Saturday, April 23, 2011

సాయిబాబా - అంతశ్శోధన


"అంతమంది జనాలు సాయిబాబాను నమ్ముతున్నారు గదా, నువ్వెందుకు నమ్మవు?" కాలేజీ చదువుతున్నప్పుడు మాయమ్మ అడిగింది ఒకరోజు.

అప్పట్లో ఒకానొక ఫంక్షన్ లో (సత్యసాయి నిగమాగమం ప్రారంభోత్సవం అనుకుంటా) సాయిబాబా రాజేష్ పైలట్ అనే కేంద్రమంత్రికి కొన్ని వేలమంది చూస్తుండగా గాలిలో నుండి ఒక చిన్న నగ సృష్టించి బహుమతిగా ఇచ్చారు, ఆ దృశ్యం వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియో రికార్డులను స్లో మోషన్ లో చూస్తుండగా ఒక విషయం బయటపడింది. సాయిబాబా పక్కన ఒకతను ఒక పళ్ళెం పట్టుకుని నిలబడి ఉంటే, ఆ పళ్ళెం క్రిందుగా చేతులు పోనిచ్చి సాయిబాబా ఆ నగను తీసినట్టు ఆ దృశ్యం చెబుతూంది. ఆ టేపును అప్పటి దూరదర్శన్ డైరెక్టర్ అప్పారావు గారు కాల్చేశారట. ఇదంతా పత్రికల కథనం కాబట్టి నిజానిజాలు నాకు తెలియవు. అయితే సాయిబాబా పళ్ళెం కింద చేయి పెట్టటం నగ తీయడం ఈ వరుస ఫోటోలు ఒకానొక దినపత్రికలో వచ్చాయి. వాటిని మా కాలేజీ నోటీసు బోర్డులో పెట్టారు. అదీ కథ.

ఆ రోజు వరకూ నా గోల నాది, కానీ సాయిబాబాను నమ్మకపోవడం ఆ సంఘటన నుంచి నాలో మొదలైంది. దానికి తోడు ఆయన కుండలోంచి విభూతిని పది పదిహేను నిముషాల వరకూ తీస్తూనే ఉండడం, నోట్లో శివలింగం తీయడం ఇవన్నీ ఒక డాక్యుమెంటరీ సినిమాలో చూసి కాస్త విరక్తి కలిగింది. ఈ పైత్యానికి తోడు నాకో స్నేహితుడు ఉండేవాడు. వాడు పరమభక్తుడు. "దీపం విలువ దీపం క్రింద చీకట్లో కూర్చున్న వాళ్ళకు తెలీదురా. కాస్త దూరం నుంచి చూసేవాళ్ళకు మాత్రమే కనబడుతుంది" అనే వాడు. వాడి మూర్ఖభక్తి చూసి నవ్వు వచ్చేది. ఆలోచనాశక్తిలేకపోవడం వల్ల ఎప్పుడైనా కోపమూ వచ్చేది.

సాయిబాబా మీద ఈ తిరుగుబాటు భావజాలం అంతర్మథనంగా మారింది మా మేనమామ వల్ల.

కీర్తిశేషులు శంకరసుబ్రహ్మణ్యం మా మామయ్య. ఆయన కాలం చేసి నేటికి పదేళ్ళవుతూంది. ఆయన బహుభాషావేత్త. సంస్కృతంలో మంజరీశతకం అన్న శతకకావ్యమూ, వేమన పద్యాలకు హిందీ అనువాదం, ఠాగూర్ పద్యాలకు తెనుగు సేత, మేఘదూతం లా నిస్తంతీ దూతం (ఆయన టెలికాం లో ఆఫీసర్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు) ఇలాంటి రచనలతో సాహిత్యపరిశ్రమ, శారదాసేవ చేసిన వారు. నిత్యవిద్యార్థి. ఆయన ఛాందసులు కారు, ఆధునికులనే చెప్పాలి. ఆంగ్లం మీద, ఆంగ్లవిద్య మీద మోజు, ఆంగ్లం చదివితే జీవితంలో పైకి రావడం సులభమనే భావనా ఆయనకు ఉండేవి. ఆయన టెలికాం ఉద్యోగం నుండి రిటైర్ అవడానికి ముందు కొన్ని చిక్కుల్లో పడ్డారు. తన ఆఫీసులో సహోద్యోగి ఒకతను ఒక చెక్కును ఫోర్జరీయో ఏదో చేసి, డబ్బు కాజేసి, ఆ నేరం ఈయన మీదే మోపారు. ఆ కేసు పెట్టినది దళితుడు అవడంతో ఈయనకు చిక్కులు మరింత ఎక్కువయ్యాయ్. దాదాపు నలభై అయిదేళ్ళ సర్వీసులో నిజాయితీగా కష్టపడినందుకు ఈ ఫలితం దక్కిందని ఆయన మానసిక వేదన అనుభవించారు. ఆ సమయంలో సత్యసాయిబాబాను నమ్మారు. వేడుకున్నారు. ఎలాగైతేనేం కొన్ని యేళ్ళకు ఆయనకు న్యాయం దొరికింది. కోర్టు ఆయనను నిర్దోషిగా నిర్ణయించి తీర్పునిచ్చింది. సాయిమీద కృతజ్ఞతతో ఆయన ఇల్లు కట్టుకుని "సాయిసదనమ్" అని పేరు పెట్టుకున్నారు.

మా అమ్మకూ, మా పిన్నమ్మలిద్దరికీ మేనమామ మాట వేదవాక్కు కాబట్టి వాళ్ళూ ఆయనను నమ్మడం మొదలుపెట్టారు.మా ఇళ్ళ పూజాగృహాలలో సాయిబాబా పటం ఉండేది. అయితే అవజ్ఞతతో, తెలివిమాలినతనంతో అప్పట్లో మా అమ్మతో నేను కాస్త దురుసుగా మాట్లాడేవాణ్ణి, సాయిబాబా కుండలో విభూతి తీస్తే మీరెలా నమ్ముతారని మా అమ్మను ఆక్షేపించిన జ్ఞాపకం. టపా మొదట్లో మా అమ్మ కోపంగా అడిగిన ప్రశ్న ఆ సందర్భం లోనిదే.

బతికి ఉన్న రోజుల్లో మా మేనమామయ్యతో నాకు మాటలు, కొంతవరకూ చర్చలు ఉండేవి కానీ, విపరీతమైన చనువు లేదు,ఆయనతో మాట్లాడే స్థాయి కూడా లేదు. అంచేత సాయిబాబా విషయంలో నేను ఆయనతో చర్చించలేదు కానీ, ఒక సందర్భంలో నాకు తెలిసిందేమంటే, ఆయన సాయిబాబాను చూడనే లేదని, కేవలం ఆశ్రయించారని. తన లీలల గురించి కూడా తనకు తెలిసి ఉండదని నా అనుకోలు. సాయిబాబాను ఆయన కడకు దర్శించారో లేదో తెలియదు.

ఆయన ద్వారా నేను నేర్చుకున్నది సాయిబాబాను నమ్మినా, నమ్మకపోయినా నమ్మేవాళ్ళను గేలి చేయరాదన్న సంస్కారం. ఆ సంస్కారం కాస్త మిగలబట్టి మా ఇంటికి ఒకసారి నాన్న తరపున బంధువులు వస్తే, వారివెంట పుట్టపర్తి వెళ్ళి వచ్చాను. మా బంధువు పొద్దున ఐదున్నరకు వెళ్ళి మూడవ వరుసలో కూర్చున్నారు. సత్యసాయిబాబా చేతి నుండీ విభూతి రాలడం ఆయన స్వయంగా చూశానన్నారు. చాలా ఆశ్చర్యపడిపోయారు.

అయినా ఎందుచేతో అప్పుడప్పుడూ పురుగులా ఒక ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది. ద్వేషం వల్ల కాదు, ఏదో తెలియని బాధ, ఆవేశం వల్ల.  ఒక వ్యక్తి రోలెక్స్/టైమెక్స్/సిటిజెన్ గడియారం గాల్లో ఎలా సృష్టిస్తారు? ఒక గడియారం కావాలంటే క్వార్ట్జ్ క్రిస్టలు, దాని వెనుకనున్న సైన్సు సూత్రాలు, నిపుణులు అనేకుల పరిశ్రమ లేకుండా ఎలా సాధ్యం? గాల్లో బూడిద పుట్టిందంటే ఏదోలే సంభావ్యత ఉందనుకుందాం, గడియారం ఎలా "పుడుతుంది"? అసలు చేతిలో పట్టేంత వస్తువెందుకు పుట్టాలి? యే రిఫ్రిజిరేటర్ నో పుట్టించవచ్చు గదా? (నేను ఎర్ర వాణ్ణి, మతద్వేషినీ కానని మనవి. నా వాదన ఎర్రవారికి మద్దతు కాదు. పైవాదన సాయిబాబా భక్తులకు ధిక్కరింపూ కాదు. నేను నమ్మవలసి వస్తే నాకు కలిగే ప్రశ్నలు మాత్రమే)

పై ప్రశ్నలు ఎవరినైనా అడిగితే వాళ్ళు నన్నెలా ఆక్షేపిస్తారో అనుకుంటే ఈ క్రింది ప్రశ్న తట్టింది.

"నువ్వెందుకు ఐదేళ్ళ పిల్లవాడు (కృష్ణుడు) ఒక కొండను చిటికెన వ్రేలుతో ఎత్తాడంటే నమ్ముతున్నావు? పూజిస్తున్నావు?రాముడు ఒక బండకు తన కాలు సోకించగానే ఒకమ్మాయి పుట్టిందంటే నీవెలా నమ్ముతున్నావు?(ఇలాంటివి అనేకం ఉన్నయ్)

కాస్త తల చెడగొట్టుకుంటే రెండు సమాధానాలు కని(విని)పించాయి.

౧) పై రెండు కావ్యసాహిత్య విషయాలు కాబట్టి. సాహిత్యంలో ఒక పురుషోత్తముణ్ణి, శ్రేష్టుణ్ణి చేయడానికి చిలవలు పలవలుగా కల్పించడం ఉన్నదే. (రాజమౌళి సినిమాల్లో హీరోలు చేసే విన్యాసాలలాగా). అవన్నీ లేకపోతే కావ్యమూ లేదు, కావ్యోద్భవరసనిష్పందమూ లేదు. కావ్యం అంటే కేవలం న్యూస్ పేపర్ లో చదివే న్యూస్ లాంటిది కాదు, పొద్దస్తమానం తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా లేదు. అంచేతే కావ్యమూ, రసమూ, కల్పనలూ వగైరా వగైరా..

౨) ఎవరైనా ఒక మహానుభావుడు, మహోన్నతుడు, పురుషోత్తముడు, సద్గురువు పుట్టి గతించిన తర్వాత ఆతని చుట్టూ మార్మికత, ఆచారాలు, వ్యవస్థా కమ్ముకోవడం లోకవ్యవహారం. బుద్ధుడు దేవుడే లేడన్నాడు. (లేదా దేవుణ్ణి బయట కాక అంతశ్శోధనలోనే వెతుక్కోమన్నాడు). ఆయన తర్వాత అనుచరులు ఆయనను దేవుణ్ణి చేసిపెట్టారు. ఆయన పేరు మీద అభూతకల్పనలు, అతీంద్రియ శక్తులు కల్పించారు. షిర్డీ సాయిబాబా విషయంలో అదే జరిగింది. ఇంకా ఎంతోమంది విషయంలో కూడానూ. బహుశా మరో రెండు తరాల తర్వాత ఏమో, జిడ్డు కృష్ణమూర్తి కూడా దేవుడు కావచ్చు!

జిడ్డు కృష్ణమూర్తి 1929 లో తను అధిపతిగా ఉన్న ఆర్డర్ ఆఫ్ స్టార్ సంస్థను రద్దు చేసి అప్పట్లో 3000 కోట్ల డాలర్ల సొమ్మును సంస్థ సభ్యులు ఎవరికి వారికి పంచి ఇచ్చేశాడని వార్త.

బహుశా మరో వంద, నూటయేభై సంవత్సరాల తర్వాత -

కృష్ణమూర్తి అప్పుడు కళ్ళు తెరిచాడు. అంతే! ఆయన ముందున్న డబ్బంతా మాయమయింది. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఆశ్చర్యం!!! వాళ్ళ ఇళ్ళ అల్మైరాలలో, ఇనుపపెట్టెలలో సరిగ్గా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ స్టార్ కు ఇచ్చిన విరాళం లెక్క ప్రకారం అంతే లెక్క అలాగే ఉంది. పూజాగదిలో కృష్ణమూర్తి విగ్రహం లోంచి దేదీప్యమానమైన కాంతి ప్రసరిస్తోంది......

అలాంటిది కల్పన ఒకటి మొదలయితే ఆశ్చర్యమేమీ లేదు.

**************************************************************************************************

సాయిబాబా (మత) ద్వేషులది మరో తీరు. ఏదో, ఎవరినో ఉద్దరిస్తున్నట్టు, ప్రపంచానికంతా జ్ఞానజ్యోతులు వెదజల్లుతున్నట్టు ఉంటాయి వీళ్ళవాదనలు. జీవితంలో భరించలేని కష్టాలొస్తే, మళ్ళీ వీళ్ళది అదే త్రోవనే. ఏదో ఒక నమ్మకమో, విశ్వాసమో ఆసరా కావలసిందే. వ్యవస్థీకృతమైన నమ్మకం చెడ్డదని కొందరి చిలకపలుకు. వ్యవస్థీకృతమైన నమ్మకం ఆత్మశోధనకు అడ్డంకి కావచ్చునేమో, కానీ వ్యవస్థీకృతమైన అపనమ్మకం పరమ దారుణమైనది. మనుషులను పశువులుగా మార్చేదీనూ. Truth is not opposite of false, but absence of false అనేది వివేకవంతమైన మాట. అది స్వయంగా ఎవరికి వారు తెలుసుకోవలసిందే. నమ్మకం కనీసం సాంత్వననిస్తుంది. అపనమ్మకం వల్ల ఒరిగే ప్రయోజనమేదీ లేదు. వీళ్ళు చెప్పే అంత సైన్సూ ఈ రోజు ఒరగబెడుతున్నదేమీ లేదు. నూటికి ముప్ఫై మంది ఆకలితో ఛస్తుంటే సైన్సు బాంబులకోసం తన్నుకుంటూంది. అందుకు శాస్త్రీయవాదులు సమాధానం చెప్పరు. వాళ్ళమాట వింటే ప్రపంచం మారిపోతుందన్న అల్పభ్రమలో ఉంటారు.

