Tuesday, October 27, 2009

తెలుగు - ఇంగిలిపీసూ!


అప్పి గాడు: ఏంది విశేషాలు?

సుబ్బి గాడు: అదేదో ఊర్లో టీచర్లు "తెలుగు మాట్లాడను అని పలకల మీద రాయించి పిలకాయల మెడకాయలకి యేలాడగట్టినారంట".

అప్పి గాడు : ఏమంటవ్ నువ్వు?

సుబ్బి గాడు : ఆ టీచర్ చెంపకు ఒక్కటి జవిరితే, అప్పుడు నెప్పికి "అమ్మా" అని అరుస్తదో, "ఓ మై గాడ్" అని అరుత్తదో సూడాల్నుంది.

అప్పిగాడు : నెప్పెడితే తెలుగు గుర్తొస్తది, కోపమొస్తే, ఎవున్తోనయినా వాదులాటకి దిగాల్నంటే మాత్రం ఇంగిలిపీసు గావల్న మన తెలుగోల్లకు.

సుబ్బిగాడు : అదేమన్నా, అట్లంటివి?

అప్పిగాడు : అవును మల్ల, ఏదైనా విషయం సాధ్యమైనంత స్పష్టంగా చెప్పాల్నంటే, లేదా, అది నాకు బాగా తెలుసు అని చెప్పాల్నంటేనో, మనోల్లకు తెలుగు మరుపొచ్చేస్తది.

సుబ్బి గాడు : ఎట్టేట్టా అర్థం గాలే.

అప్పిగాడు : ఈ సారి యాదైనా బ్లాగులో వాదులాట, సారీ, చర్చ జరిగేప్పుడు ఎల్లి సూడు, కొట్టుకోడం ఎక్కువయే కొద్దీ ఇంగ్లీసలాగ ధారగా కారిపోతా ఉంటది.

సుబ్బి గాడు : ఏందో అర్థం గాలే.

అప్పిగాడు : If the discussion gets deepened, You know you tend to choose ...

సుబ్బి గాడు : ఇంగ జెప్పద్దు. అర్థమయెలే!

16 comments:

 1. కొట్టుకోడం ఎక్కువయే కొద్దీ ఇంగ్లీసలాగ ధారగా కారిపోతా ఉంటది.
  వాస్తవం చెప్పారు.

  ReplyDelete
 2. భలే నవ్వొచ్చింది. వాస్తవికతని అద్దం పడుతూ సరదాగా చురకంటించారు కదా!..

  ReplyDelete
 3. మా ఊర్లో అలాంటివేమీ లేవండోయ్... ఎంత పెద్ద బూతులైనా తెలుగులోనే తిట్టుకుంటారు :-)

  ReplyDelete
 4. How does a cosmopolitan Bangalorean ridicule the English language?

  ReplyDelete
 5. హిహి..తగిలింది.

  ఆంగ్లంలో ఎదుటివారు వ్యక్తిగతదాడి అనుకోలేని విధంగా విషయాన్ని బలంగా చెప్పటం సులభం అండీ (నాకు). తెలుగులో అలా చెయ్యాలంటే ఇంకా ఎదగాలి (నేను) :)

  ReplyDelete
 6. Look at that sentence ... That itself is grammatically incorrect :-)

  ReplyDelete
 7. "ఇంగిలి పీసూ" అనేదానికన్నా "ఎంగిలి పీసు" అనవచ్చేమో!! పైకి సరదాగా అనిపించినా... అవేదన ధ్వనించింది... మంచి టపా....

  ReplyDelete
 8. @విజయమోహన్ గారు, @మురారి గారు: నెనర్లు.

  @రవిచంద్ర గారు: మన ఊర్లలో అలానే లెండి. పెద్దగా డెవలప్పు కాలే కదా, అందుకు.

  @యోగి గారు: నేను కూడా అలాంటోణ్ణే. అయితే పూర్తిగా కాదు. (మనలో మాట : దానిక్కారణం నాకు ఇంగ్లీషు వచ్చి సావదు)

  @Anonymous: I want to screw english language.

  @శివ : ఎంగిలిపీసు. బాగా చెప్పారు.

  @Praveen Sarma : నేను చదువుకున్నది తెలుగు మీడియం. ఇంట్లో మాట్లాడేది తెలుగు. ఆఫీసు పని మీద 5 దేశాలలో తిరిగాను. ఆ ఐదు దేశాల్లోనూ ఎక్కడా ఇంగిలిపీసు లేదు, ఉపయోగపడే కాస్త ఇంగిలిపీసు, మామూలుగా ఎవడికైనా వచ్చుద్ది.

  ReplyDelete
 9. మీడియావాళ్ళ కన్నా మన బ్లాగర్లు వెయ్యి రెట్లు మేలేనండీ.
  ఇదిగో ఇక్కడ చూడండి అసలైన కామే(ట్రాజే)డీ!

  http://apmediakaburlu.blogspot.com/2009/10/blog-post_27.html

  ReplyDelete
 10. @ఆదిలక్ష్మి గారు : నెనర్లు.
  @కామేశ్ : టీవీ చూడ్డం మానేసి కొంతకాలమయింది. మానెయ్యడం ఎంత మంచిదయ్యిందో తెలుస్తూంది.

  ReplyDelete
 11. హ హ హా.... నవ్వీ నవ్వీ కళ్లల్లో నీళ్లు తెప్పించారు....
  మీ దైన తరహాలో చాలా చక్కగా చురకేశారు :)

  ReplyDelete
 12. Siva Kolanukuduru
  gaaari maate naa maata..

  baaga raasaaru.
  ..

  ReplyDelete
 13. Hypocritical verses
  >>>>>>>>>>
  I eat Telugu
  I drink Telugu
  I breath Telugu
  I live with Telugu
  But I don't want to admit my child in Telugu medium school"
  >>>>>>>>>>

  ReplyDelete
 14. హి హి హి భలే చెప్పారు

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.