Wednesday, September 16, 2009

సత్యక్రియ - అనుబంధ చర్చ

ఇదివరకు నేను రాసిన టపా సత్యక్రియ లో ఓ చర్చ జరిగింది. అందులో ఓ అంశం కాస్త సందిగ్ధంగా మిగిలింది. అందుకే ఈ టపా. (అయితే ఈ టపా తర్వాత కూడా ఆ చర్చ సందిగ్ధంగా మిగిలితే అందుకు నేను పూచీకత్తు కాదు).

జిడ్డు కృష్ణమూర్తి మీద నాకున్న అభిమానంతో, తన వాక్యాలను అక్కడక్కడా ఉటంకించే చాపల్యం తో ఆ టపాలో రాసిన వాక్యం - "The unknowable can never be known". ఈ మాట మీద జరిగిన చర్చ అక్కడే చదవడం ఉత్తమం. చివరకు శాంతియుత ఒడంబడిక లో భాగంగా, కామేశ్వర్రావు గారి ప్రశ్నకు నేను మరికొన్ని ప్రశ్నలు జోడించి, విజయవంతం(బలవంతం?) గా దాటెయ్యడం జరిగింది. :-)

అక్కడ ప్రశ్ననే ఈ విధంగా మారుస్తున్నాను, కాస్త సౌలభ్యానికి.

"ఓ పరమ సత్యాన్ని (అది దేవుడు/బ్రహ్మం/పరమాత్మ/మోక్షం/నిర్వాణం/ ఏ పేరుతో పిలువబడినా) కనుగొన్న వాడు, దానిని ఇతరులకు చెప్పడానికి (to communicate) వీలవుతుందా? దాని గురించి విన్నవాడు, మరికొంతమందికి తెలియజెప్పడానికి వీలవుతుందా? ఒక వేళ వీలయితే ఏ విధంగా?"

ఈ ప్రశ్నకు జవాబు కృష్ణమూర్తి ద్వారానే వినాలి. ఓ చోట ఇదే ప్రశ్నకు చెప్పిన జవాబు ఇక్కడ సంభాషణలో భాగంగా చదవచ్చు. లేదా ఇక్కడ పీడీఎఫ్ ను దింపుకుని, ఐదవ పేజీ లోని ప్రశ్నను చదవవచ్చు. (ఈ సంభాషణ పూర్తిగా చదివితే ఇంకా మంచిది)

JK_VenkaTeSaananda_1
JK_VenkaTeSaananda...
Hosted by eSnips


ఇక పోతే, నేనక్కడ దాటవెయ్యడానికి సంధించిన ప్రశ్నలకు సమాధానం అన్వేషిద్దాం, కొంత కథనం సహాయం కూడా అవసరం.

గౌతముడు కపిలవస్తు గణతంత్రానికి యువరాజు. అనుకూలవతి అయిన భార్య, చక్కని సంసారం, ఒడిదుడుకులు లేని జీవితం. అయితే జీవితం అంటే ఇంకేనా? మరింకేదైనా ఉందా అన్న "చింత" ఆయనను అప్పుడప్పుడూ బాధిస్తుండేది. ఓ రోజు ఆయన రాచవీధిలో విహరిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన - ఓ వ్యాధి గ్రస్తుణ్ణి, ఓ మరణాన్ని, ఓ ముసలి వ్యక్తిని, ఓ శ్రమణుణ్ణీ చూశాడు.

గౌతముడు గమనించిన విషయం ఏమిటంటే - దుఃఖం అన్నది ఉన్నది. (అన్ని సౌకర్యాలు ఉన్న తనకు కూడా ఏదో తెలియని దుఃఖం ఉన్నది!). ఆ దుఃఖం భౌతిక కారణాలపై ఆధారపడి లేదు. (అన్ని సంపదలు ఉన్నా తనలోనూ దుఃఖం ఉన్నది.కాబట్టి దుఃఖానికి భౌతిక కారణం లేదు) ఈ దుఃఖ కారణాన్ని కనుక్కోవాలి! పరిహరించాలి!

(దుఃఖం ఉన్నదన్న విషయాన్నిపాశ్చాత్య చింతనలో షోపెన్ హూవర్ అనే తత్వ వేత్త కూడా చెబుతాడు. అయితే పాశ్చాత్యులది పద చర్చ, rationalization మాత్రమే. స్థిరమైన అన్వేషణ కాదు)

ఈ ఉద్దేశ్యంతోనే బుద్ధుడు ఆరేళ్ళు రకరకాలయిన పద్దతులలో సాధన చేశాడు. ఏ పద్ధతిలోనూ సమాధానం లభించలేదు. అలా నిస్పృహావశిష్టుడైన ఆయనకు ఓ రోజు, ఓ లిప్తలో తన ప్రశ్న, తనలోనే కరిగిపోయి, సత్య దర్శనం కలిగింది. నిజమైన ప్రశ్నలకు సమాధానం - జవాబు లో ఉండదు. ప్రశ్న - జవాబు అన్నవి ద్వైధీభావాలు. జవాబు భౌతికం మాత్రమే. ప్రశ్న mitigate అవడమే నిజమైన సమాధానం. అన్ని రకాల ద్వైధీభావాలు నశించి, తనను ఇతరులలోనూ, ఇతరులలో తనను, ఆ మాటకొస్తే అన్ని ప్రాణులలోనూ, కనిపిస్తున్న, కనిపించని అన్ని వస్తువులలోనూ తనను చూడడమే ఆ పరమ సత్యం.