**************************************************************************************************

అయితే సాయిబాబా గురించి ఆలోచనలు వచ్చినప్పుడు దొర్లే కొన్ని ప్రశ్నలు మట్టుకు వేధిస్తూనే ఉంటాయి. Faith begins when logic ends. అని సూత్రం. Is that faith which comes is really a faith? or a subset of FEAR/DESIRE? గౌతమ బుద్ధుని నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకూ శంకను నిరంతర అన్వేషణాపరత్వాన్ని వీడకూడదని బోధిస్తారు. Doubt has a cleansing effect అంటారు కృష్ణమూర్తి. శంక అంటేనే తర్కం పరిధిలోకి వచ్చేది. తర్కాన్ని ఎంతవరకు నమ్మాలి? ఎప్పుడు తర్కం వద్దనుకోవాలి? ఎవరి దగ్గర తర్కాన్ని త్యజించి విశ్వాసం చూపడం మొదలుపెట్టాలి? తర్కం కూడా బుద్ధి పరిధి లోనిదే కదా? దాన్ని తోసిరాజనడం ఆత్మవంచన కాదా?

Logic ను పక్కకు నెట్టేసి ఒక Entity ని నమ్ముతాము అనుకుంటే నా నమ్మకం (FAITH) వెనుక ఉన్నది ఏమిటి? కోరికా? భయమా? లేక ఆత్మార్పణమా? (Total surrender)

భయమూ, కోరికా లేనప్పుడు మనలను (ఆత్మను లేదా మనసును) ఒకరికి అర్పించుకోవడం ఎందుకు? ఆ అవసరమేమిటి?

Master is born when pupil is ready
When the rain comes
grass grows by itself.

అనేది ఒక జెన్ హైకూ. గురువు కన్నా శిష్యుడే గొప్ప, అంతశ్శోధనయే గురువు అని ఈ సాంప్రదాయం. అంతిమంగా ఏదైతే తెలుసుకోవలసి ఉందో, ఏది తెలిస్తే దుఃఖమూ, అసూయ, అజ్ఞానము, అవివేకమూ మొదలైనవన్నీ నశిస్తాయో దానికి formula ఏ గురువు దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ ప్రస్థానం వద్ద, ఏ పుస్తకంలో, ఎవరి బోధలో, ఎవరి శిష్యరికంలో,ఏ మఠంలో, ఎక్కడ దొరుకుతుంది?

75 comments:

 1. రవి - చాలా బాగా రాసారు....ఎప్పట్లానే! చాలా చక్కని అక్షర రూపం....అక్షరాలు ధన్యమయ్యాయి ఈవేళ....

  అవును అంతశ్శోధనే గురువు ఎన్నటికీ....ఫార్ములా ఎక్కడో లేదు. మనలోనే, మనలోపలే ఉన్నది.....ఆ అంతరంగం మీద, శోధన మీద "నమ్మకం" కుదుర్చుకోలేక ఊగిసలాడే మనుషులకు ఆసరా ఈ భావజాలాలు, బాబాలు, దైవాలు వగైరా వగైరా.........ఈ పై వగైరాల్లో ఆ శోధన తీరాలకు చేరేవరకూ నాకు ఆసరా - ఆ కనపడని శంభో శంకరుడే...

  నమ్మకం వెనకాల ఉండేది స్వార్థం....ఆ స్వార్థం వల్ల కలిగే కోరిక, భయం మనుషులను ఓ దోవ పట్టిస్తే, ఆ స్వార్థానికి ఆత్మార్పణ చేసుకున్నవాడు ఇంకో దోవ పడతాడు.....మరి స్వార్థ రహితుడిగా ఉన్నవాడు? అదే మీ ప్రశ్నలకు నా జవాబు...

  మీ అంత బాగా రాయనూలేను, నాకున్న సమయమూ అనుమతించదు....తీరిగ్గా తర్వాత మళ్లీ ఎప్పుడైనా!

  చప్పట్లతో ....శలవు...

  ReplyDelete
 2. Ravi, Very well written.

  >> అంతిమంగా ఏదైతే తెలుసుకోవలసి ఉందో, ఏది తెలిస్తే దుఃఖమూ, అసూయ, అజ్ఞానము, అవివేకమూ మొదలైనవన్నీ నశిస్తాయో దానికి formula ఏ గురువు దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ ప్రస్థానం వద్ద, ఏ పుస్తకంలో, ఎవరి బోధలో, ఎవరి శిష్యరికంలో,ఏ మఠంలో, ఎక్కడ దొరుకుతుంది?

  ఎక్కడో బయట దొరుకుతుందని అనుకుంటున్నంతవరకూ దొరక్కపోవచ్చు.
  ఎక్కడ, ఎలా దొరుకుతుందని ప్రశ్నించుకుంటూ మనలో మనమే వెతుక్కుంటూ ఉండడం మంచిదని నేననుకుంటూ ఉంటాను.

  ఈ రకమైన వివేచన చేసేవాళ్ళకి విశ్వాసం అన్న మార్గంలో వెళ్ళడం కష్టం. అది వాళ్ళ మార్గం కాకపోవచ్చు కూడా.

  ReplyDelete
 3. రమణ మహర్షిని పశ్చిమదేశాలకు పరిచయం చేసిన పాల్ బ్రంటన్ (A search in Secreat India book writer) చాలా రోజులు తిరువణ్ణామలై లో గడిపారు.చనిపోయే వరకు భగవాన్ రమణ యందు ఎంతో గౌరవం కలిగి ఉండేవాడు. కాని మొదటి సారిగా వచ్చినపుడు కౌపీనం ధరించి గమ్ముగా కుచ్చొన్న రమణ మహర్షి ఆశ్రమంలో మొసాలు జరుగుతున్నాయని రమణ మహర్షి దృష్టికి తీసుకేళ్ళాడు. అతని (వెస్ట్రెన్)కల్చర్ పరంగా నమ్మకమేమిటంటే ఇటువంటి వారు యోగులు/ఋషులు మొద|| వారు నైతికతకు ఎక్కువ విలువ ఇస్తారని అనుకొంటారు. కారణం బైబిల్ నిండా ఉండేవన్ని సూక్తులే కదా! అందువలన రమణ మహర్షి ప్రపంచ శాంతికి పాటుపడాలని, నీతీ నిజాయితీలను ప్రోత్సహిచాలని,అవినీతిని ఖండించాలని ఇలా ఉంట్టుండేవి అతని ఆలోచనలు. కాని ఈ విషయం లో రమణ మహర్షి రెస్పాన్స్ అతనికి త్రుప్తి నీయలేదు. ఈ విషయాలను తన అసంత్రుప్తిని డైరీలో రాసుకొన్నారు కూడాను.
  ------------------------------------------------
  రమణ మహర్షి దృష్ట్టిలో అంత దూరం లండన్ నుంచి వచ్చి,ఎందుకు వచ్చాడో అన్న సంగతి పక్కనపేట్టి ఆశ్రమంలో అవినితి మీద మాట్లాడటం అనేది చాలా అల్పమైన విషయం. అందువలన ఆయన కి ఈ విషయం లో మద్దతు ఇవ్వలేదు. ఈ విషం పాల్ గారికి కొన్ని సం|| వెలిగింది. మీకు తేలుసు కదా రమణ టీచింగ్ మొత్తం "నేను ఎవరు ?" అన్న ప్రశ్న ఐతే ఇతను వారు అవినితి ఎందుకుచేస్తున్నారు అనే ప్రశ్న మొదలు పెట్టి మళ్ళి ప్రపంచం లో సామాన్యుడు చిక్కుబడినట్లు చిక్కుబడ పోయాడు. భగవాన్ అతనిని అక్కడితో ఆపి,
  వచ్చిన పని చూడమన్నాడు.
  ---------------
  మీరు చూడబోతే జిడ్డు దగ్గరే ఆగి పోయిన్నట్లున్నారు. యు జి కృష్ణమూర్తి గురించి చదవండి. మీకు ఎమైనా ఉపయోగముంట్టుందేmO!
  http://en.wikipedia.org/wiki/U._G._Krishnamurti
  http://www.well.com/~jct/

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. నమ్మకం కనీసం స్వాంతననిస్తుంది. అపనమ్మకం వల్ల ఒరిగే ప్రయోజనమేదీ లేదు.
  --------
  క్లుప్తంగా సూక్ష్మంగా సందేశాన్ని రెండు మాటల్లో చెప్పేసారు.

  నేను ఆ రెండు వాక్యాలకీ ఇంకో వాక్యం కలుపుకున్నాను.
  "నీరు కారి పోవటం తప్ప."

  ఎన్ని మందులు ఇచ్చినా బ్రతుకుతామని నమ్మకం లేని వానిని బ్రతికించ లేము.

  ReplyDelete
 6. రవి,
  ప్రపంచం లో రెండే మార్గాలు ఒకటి ఉన్నది ఉన్నట్లు ఆమోదించటం( కబిర్, సాయిబాబా,ramakrishna paramahamsa). లేక పోతే అన్నింటిని తిరస్కరించటం (యు జి, రమణ మహర్షి లాగా). బుద్దుడు, రజనీష్, జిడ్డు గారు ఈ రెంటిలోనురారు. వారు పూర్తిగా రియలైజ్ కాలేదు. అలా కలిగిన వారికి ప్రపంచం లో తప్పు ఒప్పు అనేవి ఉండవు. ప్రపంచాన్ని మార్చాలి అనుకోరు.

  ReplyDelete
 7. correction
  ఈ విషయం పాల్ bruntan గారికి కొన్ని సంవత్సరాల తరువాత వెలిగింది

  ReplyDelete
 8. మీ పోస్ట్ బాగుంది (వారెవరో దైవాన్ని ఆడిపోసుకున్నట్లు మీరుకూడా సైన్సును అకారణంగా విమర్శించకుండా వుంటే మరింత బాగుండేది). మనం నమ్మని ప్రతివిషయాన్నీ తీవ్రంగా ద్వేషించడం అనవసరమని నా అభిప్రాయం. May be we are just being ignorant of the truth. Why close the doors when theres always time for enlightenment? ఒక సారి మనం తీవ్రంగా ద్వేషాన్ని వెలిగక్కాక తిరిగి దాన్ని అంగీకరించకుండా వుండటానికి మన అహం అడ్డువస్తుంది. కాదంటారా?

  శ్రీకర్ గారు: రమణ మహర్షి గురించి మీరు చెప్పినది నాలో ఆసక్తిని రేకెత్తించింది. ఇన్నాళ్ళూ జిడ్డు కృష్ణమూర్తి ఈ యు. జి. కృష్ణమూర్తి ఒకరే అనుకున్నాను కాదన్నమాట. రజనీష్ నాకు కొన్ని విషయాల్లో నచ్చుతారు.

  ReplyDelete
 9. పైన వారందరిలా వివరంగాఎనలైజ్ చేసి చెప్పలేను కాని బాగా వ్రాసారు.

  ReplyDelete
 10. This comment has been removed by the author.

  ReplyDelete
 11. Very well written.

  Even if there is a Master, I think what is needed is the appetitie for quest, without which the pupil doesn't go much farther.

  Yes, I agree with what you said above.

  The organized religion may have done unspeakable sinful things, but at the same time it has contributed a lot to humanity, which atheists conveniently forget.

  ReplyDelete
 12. మీ అ౦తర౦గాన్ని చక్కగా తెలిపారు.

  @ద్వేషం వల్ల కాదు, ఏదో తెలియని బాధ, ఆవేశం వల్ల

  :) ఎన్నాళ్ళొ కాలేదనుకు౦టా ఈ వ్యాపార౦ బావు౦దని, కూతుర్ని దైవ౦ గా ప్రచార౦ చెయ్యడానికి ఇ౦కొకరు ప్రయత్ని౦చడ౦. అది ఫలి౦చి ఉ౦టే ఇ౦కా ఎ౦దరో నమ్మి స౦తోష౦గా ఉ౦డేవారు.

  @నమ్మకం కనీసం స్వాంతననిస్తుంది.

  అదే ఇ౦కొకరికి పెట్టుబడి కూడా.

