Friday, August 21, 2009

నూరు టపాల సింగారం

ఎట్టకేలకు....నేనూ హండ్రెడ్ షాట్ వాలా సరం పేల్చాను.

రెండేళ్ళు కావస్తూంది, బ్లాగ్లోకంలో అడుగుపెట్టి. నేను బ్లాగు మొదలెట్టిన విధంబెట్టిదనిన .......... మామూలే. ఆదివారం ఈనాడు అనుబంధం చదివి. చదవగానే బాడీ లో మూవ్ మెంట్స్ వచ్చాయి. ఆవేశం తన్నుకొచ్చింది, అదీ కాక ఆ వ్యాసంలో డాక్టర్ ఇస్మాయిల్ గారని మా సీమ డాక్టర్ బ్లాగు గురించి రాశారు! తట్టుకోలేక జూనియర్ ఎన్ టీ ఆర్ "ఆది" సినిమాలో లాగా, "ఎన్నాళ్ళిలాగ", "ఎన్నాళ్ళిలాగ" అని మనసు ఆక్రోశించింది. జనాలు నా రాతలు మిస్ అవుతున్నారు కదా అన్న భావన కుదిపేసింది. (అక్కడికి నా సోది వినడానికిక్కడ అందరూ కాసుక్కూర్చున్నట్టు) ఏదో చేసెయ్యాలి అని ఊగిపోయాను. ఆఫీసుకెళ్ళి చూస్తే అక్కడ బ్లాగర్.కాం వంటి తుచ్చమైన వాటికి పర్మిషన్ లేదు!

ఆ తర్వాత 2007 ఆగస్ట్ లో ఆన్ సైట్ తగిలింది. వాడుకోడానికి లాప్ టాప్ ఇచ్చారు ఆఫీసుగాళ్ళు. రూమ్ లో ఇంటర్నెట్ ధారలై ప్రవహిస్తూంది. అంత ఇంటర్నెట్ తేరగా దొరికే సరికి ఓ రెండు రోజులు అందరు మగాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ తేరగా దొరికితే ఏం చేస్తారో ఆ పనులు చేసి, విసుగెత్తి, బ్లాగుల గురించి చూశాను. త్రివిక్రం గారి బ్లాగు మొట్టమొదట తగిలింది. ఆ తర్వాత రాధిక గారి స్నేహమా బ్లాగు. అంతకు ముందు ఇస్మాయిల్ గారి గురించి విన్నారుగా. ఇదిగోండి, ఈ ముగ్గురే నేను బ్లాగడానికి మూలకారణమైన త్రిమూర్తులు. రానారె, ప్రవీణు, కొ.పా గారు, తదితరులు మొదట్లో రాసిన సోదంతా చదివి ప్రోత్సహించారు. మేధ (నాలో నేను) కూడా ఇంచుమించు అదే టైం లోనే బ్లాగులు మొదలెట్టారనుకుంటా. కాబట్టి ఆమె ఏమి రాస్తున్నారో చూసేవాణ్ణి రెగ్యులర్ గా.

సరే బ్లాగుకు ఏం పేరు పెడదామా అని "నీహారిక" అని డిసైడ్ చేసి, ప్రయత్నిస్తే, ఆ పేరుతో ఎవరో బ్లాగేస్తున్నారు. ఆ తర్వాత "హరివిల్లు", "ఉత్పలమాల" ఇలా ప్రయత్నించి, అవేవి కుదరక, చివరికి మాస్ టైటిల్ ప్రయత్నిస్తే, గూగులమ్మ ఓకే అంది. అదీ టైటిలు కథ.


రాద్దామనుకున్నది పేరడీలు. సినిమా రివ్యూలు. (నాకు కూసింత అనుభవం ఉండేది వాటిలో. మా మిత్రుల వెబ్ సైట్లు బలయ్యాయి నా రాతలకు) ఇప్పుడు రాసేవి చూస్తే, మళయాళం క్లాసిక్ సినిమా కథలా నా రాతలు నాకే అర్థమయి చావడం లేదు.

చాలా రోజులు ఆఫీసులో ఆఫీసుటైం లో బ్లాగిన తర్వాత (ప్రాక్సీ కనుక్కుని, దాని ద్వారా లాగిన్ అయి), మొన్నామధ్య మార్గదర్శిలో చేరకుండానే ఓ లాప్ టాప్ కొనుక్కున్నాను. అదీ నా సెల్ఫ్ డబ్బా.

వెనక్కి తిరిగి చూసుకుంటే -


ఈ రెండేళ్ళలో, కొన్ని నవ్వులు, కొన్ని చమక్కులు, ఇంకొన్ని చురుక్కులు, కొంచెం అమాయకత్వం, కొంచెం ఆస్తికత, కొంచెం తిరగబడ్డ ఆస్తికత్వం, అస్తవ్యస్తమైన ఆలోచనలు, కుదురుగా ఉండలేని తలబిరుసుతనం,
జ్ఞాపకాల అల్మారాలో వెలికితీతలు, హృదయమనే భూగర్భంలో నుంచి తవ్వుకున్న అనుభూతుల జలాలు,

"పుస్తకం" లో వెలగబెట్టిన కబుర్లూ..