జిడ్డు కృష్ణమూర్తి అధ్యాత్మిక అనుభవం (నిర్వాణం) పొందినప్పుడు, తన అనుభవం తన మాటల్లో.

There was such profound calmness both in the air and within the lake, I felt my physical body, with its mind and motions could be ruffled on the surface but nothing, nay nothing, could disturb the calmness of my soul ... nothing could ever be the same. I have drunk at the clear and pure waters at the source of the fountain of life and thirst was appeased. Never more could I be thirsty, never more could I be in utter darkness ... I have touched compassion which heals all sorrow and suffering; it is not for myself, but for the world ... I have seen the glorious and healing Light. The fountain of Truth has been revealed to me and the darkness has been dispersed. Love in all its glory has intoxicated my heart; my heart can never be closed. I have drunk at the fountain of Joy and eternal Beauty. I am God-intoxicated’.

అది శాశ్వతమా? అశాశ్వతమా?
నిర్గుణోపేతమా? సగుణోపేతమా?

శూన్యత్వమా? పూర్ణత్వమా?


ఇప్పుడు కొన్ని నిర్వచనాలు కూడా చూద్దాం.

మోక్షం - పునర్జన్మ రాహిత్యం (మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఈ మాసం స్వాతి)
నిర్వాణం -

"అప్రహీణం అసంప్రాప్తం అనుచ్చిన్నం అశాశ్వతం
అనిరుద్ధం అనుత్పన్నమ్ ఏతన్నిర్వాణముచ్యతే"

"పరిత్యజించనిది, పొందనిది, ఉచ్చేదం కానిది, అశాశ్వతం, అనిరోధమూ, ఉత్పన్నం కానిది నిర్వాణం"

మన చర్చకు వద్దాం.

ఈ పూర్ణత్వాన్ని/శూన్యత్వాన్ని గురించి ఒకరికి చెప్పడానికి వీలవుతుందా? ఆ మాటకొస్తే - దాన్ని "తెలుసుకోవడం" జరుగుతుందా? Does the emptiness (unknowable) can ever be known?

కాబట్టి సత్య (ఆత్మ) దర్శనం కొరకు ఒకరిని ప్రేరేపించటం (ఆత్మదీపోభవ) మాత్రమే బుద్ధులు చేయగలిగిన పని.

(దీని తర్వాత భాగం అవసరమయితే మళ్ళీ ఇంకొకసారి)

16 comments:

 1. "ఓ పరమ సత్యాన్ని (అది దేవుడు/బ్రహ్మం/పరమాత్మ/మోక్షం/నిర్వాణం/ ఏ పేరుతో పిలువబడినా) కనుగొన్న వాడు, దానిని ఇతరులకు చెప్పడానికి (to communicate) వీలవుతుందా? దాని గురించి విన్నవాడు, మరికొంతమందికి తెలియజెప్పడానికి వీలవుతుందా? ఒక వేళ వీలయితే ఏ విధంగా?"

  Let me attempt to answer this question, but before I do so - let this be known that I am not enlightened, just yet. If I were, I wouldn't be theorizing about it :) :)

  For the sake of this discussion, let us use the word 'enlightenment' for దేవుడు/బ్రహ్మం/పరమాత్మ/మోక్షం/నిర్వాణం/ etc.,

  Now what is the question exactly? That whether -

  1. Enlightenment is learnable? (Can all people be happy, attain that state?)

  2. The descriptions of enlightenment be transmitted?

  1A - Yes. Enlightenment is learnable. If I want to be a Ramakrishna Pramahamsa or a Ramana Maharshi, I can very well be that. Sooner or later. It may take sometime, but one can surely attain that state. Whatever a fellow human being does can be emulated by the other. But the pace at which each human being learns varies because of differential learning.

  But, what if I pick up a method, practice it (saadhana), and before getting to enlightenment, I die? Here is where Indian Traditions give you wonderful answers. You have infinite number of births to come to get to that state. Your efforts accumulated in one life are not wasted. The Karma theory and theory of rebirth explain exactly these.

  But some retarded zealots have brought down Karma theory to such lows that they argue - "The physically handicapped must have done something to deserve it in past life". Whenever I see such arguments, I feel like skewing these retards alive. It is exactly these kind of people that brought misery on India and her traditions! Anyways, I am digressing.

  2A. The descriptions/experiences of enlightenment can be transmitted the way you transmit any other experience. One doesn't have to be enlightened to talk about the descriptions of enlightenment and One doesn't get enlightened by merely philosophizing about such descriptions.

  I will end this comment with an awkward but striking example, I hope you understand it in the right spirit.

  There is always a difference between watching porn and doing sex.

  ReplyDelete
 2. U.G Krishnamurthy is a fierce soul. There was a time in his life when he questioned everything he encountered, denounced every tradition, he looked down at Rishis and the Enlightened with great contempt. During that period, he happened to meet Ramana Maharshi. Read below:


  "I looked at him, and he looked at me. "In his presence you feel silent, your questions disappear, his look changes you" -- all that remained a story, fancy stuff to me. I sat there. There were a lot of questions inside, silly questions -- so, "The questions have not disappeared. I have been sitting here for two hours, and the questions are still there. All right, let me ask him some questions" -- because at that time I very much wanted moksha. This part of my background, moksha, I wanted.

  "You are supposed to be a liberated man" -- I didn't say that.

  "Can you give me what you have?" -- I asked him this question, but that man didn't answer, so after some lapse of time I repeated that question --

  "I am asking 'Whatever you have, can you give it to me?'"

  He said,

  "I can give you, but can you take it?""

  ReplyDelete
 3. @యోగి : I donno much about U.G. Krishnamurthy, except that he is a rationalist. good to read a bit about him.

