Sunday, July 5, 2009

గుసగుస - రుసరుస

ఉదయం 8:30 కావస్తోంది.

"హా...(ఆవులింత) ఈనాడు వచ్చిందా?"

"ఇదిగోండి. ఇప్పటికి తెల్లారిందీ. ఇప్పటికైనా నిద్ర లేచేదుందా? లేదా?"

"పేపర్ చదివీ (పన్లో పనిగా టీవీ చూసి)"

"తిప్పసంద్ర కెళ్ళి కూరగాయలు తీసుకు రావాలి. ఇంట్లో కూరగాయల్లేవు"

"బయట బండ్లో వస్తాయి. లేదంటే సొప్పు (కన్నడంలో ఆక్కూర) గాడొస్తాడు. వాడితో తీసుకో"

"ఏమంత బద్ధకం? ఈ రోజయినా కాస్త మంచి తిండి తిందామని లేదా?"

"సర్లే"

బయటకొచ్చాను. పక్కింటి ముందు మల్లె పూల చెట్టు. దానికి పూచిన మల్లెపూలు నవ్వుతున్నాయ్.

ఆదివారం అనుబంధం లో బాలు కూడా. బాలుడి పుట్టినరోజా? ఏమో?

"ఉప్మా రవ్వ కొంచెమే ఉంది. టిఫిన్ తీసుకు రావాల్సిందే. తప్పదు." ప్రాంప్ట్ గా అనౌన్స్ చేసింది మా ఆవిడ.

అబ్బా..తప్పదా? లేదంటే ఉప్మా చేసేస్తుందని, వీధిలోకి దౌడు తీసాను. టిఫిన్ తిని ఆత్మారాముడు శాంతించాక లాప్ టాప్ తీశాను. నాకిష్టమైన బాలు పాట కనిపించింది. ఇక ఆగలేక ఆ పాట మోగించాను.బాలు గారి "పూలు గుస గుస లాడేనని" నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట కోసం చెవి కోసుకుంటాను నేను.

పాట బాక్ గ్రవుండ్ లో నడుస్తుంటే, తెలుగుపద్యం లో కొ.పా. గారి వ్యాఖ్య కనిపించింది. ఇదేదో బావుందే. నేను పాట పాడతాను. ఆలస్యమెందుకు, ఇదీ నా పాట. (మొదటి చరణం)


poolu.wma

"అస్తమాను ఆ లాప్ టాప్ తప్ప సంసారం అదీ కాబట్టదా?" బాక్ గ్రవుండ్ లో సణుగుడు, ఫోర్ గ్రవుండ్ లో మా ఆవిడ.

ఆవిడ అలా పక్కకెళ్ళిన తర్వాత శ్రోతలు కోరని నా పాట కంటిన్యూ చేశాను. రెండవ చరణం.

poolu1.wma

"ఇంకా బట్టలుతకాలి. సరే స్నానం చేసొస్తాను" వెళ్ళిందామె.

ఆవిడ బయటకొచ్చే లోపు ఆవిడ మీద ఈ (పేరడీ) పాట కట్టేశాను.
aalu.wma

ఉంటానండి. ఆవిడ పాట ఛ, ఛ..., స్నానం ముగించి వచ్చేస్త్తోంది.

ఇవన్నీ ఒకే షాట్ లో ఓకే చేసిన పాటలు. బాలు పుట్టిన రోజుకు చాక్లెట్ గా పనికి రాకపోతే, జాక్సను నివాళి కోసమైనా సరే వాడుకోవచ్చు.

13 comments:

 1. బాలుడి స్థాయికి పనికిరాకపోయినా 'కనీసం' జాక్సనుడికైనా పనికొస్తుందనడంలో.. :)

  పేరడీ బాగుంది. మీరాపాట పనిచేస్తూ పాడినట్టుంది! :)

  ReplyDelete
 2. హబ్బెబ్బే, మీరు చాలా విషయాలు నేర్చుకోవాలి.
  1. భార్యా రత్నమ్మీద పేరడీలు కడితే కట్టారు గానీ ఇలాంటివి పబ్లిక్లో పెట్టొచ్చా? హన్నా, తప్పుగాదూ? ఎప్పుడన్నా ఆవిడ దయతల్చి శేంక్షన్ చేసిన మందుపార్టీ వేళలో మూడో చెవికి వినబడకుండా ఆప్తమిత్రుల దగ్గరైతే చెప్పుకోవచ్చు కానీ. బయటకి బహిరంగంగా చెప్పే ప్రకటనలన్నీ ఆవిడ రూపాన్నీ, గుణాల్నీ, వంటనీ పొగుడుతూ మాత్రమే చెప్పాలి. మీరు ముందస్తుగా పొద్దులో అప్పుడెప్పుడో పప్పు నాగరాజు గారు రాసిన స్త్రీహృదయోపనిషత్తు భట్టీయం వెయ్యాలి అర్జంటుగా.

  2. అదలాగుండగా, అసలే బ్లాగ్జనుల్ల ప్రస్తుతం మన రాశి బాగా లేదు, ఏదో లోప్రొఫైలు మేంటేన్ చేసి కాలం గడుపుకొస్తున్న నన్ను ఇలా స్టేజెక్కించడం న్యాయమా అధ్యక్షా అని నిలదీసి ప్రశ్నిస్తున్నా. ఇలాగ పురజనుల్ని దారుణకృత్యాలకి ప్రేరేపిస్తున్నాననే కొత్త అభియోగం నామీదకొస్తే???

