Tuesday, June 30, 2009

సంస్కృత చిత్రకవితలు!ముగ్గులా? గణిత సూత్రాలా? ఏవైనా దేవతను ఆవహన చేయడానికి ఉద్దేశించబడ్డ మంత్రాలా?

ఉహూ. ఇవేవి కావు. ఇవి చిత్ర కవితలట. అక్కడికెళ్ళి చూస్తే చాలు, ఆ కథా కమామీషు ఏమిటో అర్థమవుతుంది. ఇటువంటివి తెలుగులో కూడా ఎవరైనా వ్రాస్తే బావుణ్ణు. ఉదాహరణకు ఈ గదాబంధం చూడండి. పైనుండీ క్రింది వరకు వచ్చి, తర్వాత కిందనుండీ చదువుకుంటూ పైకెళ్ళాలి. ఈ పద్యాలు చాలా గహనంగా ఉన్నాయి. వీటికి అర్థం ఎవరైనా సంస్కృత పండితులే చెప్పాలి.

11 comments:

 1. helo
  i am blogger indonesia klik here to my blog

  ReplyDelete
 2. > ఇటువంటివి తెలుగులో కూడా ఎవరైనా వ్రాస్తే బావుణ్ణు.

  రవి-గారు, పై వాక్యం చదివి చాలా ఆశ్చర్యపోయాను (మీ బ్లాగు చదివి ఇలా ఆశ్చర్యపోవడం మొదటి సారి కాదనుకోండి!). తెలుగులో చాలా విస్తృతంగా చిత్రకవిత్వమూ వుంది, దానిపైన మంచి విశ్లేషణలు, (కొద్దో గొప్పో పనికొచ్చే) Ph.D. theses వున్నాయి. మీరు బ్లాగులే కాకుండా తెలుగులో కాస్తో కూస్తో సాహిత్యపరమైన చర్చలు జరిగే forums చూస్తుంటే Dr. జెజ్జాల కృష్ణమోహనరావుగారి పేరు తెలిసి వుండేది. ఆయన చాలా వివరంగా, విస్తృతంగా చిత్రకవిత్వంపైన రాసారు/రాస్తారు.

  సంస్కృతంలో చిత్రకవిత్వ విషయానికొస్తే మీకు Indological journals వగైరా ఫాలో అవ్వగలిగే అవకాశం వుంటే కొన్ని references ఇవ్వగలను. ముఖ్యంగా మీరు జర్మన్‌ చదవగలిగితే Prof. Sigfried Lienhard రాసిన ఒక మంచి పేపర్ వుంది.

  -- శ్రీనివాస్
  P.S. "అప్పకవీయం"లో కూడా చిత్రకవిత్వ ఉదాహరణలు చూడవచ్చు.

  ReplyDelete
 3. తెలుగులో చిత్రకవిత్వం గురించి అక్కడక్కడా చదివినదే తప్ప, స్వయంగా చూడలేదు. మీరు చెప్పిన సాహిత్య చర్చలు జరిగే forums సంగతి తెలియదు. ఈ మధ్య వెతుకుతుంటే, ఓ సంస్కృత forum దొరికింది.

  అంతర్జాలం లో వెతుకుతాను.

  ReplyDelete
 4. ఈ క్రిందిలింకులో తెలుగు చిత్రకవిత్వం గురించి మరింత సమాచారం తెలుసుకోవచ్చును.

  http://kovela.blogspot.com/2009/01/blog-post_25.html

  ReplyDelete
 5. బాబా గారు, బావుంది, మీరిచ్చిన లంకె.

  ReplyDelete
 6. రవి-గారు ఈ క్రింది చిత్రకవిత్వం చూడండి !!

  తంభూసుతా ముక్తిముదారహాసం
  వందేయతోభవ్యభవం దయాశ్రీ:
  శ్రీయాదవం భవ్యభతోయ దేవం
  సంహారదాముక్తిముతాసు భూతం

  -- దైవజ్ఞ సూర్యకవి

  నాకు ఏదో స్వల్పం గా తెలుసుకదా అనే రాస్తున్నా, మీకు తెలియదేమో అని కాదు సుమా!