  ReplyDelete
 4. రవిగారు !! క్రితం టపాకే కామెంటుదామనుకున్నా కానీ సమయం చాలక వదిలెయ్యటం జరిగింది. సమయం వచ్చింది కాబట్టి మళ్ళీ మొదటినుంచీవస్తున్నా. ఏమనుకోవద్దు.

  (1) "The unknowable can never be known". జిడ్డు కృష్ణమూర్తిగారి భావంతో ఏకీభవిస్తున్నా ఆయన స్టేట్మెంటుతో విభేధిస్తున్నా.

  అసలు unknowable అని ఏదైనా ఉంటుందా? తెలియనిది/ తెలియబడనిది unknown ఉంటుంది కానీ తెలియబడకూడనిది unknowable అని ఏదైనా ఉంటుందా ?
  More over, జిడ్డు కృష్ణమూర్తిగారి ఈ స్టేట్మెంటు అసంపూర్తిగానో/ out of context గానో ఉందేమో అనిపిస్తోంది. "The unknowable can never be known (by itself)".
  seems the inference.

  I presume the above phrase has been picked up when GK was referring to the physical universe from the verses of Manusmriti, which said,
  ఆసీత్ ఇదం తమోభుతం
  అప్రజ్ఞాతం అలక్షణం
  అప్రతర్క్యం అవిజ్ఞేయం
  ప్రసుప్తం ఇవ సర్వతః

  "This physical universe was quiescent darkness, indistinguishable, without its characteristic forms; inconceivable, unrecognizable, as it were wholly sunken in deep sleep." (5)
  ఇంతవరకే చూసుకుంటే అది అసంపూర్తి గా ఉంటుంది. అట్లాంటి దాన్నుంచి ఎట్లా వ్యక్తమయ్యడు భగవంతుడు అన్నది తర్వాతి శ్లోకం లో చెప్పాడు మనువు.

  తతః స్వయంభుర్భగవాన్
  అవ్యక్తొ వ్యంజయన్న్ ఇదం
  మహా-భుతాది-వ్రిత్తౌజః
  ప్రదురాసిత్ తమోనుదః

  Thence the Self-becoming, celestial, unmanifest, of cyclical power, manifesting this physical universe, the elements and so forth, came forth, dispelling the darkness. (6)
  "That one, to be perceived by a faculty transcending the senses, subtle, unmanifest, ancient, consisting of all beings and things, unthinkable, shone forth verily of itself. (7)

  మన విషయానికొస్తే, తెలియదగనిది తెలియదగినదీగా దానంతట అదిగా మారగదు. "The unknowable can never be known (by itself)" దానికి కొంత ప్రయత్నం (inertia) కావాలి. తెలుసుకోవాలన్న తపన అందులో మొదటిది. ఆ తపన ఎవరిలోనో ఒకరిలో కలిగేంతవరకూ తెలియవలసినవన్నీ, తెలియకుండా నిద్రాణం గా పడి ఉంటాయి. న్యూటన్ మొదటి సూత్రం లో చెప్పినట్టు సూత్రం లో చెప్పినట్టు every object will remain at rest or in uniform motion in a straight line unless compelled to change its state by the action of an external force. సరైన సమయం లో, సరైన ప్రయత్నం తో సాధిస్తే అప్పటి దాకా తెలియనివెన్నో కొత్త కొత్త గా తెలుస్తున్నట్టు ఉంటాయి. Inertia అన్నా, బృంహణము అన్నా ఒకే అర్థం.

  తైత్తిరియోపనిషత్తులోని భృగువల్లి పాఠంలో భృగు-వారుణి సంవాదం లో బ్రహ్మం అంటే ఏమిటి అని పిల్లవాడు తండ్రిని అడగటం, నీ అంతట నువ్వే అదేమిటో తెలుసుకో అని తండ్రి పిల్లవాడికి చెప్పటం, వాడు తప్పస్సు చేసి బ్రహ్మం అంటే అన్నమే అని తెలుసుకున్నాను అని చెప్పటం, ఇంకా తపస్సు చెయ్యి అని తండ్రి చెప్పినప్పుడు అన్నానికి ఆధారమైన ప్రాణమే బ్రహ్మం అనీ, ప్రాణానికి ఆధారమైన మనస్సు బ్రహ్మమనీ, మళ్ళీ తపస్సు చేసి, మనస్సుకు ఆధారమైన విజ్ఞానమే బ్రహ్మం అనీ, అన్నిటికన్నా ఆ విజ్ఞానికి ఆధారమైన ఆనందమే బ్రహ్మం అనీ తెలుసుకున్నాను అని చెప్పటం చూస్తే.. గౌతముడు చేసిన అన్వేషణ, వారుణి చేసిన అన్వేషణ, వారికి చివరకు లభించిన ఫలమూ ఒకటే. బ్రహ్మం అన్నా, నిర్వాణం అన్నా, ఆనందం అన్నా, సత్యం అన్నా అదే.

  వ్యాఖ్య పెద్దదౌతోందేమో అని రెండు భాగాలుగా ఇస్తున్నాను.

  ReplyDelete
 5. (2) మీ ప్రశ్న. "ఓ పరమ సత్యాన్ని (అది దేవుడు/బ్రహ్మం/పరమాత్మ/మోక్షం/నిర్వాణం/ ఏ పేరుతో పిలువబడినా) కనుగొన్న వాడు, దానిని ఇతరులకు చెప్పడానికి వీలవుతుందా? దాని గురించి విన్నవాడు, మరికొంతమందికి తెలియజెప్పడానికి వీలవుతుందా? ఒక వేళ వీలయితే ఏ విధంగా?"

