Thursday, July 8, 2010

సమస్యా రణములు

సాధారణంగా పద్యాల సమస్యాపూరణాలలో సమస్యలు గమనిస్తే మనకో విషయం స్ఫురిస్తుంది. ఏదైనా అస్వాభావికమైనది, ప్రకృతి విరుద్ధమైనది సమస్యగా కూర్చడం సులభం.అలాంటి ప్రకృతి విరుద్ధమైన విషయాలంటే మన సినిమా హీరోలు గుర్తొచ్చారు.రజనీ కాంత్, విజయకాంత్, బాలకృష్ణ, హిందీలో మిథున్ ముందువరుస ఆసామీలు ఈ విషయంలో.

కాదేదీ క’పి’త కనర్హం కాబట్టి,పై వారిలో బాలయ్య స్ఫూర్తిగా కొన్ని సమస్యలు, వాటి ఆధారంగా నేనల్లుకున్న పద్యాలతో ఈ టపా కూర్చాను.సమస్యలన్నీ చివరిపాదంలో చదువుకోండి.ఈ సందర్భాలు చాలా వరకూ తెలిసినవే. కొన్నిటికి లంకించాను. మరికొన్ని "మీగొట్టం" (youtube) లో దొరుకుతాయి.

వీరరాఘవరెడ్డిని పీచమడఁచ
సమర సింహుడు వెడలెను శౌర్యమొప్ప
సింహ నాదము జేయుచుఁ జెప్పె - "వత్తు
ఇంట నట్టింట వంటింట యెక్క డైన"
(సమరసింహా రెడ్డి)

మిక్కుటమౌ రోషానలి
ఠక్కున తన కనులఁ వెలువడంగను జేసెన్
మిక్కిలిగ బాలయ చెలఁగి.
కుక్కురములు బెదరి నిలిచె కూనల వోలెన్.
(నరహింస నాయుడు)

నేర్వుదురిలను పశువుల,నీడ వళుల
భాషలన్ మనుజులుఁ గోరి.బాలు నేర్చె
యచరముల భాష.విలను గృహముకు నరిఁగి
ధాటిగ తొడను గొట్టగ సీటు కదిలె.

తొల్లి బాలయ విలనులు యున్న రైల్ జూచి
ధాటిగ తొడ గొట్టి నంత మాత్ర
ముననె ప్రాణమొచ్చి భుగభుగ మనుచును
రైలు వెనుక మరలె రయము గాను
(పలనాటి బ్రహ్మనాయుడు)

దోషుల వెదకుచుఁ జేరెను
వేషపు ధారియగు బాలు వీసా లేకే
భేషుగ దుష్టులఁ దునుమఁగ
భాషగఁ దనకును తెనుఁగయె పాకిస్తానున్
(విజయేంద్ర వర్మ)

బంధితుడయి యొప్పు బాలయ కొంపలు
మునుగు యవసరమున ముప్పుఁ దప్ప
గుండును గురి జూచి గొట్టె ఎఱుపు రంగు
మీటనొక్క దాని నోటి తోను
(అల్లరి పిడుగు)

బాలు పాండురంగడయెను ప్రజలు మెచ్చ
దర్శకేంద్రుని లీలనుఁ దలుప వశమె?
భరత భూమినిఁ బుట్టిన భక్త మూర్తి
ధవళ భామల సరసను నాట్యమాడె.
(పాండురంగడు)

చిరంజీవి కూడా తక్కువ తినలేదు.ఆయన ఘనకార్యాలిలా ఉంటై.

వందల కొలదిగ జనముల బాదెన్ ఘనుడై.
ట్రాక్టరు నెగిరించెను చిరు ఠారెత్తింపన్.