  ReplyDelete
 13. సాయిబాబా దేవుడా ? ...దెయ్యమా ?
  see at http://www.analysis-seenu.blogspot.com/
  ANALYSIS <<<>>> అనాలిసిస్
  on MONDAY ( 24-04-2011)

  ReplyDelete
 14. ఇక్కడ నేను బుద్దుడు,జిడ్డు, రజనీష్ గురించి పూర్తిగా రియలైజ్ కాలేదని రాయటం అన్నది.వారిని తక్కువ చేసి మాట్లాడటానికి కాదు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, ఒక్కొకరి మానసిక స్థితిని బట్టి వారికి గురువులు కాని, సలహాలిచ్చేవారు కాని దొరుకుతారు. తీవ్ర తపన ఉన్నవారికి మాత్రమే అది లభిస్తుంది. రామకృష్ణ పరమహంస ఎలా చెప్తారంటె నీళ్ళ మునిగిపోతూ ఉంటే ఉప్పిరాడక బతకాలని ఎలా ప్రయత్నిస్తామో అలాంటి ప్రయత్నం ఉండాలి. లేకపోతే ఉన్నదానితో త్రుప్తిగా జీవించాలి. ఎందుకంటె ఈ ప్రపంచాన్ని సృష్టించిన శక్తి ఎక్కడా పొరపాటు చేయడు.Its so perfect we can not even imagine. ఇది కృష్ణుడి పిలాసఫి. అందువలన ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంట్టు, పక్కన ఉండేవారిని ఆనందపరచేవాడు. ఆయన ఎంత ఆనందంగా ఉందేవాడు అంటే అతనితో గడపిన వారు దానిని తలచుకొంట్టు జీవితాంతం గడిపేవారు. పండితుల నుంచి పామరులవరకు ఒకసారి ఆయన తో మాట్లాడితే జీవితాంతం మరచిపోలేక పోయెవారు. కృష్ణుడు ప్రపంచంలో మనం అనుకునే ఏ సుఖాన్ని తిరస్కరించ లేదు. మంచి చేడు, నీతి అవినీతి అన్నవి ద్వందాలు మాత్రమే. ఒకటిని పూర్తిగా నిర్మూలిస్తే రెండవది ఉండదు.

  ReplyDelete
 15. చాలా బాగా వ్రాశారు..

  మన మీద మనకు నమ్మకం కోల్పోయినప్పుడు ఆ నమ్మకం లభించే దారి కోసం వెతుకుతాం.. ఆ ప్రయత్నంలోనే బాబాలు, ఇంకెవరైనా.. మనం నమ్మిన వాళ్ళకు ఎటువంటి శక్తులు లేకపోయినా, వాళ్ళ మీద మనకున్న అపారమైన నమ్మకం అంతః చేతనలో మన శక్తిని పెంచి మనం కోరుకున్నది సాధించగలుగుతాం.. చాలాసార్లు ఈ విషయం గుర్తించలేం, మనం నమ్మిన వాళ్ళ వల్లే ఇవన్నీ సాధించగలుగుతున్నాం అని బలంగా విశ్వసిస్తాం.. మనకి తెలియని మన శక్తిని బయటకి తీసుకు వచ్చే నమ్మకాల వల్ల ముప్పు లేదు కానీ, అవతలి వాళ్ళు ఈ నమ్మకాన్ని వేరేగా వాడుకుంటేనే ఇబ్బందంతా..

  ReplyDelete
 16. >>దానికి ఫొర్ముల ఏ గురువు దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ ప్రస్థానం వద్ద, ఏ పుస్తకంలో, ఎవరి బోధలో, ఎవరి శిష్యరికంలో,ఏ మఠంలో, ఎక్కడ దొరుకుతుంది?

  నేనూ దానిగురించే వెతుకుతున్నాను. నాకు తెలిస్తే మీకు చెప్తాను, కాని అది మీకు ఉపయోగపడుతుందన్న గేరంటీ లేదు :-)

  >>సాయిబాబా (మత) ద్వేషులది మరో తీరు.
  మీరిక్కడ శాస్త్రీయవాదులనీ నాస్తికులనీ మతద్వేషులనీ ఒకే గాటిన కట్టినట్టు అనిపిస్తోంది. వారందరూ ఒకటికాదు.

  >>వ్యవస్థీకృతమైన అపనమ్మకం పరమ దాఱుణమైనది
  "దారుణం". అపనమ్మకం వ్యవస్థీకృతం కాగలదా? దేవుడు లేడన్న నమ్మకం వ్యవస్థీకృతం కావచ్చు. అది అపనమ్మకం కాదు, నమ్మకమే.

  >>నమ్మకం కనీసం స్వాంతననిస్తుంది. అపనమ్మకం వల్ల ఒరిగే ప్రయోజనమేదీ లేదు.

  "సాంత్వన". అపనమ్మకం వల్ల సంశయం దానినుండి అన్వేషణ పుడతాయి కదా?

  >>నూటికి ముప్ఫై మంది ఆకలితో ఛస్తుంటే సైన్సు బాంబులకోసం తన్నుకుంటూంది. అందుకు శాస్త్రీయవాదులు సమాధానం చెప్పరు
  బాంబులకోసం తన్నుకుంటున్నది సైన్సు కాదు. దానికి శాస్త్రీయవాదులు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.

  >>తర్కాన్ని ఎంతవరకు నమ్మాలి? ఎప్పుడు తర్కం వద్దనుకోవాలి? ఎవరి దగ్గర తర్కాన్ని త్యజించి విశ్వాసం చూపడం మొదలుపెట్టాలి?
  న్యూటన్ సూత్రాలు ఎంతవరకూ వర్తిస్తాయి? ఎక్కడవాటిని వదులుకోవాలి? ఇది చెప్పడానికి ఐన్స్టీన్ అవసరమయ్యాడు కదా! అయితే న్యూటన్ సూత్రాలని అధిగమించడానికి ప్రయత్నించినది ఐన్స్టీన్ ఒక్కడే కాదు. అలానే తర్కాన్ని త్యజించిన ఏ విశ్వాసమైనా సత్యాన్ని చూపిస్తుందని చెప్పలేం.

  >>Logic ను పక్కకు నెట్టేసి ఒక Entity ని నమ్ముతాము అనుకుంటే నా నమ్మకం (FAITH) వెనుక ఉన్నది ఏమిటి? కోరికా? భయమా? లేక ఆత్మార్పణమా? (Total surrender)

  చాలావరకూ కోరికా భయమే. వాటివల్ల ప్రయోజనమేమిటి? (మరకవల్ల ప్రయోజనమేమిటి అన్నట్టే ఉంది:-) ఏదైనా ప్రయోజం ఉండవచ్చు కాని కచ్చితంగా ఆ ప్రయోజనం సత్యాన్ని తెలుసుకోడం కాదు. నూటకోటికో కోటికోటికో బహుశా ఆత్మార్పణ ఉంటుంది. దాని వల్ల బహుశా సత్య దర్శనం అవుతుందేమో, నాకు తెలీదు.

  >>భయమూ, కోరికా లేనప్పుడు మనలను (ఆత్మను లేదా మనసును) ఒకరికి అర్పించుకోవడం ఎందుకు? ఆ అవసరమేమిటి?
  మళ్ళా నమ్మకంలో తర్కాన్ని వెతుకుతున్నారే! :-) సూర్యుడు ప్రతి రోజూ ఉదయించడం ఎందుకు? దాని అవసరమేమిటి? అని ఆలోచించి ఉదయించడు కదా. అది ప్రకృతి సహజంగా జరుగుతున్న ఒక క్రియ. ఆత్మార్పణం కొందరికి అలానే సహజం, అది వారి ప్రకృతిలో భాగం. అలా ఉన్నప్పుడే అది నిజమైన ఆత్మార్పణం.

  ReplyDelete
 17. టపాకాయలాంటి టపాను, ఐసుముక్కలమధ్య పెట్టి అందించారు. మీ రచనా శైలి అమోఘం!

  సాయిబాబాను విమర్శించినవారు, ఆయన మహిమల అసలు నిజాలను బయటపెట్టినవారు ఎందరో ఉన్నారు, డా. మిత్రా, అబ్రహాం కోవూర్... ఇలా. వాళ్ళను నమ్మక సాయిబాబాను నమ్మి బాగుపడ్డవాళ్ళున్నారు. అలాగే వాళ్ళను నమ్మి సాయిబాబాను నమ్మక కూడా బాగు పడ్డ వాళ్ళున్నారు. మొత్తానికి నమ్మకం ఎటువైపున్నా మంచిదే.

  ప్రొఫెసర్ సూరి భగవంతం గారని ఒకాయన, అంతరిక్ష శాస్త్రవేత్త, బాబా జీవిత చరిత్ర వ్రాశారు.అందులో బాబా సీకో వాచ్ కంపెనీ అధినేత బాబా దర్శనానికి వస్తే, ఇంకా మార్కెట్లోకి విడుదలకాని వాచీని సృష్టించియిచ్చారని, ఆయన దెబ్బకు బాబా భక్తుడైపోయాడని వ్రాశారు. ఈ తీగ పట్టుకొని జపాన్ డొంక దాకా కదిలించిన కోవూర్ గారు, తనకు బాబా ఎవరో తెలీదని, తానసలు ఇండియాకే ఎప్పుడూ రాలేదని సీకో కంపెనీ అధినేత వ్రాసిన లేఖను ప్రచురించారు. ఐనా ప్రజలకు మహిమల కథలు నచ్చినట్లు నిజాలు నచ్చవు కదా. అందుకే బుద్ధుని బోధనలకు దగ్గరగా ఉండే హీనయానం(తెరవాదం) కంటే ఆయన మహిమలను ముఖ్యంగా ప్రచారం చేసే మహాయానమే ప్రసిధ్ధి చెందింది.

  నేనూ పుట్టపర్తి వెళ్ళాను ఒక మూడు నెలల క్రితం.అక్కడ నేను కలిసిన అందరూ వారి జీవితంలో ఏదో కష్టం బాబా మహిమల వలన తీరిపోయిందని చెప్పేవారే గానీ, బాబా తమకు ఏదో ఆధ్యాత్మిక ప్రబోధం చేశారనో, అంతవరకు అనుభవంలోకి రాని సత్య దర్శనాన్ని కలిగించారనో చెప్పినవారు లేరు. నేటి కాలంలో భక్తి యొక్క పరమార్థం భుక్తి మాత్రమే అన్నది పుట్టపర్తిని దర్శించినా, షిరిడీని దర్శించినా, అంతెందుకు, తిరుపతి వెళ్ళినా ప్రత్యక్షంగా కనుపిస్తూనే ఉంటుంది.

  ReplyDelete
 18. టపా అసలు విషయంలో ఒక మంచి కొసరు విషయం దాగి పోయింది!

  మంజరీ శతకం గురించీ, వేమన పద్యాల హిందీ అనువాదం గురించీ ఇంకా నిస్తంత్రీ దూతం గురించీ కొంత వివరంగా పరిచయం చేయండి.

  ReplyDelete
 19. This comment has been removed by the author.

  ReplyDelete
 20. పాత సామేత ఒకటి ఉంది. " అన్ని పాములు నాట్యమాడుతుంటె ఏలిక పాము కూడా నాట్యమాడిందని". బ్లాగులోకం లో బాబా పేరు వినపడటం ఊగిపోతు ఉత్తర ఆంధ్రా నుంచి ఒక యువకుడు, కొత్త బిచ్చగత్తేకి పొద్దెరగ దన్నట్టు ఇంగ్లాండ్ లో టైంపాస్ కాక నిద్దరలేచిన మొదలు యితరుల బ్లాగులో చేరి విశ్వాసం అంటే ఎమిటి? నమ్మకం ఇతరులకు పెట్టుబడి అని మీకు తెలియదా ? చిన్న పిల్లలు ప్రశ్నలడిగినట్లు అడగటం. ఇతరులని ఇటువంటి ప్రశ్నలడిగే ముందర వారిని వారు ప్రశ్నించూ కోవాలి? లేకపొతే చెప్పింది విని గమ్ముగా ఉండాలి. ఇలాగే అడుగుతూ పోతుంటె ఉన్న మర్యాద పోగొట్టుకోవటం తప్పించి వీరికి ఒరిగే లాభం ఉండదు. అదిగమనించ కుండా ఇతరుల సహనాన్ని పరీక్షిస్తూ, అడ్డదిడ్డమైన పనికిమాలిన ప్రశ్నలు వేసేవారు, వారి స్థాయి మేధావులను (ఉత్తరాంధ్రా మేధావి, మీడియా మేధావి ) వెతుకొని అక్కడ చేరి వారి భావాలను పంచుకొని ఆనందించేది.
  ప్రశ్నించి నిజం తెలుసుకోవాలను కునేవారు, సమాధానం వెతకాలను కునే వారు యు జి గారి లాగా గట్స్ ఉండాలి. అంతే కాని ఊరకనే ఇతరులను ప్రశ్నించటం. అది మోసం గురించి అడగటం ఎమీ బాగా లేదు. ఎవరైనా మోసం చేస్తే ప్రభుత్వం,Police, న్యాయస్థానలు ఉన్నాయి కదా! వాటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఇది ఆధ్యత్మిక చర్చ. ఇదేమి దేశంలో లంచగొడ్డి తనం మీద చర్చ కాదు. ఇతరుల ఏకాభిప్రాయం అభిప్రాయాన్ని ఖండించి, వాదనలో తప్పొప్పులను ఎత్తి చూపి చట్టం లో మార్పులు తెవాలని ఇక్కడ ఎవరు ప్రతిపాదన చేయటం లేదు.
  ..... Continued

  ReplyDelete
 21. ఇక బాబావిషయానికి వస్తే అతను తల్లి లా అందరిని ప్రేమించాడు. డబ్బులిస్తే తీసుకొన్నాడు. బలవంతం వసూలు చేయలేదు. అన్ని దేశాలు తిరుగుతూ సంపాదించను లేదు. ఆ డబ్బులు ఎక్కువై ఆయనని పట్టించుకోకపోయినా తన పక్కవారి మీద పేపరికి ఎక్కలేదు. పక్కవారి డబ్బును మొత్తం తీసుకొని భక్తులను వీధులపాలు చేయలేదు. అటువంటి గురువులు చాలామంది ఉన్నారు.బాబా ఒరిజినల్ కాకపోతే ఇన్ని రోజులు ఆస్థానం లో నిలబడేవాడు కాదు. బాబాని అనుకరించి బాల సాయిబాబా ఎలా ఘొరం గా దెబ్బతిన్నాడో అందరికి తెలుసు.