  సమాధానానికి ముందు కొన్ని ప్రశ్నలు.
  (అ) ఒక మాంచి మామిడి పండు (పెద్ద రసమో, బంగినిపల్లో) కమ్మని పెరుగన్నంలో కలుపుకుని తిన్నవాడు దాని రుచిని వర్ణించగలడా? ఏమో. కవిగారైతే వర్ణించవచ్చేమో.
  (ఆ) ఆ వర్ణన ఎంతమేర పరిపూర్ణత్వం పొంది ఉంటుంది? ఏమో సరిగ్గా చెప్పలేం.
  (ఇ) పోనీ ఆ వర్ణించినది ఆ తిన్న అనుభూతిని ఇవ్వగలదా? అప్పటికే ఆ రుచి తెలిసినవాడికైతే అనుభవప్రాయం గా స్మృతిపథం నుండీ అనుభూతినివ్వవచ్చు. లేనివాడికి ఆ అనుభూతి ఊహా జనితం గా ఉంటుందే కానీ అనుభవప్రాయం గా ఉండదు.
  (ఈ) మరి అల్లాంటప్పుడు అనుభూతి కలగాలంటే దారేమిటి? వీలైతే అల్లాంటి మామిడి పండునే ఇవ్వటం, కాని పక్షం లో తత్సమమైన దానినిచ్చి (చెరుకో, పంచదారో, అరటి పండో, మరోటో ఇచ్చి ఈ మాదిరి గా ఉంటుంది అని చెప్పటం.

  ఈ కారణం చేతనే ఏ మహాత్ముడు చెప్పినా నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు ఆనంద స్వరూపుడివని తెలుసుకో, దానికి మార్గంగా ఆలోచనలకు పుట్టుక స్థానం ఏదో అది తెలుసుకో, ధ్యానం చెయ్యి, శ్వాస పై ధ్యాస |మొ| అన్నారే కానీ, నువ్వు ఆనంద స్వరూపుడివని నేను చెబుతాను, రా, అని అనలేదు.

  మరి పొందినవాడె దానికి మార్గం ఇవ్వలేకపోతే ఆనందానుభూతి పొందేదెలా అంటే దానికి రెండు ఉపాయాలు ఉన్నాయి. (అ) చెట్టెక్కే వాడికి కొంతవరకూ మాత్రమే సాయం అందించినట్టు మహానుభావులు ఎక్కడ ఎలా మొదలెట్టుకోవాలో చెప్పగలరు. రమణ మహర్షులు, అరవింద యోగీంద్రులు, రామకృష్ణులు, వివేకానంద, యోగానంద, శివానంద మొ|| సాధనా మార్గాలిచ్చారు. దానిని పట్టుకుని ఎవడికి వాడు సాధన చేసుకోవటం (ఆ) వాడికి సర్వస్య శరణాగతి చేస్తే వాడంతట వాడు అనుభూతిని ప్రసాదించటం. గోపికలూ, ప్రహ్లాదుడూ, శుకుడూ, పోతన, నారదుడూ, ||మొ|| వారికి తన సాన్నిధ్యం తో తానేమిటో తెలియజెప్పటం.

  మొదటిది ఆచరించటం సుళువే కానీ మర్కట-కిశోర న్యాయం. తప్పొప్పుల పూచీ మనదే
  రెందోది ఆచరించటం కష్టమే కానీ మార్జాల-కిశోర న్యాయం. అన్నిటికీ వాడే దిక్కు. దీనినే ఎంచుకోండర్రా అని చెప్పాడు భగవద్గీత చివరాఖర్లో...

  కాకపోతే ఎంపిక మాత్రం మనదే.

  ReplyDelete
 6. final gaa, ఈ పూర్ణత్వాన్ని/శూన్యత్వాన్ని/ సత్యాన్ని/ బ్రహ్మాన్ని/ఆనందాన్ని గురించి ఒకరికి చెప్పడానికి వీలవుతుందా? తప్పకుండానూ.

  ఆ మాటకొస్తే - దాన్ని "తెలుసుకోవడం" జరుగుతుందా? తప్పకుండా.

  కాకపోతే ఒకరింకొకరితో చెప్పినప్పుడు వాడికి తెలిసినదానికీ, అనుభూతి పరంగా "తెలుసుకున్నప్పుడు" అవగాహన అయ్యినదానికీ హస్తి మస్తకాంతరం ఉంటుంది.

  పోతన పద్యాలో, దాశరధీ శతకమో చదువుతూంటే, మనస్సు కరిగిపోయి క్షణకాలం తన్మయత్వం పొందగలిగితే, అన్నమాచార్యులో/ త్యాగరాజో రచించిన కృతులను వింటూంటే పరిసరాలన్నీ మరచిపోయి నాదం లో లీనమయ్యి అనిర్వచనీయమైన తాదాత్మ్యత పొందగలిగితే అది - 'అదే'.

  అది మొదలు అలాంటి అనుభూతి కావాలని తదేక దృష్టి తో ప్రయత్నం చేస్తే అది ముమ్మాటికీ సాధ్యమే. energy follows thought కదా !!

  ReplyDelete
 7. @సనత్ శ్రీపతి గారు : నా టపాల సంగతి ఎలా ఉన్నా, మీ వ్యాఖ్యలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి.