21 comments:

 1. ఆహా ఆహా ఏం రాసారండీ..బాలయ్యబాబు చూస్తే మిమ్మల్ని ఎత్తుకుని ముద్దుపెట్టేసుకుంటాడు. మీరు ఈ సంవత్సరం అవార్డ్ కూడా ఇప్పిస్తాడు. కాదేదీ కవితకనర్హమని శ్రీ శ్రీ అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ అంటే మీరొకడుగు ముందుకేసి కాదేదీ పద్యానికనర్హం బాలయ్య, వీరరాఘవరెడ్డి అంటున్నారు.

  "వీరరాఘవరెడ్డిని పీచమడఁచ
  సమర సింహుడు వెడలెను శౌర్యమొప్ప"

  ఇవి ఇలా పద్యాల్లా కాకుండా బుర్రకథలా ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.

  "రాజు వెడలె రవితేజము అలరగా".... అన్నట్టు

  "సమరసింహుడు వెడలె వీరరాఘవరెడ్డి పీచమడచగా" అని మీరంటూ ఉంటే "తందాన దేవనందనాన" అని వెనకాతల మేము అందుకుంటాం... ఆ అవిడియా ఎలా ఉందంటారు?

  ఉదాహరణకి:
  ఆరోజు ఏమయిందయ్యా అంటే

  తొల్లి బాలయ విలనులు యున్న రైల్ జూచి
  ధాటిగ తొడ గొట్టి నాడూ

  తందన దేవనందనాన

  రైలు కేమో ప్రాణమొచ్చెను,
  ఆహా అలాగ
  వెనుకకి మరలి పోయెను
  ఒహోహో
  ఎలా వెళ్ళిమదాన్నా
  భుగభూగ భుగభుగ మని పరుగెట్టుకెళ్ళెను
  తందాన దేవనందనాన

  ఇలా సాగుతుందన్నమట బుర్రకథ.

  ReplyDelete
 2. హ హ.. రచ్చ రచ్చ.. అరుపులు..మంటలు..
  గుడ్ పోస్ట్ రవి గారు. :) :)

  ReplyDelete
 3. రవి గారూ,
  మీ పద్యాలు భలే నవ్వించాయండీ. బాగు ... బాగు ...

  ReplyDelete
 4. ఆహా రవి గారు అద్భుతం.
  ఇరగదీసారు :)

  ReplyDelete
 5. e-రాతతో చంపేసావయ్యా రవీ!

  ReplyDelete
 6. వంద పద్యాలు పూర్తి చేసినందుకు అభినందనలు.

  ReplyDelete
 7. మీ పద్యాలు అమోఘమండి. అటు చదువర్లను ఆకట్టుకుంటూ, ఇటు తెలుగుభాషను గుర్తుచేస్తూ మీరు చేసే ప్రయత్నాలు భలే బాగున్నాయి.

  కంత్రి, పోకిరి, ఇడియటు కాలు ద్రువ్వఁ
  తిట్లు దిక్కుమాలినవాయె హిట్లు మిగిలె
  సింహ, పులి, చిరుతాదుల సేన కదుల
  జంతువులు జాలిపడె తమ జాతి మీద!

  ReplyDelete
 8. భలే ఉన్నాయండీ రవిగారూ. రాబోయే బాలయ్య సినిమాలో డైలాగు - కంటి చూపుతో కాదురా, కంద పద్యంతో చంపుతా.

  ReplyDelete
 9. రవి గారు, మీ ఆలోచన బాగున్నది. మంచి హాస్యాన్నందించారు.. ఎప్పటికప్పుడు వెర్సటాలిటీ భలే ఉంటాయండీ మీ టపాల్లో...ఒకచో చరిత్ర మీద విస్లేషణ, ఒకచో పులిహార ఊసులు.. ఒకచో చెరువు కబుర్లు.. కొన్నిచోట్ల విసుర్లు.... షడ్రుచుల సమాహారాం అనిపిస్తూంటుంది..

