Monday, May 24, 2010

మిరపకాయ పేరడీ

ఎద్దాని సంబంధ మెలమి గల్గిన మాత్ర
కూరలెల్లను మంచి గుణము గనునో
కొత్తిమీరను నూరుకొని తిన్న నెయ్యది
కంచెడన్నము తినగలుగ జేయు
ఎద్దాని శిశుజాల మెఱుగక చేబట్టి
కనులు నల్పిగ మంట గలుగ జేయు
ఎద్ది తా క్రమముగ నెదిగి పంపిన మీద
జోటి కెమ్మోవితో సాటి యగునో

నూరి దేనిని పుల్లనై మీరు మెంతి
పెరుగులో గూర్ప స్వర్గము నెరుగజేయు
నరులకెల్లను నా పచ్చి మిరపకాయ
మహితభక్తిని నేను నమస్కరింతు!

తిరుపతి వేంకటకవులు పచ్చిమిరపపై చెప్పిన పద్యమట ఇది. ఈ పద్యం చదవగానే మరో భారతపద్యం స్ఫురించింది. ఇక్కడ వ్యాఖ్యానం చదివి, ఇక్కడ ఆ పద్యం విని రండి. ఈ పద్యం ఆ పద్యానికి పేరడీయా అన్న అనుమానమొచ్చింది. ఓ సారి పాడి చూసుకున్నాను. ఎత్తుగీతి కొంచెం అలానే ఉంది, అయితే తేటగీతి మాత్రం కుదరలేదు.

పై పద్యం నా గొంతులో.

Get this widget | Track details | eSnips Social DNA(గత పది రోజులుగా నా ఆరోగ్యం బావోలేదు. అందుకనే గొంతు సరిగ్గాలేదు. దయచేసి భరించగలరు.)

8 comments:

 1. బావుంది..........బావుంది !

  మంచి పెరుగు పచ్హడి తిన్నట్టు వుంది !

  డా. కె.వి . రమన మూర్తి !
  http://ramanafm.blogspot.com/

  ReplyDelete
 2. బావుందండీ.. భేష్..

  ReplyDelete
 3. @రమణమూర్తి గారు, @కొత్తపాళీ గారు, @సనత్ : ధన్యవాదాలు.

  @విజయమోహన్ గారు : ఏదో విషజ్వరం. తగ్గుతూ పెరుగుతూ వస్తోంది. :-) అందుకే గొంతు బావుండట్లేదు.

  ReplyDelete
 4. రవి.. ఏంటి?? పచ్చిమిరపకాయ కాని కొరికావా?? పద్యాన్ని వెతికి పట్టుకుని,ఆరోగ్యం బాలేకున్నా పాడావు? :))

  ReplyDelete
 5. రవి గారూ...,

  నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
  ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
  నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
  మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

  తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
  తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
  హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

  మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

  - హారం ప్రచారకులు.

  ReplyDelete
 6. వీరిదే పకొడీ మీద కూడా సీసం ఉండాలండీ. ఒక సారి జ్యోతి గారు, అన్ని వంటకాల మీదా పద్యాలు గుదిగుచ్చారు .. లంకె దొరికితే ఇస్తాను
  భవదీయుడు
  ఊకదంపుడు

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.