  "అసలు unknowable అని ఏదైనా ఉంటుందా? తెలియనిది/ తెలియబడనిది unknown ఉంటుంది కానీ తెలియబడకూడనిది unknowable అని ఏదైనా ఉంటుందా ? "

  - ఇక్కడ unknowable అంటే "తెలుసుకోవడానికి కుదరనిది" అన్న అర్థం అని నేను భావిస్తున్నాను. ("తెలియబడకూడనిది" అంటే దానికి అసలు అర్థం లేదు.)

  తెలుసుకోడానికి కుదరనిది - అన్న వెంటనే ఉత్పన్నమయే ప్రశ్న -

  దేని చేత తెలుసుకోడానికి కుదరనిది?
  - బుద్ధి చేత. మానవ మేధస్సుతోనో.

  ఎందుచేత?
  - infinite (బ్రహ్మం) cannot be contained with the finite(బుద్ధి).

  నేను ఈ వాక్యం ఉపయోగించినా కూడా, ఆయన ఏ సందర్భంలో చెప్పారో గుర్తుంచుకోలేదు. అయితే ఆయన refer చేసినది భౌతిక జగత్తుకు సంబంధించి కాక, పూర్ణం/శూన్యం అయిన బ్రహ్మాన్ని అని భావిస్తున్నాను.

  ఇకపోతే రెండు పద్ధతుల గురించి బాగా చెప్పారు. మొదటి పద్ధతి బౌద్ధ చింతనకు దగ్గరగా ఉంటుంది. బహుశా అందుకనేమో హిందువులను ఆకట్టుకోలేకపోయిందని అని నా అనుకోలు.

  ReplyDelete
 8. @సనత్ శ్రీపతి గారు, @యోగి, etc : వీలయితే జిడ్డు కృష్ణమూర్తి పీడీఎఫ్ ను కాస్త శ్రద్ధగా చదవగలరు. (బోరు కొట్టినా కూడా. నా వద్ద ఇదే చర్చ, ఆడియో ఉన్నది, అందుకని కాస్త బోరు కొట్టలేదు)

  ReplyDelete
 9. ఊఁ...ఈ చర్చ తెగేది కాదని తెలుసుకాని మనసులో ఆలోచనలు ఎన్ని మార్లైనా అలా బయటపెట్టాలన్న ఒకానొక దుగ్ధ మళ్ళీ యీ వ్యాఖ్యని రాయిస్తోంది :-)

  మీరు ముందు వ్యాఖ్యలో రాసినట్లు పరమ సత్యం/బ్రహ్మం - యీ పదాల interpretationలో ఉన్న తేడాలే యీ చర్చకి కారణం అనుకుంటాను. GK నాకు ఎప్పుడూ అర్థం కారు, మీరిచ్చిన లంకె దానికి విరుద్ధం కాదు (ఒక రెండుసార్లు పూర్తిగా చదివే చెపుతున్నానీ మాట). కాబట్టి దాని గురించి నేనేమీ చెప్పలేను. కాని మీరూ, యోగి, సనత్ గార్లు ఇచ్చిన ఉదాహరణల గురించి మాత్రం నా ఆలోచనలు ఇవి:

  బుద్ధుడు తన దుఃఖానికి కారణం కోసం చేసిన అన్వేషణ తర్వాత అతనికి "సత్య"దర్శనం అయ్యింది. అతని దుఃఖం పటాపంచలైపోయింది. అంతవరకూ బాగుంది. కానీ తనేదైతే దుఃఖ కారణమని కనుగొన్నాడో "అందరి" దుఃఖానికీ అదే కారణమని ఎలా చెప్పగలం? అతనికైన "సత్య" దర్శనం పరమ సత్యమని ఎలా చెప్పగలం? అతనలా అనుకున్నాడా? అనుకుంటే ఎందువల్ల?

  ఇక - doing sex, మామిడిపండు పెరుగన్నంలో కలుపుకు తిన్న రుచి, భక్తి తన్మయత్వం - వీటి గురించి. ఇవన్నీ వ్యక్తిగతమైన అనుభూతులు. ఒకరి అనుభూతి మరొకరు పొందడం (ఇంచుమించు?) అసాధ్యం. ఆ మాటకొస్తే దోమ కుట్టినప్పుడు కలిగే నొప్పికూడా అంతే! (ప్రస్తుతం నేననుభవిస్తున్న ఆ అనుభూతి మాటలకందనిది :-)

  అయితే వీటన్నిటినీ నరాల ద్వారా మెదడులోని nuerons స్పందనలుగా అర్థం చేసుకొనే ప్రయత్నం సైన్సులో జరుగుతోంది, నాకు తెలిసి విజయవంతంగానే జరుగుతోంది.
  మీరు మాట్లాడుతున్న పరమ సత్యం కూడా ఇలాటిదేనా? అలాటిదే అని నాకు నమ్మ బుద్ధి కావడం లేదు.
  నేను అడుగుతున్నది మోక్షం గురించి కాదు, దుఃఖ హేతువు గురించి కాదు, నిర్వాణం గురించి కాదు, enternal joy or eternal beauty గురించి కాదు, bliss/ఆనందం గురించి కాదు, నేనడుగుతున్నది "తత్త్వమసి"లోని "తత్" గురించి. అందరికీ ఒకటే అయిన "సత్" గురించి. దానికి పైనున్న "పర బ్రహ్మం" గురించి. నేనడుగుతున్నది "అనుభూతి" గురించి కాదు, "జ్ఞానం" గురించి.

