సందేహం లేదు.

  తిండి, ఫిలాసఫీ లంకె చాలా పెద్దది. పుస్తకమే వ్రాయవచ్చు, కొన్ని కేస్ స్టడీలు తీసుకుని. అది పెద్దవాళ్ళు చెయ్యాలండి. మనం ఏవో కొక్కిరి గీతలు గీసుకోవడమే.

  ReplyDelete
 3. చాలా బా సెలవిచ్చారు

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.