  :)))
  మీ ధైర్య సాహసాలకి అభినందనలు.
  ఈనాడులో బాలుడి ఫీచరు, బహుశా తానావాళ్ళు లైఫ్ టైం పురస్కారం ఇస్తున్న సందర్భంగా అయి ఉండోచ్చు.

  ReplyDelete
 3. రవిగూడా పాటలు పాడేనని
  మమ్మల్ని అలరించేనని
  ఈనాడె తెలిసిందీ
  వాళ్ళావిడ కూడ
  మా ఆవిడ మాదిరేనని
  ఎప్పుడూ కంప్యూటరేనేనా అని
  సంసారమొద్దా అని అంటుందని
  ఈనాడె తెలిసిందీ...

  ReplyDelete
 4. మధ్య మధ్యలో మీ విచిత్రమై అరుపులు వింటే, మీ పాట(ల)కి మీ ఆవిడగారిచ్చిన రియాక్షను ఏ లెవెల్లో ఉందో తెలిసిపోయింది! :-)

  ReplyDelete
 5. > తిప్పసంద్ర కెళ్ళి కూరగాయలు తీసుకు రావాలి
  అవును బుధవారం,వారాంతంలో తాజా కూరలు దొరుకుతాయి

  ReplyDelete
 6. @చదువరి : సూక్ష్మం గ్రహించారు.

  @కొ.పా గారు : స్త్రీ హృదయ రహస్యోపనిషత్తు గురించి చెప్పి, దాన్ని వెతికి చదివేలా చేశారు. ధన్యవాదాలు. గురువు గారి మాటలు శిరోధార్యమైనా, మూలసూత్రం చెడకుండా, ఒక్కోసారి customize చేయాల్సి వస్తుందండి. మీకు కనీసం శేంక్షన్స్ అన్నా ఉన్నాయి. అవి కూడా లేని మా లాంటి బతుకులు పనులు గడుపుకోవాలంటే, ఒక్కో సారి అగ్నేయాస్త్రాలు అవీ వాడాలి. తప్పదు. "వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి."(కోసేప్పుడు మొదటి వజ్రానికి దెబ్బ తగలకుండా అనుకోండి)

  (పై మాట, మా ఆవిడ నా బ్లాగు చదువుతుంది అన్నంత నిజం)

  2. ఏదో రకంగా తప్పించుకుంటే కుదరదండి. మీరూ జన జీవన స్రవంతిలోకి రావాలి. తప్పదు.

  @విజయమోహన్ గారు :
  ఏ ఇంటి చరిత్ర చూసినా
  ఏమున్నది గర్వకారణం
  భర్తల జాతి సమస్తం
  భార్యా పీడన పరాయణత్వం

  @కామేష్ గారు : అవి బాధతో అరిచిన అరుపుల్లా ఉన్నాయా? ఉత్సాహపూరితమైన కేకల్లా లేవా? ఏమో?

  @పానిపూరి గారు:దొరుకుతాయి. తీసుకురావడమే బోర్.

  ReplyDelete
 7. మీరుండేది తిప్పసంద్రలోనా..?!

  ReplyDelete
 8. @మేధ : తిప్పసంద్ర దాటి, BEML హాస్పిటల్ దగ్గర. జగదీష్ నగర.

  ReplyDelete
 9. హన్నా!!! ఆదివారం వెళ్లి కూరగాయలు తెమ్మంటే మీఆవిడ మీద పేరడి కడతావా రవి?? తను నీ బ్లాగు చూడదనే ధైర్యమా?? ఉండు నీకు రోజు ఉప్మా చేసిపెట్టమంటా? నేనే ఐదు కిలోల ఉప్మారవ్వ పంపిస్తాను.. లేకపోతే పెళ్లాం మీద పేరడి రాసి, అదో ఘనకార్యంలా బ్లాగులో పెట్టి తుత్తిపడదామనే...

  ReplyDelete
 10. @జ్యోతక్కా: ఒక్క పేరడీ కి అంత ఖటిన శిక్షా? చివరకు పేరడీలు రాసుకునే సౌభాగ్యం కూడా మొగుళ్ళకు లేదా?

  ReplyDelete
 11. హ హ పేరడీ బాగుంది మాష్టారు :-) ఈనాడు లో బాలు గారి గురించి నేనూ చదివాను, బాగా రాసారు రాగం తానం పల్లవి బాలు అని.
  I miss that తిప్పసంద్ర మార్కెట్ వచ్చే వారాంతం లో ఓ ట్రిప్ వేయాలి ఇంతకు ముందు ఆ మార్కెట్ వెనకే ఉండేవాడ్ని.

  ReplyDelete
 12. రవి గారూ! పేరడీ చేస్తే చేశారు గానీ, ఇలా అంతర్జాలపరం చేస్తారా మరీనూ!

  అన్నట్టు.. మీరు కొత్త లాప్ టాప్ ఎప్పుడు కొంటారని అడగాలనిపిస్తోంది. :-)

  ReplyDelete
 13. తిప్పసంద్ర కెళ్ళి కూరగాయలు తీసుకు రావాలి

  idi super andi endukante maa nanna eppudu ide maata antu untaadu. b'lore voste maa nanna nannu tesukoni vella manedi ikkadike! adi maaku chaala daggara.

  chaala thanks malli mee blog lo aa word choosanu and ippudu maa nanna ki phone cheyali.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.