  ReplyDelete
 10. ఏదైతే మీరు వివరించ గల్గుతున్నారో అది బ్రహ్మం కాదు. ఎందుకంటే మీ వివరణ మీ బుద్ధి మీద, మీ మనస్సు మీద అనే లిమిటెడ్ ఫాకల్టీస్ మీద ఆధారితం కనక. 'నేను బ్రహ్మాన్ని చూసాను/తెలుసుకొన్నానూ' అని చెప్పినవాడు నిజంగా తెల్సుకోలేదనే అర్ధం. బ్రహ్మాన్ని తెల్సుకున్నవాడు బ్రహ్మమే ఔతాడు అని శాస్త్రం. పంచదార తన తీపిని తాను తెల్సుకోగలదా? బ్రహ్మం ఈజ్ బికమింగ్. టు నో దట్ ఈజ్ టు బికం 'దట్.'

  ఎందుకంటే భగవంతుడు అవ్యక్తుడు. ఏదైతే మనం వ్యక్త పరుస్తున్నామో అది ఆయన కాదు. అందుకే జ్ఞాన యోగులు 'నేతి, నేతి అని సాధన చేస్తారు(ట). సరే తెల్సుకున్నామనుకోండి అప్పుడెలా ఉంటుంది? రమణ మహర్షి చెప్పినట్టుగా కొత్తగా వచ్చేది ఏమీ లేదు, పోయేదీ లేదు. 'వార్నీ, ఇదే కదా, ఇంతకాలం నేను బ్రహ్మాన్నే అన్నమాట. ఇప్పటి వరకూ మిగతావన్నింట్నీ పట్టుకుని వేలాడుతున్నాను. ఇప్పుడు తెల్సి వచ్చింది. అహం బ్రహ్మాస్మి. ప్రజ్ఞానం బ్రహ్మ. ఏది తెల్సుకుంటే అన్నీ తెల్సినట్టు అవుతోందో అది నేను తెల్సుకున్నాను. నేను బ్రహ్మాన్నే కాని నీకు అది ఎలా ఉంటుందో చెప్పలేను ఎందుకంటే తీపి అనేది ఎరగని వాడికి పంచదార ఎలా ఉంటుందో చెప్పడం ఎలాగా? అంచేత నేను చెయ్యకల్గింది ఏమిటంటే, మీకు దారి చూపిస్తా పోయి పంచదార నోట్లో వేసుకోండి. కానీ ఇదంత సులభం కాదు ఎందుకంటే ఎంతో కష్టపడాలి. జీవితం కావాలంటే మ్రుత్యువుని విడనాడాలి (వివేకానంద). ఆత్మార్ధే పౄథ్వీం త్యజేత్! అయితే అంత కష్టపడినా ఈ జన్మలో ఫలితం గారంటీ లేదు. అచంచలమైన విశ్వాసం ఉండాలి. రెండో దారిలో విషయాలన్నీ ఈజీగా దొరికేవే - డబ్బూ, అధికారం, మొదలైనవి. ఇవి పొందడం సులభం, వదిలించుకోవడం కష్టం.
  -------
  To kameswara Rao garu. You can talk endlessly about sciece and linking it to the neurons etc but it will never lead anywhere about the experience of becoming one with Brahman. BTW Buddha said he found the way that 'ceases ALL the unhappiness' not just his own unhappiness. By knowing what you can eradicate ALL the unhappiness, that is Brahman/nirvAna. Also BTW the unhappiness is NOT in this world. It is within one's own personality. He stated the path that would eradicate ALL the unhappiness of ALL people but the process is difficult. He never said AFAIK, - to do this or do that. What all he said was this is my path. Practice it and see if it helps you. If it does, take it otherwise throw it away like the goldsmith tests the gold with his fire/tools. Sorry nothing to make you feel bad but just before posting the telugu text I read your comment and typing it in English than to go back to Lekhini and type all this again ;-)

  ReplyDelete
 11. "కానీ తనేదైతే దుఃఖ కారణమని కనుగొన్నాడో "అందరి" దుఃఖానికీ అదే కారణమని ఎలా చెప్పగలం? "

  పైన అనానిమస్ గారు చక్కగా వివరించారు. నా ఆలోచనలు జోడిస్తున్నాను.

  - ఒకరికి ఉద్యోగం దొరకలేదని చింత (దుఃఖం) ఉంటుంది.
  - మరొకరికి మంచి జీతం లేదని.
  - మరింకొకరికి, రెండూ ఉన్నా, ఇంకా ఏదో కావాలి.
  - అన్నీ ఉన్న వాడికి ఇంకా వస్తూనే ఉండాలి.

  ఇలా దుఃఖానికి (భౌతిక) కారణాలు వేరు వేరు కావచ్చేమో కానీ, దుఃఖం అన్నది ఉన్నది.

  ఫలానా వస్తువు దొరకలేదనో, ఫలానా కోరిక నెరవేరలేదనో కలిగే దుఃఖం - నామవాచకం - noun - భౌతికమైన వస్తుజనితం. ఆ భౌతిక వస్తువు దొరికితే, దుఃఖం తాత్కాలికంగా ఉపశమించవచ్చు.

  దుఃఖం - శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా
  జన్మ దుఃఖం, జరా దుఃఖం... అంటే, జీవితం (life - as a noun - అంటే ఫలానా అని కాక - life - as a verb - the pulsating energy pervades the universe) లో అంతర్లీనంగా (as an invisible thread) ఓ దుఃఖం ఉన్నది.

  (నిజంగానే ఉందా? ఇది నిజమైన శోధన. ఉంది - సమాధానం వెతుకుతాను - అంటే అది శోధన అవదు, వెతకటం అవుతుందేమో)

  ఈ రెండవ దుఃఖానికి కారణం జీవులందరిలోనూ, ఒక్కటే. తన - పర అన్న భేదం ఉండదు.

