Monday, March 8, 2010

ఫలానా దినోత్సవం

ఈ టపా మగాళ్ళకు మాత్రమే.

ప్రతీ సోమవారం లాగే అంతకు ముందు ఐదు రోజుల గబ్బును రెండు రోజుల సబ్బుతో వదిలించేసుకుని, కచేరీలో పొద్దున అడుగుపెట్టి చూద్దును కదా. హాశ్చర్యం. అమ్మాయిలందరూ .. ఆ కాదు ., ఆంటీలందరూ (మా ఆఫీసులో అమ్మాయిలు ఆంటీల్లా ఉంటారు) చుడీదార్లు, చున్నీలూ వదిలేసి చీరలు కట్టుకొచ్చేస్తున్నారు. ఒక కైరళి (ఈమె మటుకు అమ్మాయిలానే ఉంది) తెల్లచీర, నుదుటిన చందనపు బొట్టు, వదిలేసిన జడతో సాంప్రదాయబద్ధంగా వచ్చింది. ఏంటో ఏమో అనుకుని లోపల అడుగు పెడితే వుమన్స్ డే అట. అమ్మాయి బొమ్మ తాలూకు శక్తిబిందువు (పవర్ పాయింటు) ప్రెజెంటేషన్ గోడ మీద నడిపిస్తున్నారు.

పడమటి సంధ్యారాగం సినిమాలో నటుడు "అమ్మ దినం ఏంటి తద్దినం లాగా?" అని విసుక్కున్నట్టు, నాకూ ఇవి కాస్త చీకాకే. పక్క సీటోణ్ణి ఏంటిది? మగాళ్ళకు దినాల్లేవా? అనడిగితే వాడన్నాడు, మిగిలిన మూడొందలరవై నాలుగు రోజులూ మనవే అని.

ఈ ఫలానా దినోత్సవాలు నాకు తెలిసి ఆర్చీస్ కంపెనీ వాడి కుట్ర అని నా ప్రఘాఢ నమ్మకం. ఎందుకంటే ఈ దినాల వల్ల బాగుపడేది వాడే. అందులో కూడా కొత్త కొత్త ఇన్వెన్షన్లు. అపుడెపుడో మా గ్రూపులో ఒకమ్మాయి మణికట్టు గమనించాను. రంగురంగులుగా ఉంది. అడిగితే ఒక త్రాడు దేవుడికి (వదిలేద్దాం). మరొకటి ఫ్రెండ్ షిప్ డేది. మరొకటి రాఖీ. ఇంకోటి ఏదో .. ఇలా చెప్పుకొచ్చింది. ఇది ఆర్చీస్ కి ప్రత్యామ్నాయం అనుకుంటాను.

హా, మళ్ళీ ఆఫీసుకొస్తా. ఆఫీసులో అమ్మాయిలు...వద్దులెండి. స్త్రీలందరికీ ఈ రోజు చుక్కల పూటకూళ్ళ కొంపలో ಊಟ, ఒక్కొక్కరికి ఒక కుసుమ రాజం బహుమతి. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఆటవిడుపు. ఇదీ మెను. ఇది జెండరు డిస్క్రిమినేషన్ గా పరిగణించాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను.

ఎయిడ్స్ డే, వేలెంటైన్స్ డే, ఇప్పటికే ఇలాంటివి ఉన్నాయి. భవిష్యత్తులో
శిశువుల దినోత్సవం
పశువుల దినోత్సవం,
జంతువుల దినోత్సవం (ఇంకా ముదిరితే ఒక్కో జంతువుకొకటి),
పక్షుల దినోత్సవం,
చెట్ల దినోత్సవం,
పుట్టల దినోత్సవం,
పిట్టల దినోత్సవం,
గుట్టల దినోత్సవం,
మొక్కల దినోత్సవం,
నాచు మొక్కల దినోత్సవం
ఇలా ఏదిబడితే అది వచ్చే అవకాశం లేకపోలేదు. ఇంకా ముదిరితే పూటలు. కేన్సరు అర్ధ దినోత్సవం, తాతయ్యల పూట, శిశువుల గంట - ఇలాంటివి కూడా వచ్చేస్తాయేమో!

(ఈ టపా సరదాగా మాత్రమే. ఈ టపాలో సంఘటనలూ, వ్యక్తులూ కేవలం కల్పితాలు. (నిజ్జం). ఏదైనా సారూప్యం తగిలితే అది కేవలం కాకతాళీయం అని గమనించగలరు.)

ఈనాడు శనివారం రోజున నా బ్లాగు పరిచయం వచ్చింది. అభినందనలు తెలుపుతూ వేగులు, వ్యాఖ్యలూ వచ్చాయి్, వస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు. నా బ్లాగు పరిచయం చేసిన సుజాత (మనసులో మాట) గారికి కృతజ్ఞతలు. - రవి.

17 comments:

 1. FYI, aa dinalalo almost sagam paiga already unnayi

  ReplyDelete
 2. ha...ha..
  BaavundanDi... :) :)

  Venuram.