  It is a Palindrome. 1st and 4th lines can be read as the
  mirror images and same with 2 & 3 too.

  The beauty is here. In addition the stanza if read from begining to end is a description of lord rAma/rAma katha.
  if read from last to first in the reverse order it is the description of lord krishna/krishna katha.

  Pingali Surana (author of the first original kavya (classic) ‘‘Kalapoornodayamu’’) and Dvyardhi kavya,, ‘‘Raghava
  Pandaveeyamu’’ with each poem giving 2 meanings suitable for both Ramayana and Mahabharatta – a rare scholastic feat

  “It is difficult to compose a poem with two meanings; if the entire work is like that, is it not extra-ordinary scholarship? That too, in Telugu, which is wonderful!! Who is there (other than me), who can combine Ramayana and Mahabharatta (into one)!!

  తెలుగు వారికి గర్వకారణమైన రాఘవ పాండవీయం గొప్పతనం స్ఫూర్తి తోనే పద్యం.నెట్ లో సమస్యా పూరణం ఈ క్రింది విధం గా రాశా.

  అదిరె ! "రాఘవ పాండవీయ"మ్ము జూడ
  ఒక్క కావ్యమందున రెండు* ఒదిగి నిల్చె
  ఎక్క డైనను జూచిరే ఇట్టి వింత
  తెలుగుదనమన్న ఇది కదోయ్ తెలుగువాడ!!

  * —> ఒక్క పద్యమందు భారత రామాయణార్థములు ఒదిగి ఉన్నట్టు మొత్తం కావ్యం ఉండటం, అది చదువుకునే సౌభాగ్యం మన తెలుగు వారికి మాత్రమే ఉన్న అమూల్య మైన సంపద.

  ReplyDelete
 7. శ్రీపతి గారు,

  చాలా బావుంది. "రాఘవ పాండవీయం" గురించిన మీ పద్యం, పద్యం.నెట్ లో ఇదివరకే చూశాను. నిజంగా రాఘవ పాండవీయం ఒక అద్భుతం.

  మీరు ఉదహరించిన సంస్కృత పద్యం చాలా బావుంది. మాఘుం లోనూ ఇలాంటి పద్యమొకటి ఉండాలి.అయితే రామ, కృష్ణులిద్దరినీ వేర్వేరు క్రమాల ద్వారా వర్ణించటం అద్భుతం.

  మీకు స్వల్పంగా తెలిసినవి కూడా నాకు తెలియవండి. మీరు నిరభ్యంతరంగా చెబుతుండండి. అంతర్జాలంలో ఔత్సాహికులే గానీ పండితులు లేరు. (నాకు తెలిసిన వాళ్ళలో)

  ReplyDelete
 8. నేను ఉదహరించిన పద్యం దైవజ్ఞ సూర్యకవి ప్రణీతమైన "రామ కృష్ణ విలోమ కావ్యం " లోనిది. మొత్తం 36 పద్యాలూ మొదటి నుంచి చివరకు రామాయణంలాగ చదివించి, వెనకకు చదివితే కృష్ణుని భారతంలా అర్థమిచ్చేలా ఉంటాయి.

  http://sanskritdocuments.org/all_pdf/raamakrshhna.pdf

  ReplyDelete
 9. రవిగారూ, చిత్రకవిత్వమంటే గుర్తొచ్చింది. పారిజాతాపహరణంలో కావలసినంత (నిజానికి బోలెడంత) చిత్రకవిత్వం చెప్పారండీ తిమ్మన్నగారు. ఇది చూడండి.

  ReplyDelete
 10. వీటిని బంధ కవిత్వం అంటారు. 'ప్రయోగాలు' కూడా చేస్తారట! ఇవి తెలుగులో కూడా ఉన్నాయని విన్నాను.

  ReplyDelete
 11. తెలుగులో చిత్రకవిత్వం పై వచ్చిన సిద్ధాంతవ్యాసం ఇక్కడ చూడవచ్చు.
  http://teluguthesis.com/showthread.php?tid=2642

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.