  ReplyDelete
 22. *ఆత్మార్పణం కొందరికి అలానే సహజం, అది వారి ప్రకృతిలో భాగం. అలా ఉన్నప్పుడే అది నిజమైన ఆత్మార్పణం. *

  భైరవభట్ల కామేశ్వర రావు గారు చెప్పినట్టు ఆత్మార్పణం అనేది ఒక క్రియ కావొచ్చు. కాని అది మొదలయ్యేది గురువుని కలవటం ద్వారా మాత్రమే. అంతవరకు ఎవరో చెప్పితే వినటం , పుస్తక జ్ఞానం తో ఉబుసుపోకగా చర్చించుకోవలసిందే,ప్రశ్నించు కోవలసినదే . మరి గురువు కలవటమనేది ఎటువంటి సైకాలజి వారికి అటువంటివారు దొరుకుతారు. ఆగురువుని సిన్సియర్ గా వుండేవారు బాగా పరీక్షించి మాత్రమే నమ్ముతారు. ఆ పరీక్ష ఏలా వుంట్టుందంటె వివేకానందుడు రామకృష్ణ పరమహంసని ప్రశ్నలతో సతాయించి, అతని నడవడికను గమనించి చివరికి నమ్ముతాడు. ఇక్కడ నేను పదే పదే వివేకానందుడు ఉదాహరణ ఇవ్వటానికి కారనం ఆయన గురించి అందరికి తెలుసు కాబట్టి.

  ReplyDelete
 23. ఇదివరకు రాసిన వ్యాఖ్య స్పామ్‌లోకి వెళ్ళిందో లేక పోస్ట్ చేయడం మరిచానో...
  found some answers to questions dwelling in my mind for awhile. thanks for the post

  ReplyDelete
 24. చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళకేమీ నమ్మకాలు లేవని ఉన్నా వాళ్ళ నమ్మకాలే గొప్పవని. మనం తెల్లారిన దగ్గరనుంచీ రాత్రి పడుకునేదాకా నమ్మకాల మీదే జీవించేది. పొద్దున్న నిద్ర లేస్తామనే నమ్మకంతోటి రాత్రి పడుకుంటాము. రోడ్డు దాటుతుంటే మననెవరూ కొట్టేయ్యరని రోడ్డు దాతుతాం. ఆఫీస్ కెళ్తే ఉద్యోగం ఉంటుందని ఆఫీస్ కి వెళ్తాము. ఇంటికొస్తే భోజనం ఉంటుందని ఇంటికి వస్తాము. ఇంతెందుకు మనం రోజూ ఆరోగ్యంగా ఉండి జీవిస్తామనుకుంటూ జీవిస్తాము. ఇంకా ఎన్నయినా చెప్పచ్చు. నమ్మకాల మీదే జీవించేది.

  ఆ నమ్మకాలన్నీ వమ్ము అయిన వాళ్ళని హాస్పటల్ల లోనూ, ఉద్యోగవేటల లైన్ల లోనూ, నిద్ర కోసం రోడ్లమీద జాగా కోసం కొట్టుకునే వారిలోనూ,జపాన్ మలేసియా లో సునామీ బాధల శిబిరాల్లో, భూకంపాలతో ఇల్లుపడిపోయి దిక్కులేకుండా తిరిగుతున్న హైతీ లోనూ చూస్తాము. నమ్మకాలూ, ఆశలూ, అడియాసలయిన వారు ఎందఱో.

  అందుకని మన నమ్మకాలని మానుకుంటున్నామా? రైళ్ళు ఎక్కటల్లేదా?, కార్లు ఎక్కటల్లేదా? ప్లేన్లు ఎక్కటల్లేదా? రోడ్లు క్రాస్స్ చెయ్యకుండా వెళ్ళు తున్నామా? కాగా ఎవరన్నా భయపడుతుంటే ఎద్దేవా కూడా చేస్తాం. అసలు మన జీవితమంతా నమ్మకాల తోటి బ్రతికేది. అవి మనకి ఊరటనిస్తాయి. జీవించనిస్తాయి. ఇంకొకళ్ళ నమ్మకాలు
  మన నమ్మకాలతోటి సరిపోవని వాళ్ళని కించపరచిన అవసరంలేదు. బాధ పడిపోయి జుట్టుపీక్కుని అందరూ తప్పుచేస్తున్నారని గంతులేయ్యవలసిన అవుసరం లేదు. వాళ్ళ జీవితం వాళ్ళ నమ్మకాలతోటి బాగానే సాగిపోతోంది.

  అందుకనే వాళ్ళకి వాళ్ళ నమ్మకం కనీసం స్వాంతననిస్తుంది. అపనమ్మకం వల్ల ఒరిగే ప్రయోజనమేదీ లేదు. నీరు కారి పోవటం తప్ప.

  ReplyDelete
 25. చాలా బాగా వ్రాశారు రవిగారు..
  మినర్వాగారు రాసిన కామెంట్ లొ మొదటి రెండు లైన్లు నా అభిప్రాయం కూడాను.

  ReplyDelete
 26. చాలా బాగా చెప్పారు నమ్మేవారి నమ్మక౦ గురి౦చి. కాని నేను పెట్టుబడి అన్నది, నమ్మి౦చే వారి గురి౦చి.నమ్మేవారిని ఎలా ని౦ది౦చగలము. నాకు కావల్సిన వారు కూడా చాలా మ౦ది ఉన్నారు సత్యసాయిని నమ్మిన వారిలో. వారెవరు మోసపోయామని అనుకోరు కూడా.

  ఇలా౦టి వారిని చూసి, ఇ౦కొకామే 'సుధారాణీ ఒక బిడ్డను కని ఇలా దైవ౦ గా చెలామణీ చెయ్యడ౦ కోస౦' రె౦డవ వివాహ౦ చేసికొని ఆడపిల్లను కని, అలాగే పె౦చి వార్తల కెక్కిన కధ మనకి తెలుసు కదా.

  ఇక సత్యసాయి ట్రస్టు ధన౦ గురి౦చి కూడా నేను వ్యాఖ్యాని౦చను. అది ఇచ్చేవారికి తీసికోనే వారికి స౦బ౦ధి౦చిన విషయ౦.

  ఇక ఆయన్ని దైవ౦ కాదు అన్నవారిని విమర్శి౦చే హక్కు కూడా ఎవ్వరికి లేదు కదా.

  ReplyDelete
 27. @ శ్రికర్ గారు ,
  "మంచి చేడు, నీతి అవినీతి అన్నవి ద్వందాలు మాత్రమే. ఒకటిని పూర్తిగా నిర్మూలిస్తే రెండవది ఉండదు. "
  ఎందుకో తెలియదు, ఈ వాఖ్య నన్ను చాలా ఆలోచింప చేస్తుంది. ధన్యవాదాలు.

  ReplyDelete
 28. *కాని నేను పెట్టుబడి అన్నది, నమ్మి౦చే వారి గురి౦చి.నమ్మేవారిని ఎలా ని౦ది౦చగలము. *
  చిన్నపుడు పిల్లలు వాళ్ళ అమ్మ వారిని ఎంతో ప్రేమిస్తుందని అనుకొంటారు. కాని చాలా మంది మగ వారికి పెళ్లి ఐన తరువాత తల్లి ప్రేమలో కొన్ని లోపాలు కనిపించటం మొదలు పెడతాయి. కొన్ని సార్లు ఆమే తన మాట నెగ్గాలని కోడలిని అదుపు చేయాలనే చేసే ప్రయత్నాలు చూసి ఇద్దరికి నచ్చ చెప్పలేక నలుగుతూ ఉంటారు. అతను తల్లి ప్రేమని పెళ్ళీఅయిన తరువాత పరిశిలిస్తే, ఆమే చిన్నపుడు ఇతనిని ప్రేమించింది పెద్ద ఐన తరువాత ఇతనిని అదుపులో ఉంచుకోవటానికని అనిపించిందే అనుకోండి. తల్లి "ప్రేమ అనేది" పెట్టుబడి నమ్మించింది, ఇతను పెద్దయ్యాక అదుపులో ఉంచుకోవటానికే అని అంటె ఎలా ఉంట్టుంది? పిల్ల వాడు నమ్మాడు గనుక అతనిని నిదించలేము. కొడుకుచేత ప్రేమించేబడేటట్లుగా తల్లి ఎత్తువేసింది అని తల్లి ని నిందించాలి అంటే ఎలా ఉంట్టుంది? ఆవిధంగా ఉంది మీవాదన. ఇంత వాదనకి అసలు కారణం మీ లాజికల్ మైండ్, ఎప్పుడు ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం లోనే ఆలోచిస్తుంది. దానికి భిన్నంగా వ్య్వహరిస్తే అర్థం చేసుకోవటం ఆగి పోయి, అపార్థం చేసుకోవటం మొదలు పెడుతుంది. కాని మనిషులు ప్రేమించినపుడె లాజికల్ మైండ్ కి భిన్నంగా ఆలోచిస్తారు.
  --------------------------------
  ప్రేమ అనే విషయానికి వస్తే మనుషులు లాజిక్ గా ఆలోచించటం మానేసి, తప్పొపులను, వాదోపవాదాలను అన్నిటిని పక్కన పెట్టి ప్రతిస్పందిస్తారు. అది తల్లి, ప్రియరాలైనా, భార్య, మిత్రులు, బంధువులు అయినా. మనుషులు సంపాదించేది తాను ప్రేమించిన వారికి సాధ్యమైనత వరకు కష్ట్టం కలగ కుండా చూడాలనేది ప్రధాన ఉద్దేశం. మనిషి ప్రేమించినన్ని రోజులు ఇతరులలో మంచి గుణాలే చూస్తాడు. చెడ్డ వాటిని చూసిచూడనట్లు వదిలేస్తారు. ఇక్కడ బాబా గారిలో కొంతమంది కి వారు ఆశించిన ప్రేమ కనిపించింది డబ్బులు ఇచ్చారు. ఆయన తీసుకొన్నారు. మిగతావారు ఎన్ని విమర్శలు చేసిన అతనిని ప్రేమించిన వారు టినేజ్ ప్రేమికులు పెద్దల మాట ఎలా వినరో వారు ఇతరుల మాటలు వినకుండా డబ్బులిస్తున్నే ఉన్నారు అని అనుకోవచ్చు కదా! మధ్యలో వారెవరు మోసపోయామని అనుకోరు కూడా అని మనం బాధ పడవలసిన అవసరం ఎమీటి?

  ReplyDelete
 29. చూడబోతే మనుషులు ప్రేమ గురించి మరచి పోయినట్లు ఉన్నారనిపిస్తున్నది. అమర్ ప్రేం సినెమా చూడండి. ఈ సినేమాలో ఎవరికి ఎవరు ఎమీ కారు కాని అందరు ఒకరిని ఒకరు ప్రేమించుకొంటారు.
  Sharmila Tagore & Rajesh Khanna Amar Prem
  http://www.youtube.com/watch?v=2KngOTfCR7s
  రవిగారు మీ బ్లాగు లో టపాకన్నా నేను ఎక్కువ రాసేశాను. సారి ఎమీ అనుకొకండి, మీకు నచ్చని వ్యాఖ్యలు తోలగించండి నేను ఎమీ అనుకోను.

  ReplyDelete
 30. బాబా అవతారాలెత్తి,ఇ౦ద్రజాల౦ తో నమ్మి౦చే వారికి, మీరు చెప్పే కుటు౦బ స౦బ౦ధాలకి పోలిక!!

  మళ్ళీ చెపుతాను, డబ్బు ఇచ్చేవారి గురి౦చి, తీసికోనే వారి గురి౦చి అది వారిష్ట౦.

  ReplyDelete
 31. >>>అంతిమంగా ఏదైతే తెలుసుకోవలసి ఉందో, ఏది తెలిస్తే దుఃఖమూ, అసూయ, అజ్ఞానము, అవివేకమూ మొదలైనవన్నీ నశిస్తాయో దానికి formula ఏ గురువు దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ ప్రస్థానం వద్ద, ఏ పుస్తకంలో, ఎవరి బోధలో, ఎవరి శిష్యరికంలో,ఏ మఠంలో, ఎక్కడ దొరుకుతుంది?

  అంతిమంగా తెలుసుకోవలసివస్తే ఇప్పట్నుంచీ వర్రీ ఎందుకు? అంతిమంలో దుఃఖము, అసూయ గట్రా పోగొట్టుకొని మనం సాధించేదేమిటి? తెలుసుకోవలసింది ఇప్పుడే.
  >>>Master is born when pupil is ready

  మన జిజ్ఞాస తీవ్రమైనప్పుడు మీరు కోట్ చేసినట్టు గురువు పుట్టుకొని రావాల్సిందే!

  ReplyDelete
 32. రవి గారూ, మీ అంతశ్శోధన బాగుంది.

  >> బహుశా మరో రెండు తరాల తర్వాత ఏమో, జిడ్డు కృష్ణమూర్తి కూడా దేవుడు కావచ్చు!... >>

  బుద్ధుడి కాలంలో మాత్రమే ఇలాంటిది కొంతవరకూ సాధ్యమైంది. తనను దైవంగా ప్రతిష్ఠించటానికి అనిబిసెంట్ లాంటివారు చేసిన ప్రయత్నాన్ని నిర్వ్వంద్వంగా తిరస్కరించిన వ్యక్తి జిడ్డు కృష్ణమూర్తి. సమాజంలో తర్కమూ, హేతువూ ఎంతో కొంత పెరుగుతూ, కమ్యూనికేషన్ వృద్ధి చెందిన ఈ రోజుల్లో (భవిష్యత్తులో కూడా) ఒక స్థిరపడిన సత్యాన్ని అసత్యంగా మార్చెయ్యటం కుదురుతుందా?