అబ్బో.... నా రేంజుకంటే చాలా ఎక్కువే వెలగబెట్టాను!!

నిజానికి నా రాతల్లో చాలా తప్పులు నాకే కనిపిస్తాయి. అవి అలా ఉంటేనే బావుంటుందని నా అవుడియా.


నన్ను అనవసరంగా రాతగాణ్ణి చేసి, నా సోది ఓపికగా విన్న వారికి, వింటున్న వారికి, ప్రోత్సహించిన, ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు (బిల్ కుల్ ముఫ్త్). వీవెన్ గారికి కృతజ్ఞతలు. ఈ రెండేళ్ళలో రెండు సార్లు మాత్రం, ఎందుకొచ్చిన సోది, మానేద్దామనుకున్నాను. తిరిగే కాళ్ళు, తిట్టే నోరు ఊరుకోవు అని సింద్ బాద్ చెప్పినట్టు,మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతున్నాను. బ్లాగులు అన్నవి తెలియక ముందు, రాయలసీమ వాణ్ణి అని చెప్పుకోవాలంటే - ఓ గోళీలాట ఆటగాడు, క్యారమ్స్, బిలియర్డ్స్ ఆటగాళ్ళ ముందు నిలబడితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయే వాణ్ణి. ఇప్పుడు షర్ట్ కున్న ఓ బటన్ విప్పేసి చెప్పుకుంటున్నాను, నేనో సీమ బ్లాగరిని (రచయితను కాకపోయినా) అని.

అన్నట్టు నా సోది రాతల వల్ల కొందరు సహృదయులను కలిసే అవకాశం దొరికింది. ఇది నా అదృష్టం. ఇంకా బ్లాగర్లు సాధ్యమైనంత మందిని కలవాలని ఉంది. చూడాలి.


(టపాలో వాడుకున్న ఫోటోలకు మోడల్ - సంహిత అనే దుండగురాలు

వయసు - సరిగ్గా యేడాది.

చేసే పనులు - బొమ్మల తలలు, కాళ్ళు విరగ్గొట్టటం,
ఈనాడు పేపర్ రాగానే చింపెయ్యటం,
కొత్త గౌను మీద నీళ్ళు పోసుకోవటం,
మట్టి, చెప్పులు, పరక, ఇలాంటి వాటితో ఆడుకోవడం,
లాప్ టాప్ మీదెక్కి చిచ్చిపోయటం,
నాన్న సులోచనాలను (కళ్ళజోడు) లాగి విసిరెయ్యటం వగైరా..)

27 comments:

 1. congrats :)

  ee krindi lines samhitha kosam
  great going samhitha! keep it up and continue

  ReplyDelete
 2. congratulations...Good work samhita.

  ReplyDelete
 3. అభినందనలు రవి గారూ! మీ నూరు వెయ్యిగావలెనని ఆకాంక్షిస్తున్నాను. మీ దుండగీడు మాడల్ చాలా బాగుంది :-) (లాప్ టాప్ మీద చిందులా! రీప్లేస్ మెంట్ కోసం మీరు మార్గదర్శిలో చేరాల్సివచ్చేటట్లుంది:))

  ReplyDelete
 4. మీ దుండగురాలికి మా ఆశీస్సులు. మాకో దుండగురాలు ఉంది ఇంట్లో!!

  నూరు ఇంకో నూరు ఇంటూ ఇంకో నూరు కావాలని ఆకాంక్షిస్తా

  ReplyDelete
 5. రవి, బ్లాగుని ఇంత చక్కగా అప్రతిహతంగా నడుపుతున్నందుకు అభినందనలు.
  మీ దుండగురాలు మాత్రం భలే క్యూటు :-)

  ReplyDelete
 6. మనసారా అబిన౦దనలు.....ఇ౦క మీ పోస్ట్ అదిరి౦ది.మీ మోడల్ అదిరి౦ది....చిచ్చు పోసి మీమ్మల్ని ఇ౦కా బాగా ఎ౦కరేజ్ చేయలని తనని ఆశిర్వదిస్తున్నా....

  ReplyDelete
 7. మీ పోస్టులు అంత చక్కగా టైప్ చేసిపెట్టేదెవరో మొదటి ఫోటో చూశాక తెలిసింది ....

  ReplyDelete
 8. వికటకవిSat Aug 22, 01:40:00 AM

  అప్పుడే సెంచరీయా....అభినందనలు.

  ReplyDelete
 9. ముందుగా శతకానికి అభినందనలు.ఇంతకూ మా ఊరి గుండమ్మ ఎక్కి కూర్చున్న లాపీ ఆఫీసుదా!లేక మార్గదర్శిలో చేరకుండానే కొనుక్కున్నదా!

  ReplyDelete
 10. congratulations...

  too slow...happy anniversary too..

  samhita keep going baby..

  ReplyDelete
 11. శతటపోత్సవ అభినందనలు.