  "అతనికైన "సత్య" దర్శనం పరమ సత్యమని ఎలా చెప్పగలం? అతనలా అనుకున్నాడా? అనుకుంటే ఎందువల్ల?"

  - అవును "మనం" చెప్పలేము. తను "అనుకున్నా", ఇతరులకు ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే అది పూర్తీగా వ్యక్తిగతం. అంటే సత్యం అన్నది ఖచ్చితంగా వ్యక్తిగతంగా శోధించి తెలుసుకోవలసిందే కాని, ఒకరు చెబితే "ఓహో అలానా" అని నిర్ణయించేది కాదు.

  - బుద్ధుడు నిర్వాణం పొందిన తర్వాత ఓ వారం రోజులు మౌనంగా ఉన్నాడట. అసలు సత్యం కనుగొన్నానని తను చెప్పవచ్చా? నిజంగా కనుగొన్నాడా?

  సరే - సత్యం ఉందంటే, అది వ్యక్తిగతం. ఎవరికి వారు సాధించి, శోధించాలి. ఆసక్తి ఉన్నవారు ఎలానూ ఆ పని చేయగలరు. ఆసక్తి లేని వాడికి చెప్పడం వృథా. అందుకని ఎవరికని బోధించాలి? ఏమని బోధించాలి? ఈ రకమైన అంతర్మథనంతో కొన్ని రోజులు మౌనం వహించాడని ఒక కథనం. చివరికి ఓ రోజు - ఇలా అనుకొన్నాడట. కొంత మంది - అటు పూర్తీగా ఆసక్తి చూపక, అలాగని అనురక్తి చంపుకోలేక మధ్యలో కొట్టుమిట్టాడుతుంటారు. వారిని కేవలం "ప్రేరేపించడానికి" తను ధర్మం ఉపదేశించాడట. (అనానిమస్ గారి వ్యాఖ్య మళ్ళీ చదవాలి ఇక్కడ)

  ReplyDelete
 12. @కామేశ్వర్రావు గారు : ఇంకో విషయం ఏమిటంటే, వాళ్ళు చెప్పే ప్రకారం "Truth is not a fixed point".

  దీనికి ఒక అనాలజీ టైం.

  - భూతకాలం అంటే - గడిచినది. అది definite.
  - భవిష్యత్ కాలం అంటే - తెలియనిది. అది indefinite.
  - వర్తమానం - తదేజతి, తన్నైజతి ...అని ఉపనిషత్తుల్లో చెప్పినట్టు, ఇది ఉందా అంటే లేదు. లేదా అంటే ఉన్నది. వర్తమానం అన్నది fixed కాదు. ఒక ప్రవాహం. సత్యం కూడా అలాంటిదేనని ఒక అనాలజీ.

  హెరాక్లిటస్ దీన్నే నదికి అన్వయిస్తాడు. - "You cannot step in to a same river twice" అని. రెండవసారి మునిగినప్పుడు ఇంతకు ముందున్న నీరు లేదు. అది వెళ్ళిపోయింది కాబట్టి.

  ReplyDelete
 13. మామిడి పండు గురించి నేను ఇచ్చిన ఉదాహరణని పెద్దలు తప్పుగా అర్ధం చేసుకున్నట్టు ఉన్నారు. ఒకరికి కలిగిన దర్శనం/ అనుభూతి/ జ్ఞానం to start with అనిర్వచనీయం. ఒకవేళ నిర్వచించినా, ఇంకొకడికి అందిస్తే అందేది కాదు. ఒకవేళ అదే నిజమైతే శంకర భాష్యం చదువుకున్న వాళ్ళందరూ శంకరులంతటివారైపోవాలి కదా. రవిగారు అడిగిన ప్రశ్నకి సమాధానం సాధ్యం కాదు అని చెప్పటానికి ఎంచుకున్న ఉదాహరణ మాత్రమే. అంతమాత్రం చేత మామిడి పండు అనుభూతీ "పరమసత్యాన్ని" గ్రహించిన అనుభూతి ఒకటే అని నా ఉద్దేశం కాదు.

  (1) రవిగారి టపాలోనూ, కామేశ్వరరావుగారి వ్యాఖ్య లోనూ ఒక పాయింటు ఇప్పుడే గమనించా.

  @రవి -- అన్ని సౌకర్యాలు ఉన్న తనకు కూడా ఏదో తెలియని దుఃఖం ఉన్నది
  @కామేశ్వరరావు గారు: --బుద్ధుడు తన దుఃఖానికి కారణం కోసం చేసిన అన్వేషణ తర్వాత అతనికి "సత్య"దర్శనం అయ్యింది.

  బుద్ధుడికి ఉన్నది దుఃఖమా లేక అసంతృప్తి/ అశాంతి/ వ్యాకులతా? (ఇవన్నీ పర్యాయపదాల్లాగా భావించటం లేదు కదా?)

  నేనెరిగినంత వరకూ బుద్ధుడికి దుఃఖం లేదు. బుద్ధుడు తాను చూసిన సంఘటనలతో వ్యాకులత చెందాడు. అప్పటి దాకా తానెరిగిన ప్రపంచం వేరు, ఇప్పుడు తాను చూస్తున్నది వేరు. ముసలితనం, మరణంవంటివి జీవితం లో మొదటిసారి తెలిసినప్పుడు కలిగే శూన్యతే బుద్ధుడికీ కలిగింది. ఇది నిజమా? ఇదే నిజమైతే ఇన్నాళ్ళూ నేను నిజమని భావిస్తున్నదేమిటి? ముసలితనం వచ్చిన వాళ్ళు దేనినిగురించి వ్యధ చెందుతున్నారు/ దుఃఖపడుతున్నారు? ఒకరింట మరణం సంభవించినప్పుడు వాళ్ళు దేనినిగురించి వ్యధ చెందుతున్నారు? అసలు దుఃఖమంటే ఏమిటి? దుఃఖానికి కారణం ఏమిటి? దేనివల్ల దుఃఖం కలగకుండా ఉంటుంది, సుఖమంటే ఏమిటి అని అన్వేషణ చేసుకుంటే "సత్య" దర్శనం అయ్యింది.