  ReplyDelete
 10. అకటా కట కటా ..హెంత పనిచేసారు..వాళ్ళ కళ్ళబడనివి ఈ బ్లాగులే.. ఇక నెక్స్ట్ డైలాగ్.. 'బ్లాగు కొస్తా, నే కామెంట్ రాస్తా..బ్లాగు పేరు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే.."బ్లాగాడిస్తా"'

  ReplyDelete
 11. సోదరా తాట తీసావ్
  సనత్ గారి పద్యం కూడా బాగుంది.

  ReplyDelete
 12. రవిగారు, సారీ అండి.. మీ టపా పిగ్గీ రైడ్ బాక్ అయిపోయింది. :) పద్యాలు సూపర్ కాకపోతే అది మన ఫోర్ట్ కాదు.

  :) నీహారిక, మరి మా యువ కి బాలయ్య అంటే మహా ప్రేమ..మనకిష్టమైన వారి ఇష్టులు/ఇష్టమైన పనులూ మనకీ కదా? అందుకనన్నమాటా! అంచేత "ఎవ్వళ్ని ఎచ్చోట ఎకసెక్కాలాడతారో వారు బాలయ్య అయిన పక్షాన, తక్షణం అచ్చోటన మనం కాలిడెదం.." ;) ఎన్ని ఎలాగున్నా "మంగమ్మ గారి మనవడు" "నారీ నారీ నడుమ మురారి" "జననీ జన్మభూమి" ఇలా ఎన్ని లేవు.. కళాకారుని ప్రతి ప్రదర్శన అతనిలోని బెస్ట్ వెలికి తేలేవు..

  ReplyDelete
 13. @సౌమ్య: :-) మీరో బుర్రకథ రాయండి. నేను ఆడియో సపోర్ట్ ఇస్తాను.

  @వేణూరాం, @శంకరయ్య గారు, @సాయి ప్రవీణ్ గారు, @విజయమోహన్ గారు, @భావన గారు, @సుమిత్ర గారు, @నీహారిక గారు,@మందాకిని గారు: నెనర్లు.

  @సందీప్ గారు: :-) బాగా చెప్పారు. పద్యం చివరి పాదం -
  జంతువులు జాలిపడె తమ జాతి మీద!
  అంతే కాదండోయ్,
  జంతువులు జాలిపడె నర జాతి మీద! కూడా.

  @నాగమురళి గారు: సూపర్ డయలాగు. విజిల్సు..

  @సనత్ శ్రీపతి గారు: నాకు మాత్రం మలయాళం అవార్డు సినిమాలా అర్థం కాకుండా, అయోమయంగా అనిపిస్తాయి నా బ్లాగులు. ఏ విషయమూ పూర్తిగా ఉండదు, ఏ ఫోకస్సూ ఉండదు!

  @భాస్కర్ రామరాజు: చిరంజీవి మీద పద్యాలు ట్రై చెయ్యరాదూ!

  ReplyDelete
 14. రావీ .. ఫెంటాస్టిక్.

  సందీప్, మీ పద్యం కూడా సూపరు.

  ReplyDelete
 15. రవి
  నేనూ ఓ బుఱ్ఱకథ రాసాను.
  మీరు చూసే ఉంటారు. ఐనా ఊర్కనే లింకు కొడుతున్నా
  http://nalabhima.blogspot.com/2008/12/blog-post_16.html

  సిన్రన్జీవి మీద పద్యమా?
  పద్యం ఇన్కా నేర్సుకున్టానే ఉన్యా.
  హిప్పుడప్పుడే రాయలేను.
  మీబోటోళ్ళు రాత్తన్టే సూసి వానందిన్చటమే హిప్పటికి

  ReplyDelete
 16. రవి,
  కడుపుబ్బ నవ్వించే పద్యాలు

  కడుపుబ్బ నవ్వించే వ్యాఖ్య - కంటి చూపుతో కాదురా కంద పద్యంతో చంపుతా

  ReplyDelete
 17. రవి గారూ,
  పద్యాలు బావున్నాయండీ..
  100 పద్యాలు వేగంగా పూర్తిచేసినది మీరే అనుకుంటా అభినందనలు...

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.