  >> వీళ్ళు చెప్పే అంత సైన్సూ ఈ రోజు ఒరగబెడుతున్నదేమీ లేదు. నూటికి ముప్ఫై మంది ఆకలితో ఛస్తుంటే సైన్సు బాంబులకోసం తన్నుకుంటూంది. అందుకు శాస్త్రీయవాదులు సమాధానం చెప్పరు. వాళ్ళమాట వింటే ప్రపంచం మారిపోతుందన్న అల్పభ్రమలో ఉంటారు.>>

  సైన్సు ప్రగతి వల్ల సమాజం సమూలంగా మారిపోతుందనుకోవటం భ్రమే కానీ- బాంబుల కోసం తన్నుకోవటం అనేదానితో సైన్సుకు సంబంధం లేదు. తప్పుపట్టాల్సింది సైన్సును దుర్వినియోగం చేసే వ్యవస్థను!

  ReplyDelete
 33. బాబా అవతారమేత్తి, ఇతరులను ప్రేమించి వారి కుటుంభసభ్యుల లో ఒకరు అయ్యాడు. మీకు తెలుసో లేదొ కుటుంబ స౦బ౦ధాలలో కూడా ప్రేమను ఇతరులకు వ్యక్త పరచటానికి నమ్మకం, నమ్మించటం ఉంట్టుంది. రక్త సంబంధం వలన ,తాళికట్టి కొంతకాలం కాపురం చేసినందు వలన భార్యా భర్తల మధ్య అన్ కండిషనల్ లవ్ పుట్టదు. మనుషులు ఎప్పుడైతే కుటుంబ సభ్యుల వలన తనకు నష్ట్టం జరుగుతున్నాదని (ఆస్థి, పవర్, వారసత్వం రావటం లేదని ) భావిస్తారో అప్పుడు చూడాలి వారి మధ్య నడిచే నాటకం. ప్రముఖుల వైతే పేపర్లో వస్తాయి. స్టాలిన్ వర్సెస్ అళగిరి, అంబాని సోదరులు మొద||. సామాన్యుల వైతే బంధు మిత్రుల వరకు పరిమితం అవుతాయి.

  *డబ్బు ఇచ్చేవారి గురి౦చి, తీసికోనే వారి గురి౦చి అది వారిష్ట౦ *
  మీరు తిరిగి పైన మాట చెప్పటం లో నే ఉంది డబ్బుకుగల ప్రాముఖ్యత.

  ReplyDelete
 34. ఈ పోస్టుకు ఇన్ని వ్యాఖ్యలు వస్తాయని అనుకోలేదు. నా సోది భరించగలిగే వారే స్పందిస్తారనుకున్నాను. వ్యాఖ్యాతలకు నెనర్లు. కొన్ని సమాధానాలు

  @మినర్వా, @వేణు, @కామేశ్వరరావు గారు, ఇంకా నా టపాలో ఎర్రటి పేరాగ్రాఫు వ్యాఖ్యాతలు: క్లుప్తంగా मॆरा भाषा कॊ नही, भावनाऒं कॊ सम्झॊ :)) - సైన్సు తన్నుకుంటుంది అంటే సైన్సు ఫలాలు అందరికీ అందట్లేదని భావం. ఇందుకు ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి. లేదా మతంకన్నా, మనిషి విశ్వాసాలకన్నా సైన్సు గొప్పదని వాదించేవాళ్ళు సమాధానం నిజాయితీగా వెతకాలి. కాదంటారా?

  @మినర్వా గారు: నేను సైన్సును నిందించలేదు. (నేను స్వయంగా సైంటిస్టును ఒకప్పుడు) అలా తోస్తే అది గ్రహపాటు (టైపాటు లాగా :))

  @మౌళి గారు: ..అదే ఇ౦కొకరికి పెట్టుబడి కూడా.
  మనం కూడా అనేకవిధాలుగా ఇతరుల బలహీనతలమీదే బతుకుతున్నాం. సూక్ష్మంగా ఆలోచించండి. వీలైతే ఎప్పుడైనా ఓ టపా రాయాలని ఉంది.

  @శ్రీకర్ గారు: యూ.జీ కృష్ణమూర్తి గురించి విన్నాను. అయితే పూర్తిగా తెలియదు. వీలైనప్పుడు తెలుసుకుంటాను.

  @కామేశ్వరరావు గారు:
  >>కాని అది మీకు ఉపయోగపడుతుందన్న గేరంటీ లేదు :-)

  అలాగయితే మీ దగ్గరే ఉంచుకోండి. :)

  >>మీరిక్కడ శాస్త్రీయవాదులనీ నాస్తికులనీ మతద్వేషులనీ ఒకే గాటిన కట్టినట్టు అనిపిస్తోంది. వారందరూ ఒకటికాదు.

  ఒక గాటన కట్టలేదు. ఆ రక్తచరిత పేరా ద్వేషవాదులకు (hatred rationalists) ప్రత్యేకం.

  >>"దారుణం". అపనమ్మకం వ్యవస్థీకృతం కాగలదా? దేవుడు లేడన్న నమ్మకం వ్యవస్థీకృతం కావచ్చు. అది అపనమ్మకం కాదు, నమ్మకమే.

  నాస్తికత్వంలో అనేకరకాలు ఉన్నట్టు అపనమ్మకం లో ద్వేషపూరితమైన అపనమ్మకం ఒకటి. అంటే నమ్మకం ఉన్నవాళ్ళ మీద విద్వేషం కక్కడమన్నమాట. అందులో మూల సూత్రం విద్వేషం కాబట్టి అది వ్యవస్థీకృతం చేయవచ్చు. :))

  @చంద్రమోహన్ గారు: మీరు చెప్పిన ఉదంతం రైలు ఉదంతం లా ఉంది. ఒక స్వామీజీ భక్తునితో నేను ఆగమంటే రైలు ఆగిపోతుందని సవాలు చేశాడుట. అలాగే ఆగింది కూడానూ. లోగుట్టు ఏమిటంటే డ్రైవరు స్వామీజీ భక్తుడు.

  మీరు చెప్పిన చివరి పేరాగ్రాఫు నిజం. మనమూ అంతే.

  @రావు గారు: సరిగ్గా చెప్పారు.

  @వేణు గారు: షిరిడీ సాయిబాబా బ్రతికి ఉన్న రోజుల్లో ఫకీరుననే చెప్పుకున్నట్టు విన్నాను. ఇప్పుడు ఆయన కోరికలు తీర్చే దేవుడు కదండి.

  ReplyDelete
 35. రవి గారూ, అబ్బ, ఎంత బాగా రాశారో! నా మనసులో సందిగ్ధంలో ఉండి ఆ భావాలలోంచి ఇంకా ఒక కొలిక్కి రాలేని భావాలకు అద్భుతంగా అక్షర రూపం ఇచ్చారు.

  చప్పట్లు చప్పట్లు !

  శ్రీకర్ గారూ, మీ మాటలు కూడా చాలా బావున్నాయి.

  ReplyDelete
 36. /వీళ్ళు చెప్పే అంత సైన్సూ ఈ రోజు ఒరగబెడుతున్నదేమీ లేదు. నూటికి ముప్ఫై మంది ఆకలితో ఛస్తుంటే సైన్సు బాంబులకోసం తన్నుకుంటూంది. అందుకు శాస్త్రీయవాదులు సమాధానం చెప్పరు. /

  ఈ ఒక్క వ్యాఖ్య పక్కన పెడితే.., తక్కిన టపా అంతా బాగుంది, బాగా చెప్పారు.
  మీరు చెప్పిన ఆ ఫోటోలు దక్కన్ క్రానికల్ లో వచ్చినట్టు గుర్తు.

  ReplyDelete
 37. @సూక్ష్మంగా ఆలోచించండి

  చక్కగా చెప్పార౦డీ,

  సరే, ఇతరుల నమ్మకాలని పెట్టుబడిగా మలచుకోవడ౦ అ౦గీకారమే అనుకు౦దాము.
  చట్టపర౦గా ఈ హక్కులకు పరిమితులున్నాయి.చట్టాన్ని పక్కన పెట్టినా ధర్మ౦ ఉ౦డనే ఉ౦ది. మీ టపా కోస౦ వేచి చూస్తాను.

  @డబ్బుకుగల ప్రాముఖ్యత.

  :) నా అభిప్రాయ౦ చెప్పాను కదా ఇ౦తే ప్రాముఖ్యత అని.

  ReplyDelete
 38. అనంతపురం జిల్లా నివాసిగా నేను కూడా మీ మాదిరిగానే మొదట్లో ఆయన గూర్చి పూర్తిగా తెలియక వ్యతిరేక భావమని అనలేనుగానీ అభిమానించేవాడిని గాను కానీ తర్వాత్తర్వాత ఆయన చేస్తున్న మంచి పనులు,పంచుతున్న సేవాభావాన్ని,ప్రేమతత్వాన్ని తెలుసుకుని అభిమానించడం మొదలుపెట్టాను.

  ReplyDelete
 39. రవిగారూ !!

  టపా ఆలస్యంగా చూశా. 'అంతశ్శోధన ' శీర్షికకి తగ్గట్టుగానే వివిధ దశల్లో మీ ఆలోచనా సరళిని అద్దంపట్టింది ఈ టపా. నేను ఆలస్యంగా చూడటం కూడా ఒకందుకు మంచిదే అయ్యింది. ఇప్పటికే అందరూ వ్యాఖ్యానించేశారు కాబట్టి, నా వ్యాఖ్యలు మళ్ళీ దుమారం రేపే అవకాశం కొచం తక్కువే. జిహ్వ కో రుచి అంటారు కదా... అట్లా కొందరికి కొన్ని నచ్చుతాయి. క్రైము, సస్పెన్సు, ట్రాజెడీ, రొమాన్సు.. అన్నీ అందరికీ నచ్చెయ్యవు. అలాగే అనుభూతికి మార్గాలు అనేకం. జ్ఞాన యోగం, కర్మ యోగం, భక్తి యోగం, సాంఖ్య యోగం గట్రా...

  అందులోనూ మళ్ళీ ఒక్కో దానిలో గ్రేడింగు... భూమి గుండ్రంగా ఉంది అన్నది ఒక క్లాసులో సత్యం, ఇంకొక క్లాసులో అసత్యం...బల్లపరుపుగా ఉంది అనేది సత్యం...సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడనేది ఒక సత్యం.. సూర్యుడు ఉదయించడు. భూమే తిరుగుతోంది కనుక సుర్యోదయమన్నదే లేదసలు తూర్పన్నది కూడా ఉత్తుత్తిదే అన్నది ఇంకో నగ్న సత్యం.. ఈ రెండిట్లో మొదటిదాన్ని మాత్రమే అర్థంచేసుకోగలిగేవారికి రెండోది చెప్పేస్తే కంగాళీగా ఉంటుంది.. రెండవవారికి మొదటిది చెబితే హాస్యాస్పదంగా ఉంతుంది...

  అల్లా ఒక్కో గ్రేడింగులో ఉన్నవాళ్ళకి ఆ తరగతి పాఠాలు చెప్పటం మనం ఎరగనిది కాదు. అమృతం పోస్తూంటే చొంగలు కార్చుకుంటూ చూస్తూ ఉండిపోయినవాళ్ళు కొందరైతే అమ్మో అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెట్టివాళ్ళింకొకళ్ళు. వారిని కట్టి పడేసిన అందం వీరిని కట్టిపడెయ్యలేకపోయింది (పల్చటి మాటల్లో చెప్పాలంటే ఆవిడగారి పప్పులు ఒకళ్ళిద్దరి దగ్గర ఉడకలేదు). అంతమాత్రాన ఆవిడ అతిలోక సౌందర్యవతి కాకపోతుందా (మిగిలినవాళ్ళామాట ఒప్పుకోరు కదా.. వాళ్ళ అనుభూతి నిజమే కదా) కానీ అదే ఆవిడ పాచిక ఒకరిద్దరి విషయం లో పారలేదుకదా.. కనుక ఆవిడ అట్టెంప్టు వృధా అంటామా?

  మరా మరా అంటే తారక మంత్రం అయిపోయింది ఒకళ్ళకి.. ఎన్ని పురాణేతిహాసాలు రాశినా తృప్తి కలగలేదింకొకరికి... తేడా నామం లో/ కథ లో లేదు. అప్పటి వారి మానసిక స్థితిలో ఉన్నది.

  వేదంలో దీనినే తైత్తిరియోపనిషత్తులో చెప్పారు. అన్నమే బ్రహ్మం అని తెలుసుకోవటంతో మొదలెట్టి దానికి ఆధరమైన ప్రాణం బ్రహ్మం అనీ, దానికాధారమైన మనస్సు అసలైన బ్రహ్మం అనీ, దాని ఆధారమైన విజ్ఞానం బ్రహ్మం అనీ చిట్టచివరికి ఆనందమే బ్రహ్మం అనీ భౄగు-వారుణి సంవాదం లో చెప్తారు... ఆ తండ్రీ కొడుకూ మీరనట్టుగా అంతశ్శోధన చేసే టైపు...ప్రశ్న నుండి ప్రశ్నకి వెదికే తైపు. మీరాబాయి, పోతన ఇంకో "టైపు ". అంతలా లోపలలోపలకి చొచ్చుకుపోకుండా పాడుకుంటూ చాలా సాదాసిడాగా ఆనందంగా గడిపేశారు.