  ReplyDelete
 3. మీరు రవిగారా రామచంద్ర గారా ? మొన్న ఈనాడులో మీ బ్లాగ్ గురించి రాశారు అభినందనలు చెబుదామంటే రవి అని ఉంది...కాని"ఆ రెండూ వదిలేసి " మీరేగా ..అభినందనలు ...
  మేమేదో ఏడాదికో రోజు మాకోసం అని గర్వపడుతుంటే మీరేంటండీ ...మీ ఫ్రెండు చెప్పినట్టు మిగతా రోజులన్నీ మీవేగా :)
  *ఈ ఫలానా దినోత్సవాలు నాకు తెలిసి ఆర్చీస్ కంపెనీ వాడి కుట్ర అని నా ప్రఘాఢ నమ్మకం. మావారు కూడా ఇదే మాట అంటారు ఏ దినోత్సవం వచ్చినా :)
  *"చుక్కల పూటకూళ్ళ కొంప" :) :)
  అన్నట్టు మీ టపా మగవాళ్ళకు మాత్రమే అయినా అభినందనలు అందుకోవడానికేం అభ్యంతరం లేదుగా :)

  ReplyDelete
 4. ఇదోటి నాకు అర్ధం కానిది. మిగతా మూడొందల అరవైనాలుగు రోజులో చీర అనేది స్త్రీ పురోగమనానికి ఆటంకంగా భావించే ఈ నవనారీమణులు తమ ప్రత్యేక దినాన అదే చీరని ఎందుకు ధరిస్తారబ్బా?

  ReplyDelete
 5. "మిగిలిన మూడొందలరవై నాలుగు రోజులూ మనవే అని"
  "పశువుల దినోత్సవం,
  జంతువుల దినోత్సవం (ఇంకా ముదిరితే ఒక్కో జంతువుకొకటి),
  పక్షుల దినోత్సవం,
  చెట్ల దినోత్సవం,
  పుట్టల దినోత్సవం,
  పిట్టల దినోత్సవం,
  గుట్టల దినోత్సవం,
  మొక్కల దినోత్సవం,
  నాచు మొక్కల దినోత్సవం"
  ?????????????????
  ఏం లేదు, వీటిల్లో సగం ఉన్నాయంటున్నారు, మిగిలిన రోజులన్నీ మావే అంటున్నారు. ఏదోలా అర్థం వస్తోంది కదూ!
  సరదాగా అన్నాను. ఏమనుకోకండేం....

  ReplyDelete
 6. మీ బ్లాగు గురించి ఈనాడులో చూసాను.. అభినందనలు.. దొంగలు పడ్డాక ఆరు..అన్నట్లు ఇంత లేటుగా ఎందుకంటే మీ బ్లాగు అడ్రస్ మిస్ అయ్యాను.. అందుకే.. :)

  ReplyDelete
 7. Ravi Garu Chala Bavundandi..............
  AAAAAAAAda valla to meku vibhedalunnayi anukuntunnanu.
  OK Lite Guru.

  ReplyDelete
 8. @ కొత్తపాళీ సర్ ! చీర పురోగమనానికి అంటే ముందుకు నడవటానికి సౌకర్యంగా ఉండదని :) మహిళా దినోత్సవం రోజైతే మహిళల్ని నేలమీద నడవనివ్వరని :)

  ReplyDelete
 9. బ్లాగరిFri Mar 12, 08:08:00 PM

  మిగిలిన రోజుల్లో మగ వారి ప్రపంచంలో మగ వారి వలే నెగ్గుకు రావాలి.
  ఈ ఒక్క రోజూ ఆడవాళ్ళం అని సగర్వంగా చాటుకోవచ్చు అనేమో?
  హాస్యాలు సరే.
  మగవారికి ప్రత్యేకంగా రోజు కావాలంటే తీసుకోండి.
  ప్రత్యేక దినాలు లేని రోజు కోసమే మహిళలు ఎదురు చూసేది.
  మనిషిని మనిషిగా, ఆడ గానో మగ గానో కాకుండా చూడగలగాలి.
  ఆడ ఐనందునో మగ ఐనందునో జాలో, గొప్పతనమో మంచితనమో చెడ్డతనమో ఆ మనిషిపై గుమ్మరించెయ్యకుండా
  మనిషిని సమగ్రంగా అర్థం చేసుకోగలగాలి.

  ReplyDelete
 10. :))).

  ఇంకా మీరు అసలు దినోత్సవాలు మర్చిపోయారు.

  తెలుగు బ్లాగుల దినోత్సవం
  మగ బ్లాగర్ల దినోత్సవం
  నా బ్లాగు ఈనాడులో వచ్చిన దినోత్సవం... :)))

  ReplyDelete
 11. @నాగూ : కెవ్.. మరదే. బ్లాగులకి దినోత్సవాలు పెట్టుకుంటూ పోతే, ఉన్న 365 రోజులు చాలవు. పూటపూటకి ఓ దినోత్సవం పెట్టుకోవాలి.నీ బ్లాగులో సరికొత్తబూతుల్లాగా, దినోత్సవాల రూపకల్పన చేద్దామా. నా తరపున కొన్ని.

  తె.బ్లా. హేతువాదుల దినోత్సవం
  తె.బ్లా. లౌకికవాదుల దినోత్సవం
  తె.బ్లా. నిర్వాద దినోత్సవం
  తె.బ్లా. చలం అభిమాన్ల దినోత్సవం ...

  ReplyDelete
 12. @నాగూ : కెవ్.. మరదే. బ్లాగులకి దినోత్సవాలు పెట్టుకుంటూ పోతే, ఉన్న 365 రోజులు చాలవు. పూటపూటకి ఒకటి చొప్పున పూటోత్సవాలు పెట్టుకోవాలి.నీ బ్లాగులో సరికొత్తబూతుల్లాగా, దినోత్సవాల రూపకల్పన చేద్దామా. నా తరపున కొన్ని.

  తె.బ్లా. హేతువాదుల దినోత్సవం
  తె.బ్లా. లౌకికవాదుల దినోత్సవం
  తె.బ్లా. నిర్వాద దినోత్సవం
  తె.బ్లా. చలం అభిమాన్ల దినోత్సవం ...

  ReplyDelete
 13. nice one. I knew of this blog through eenadu and you are doing really well.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.