  -- కానీ తనేదైతే దుఃఖ కారణమని కనుగొన్నాడో "అందరి" దుఃఖానికీ అదే కారణమని ఎలా చెప్పగలం?

  సుఖ దుఃఖాలన్నవి మనస్సుతో ఉన్న సంగంవల్ల నిర్వచించబడుతున్నాయే కానీ దానికతీతంగా ఉద్ధరింపబడ్డవాడికి నిజానికి సుఖమూ, దుఃఖమూ రెండూ ఉండవు అని "సత్య" దర్శనం అయ్యింది. ఏ దుఃఖమైనా పైన కనిపించే వస్తు కారణం ఒకటైతే, దాని వెనుక ఉండే మూల కారణం మాత్రం ఒకటే ఉంటుంది. శోధన చేస్తూ చేస్తూ ఇక అంతకన్నా మూల కారణం వెతకటానికి ఏమీ లేదు అన్న స్థితికి నిజంగా చేరుకుని, అన్ని దుఃఖాలకీ హేతువు 'ఇది ' అని నిర్వచించగలిగినప్పుడు (ఈ విషయం లో బుధ్ధుడి "సత్య దర్శనం ") తనేదైతే దుఃఖ కారణమని కనుగొన్నాడో "అందరి" దుఃఖానికీ అదే కారణమని అని నిర్మొహమాటంగా 'అతడు' చెప్పవచ్చు. అది 'సత్యం ' కనుక ఒకరికి సత్యం గానూ, వేరొకరికి సత్యం కాకుండానూ అయ్యే అవకాశం లేదు.


  (2) ఇక సైన్సు అంటారా? మానసిక ధర్మ శాస్త్రాన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా పరిశోధనాంశంగా కొన్ని దశాబ్దాలుగా చదువుకుంటూ, విద్య గరుపుతున్నరే కానీ, మనిషిని నిలువునా కోసినా ఆ మనస్సు అన్నది ఎక్కడ ఉందో ఇప్పటికీ గమనించలేని అశక్తత ప్రస్తుతం ఉన్న సైన్సుది. కనుక మనస్సు ఉన్నట్టా లేనట్టా? నరాల ద్వారా మెదడులోని nuerons స్పందనలుగా అర్థం చేసుకొనే ప్రయత్నంలో సఫలమైన ఆ స్పందనలు అలానే ఎందుకొస్తున్నయి. రాకుండా ఉండాలంటే ఏం కావాలి అన్న ప్రశ్నలకి సమాధానం సైన్సుకి అంత సులభం కాదని నాభావన. న్యూటను వంటి శాస్త్రజ్ఞులు కనుగొని నిర్వచించినది ప్రామాణికంగా, సోదహరణంగా, సశాస్త్రీయంగా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే అవన్నీ పరిమితమైన జ్ఞానానికి సంబంధించినవి కాబట్టి. అపరిమితమైన దాన్ని నిర్వచించేప్పుడు వాళ్ళు కూడా శాస్త్రానికి, లాజిక్ కీ అతీతంగానే సత్యాన్ని ప్రతిపాదించి దాని ప్రాతిపదికన మిగిలిన వాటిని నిర్ధారిస్తూ వచ్చారు. for eg. Infinity అంటే ఏమిటి? Bigbang ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? etc. ప్రశ్నలకి సమాధానం ఇంకా తెలియదు కదా.. కాకపోతే ప్రతిపాదన మాత్రం చేశారు.

  (3) చివరిగా 'సత్ ' గురించి

  సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే|
  ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే|| 17-26 ||

  పరమసత్యానికీ, మంచితనానికి సూచనగా "సత్"అనే పదాన్ని ప్రయోగిస్తారు. అర్జునా! మంచి కర్మలకు కూడా"సత్"అనే పదం ప్రయోగిప పడుతుంది.

  యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే|
  కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే|| 17-27 ||

  యజ్ఞ దాన తపస్సులలో నిలిచి ఉండడం"సత్"అని చెప్పబడుతుంది. దాని కోసం చేసే కర్మని కూడా "సత్"అనే అంటారు.

  ఇది దర్శనం అయ్యింది కనుకనే బోధిసత్వుడు కరుణామయుడయ్యాడు. యజ్ఞాల పేరు మీద జరిగే తంతుని కాదని భూతదయ, దానాన్ని నేర్పటానికి భిక్షాటన చేశాడు. దేవుడంటే ఎవరో ఉన్నారనుకుంటూ, చేయాల్సింది మానేసి, సాటి జీవులకి సహాయపడడం మానేసి ముక్కుమూసుకుని తపస్సులు చేయటం కాదని, తనను తాను తెలుసుకోవటానికి చేసే సాధనే నిజమైన తపస్సు అని చెప్పాడు. అన్ని ప్రాణులనీ సమభావంతో ఆదరించాడు.

  ReplyDelete
 14. I don't think I am eligible enough to comment on any of this but all I can say is I am reading each and every alphabet of it and enjoying it. Thanks for starting such a great topic.

  ReplyDelete
 15. good discussion keep going like this.......................

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.