  కొందరు అన్నమే బ్రహ్మం అని తెలుసుకున్నారనుకోండి... అది సత్యమా??? అని ఎంత ఎదురు ప్రశ్న వేసినా వాడి స్థాయికి అదే సత్యం.. ఇంత కుండలోనుంచి అంత విభూతి ఎలా వస్తోంది అనుకుంటే ప్రశ్నాగానే ఉంటుంది. అది అందరికోసం చేసినది కాదు అని తెలుసుకోవటం ఒక అవగాహన. కుక్కలు అతిసుక్ష్మ శబ్దాలను వినగలవు అంతమాత్రం చేత, మనకి వినిపించనిదీ, కనిపించనిదీ ట్రాష్ అనుకుంటే తప్పుకాదు. అది ఇంకొక అవగాహన.

  ఏ పనినైనా దాని ముఖవిలువతో(face value) కన్నా దాని పరమావధితో గమనిస్తే అది మంచా చెడా అన్నది సులభంగా బోధపడుతుంది అని అంటారు. బాబా గారు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస చాటి చెప్పారు. కొన్ని ఉత్తుత్తి మేజిక్కులు కూడా చేశారు. మేజిక్కులు చేస్తే హీరో అని నమ్మేవాళ్ళనూ ఆకర్షించి మంచి మార్గంలో నడిపారనుకోండి (అంటే గైడ్ సినిమాలో దేవానంద్ లాగా) ఆ మేజిక్కు పర్యవసానం మనిషిలో మార్పు అనుకోండి అది తప్పెలా ఔతుంది? కార్యం సిధ్ధించటానికి సామ దాన భేద దండోపాయాలలు ఉన్నట్టే అవతార లక్ష్యం సిధ్ధించటానికి వివిధ మార్గాలు ఎన్నుకుంటే తప్పెలా ఔతుంది?

  భూమి ఎందుకు తిరుగుతోంది, ఎలా తిరుగుతోంది అన్న విషయ సోధన చేసినవాడు చేసే సాధనలోనుంచీ తెలుసుకునే అనుభవమూ/ అనుభూతి/ పరమావధీ... భక్తిలో తాదాత్మ్యత చెందినవాడు పొందే అనుభవమూ/ అనుభూతి/ పరమావధీ...నా దృష్టిలో ఒకటే..

  ఆ మధ్య ఒక చిన్న కథ చదువుకున్నా.. ప్రపంచం లో ఏడు వింతలేమిటీ అంటే అందరూ ఏదో రాసేస్తూంటే ఒకమ్మాయి మాత్రం చూడటం, వినటం లాంటివి అన్నింటికన్నా గొప్ప వింతలు అందిట. అట్లా... విభూది తీయటం, లింగం తీయటం మేజిక్కనుకున్నారు. అంతడబ్బు అందరిదగ్గరనుండీ పోగుచేయటం, ఆ ధనాన్ని విన్యోగించి ఎందరికో దాహార్తిని తీర్చటం మాత్రం మేజిక్కు కాదా??..

  ఏ అవతార లక్ష్యం దానిది.

  ReplyDelete
 40. రవిగారూ !!

  >> Master is born when pupil is ready.
  >> When the rain comes grass grows by itself.

  రెండింటికీ తేడా ఉంది. వర్షం వచ్చింది కాబట్టి గడ్డి పెరిగింది. గడ్డీపెరగటానికి సిద్ధంగాఉంది కాబట్టి వర్షం రాలేదు. సోక్రటీసు, ఐన్ స్టీన్ లాంటి మహానుభావుడు చెప్పిన ఎన్నోసిద్ధాంతాలనీ, సూత్రాలనీ అప్పటికాలంలో చాలామంది అర్థంచేసుకోలెకపోయారు. అంతమాత్రాన వారు రాకమానలేదు, సిధ్ధాంతాలను రాసి వదలకపోలేదు. ఏమైనట్టు ?? దాన్ని అవగాహన చేసుకునే పరిపక్వత సగటు మానవులకు కలిగినప్పుడు ఎక్కువ దానిని ఆస్వాదించారు. లేకపోతే ఎంతటి మంచివిషయాన్నైనా మళయాళం సినిమాను చూసినట్టు చూసి వెళ్ళిపోయారు

  Irrespective of the readiness, the committed people have always done what they thought is good for the society at large. It is defined by the time, not by the pupil, I believe. Only the matured people could understand this at that time.

  ReplyDelete
 41. రవిగారూ !!
  సరదా గా.. కొంచం ఈకలు పీకుతున్నా ఏమీ అనుకోకండే....

  అంతిమంగా ఏదైతే తెలుసుకోవలసి ఉందో >> అంతిమంగా తెలుసుకోవలసినది ఇది అని నిజంగా ఎమైనా ఉంటుందా? (నాకు తెలిసి తెలుస్కుంటూ పోతూంతే ఇంతకన్నా తెలియదగినదేదీ లేదంతెలియటమే ఉంటుంది కదా)
  ఏది తెలిస్తే దుఃఖమూ, అసూయ, అజ్ఞానము, అవివేకమూ మొదలైనవన్నీ నశిస్తాయో >> నాకు తెలిసి ఏవీ నశించవు, మనకి పట్తటం మానేస్తాయి. (అసత్తు నుండీ సత్తుకీ, తమస్సు నుండీ వెలుగుకీ, మృత్యువునుండీ అమృతత్వానికీ పయనమే కానీ ఒకటి నశించటం అంటూ ఉండదు కదా)
  దానికి ఫొర్ముల ఏ గురువు దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ ప్రస్థానం వద్ద, ఏ పుస్తకంలో, ఎవరి బోధలో, ఎవరి శిష్యరికంలో,ఏ మఠంలో, ఎక్కడ దొరుకుతుంది>> ఇదెలా ఉంది అంటే మా ఆఫీసులో సంగతి ఒకటి చెప్పలి. ఎవడో ఒక ఎంట్రీ లెవల్ ప్రోగ్రామరు "నన్ను అమాంతం ఒక ఆర్కిటెక్టుని చేయగలిగినవాడెవడైనా ఉన్నాడా" అని అడిగినట్టుంది... అమీర్పేట నుండా ఇన్శ్తిట్యూట్లు ఉన్నాయి. ఎందులో మొదలుపెట్టి సాధనచేసినా నువ్వు ఆర్కిటెక్టువి కొంతకాలానికి ఔతావు గానీ అమాంతం రమ్మంటే కడుపూ రాదు, అమాంతం కమ్మంటే ఆర్కిటెక్టువీ కావు అన్నా" అట్లానే ఇదీను.

  ఆమధ్య చిన్నపిల్లల ఆన్సర్ షీటు అంటూ ఒక మెయిల్ ఫార్వార్డు వచ్చింది. అందులో find x అని ఉంటే ఒక పిల్ల x కి సున్నా చుట్టి here అని చూపించిదిట. అట్లా డైరెక్టు గా ఇక్కడదొరికేస్తుందంటే ఇక అందులో కిక్కేముంది?
  ఒకవేళ చెప్పారే అనుకోండి నిజాం గా ప్రయత్నించి సాధిస్తారా?? అయితే వేదం చెప్పింది తెలుసుకోవాల్సింది ఏంటీ అంటే...
  అంతర్ బహిశ్ఛ తత్సర్వం వ్యాపించిన నారాయణుడు హృదయం చాపి అధోముఖం - నాభ్యాం ఉపరితిష్ఠతి (అంటే ఆ రెంటి మధ్యలో) జ్వాలమాలా కులంభాతి లా ఉన్నాట్ట వాణ్ణి తెలుసుకొమ్మని.... అంటే ఖాట్మాండూ వెళ్ళు అని చెప్పినట్టు. ఎలా వెళ్ళాలి అని మనకి ప్రశ్నలుంటాయి కదా ఒకడెవడో త్రైనెక్కు అంటాడు. ఇంకొకడు టైoవేశ్టు ప్లేనెక్కెయ్యి అంటాడు. అబ్బే వద్దు అవి యాక్సిడెంట్లవుతాయి, నడిచివెళ్ళు అని ఒకడంటాడు. మొత్తానికి ఈ జంజాటంలోనుండీ బయటపడి ప్రయాణం మొదలెట్టాకా ఆ ట్రైను నిజంగా ఖాట్మాండు వెళ్తుందా కన్యాకుమారి వెళ్తుందా అని ఒక డౌటు. (ఎందుకంటై ఏది ఖాట్మాండో తెలీదు కనుక). తెలివితక్కువవాడికెవడికైనా కాకినాడనే చూపించి ఖాట్మాండు అనేసినా నమ్మేసి తృప్తిపడిపోతాడు. తెలిసిన్వాడికి ఖాట్మాండు చూపించినా అది అదేనని నమ్మకమేంటీ అని అంటాడు. ఒకవేళ అమాంథం ఎత్తుకు తీసుకొచ్చి చూపించినా "ఓస్ ఇంతేనా.. దీనికే అంతసీనా" అని పెదవి విరుస్తాడు.

  కనుక దానికి ఫొర్ముల ఏ గురువు దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ ప్రస్థానం వద్ద, ఏ పుస్తకంలో, ఎవరి బోధలో, ఎవరి శిష్యరికంలో,ఏ మఠంలో, ఎక్కడ దొరుకుతుంది? అంటే ఎక్కడైనా దొరుకుతుంది/ లేదా ఎకాడా దొరక్కపోవచ్చు. గ్యారంటీ ఎమిటీ అంటే చేసే కృషే... ఎంతచెయ్యలి కృషీ అంతే అవసరమైనంత అని. మొక్క పెరగాలంతే అవసరమైన సదుపాయాలుండాలి. అట్లానే ఇదీ...

  ReplyDelete
 42. @Sanath Sripathi గారూ
  మీరు వ్యాఖ్యానించినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంగతులు తెలుసుకున్నాను. థాంక్స్.

  ReplyDelete
 43. సనత్ గారూ,

  మీ వ్యాఖ్యలు చూశాను. బావున్నాయి. అయితే కాస్త incoherant గా ఉన్నయ్. బహుశా ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడేసుకున్నట్టు అలా రాశారనుకుంటున్నాను. మీకు నా అభిప్రాయాలు చాలా వివరంగా రాద్దామనుకున్నాను.ముఖ్యంగా సాయిబాబా/ఆధ్యాత్మిక సహాయం గురించి. అయితే సాయిబాబా లక్ష్యం సామాజికసేవ, అక్కడ చేరిన భక్తులకు కావలసింది, కాసింత ఓదార్పూ, కోర్కెలు తీరడం. నా టపాలో నా సోది ఆత్మశోధన, సత్యదర్శనం వంటివి. ఇవి మీరు చెబుతున్నవాటికి out of context కాబట్టి సుదీర్ఘ సమాధానం బాధ తప్పింది.

  ఇక మీ ఈకల గురించి.ఇందాకే కామేశ్వరరావు గారు పీకి పీకి బోడి చేశారు. ఇంకానా? అయినా వాటి గురించి ఎప్పుడైనా నాకు తిక్క రేగినప్పుడు టపా రాస్తాను.

  ReplyDelete
 44. బాబాగారు గలిలోనుండి సృష్టించిన చేతిగడియారానికి రోలక్స్ అనో ఇంకోటనో పేరు ఎందుకుండాలి. ఇంచక్కా 'బాబా' అనే బ్రాండ్ మీదుగా చేతిగడియారాలు పుట్టిస్తే పోలే.

  ReplyDelete
 45. కామేశ్వరరావు, శ్రీకర్, సనత్ గార్ల వ్యాఖ్యలు తీరిగ్గా చదివాను, నచ్చాయి.

  ReplyDelete
 46. మంచి పోస్టు

  భైరవభట్ల వారు మధ్యలో కన్ఫూస్ చేసేసినా, చివరకు బాగుంది.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 47. This comment has been removed by the author.

  ReplyDelete
 48. This comment has been removed by the author.

  ReplyDelete
 49. This comment has been removed by the author.

  ReplyDelete
 50. This comment has been removed by the author.

  ReplyDelete
 51. ఎలానో ఈకలు పీకానని అనేసారు కాబట్టి మరో ఈక :-)

  >>"నాకు నామిని, ఠాగూర్ వంటి వాళ్ళు కూడా అభిమానులే" !!!

  వాళ్ళ కోవలోకి రానుకాని, నేనూ మీ అభిమానినే :-)

  ReplyDelete
 52. This comment has been removed by the author.

  ReplyDelete
 53. This comment has been removed by the author.

  ReplyDelete
 54. This comment has been removed by the author.

  ReplyDelete
 55. >>నాకు మీతో వాదించి నెగ్గాలనే ఆనందం ఏకోశానా లేదు.

  మరెందుకు వాదిస్తున్నారు? పైగా మీ మిత్రులతో వాదించడానికి ఏర్పాటు చేయిస్తానని ఆఫర్లిస్తున్నారు? మమ్మల్నిలా ఒగ్గేయండి సార్.

  ReplyDelete
 56. కామేశ్వరరావు గారు, మీ వ్యాఖ్య చూస్తే ఆనందంకన్నా భయమే ఎక్కువ కలుగుతూంది. జోక్ కాదు, సీరియస్ గానే.

  ReplyDelete
 57. This comment has been removed by the author.

  ReplyDelete
 58. This comment has been removed by the author.

  ReplyDelete
 59. @jayaho,వాద ప్రతివాదాలు అయిపోయాయి కదా మాష్టారు. ఎవరి అభిప్రాయాలు వారివి, ఇంతటితో ఈ విషయం వదిలేస్తే బాగుంటుంది కదా.

  శ్రేయోభిలాషి.

  ReplyDelete
 60. >>"నాకు నామిని, ఠాగూర్ వంటి వాళ్ళు కూడా అభిమానులే" !!!

  వాళ్ళ కోవలోకి రానుకాని, నేనూ మీ అభిమానినే :-) " !!!

  "నేను నామిని, ఠాగూర్ లకు కూడా అభిమానినే."