  ReplyDelete
 12. రవిగారూ, శతటపా ఉత్సవ అభినందనలు. మీరు వాడే వ్యంగ్యం.... అపురూపమైనది. మనసారా నవ్వుకునే వీలేముందు చెప్పండి ఈ కాలంలో... సరిగా ఈ కొరతను తీర్చే మీ బ్లాగు రాతలు, మరోవైపు ఆలోచనలను కూడా రెచ్చగొడతాయి. రెగ్యులర్ గా చూడాల్సిన బ్లాగుల్లో మీదొకటి. మీవి వంద పూర్తవడానికి రెండేళ్లు పట్టింది. కానీ వెయ్యి పూర్తవడానికి మాత్రం నాలుగేళ్లే పట్టాలని కోరుకుంటున్నాను. మీ గారాలపట్టికి అభినందనలతో...

  ReplyDelete
 13. రూమ్ లో ఇంటర్నెట్ ధారలై ప్రవహిస్తూంది! :D

  నేనూ అలానే మొదలు పెట్టాను. మీ దుండగురాలి లాప్టాప్ మీదెక్కి కూచున్న ఫోటో చాలా బావుంది. మీ పాపనా ?

  అన్ని ఫోటోలూ సందర్భోచితంగా ఉన్నాయి. మీరు ఇలానే బోల్డు టపాలు నరికేయాలని (సీమ లెవెల్లో) - బ్లాగాడిస్తూనే ఉండాలని ఆశిస్తాను. మంచి ప్రస్థానం. అభినందనలు.

  ReplyDelete
 14. అభినందనలు, బ్లాగాడించండి బాగా.

  ReplyDelete
 15. రవిగారూ, శతకం పూర్తి చేసినందుకు అభినందనలు. మీరింకా చాలా రాయాలని, సీమ సినిమాల్లో సుమోల్లాగా మీ రచనలతో దుమ్ము రేపాలనీ కోరుకుంటున్నాను.

  మీ దుండగీడు లాప్ టాప్ మీద చేస్తున్న విన్యాసాలు చూశాకా - ’స్తుతమతియైన బ్లాగాడిస్తా రవి రచనల కెట్లు కలిగెనో అతులిత మాధురీ మహిమ’, ’హా తెలిసెన్’ అనిపించింది.

  మా అమ్మాయికి మూడో నెల నుంచీ నా పాత లాప్ టాప్ ఒకటి అంకింతం చేశాను. అదీ ఎక్కి తొక్కేది, కానీ ఫొటోలు తియ్యలేదు. మీ ఫొటోలు చూశాకా అయ్యో, నేనూ తీసి ఉండాల్సింది అనిపించింది.

  ReplyDelete
 16. అభినందనలు.
  మీ పాపకు ఆశీస్సులు.
  బొల్లోజు బాబా

  ReplyDelete
 17. మీరాడించే బ్లాగుకీ, మిమ్మల్ని ఆడించే మీ బుడిగికి నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు!

  ReplyDelete
 18. అందరికీ ధన్యవాదాలు.

  @విజయమోహన్ గారు : అది నా సొంత లాపీ నే. త్వరలో మార్గదర్శి యోగం తప్పేట్లు లేదు, చంద్రమోహన్ గారన్నట్లు.

  ReplyDelete
 19. రవి గారూ!

  "శతమానం భవతి.." మీ నూరు టపాలనూ మీ అమ్మయి చిందుల తో మేళవించి నెమరు వేసుకోవటం భేషుగ్గా ఉంది.

  ReplyDelete
 20. @sujata గారు : ఆ దుండగురాలు మా అమ్మాయే.
  @నాగ మురళి గారు : లాప్ టాప్ ఫోటోలు మీరు తీసి ఉండాలి. ఇకపై అలాంటివి మిస్ అవకండి.

  ReplyDelete
 21. 'శత'కోటి అభినందనలు.. :)
  అవును నేను ఈ సమయంలోనే బ్లాగడం మొదలెట్టా..
  ఏంటి అప్పుడే పుల్లంపేట జరీచీర చదివేస్తోందా సంహిత హాశ్చర్యం!!!

  >>పేరడీలు. సినిమా రివ్యూలు
  ఇవి అంత ఎక్కువేమీ కనిపించలేదు మీ బ్లాగులో!

  ReplyDelete
 22. అభినందనలు రవి గారు, మీరు త్వరలోనే ౨౦౦ టపాలు పూర్తి చేయాలి అని కోరుకుంటున్నాను. సంహిత ఫోటోలు చాలా బాగున్నాయి తనకు నా ఆశీస్సులు.

  ReplyDelete
 23. గుండు బుజ్జాయి భలే ముద్దుగా ఉంది.

  మీ బ్లాగూ అంత ముచ్చటగానూ ఉంది.
  ఎట్లాగూ ఇంత కష్టపడి మొదలెట్టి, వందదాకా లాక్కొచ్చారు కాబట్టి .. ఇహ ఇలా కంటిన్యూ ఐపోండి. మేమూ చదువుతూ కంటిన్యూ ఐపోతాం.

  ReplyDelete
 24. అభినందనలు మీకు.
  ఆశీస్సులు చిన్నారి సంహితకు.

  ReplyDelete
 25. photos chaala connective ga pettaru..samhita is sooo cute..

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.