  ఏంటో, తెలుగు మర్చిపోతున్నానండి. వారం నుండి ఒకపక్క ఫిలాసఫీ, మరో పక్క నామిని సినబ్బ కథలు చదివి ఇలా తయారయ్యాను. రెండూ వదిలేసి "నేనూ నా రాక్షసి" సినిమా చూసి వస్తానండి. ఆ తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో? :))

  ReplyDelete
 61. This comment has been removed by the author.

  ReplyDelete
 62. రవి గారు !!

  అంత చిన్న చిన్నమాటలతో, ఒకే విషయం గురించి మాత్రమే నా మూడు వ్యాఖ్యలలో రాశాను కదా నా వ్యాఖ్య incoherent గా ఉందన్నారేమిటబ్బా అని మిన్నకుండిపోయాను.

  అయితే నా పేరు ఉటంకించిన వివరం చదివిన తర్వాత నా వ్యాఖ్యకి చిన్న పొడిగింపు/ వివరణ ఇస్తే మీరేమీ అనుకోరుకదా అన్న ఉద్దేశంతో రాస్తున్నా....

  (1) బాబా గారు దేవుడు అని నేను అనలేదు. గడియారం "మహిమ " అనీ అనలేదు. అది మేజిక్కే అని బల్లగుద్దకుండానే, కుండ బద్దలుకొట్టకుండానే అన్నాను. మరి అవతారం, లక్ష్యమూ అన్నారు కదా అని సందేహం రావచ్చు. పెద్దలొకరు "భగవంతుడు జీవుడుగా దిగివచ్చుటయే అవతరణము" అన్నారు, దానిని నమ్మిన వాణ్ణి కనుక ఆమాటనే రాశాను. సిధ్ధాంతీకరించలేదు. పోతే...
  (2) వీర శైవం, వీర వైష్ణవం ఉండేట్టు, నేను బాబా గారి వీర భక్తుణ్ణి కాను. ఆయనను నమ్ముతాను. వివేకానందనీ, జీయర్ స్వామినీ, గణపతి సచ్చిదానంద్ స్వామినీ, కంచి పరమాచార్యులనీ, ఎక్కిరాల కృష్ణమాచార్యులవారినీ నమ్ముతాను. ఆ మాటకొస్తే శ్రీభాష్యం వారినీ, చాగంటి వారినీ, గరికపాటివారిని కూడా నమ్ముతాను. ఎందుకంటే అందరూ చెప్పే "విషయం" పైననే నాకు ఆసక్తి. వాటిలో నాకు తేడా ఏమీ కనిపించదు. అందరి మార్గాలూ నచ్చుతాయి, నన్ను ప్రభావితం చేసారు. వారి చుట్టూ అకృత్యాలు జరగటం లేదా, వారు కనికట్టు చేయటం లేదా అని అడిగితే నాక్కావలసింది నాకు దొరికింది. మిగిలినదాని పై నాకు ఆసక్తి లేదు. (గాంధీ గారు చెప్పిన వాటిల్లో నాకు కొన్ని నచ్చినంత మాత్రాన గాంధీగారు అన్ని విషయాల్లో నచ్చెయ్యాలని రూల్లేదు కదా.. ఆయన ఆలోచనలతో కొన్ని నిర్వాకాలతో నేనేకీభవించను... అంతమాత్రాన ఆయన ఉత్త ట్రాష్ అనుకోను. కొన్నిట్లలో మాత్రమే నచ్చారు అనుకుంటా.. )
  (3) బాబా గారి మార్గంలో మీకు సేవనచ్చితే అదే చెయ్యండి. బాలవికాస్ నచ్చితే పిల్లలకి నేర్పించండి. ఆయన దేవుడు కాకపోతేనేం? ఆయన అందించిన మార్గం మంచిదా కాదా అన్నది ఒకటికి రెండుదార్లు ఆలోచించుకుని ఎవరికి వారు ఆ సాధన చెసుకుంటే సరిపోతుంది కదా, దానికి ఆయన దేవుడే కావాల్సిన అవసరం లేదుకదా అన్నది నా పాయింటు. పైగా ఆయన మేజిక్కులు చేసారనుకోండి, లేదా చెయ్యలేదనుకోండి దానివల్ల మనకి కలిగే లాభం/ ఉప్దయోగం ఏమిటి? నిజం చెప్పాలంటే ఏమీలేదు. అదే నేను చెప్పాను నా వ్యాఖ్యలో అని అనుకున్నా ... ఏమీ లేదు కనుక దానిని చర్చించటం, తర్కించుకోవటం కన్నా, పదిమందికి ఉపయోగపడే పని/ సేవ మీద కాన్సంట్రేట్ చేయటం ఉపయోగకరం కదా అన్నది నా ఉద్దేశం.
  (4) బాబాగారి వెనుక ఆయన పేరుమీద అకృత్యాలు అవకతవకలూ జరిగాయి/ జరుగుతున్నయి అనుకోండి, దానిని భేదించటం, నిర్వీర్యం చేయటం సంబంధిత అదికారుల కర్తవ్యం.అలా ఏ అధికారైనా విదిని నిర్వర్తిస్తూంటే అదేదో అన్యాయం అయిపోయినట్టు ఆ విషయం లో మూర్ఖత్వం వహించను... (contd.,)

  ReplyDelete
 63. (5) నేను బాబాను భగవంతుడని నమ్మను అని అన్నవాళ్ళను ఎవరూ కూడా మతమార్పిళ్ళు చేసినట్టు బలవంతపు భక్తుణ్ణి చేయలేదు, చేయట్లేదుకదా... .. మరి మీ వ్యాఖ్యల్లో అంత ఉక్రోషం/ కోపం ఎందుకు? బాబాగారు చీప్ ట్రిక్కులే చేశారని మీకు అనిపించవచ్చుగాక.. అంతమాత్రాన మిమ్మల్ని ఆ ట్రిక్కులు నమ్మి తీరాల్సిందే అని ఎవరూ అనట్లేదు కదా.. ఒకవేళ అమాయకత్వం తో అనా, మీరుదాన్ని నమ్మల్సిన అగత్యమూ, అవసరమూలేదు కదా... మరి బలవంతం చేసేస్తున్నారని ఆ ఆవేదన ఎందుకు? ఇంతకీ ఇంతటి తర్కమూ (లేదా వివాదమూ) మీరు సాయిబాబా- అంతశ్శోధన అనబట్టి వచ్చింది, కాదంటారా? మీరంతశ్శోధన అన్నప్పుడు కాదనటానికి ఎవరికీ అధికారం లేదు కానీ అంతశ్శోధనకి ఇతివృత్తం గా సాయిబాబాలో ఒక పార్శ్వాన్ని మాత్రమే తీసుకుని మీరు టపాపెడితే ఇంకొక పార్శ్వాన్ని చూసినవారు విభేదించటం సహజమే కదా. మీకు మీ అభిప్రాయం ఎంత సమంజసమో వారికీ వారి అభిప్రాయాలు అంత సమంజసమే కదా... అలాంటప్పుడు మీరు విసుగు చెందటం ఎందుకు?
  (6)"మీరు భగవంతుడా" అని ఒక విలేఖరి ఒక "తెలిసిన " మహానుభావుణ్ణి అడిగితే "నీవు కావా?" అని అడిగారుట. ఈ సంఘటనను విన్నప్పుడు అందరిలో దైవత్వం చూడగలిగిన వ్యక్తి స్థితి అది అని ఒకడర్ధం చేసుకుంటే "అంతటి ఆయనే ఆమాట అన్నాడంటే నేను దేవుణ్ణే అన్న మాట, ఇంక నేనేమైనా చేయవచ్చు" అని ఇంకొకడర్థం చేసుకున్నాడనుకోండి... భావ్యమేనా? అట్లానే... బాబాగారేమేం చేసారని చూస్తే.. ఆ లిస్టులో మంచివీ, ఎందరికో ఉపయోగకరమైనవీ, కొన్నిమార్లు చీప్ ట్రిక్కులు కూడా ఉన్నాయి. మీరంతశ్శోధన చేయదలిచుకుని కూడా చీప్ట్రిక్కులతో ఆగిపోతానంటున్నారు..అది భావ్యమా అన్నది నా వ్యాఖ్యల సారాంశం.
  (7) ఇంక చివరాఖరిగా... అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని నగరాల్లో , అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో కొన్ని వేలమంది సాయి సేవాదళ్ సభ్యులు మంచి పనులేమైనా చేస్తున్నారనుకుంటున్నారా? లెదా? అంతలా ప్రభావితం చేసి (ఎదో స్మశాన వైరాగ్యం లాగా ఒక సారి వచ్చి ఒకసారి వెళ్ళిపోవటం గా కాకుండా ) అన్నేళ్ళు నిర్వ్రామంగా, నిరంతరాయం గా స్వార్థాన్ని దాటి పరోపకారం, పరహితం, సన్మార్గం గట్రా సాధనచేసే వాళ్ళను ఒక త్రాటిపైకి తెచ్చి మంచి మార్గం లో నడపటం నా దృష్టిలో "మహిమే". దానిని ఆర్గనిజేషనల్ ఎబిలిటీస్ అని మీరన్నారనుకోండి దానిని ప్రదర్శించిన వాళ్ళెవరైనా నా దృష్టిలో మహాత్ములే... రజనీష్ చేసినా, మహాత్మా గాందీ చేసినా, చివరకు శివ్ ఖేరా చేసినా నాదృష్టిలో అది ఉన్నతమైన దైవ కార్యమే. వేదాన్ని నమ్ముతానుకాబట్టి (ఎందుకు అని అడగకండి, నాకిష్టం కాబట్టి నమ్ముతా... ) నావిష్ణుః పృథివీ పతిః అన్నట్టు దైవాంశలేనిదే ఇంతటి మహత్కార్యాలు పరోపకారార్థం జరగలేవు కాబట్టి బాబాగారు దైవాంశ సంభూతుడని నమ్ముతాను. అంతటి మహత్కార్యదీక్ష వహించినదాని ప్రభావం ముందు / ప్రయోజనం ముందు ఏవో ఈవెంట్లు జరిగినప్పుడు బాబాగారు చేసే మేజిక్కులు నాదృష్టిలో అల్పం. ఆయన మొదలెట్టిన ఈవెంట్లను/ సేవా కార్యక్రమాలనూ నిరంతరాయం నడపడానికి కావలసిన నమ్మకాన్ని సంస్థ సభ్యుల్లో, కార్యకర్తల్లో కలిగించటం, నిలిపి ఉంచటం నా వరకూ నాకు అనంతం. లేదూ అదే (మీజిక్కుల జిమ్ముక్కులే) ముఖ్యం అనుకుంటే సెమించెసెయ్యండి బాబూ...

  ఇంత సుదీర్ఘమైన వ్యాఖ్య incoherent గా ఉంది అని అంటే నన్ను భీ ఒగ్గెయ్యండి. (complete)

  ReplyDelete
 64. @సనత్ గారు: మీ వ్యాఖ్య పూర్తిగా చదవలేదు. ఖంగారుపడి వ్రాస్తున్నాను. మీరు చెప్పిన పాయింటు నాకు మొదటే అర్థమయింది. బాబా మేజిక్ చేసినప్పటికీ అందులో ఒక లక్ష్యం ఉందన్నారు మీరు. మీ వ్యాఖ్యను గౌరవిస్తాను.

  ఇకపోతే మీ వ్యాఖ్యకు నా చిన్న సమాధానం తర్వాత వ్రాసినదంతా exclusive గా Mr.జయహో గారికి మాత్రమే. అది చదివి మీకు అన్వయించుకొని బుర్ర చెడుగొట్టుకోబాకండి. నా ఉక్రోషము, కోపము మీ పైన, బాబా గారి మీద కాదు. వ్రాసిన దాన్ని అర్థం చేసుకోక, ఆ ప్రయత్నమూ చేయక వ్యక్తిగతహేళనకు దిగిన వ్యక్తికి చెప్పినది మాత్రమే.

  ఇక మీ వ్యాఖ్య ఇప్పుడు నిదానంగా చదవబోతున్నాను. :))

  ReplyDelete
 65. మీ వ్యాఖ్యలు కాస్త Deep sense లో ఉంటాయి. అవి చదివితే లాభం లేదు. One needs to dwell upon them. అలా లోనికి దిగి సారం లాగాలి. నాది incremental approach.అంచేత మీరు ఏమి చెప్పారో దాని సారాంసం స్పష్టంగా ఇదమిత్థమని అర్థం చేసుకోలేకపోయాను, (నా మట్టి బుర్రకు కాలేదు కూడా అనుకోండి) ఒక్క మేజిక్ వ్యవహారం తప్ప. నేనో బారెడు సమాధానం రాసిపెట్టుకున్న తర్వాత చివర్లో అనుమానం వచ్చింది. ఇదంతా చదివి సనత్ గారు రిప్లై ఇచ్చి అది నాకు అర్థం కాక మళ్ళీ రాసి చివరకు infinite loop కెళుతుందా అని. అందుకే మీకు చిన్న సమాధానం ఇచ్చి సరిపెట్టుకున్నాను.

  ఇప్పుడు మీరు point wise చెప్పారు. ఇక మాట్లాడుకుందాం.

  ReplyDelete
 66. సనత్,

  >>(1) బాబా గారు దేవుడు అని నేను అనలేదు. గడియారం "మహిమ " అనీ అనలేదు. .... సిధ్ధాంతీకరించలేదు.

  అవును. అర్థమయింది. కాకపోతే అవతారం మీద మీరు చెప్పిన వ్యాఖ్య interesting. ఇదివరకెప్పుడో నాగమురళి గారి దగ్గర Discuss చేసేప్పుడు ’అవతారం’ అన్న మాట వచ్చింది. కాకపోతే ఒక ప్రశ్న. మీరు సమాధానం చెప్పకపోయినా పర్లేదు. :))కానీ నాకు చాలాకాలంగా బుర్రలో పేరుకున్నయ్. అంచేత..

  Does this word imply - the person who descends as avataara is a super human by very definition? Is He above the rest of humans in any manner? Or one 'becomes' avataara with his deeds gradually? How does we come to know an avataara when he is alive? For example, suppose Sri Krishna is alive today. (who knows, he may be alive today) how do you and me know Him, go there and surrender to Him? By looking at some magical powers exhibited? If he does not opt to exhibit any magical powers, then how do we know Him?

  ReplyDelete
 67. 2)బావుందండి. నేను ఎవ్వరిని నమ్మనండి. తిట్టుకోరనుకుంటాను. :) అది నా nature అంతే. అయితే I'll probe and try to find out.During that probing sometimes I may trust temporarily.

  3)ప్రేరణకు ఎవరైతేనేమండి? ఎవరికి వారు ఆ పని చేస్తూనే ఉన్నారనుకుంటున్నాను.
  4)ఏకీభవిస్తున్నాను. None of our business.
  5)తప్పకుండా. విభేదించండి. In fact I like it. ఒకప్పుడు నాతో విభేదించిన నాగమురళి నాకు ఇప్పుడు ఆప్తుడు. మీరు విభేదించారు. మేజిక్ వెనుక అంతర్యం చూడమన్నారు. అందుకు సమాధానం చెబుతాను.

  అయితే @జయహో గారి వ్యాఖ్యల సారాంశం నాకు ఇలా కనిపిస్తోంది: ౧. నేను బాబా మీద అనుమానం కలిగేలా రాస్తున్నాను. ౨. బాబా ఏమి చేసినా ప్రశ్నించరాదు. ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన పని ’ఇతరులు’ చేశారు. ౩. నాకు కలిగిన అనుమానాలకన్నా భక్తుల విశ్వాసం విలువ పెద్దది కాబట్టి ఆ వెల్లువలో అనుమానాలను తుడిపేసుకోవాలి. ౪. నేను జిడ్డు భక్తుణ్ణి కాబట్టి అతణ్ణి తప్పు అని నిరూపిస్తే నేను దారికి వస్తా. :))౫. సరిగ్గా గమనించండి. మీరు మేజిక్ గురించి స్పష్టంగా సమాధానం చెప్పారు. జయహో అనే ఆయన ఇంత సోది రాసి స్పష్టంగా ఏదీ చెప్పలేదు. కాసేపు మేజిక్ కాదు మిరకిల్ అంటారు. అది హీలింగ్ ఒకటేనంటారు. కాసేపు ఇతరులు చేశారు కదా అంటారు.

  ఇలా conviction లేకుండా మాట్లాడి నాకు విసుగు రాకూడదంటే ఎలాగండి? పోనీలే తప్పుకుందామని చూస్తే వదలకుండా ఉన్నారాయన. గమనించండి. :)

  6)సామాజిక సేవ - శోధన. ఇది కాస్త పెద్ద విషయం. మీరన్నది valid. కానీ నా ఉద్దేశ్యం వివరంగా చెబుతాను ఎప్పుడైనా.

  7)మీరు చెబుతున్నది చాలా చాలా సున్నితమైన విషయం. (నా వరకూ నాకు సమాధానం ఉన్నా కూడా) సమాధానం చెబితే బావోదు. నేను పెద్ద బుద్ధుడికి కాదు కాబట్టి. నిదానంగా ఆలోచించి చెబుతాను.

  ReplyDelete
 68. ఆఖరుగా సనత్, ఇంతకు ముందు మీరు వ్రాసిన వ్యాఖ్యలకు నా సమాధానం (unedited) రాసిపెట్టుకుని చెప్పలేదన్నాను. ఆ ముక్క ఇది.


  సనత్ గారూ,

  సాయిబాబా గురించిన ప్రశ్నలకు కాసింత బాక్ డ్రాప్ తో నా అభిప్రాయాలు ఇవి.

  (సాయిబాబా భగవంతుని అవతారం, మనం సాధారణమానవులం, ఆయన అసాధారణం అని అంటే, దయచేసి ఈ క్రింది సోదినంతా Shift + Del చేసెయండి. ఆయన మనలాంటి వాడే అయితే సత్యదర్శనం చేసిన మనిషి అంటేనే చదవండి. మరో ముక్క. సాయిబాబా మేజిక్కులు ప్రదర్శించడానికి కారణం సామాజిక సేవ అంటే ఏమీ మాట్లాడ్డానికి లేదు)

  మీరన్నట్టు ఒక్కో వ్యక్తిది ఒక్కో స్థాయి. ఒక్కో సాధకుడిది ఒక్కో తీవ్రత. ప్రతి మనిషి తనకు బాధల నుండి ఎలా విముక్తి కలుగుతుంది? ఎలా జీవిస్తే ఇబ్బందులు లేకుండా గడిచి పోతుందని ఆలోచిస్తాడు. అదే తీవ్రతరమైతే శోధన, సత్యశోధన అందాం. అటువంటి శోధకులు మౌలికంగా రెండు రకాలు.

  మొదటి రకం - ఒక గురువు మీదో, సిద్ధాంతం మీదో, దైవం అని నమ్మిన entity మీదనో విశ్వాసం చూపేవారు, ఆ విశ్వాసాన్నే తీవ్రమైన తపనగా సాధనగా మార్చుకున్న వారు (మీరాబాయి, కబీర్, చైతన్యప్రభువు వగైరా)

  రెండవరకం - నిరంతర ఆత్మశోధన. ఇల్లు, వాకిలి వదిలి చెట్లూ పుట్టా తిరిగి, గురువు దొరికితే అతణ్ణి కొంతకాలం సేవించి తృప్తి లేక, భోంచేయక కడుపు మాడ్పుకుని తపస్సు చేసి, దేవుణ్ణి ప్రార్థించి, ఏడ్చి, నానా పాట్లు పడి, చివరికి ఎక్కడా, ఏ ప్రస్థానం దగ్గరా అలుపు లేక తిరిగి తిరిగి చివరకు తనలోనే సత్యాన్ని దర్శించుకున్న వారు. ఈ ఉటంకించిన పద్ధతులు వేఱు కావచ్చు, అయితే సత్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనయినా తమంతట తామే కనుక్కోవాలని తపించే వారు. వీళ్ళు మధ్యలో ఒక గురువునాశ్రయించవచ్చు, లేదా పూజలు చేయవచ్చు కానీ అంతిమంగా చేసేది మాత్రం ఆత్మశోధన.

  మొదటి తరహా వ్యక్తులు అనేకులు.
  రెండవ తరహా వ్యక్తులు చాలా అరుదు. (అరుదన్నంత మాత్రాన గొప్ప అని కాదు) దురదృష్టవశాత్తూ ఈ తరహా వ్యక్తులు చెప్పేది కాస్త దురుసుగా, ఆడిపోసుకుంటున్నట్లుగా, తిడుతున్నట్లుగా ఉంటుంది. కానీ అది తిట్టటం కాదు ప్రశ్నించటం మాత్రమే.ఈ శతాబ్దానికి సంబంధించి అలాంటి సత్యశోధకులలో ముఖ్యులు జిడ్డు కృష్ణమూర్తి, ఓషో. ప్రాచీనకాలంలో బుద్ధుడు, అష్టావక్రుడు అలాంటి కోవకు చెందినట్లు కనబడుతుంది. వీరికి, వీరు చెప్పే బోధలతో ఐడెంటిఫై చేసుకునే వారికి, ఐడెంటిహై చేసుకునే ప్రయత్నం చేసే వారికీ (నాలాంటి గాళ్ళు) విశ్వాసం - అన్న పద్ధతి లాభించకపోవచ్చు.

  ఇక ఆధ్యాత్మిక సహాయం గురించి. X అనే పుణ్యాత్ముడు సత్యదర్శనం చేశాడనుకుందాం. సత్యదర్శనం అంటే ఏదో అంగడిలో కొనుక్కునేది కాదుగదా. తనలో తను వెతికి కనుక్కోవలసిందే కదా. ఇప్పుడు ఆ X అనే వ్యక్తి తనంతట తాను విభూతిని రాల్చో, మేజిక్కులు చేసో ఇతరులకు చేసే సహాయం ఏమిటి?
  ...to be continued

  ReplyDelete

 69. (ఇక్కడ నేను సామాన్య వ్యక్తులను - టపాలో మా మామయ్య వంటి వ్యక్తులను మినహాయిస్తున్నాను. నాకు డబ్బు కావాలి. ఏదో దేవుడికి మొక్కాను, డబ్బు దొరికేసింది, అంతే, నేను ఆయనకు భక్తుణ్ణి అంటే ఆయన పరమ గురువు కాదు, సాధారణ గురువు, ఆయనకు ఒక నిర్దుష్టంగా వేల్యూ ఉంది. అంతే. మనం సత్యశోధన, సాధకుల స్థాయిలో మాట్లాడుకుంటున్నాం)

  సహాయం ఏమిటి? సత్యం తనలోనే ఉందని గ్రహించిన వాడు ఎలానూ వెతుక్కుంటాడు. సత్యం, గిత్యం, ఫిలాసఫీ, ఇదంతా ఏంది? మందుకొట్టి పడుకుందాం అనేవాడు మందుకోసం వెతుక్కుంటాడు. మధ్యలో X అనే ఆయనకు వాణ్ణైనా, వీణ్ణైనా ఉద్ధరించాలన్న తపన ఎందుకు? స్వయంగా తను కనుక్కున్న సత్యం - సత్యం ’ఆత్మ’ లోనే ఉందని. (ఆత్మదీపోభవ) తన బోధ -ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్, ఆత్మైవహ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. కానీ ఎదుటి వాడికి మాత్రం చాక్లెట్లూ బిస్కెట్లూ తినిపించి, బుజ్జగించి, లాలించి, మహిమలు చూపి సత్యం వైపుకు తీసుకెళతానని చెబుతున్నాడు, అంటే - ఆయన వాళ్ళను నిజానికి సత్యం నుంచి వ్యతిరేకదిశలో తీసుకెళుతున్నట్టు లెక్క.

  పై వాదన జిడ్డు కృష్ణమూర్తి చేశాడు. ఒకానొక సందర్భంలో జిడ్డు కృష్ణమూర్తి ఆది శంకరుల చర్యలను HYPOCRICY గా చెబుతాడు. (ఇందాక పేరాలలో చెప్పినట్టు ఈ తరహా వ్యక్తులను ద్వేషవాదులుగా ముద్రవేయడం తగదు).

  Why one wants to establish an authority over other? By doing that, He is actually enslaving them. Isn't that hypocricy? If somebody wants to find the truth, it is his business to find the truth. He'll die for it. Why X needs to supply the truth? Proaganda can never become the truth. Truth can never be propagated. It cannot be brought down from Everest. One has to climb atop to find it. On one hand u r craving for "I" (ఆత్మన్) and Telling others not to follow "Their" own self but to follow YOU!!!

  పై మొత్తం డిస్కషన్ చదివి నామీద కోపం తెచ్చుకోరని, అభిప్రాయం ఏర్పరుచుకోరని ఆశిస్తున్నాను. :). ఇక సాయిబాబా భగవంతుని అవతారం అని అంటే, దయచేసి పై సోదినంతా Shift + Del చేసెయండి. మొదటే నా సమస్యలు నావి అవతారపురుషులతో మాట్లాడలేను. ఏదో మామూలువాణ్ణి. :))

  ReplyDelete
 70. This comment has been removed by the author.

  ReplyDelete
 71. This comment has been removed by the author.

  ReplyDelete
 72. ఒక చిన్న సమాచారం. ఈ టపా బాబా గారి మరణానికి ముందు వ్రాయబడింది. బాబా గారి ఆరోగ్యవివరాలు ఈ టపా రాసేప్పుడు నాకు తెలియవు.మా ఇంట్లో టీవీ లేదు కాబట్టి. పేపర్ నేను చూస్తాను కానీ చదవను.

  ReplyDelete
 73. పైన వ్యాఖ్యల పరంపరలో చంద్రమోహన్ గారికి నేనిచ్చిన సమాధానం (రైలు విషయం) కావాలని ఓ వ్యక్తి మీద ద్వేషం పుట్టించాలని ఇచ్చినది కాదు. ఒకరి నమ్మకం పైన బురద చల్లాలని చెప్పింది కాదు. జనాలను నమ్మించాలనుకుంటే అది సులభంగా చేయవచ్చు అని నా ఉద్దేశ్యం తెలుపడం కోసం వ్రాశాను. ఆ స్వామీజీ ఉదంతం నేను విన్నదే కానీ ఎవరు ఎందుకు ఎప్పుడు చేశారన్న వివరాలు నాకు నిజంగానే తెలియవు.

  ReplyDelete
 74. రవి గారు,

  మీ వ్యాఖ్యలను చూశాను. నాగమురళిగారిని బాల్యమాదిగా ఎఱిగినవాణ్ణవటం చేత, అతనిద్వారా మిమ్ములను ఉర్ఫ్ మీ గురించి (రవీ, కామేష్, రాఘవ) తెలుసుకుని ఆత్మీయతా భావం అకారణంగా (లేదా చెప్పుడు మాటలు వినటం వల్లనో ;) ) ఏర్పడింది. మీతో విభేదించకముందే సుమీ... ఆతర్వాత బ్లాగ్ముఖాముఖీతో ధృవీకరింపబడింది. మీతో ఎంత అడ్డదిడ్డంగా వాదించినా దానికొచ్చే ఢోకా ఏం లేదని నా నమ్మిక (గుడ్డి నమ్మకమే కావచ్చు గాక)

  ReplyDelete
 75. పేద వారికి బూడిద, పెద్దవాళ్ళకి గోల్డ్ చైనులు సృస్టించగలగడం మహిమలు కాదా?

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.