Saturday, March 28, 2009

షాడో ఇన్ రిసెషన్ (షాడో ఉగాది థ్రిల్లర్)

(ఇందులో పాత్రలు, ప్రదేశాలు, సంఘటనలు కేవలం కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కావు)

ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో బిందుతో కలిసి షాపింగ్ చేస్తున్నట్టు, బిందు తన క్రెడిట్ కార్డ్ తూట్లు పడేలా బట్టలు, ఎలెక్ట్రానిక్ సామాన్లు, అదీ, ఇదీ సర్వం పర్చేస్ చేస్తున్నట్టు దారుణమైన కలగన్నాడు షాడో. నాలుక పిడచగట్టుకుని పోతుండగా మెలకువ వచ్చేసింది. తను పనిచేస్తున్న కంపనీలో రిసెషన్ అవడంతో, పని ఉండట్లేదీ మధ్య. సరే అని మధ్యాహ్నం ఓ కునుకు తీశాడు తను. తనకు కులకర్ణి గారి మేనకోడలు బిందుతో ఈ మధ్యనే పెళ్ళయింది. దాంతో, అప్పటి వరకు తనతోడు ఉన్న అదృష్టదేవత ముఖం చాటు చేసింది.

విపరీతమైన ఆలోచనలతో కందిరీగల తుట్టెలా తయారయింది మెదడు. ఇక లాభం లేదు, కాఫీ తాగాలి అని లేచి, ఈ మధ్యనే ఆఫీసు గాళ్ళు కాఫీ మిషన్ని కూడా లే ఆఫ్ (లేపివేయుట) చేశారని గుర్తొచ్చి ఆగిపోయాడు. ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది షాడో నాసిక నుండీ. అప్రయత్నంగా ఆలోచనలు రెండు రోజుల వెనక్కి పరుగులు తీశాయ్.ఆ రోజు ఉగాది...

"బారెడు పొద్దెక్కినా దున్నలా పడుకోవడం తప్ప, ఏనాడైనా ఓ పండుగ పబ్బం జరుపుకున్న మొఖమేనా ఇది?" అంటూ ముఖంపై బకెట్ తో బిందు చల్లబోతున్న నీళ్ళను, ఆఖరు క్షణంలో దిండు అడ్డు పెట్టుకుని నేర్పుగా కాచుకున్నాడు షాడో. జారిపోతున్న లుంగీని సవరించుకుంటూ టాయిలెట్ వైపుగా పరుగులు తీశాడు. నలిగిపోయిన సిగరెట్ వంక అసహ్యంగా చూస్తూ, ఓ కొత్త సిగరెట్ వెలిగించుకుని, కాల కృత్యాలు తీర్చుకుని, స్నానం ముగించాడు.

బ్రేక్ ఫాస్ట్ టేబుల్ ముందు తగుదునమ్మా అని పొద్దునే తయారయారు కులకర్ణి గారు. కనుబొమల మధ్య నుంచీ గుర్రుగా చూస్తున్న ఆయన చూపులను పట్టించుకోనట్టే నటిస్తూ, సిగరెట్ వెలిగించుకున్నాడు షాడో. గప్పు గప్పున ఇడ్లీలను ఒక్కొక్కటే లాగించేస్తున్నారు కులకర్ణి గారు.

ఇంతలో బిందు ఉగాది పచ్చడి తీసుకుని వచ్చింది. వస్తూనే, "ఫ్రిజ్ పాడయిపోయింది, కొత్తది కొనాలి. అలానే టీవీ కూడా. వాటితో బాటు బట్టలు. వీటన్నిటి కోసం సాయంత్రం షాపింగ్ మాల్ కు వెళుతున్నాం" కామ్ గా అనౌన్స్ చేసింది. గుండెలపై పదిటన్నుల బండరాయి పడ్డట్టు ఉక్కిరిబిక్కిరయాడు షాడో. అసలే రెసెషను. ఉంటుందా, ఊడుతుందా అన్నట్టున్న ఉద్యోగం. పైగా తనపాలిటి శనిలా ఈ కులకర్ణి గారు. ఈ పరిస్థితులలో ఇలా షాపింగు కార్యక్రమాలు. వద్దని చెబితే వినే రకమేనా ఇది? పొద్దున లేచి తను ఎవరి మొఖం చూశాడో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.

గుర్తుకు రాకపోవడంతో విసుగ్గా తల విదిల్చి టీవీ ముందు సెటిలయాడు.

టీవీలో ఓ ధృఢకాయుడు కూర్చుని పంచాంగ శ్రవణం చెబుతున్నాడు.

మేష రాశి ఫలితాలు చెబుతున్నారు. బిందుది కూడా మేష రాశి అవడంతో, చెవులు రిక్కించాడు షాడో. ఆదాయం 2, వ్యయం 8 అని చెప్పడం తో ఒక రకమైన అనీజీనెస్ అలుముకుంది తనను. అయితే, ఈ రాశి వారికి ఎక్కువ భాగం మంచి ఫలితాలు అని అనౌన్స్ కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అతని ఆలోచనలకు అడ్డుపడుతూ, "తోటల కొనుగోలుకు ప్రయత్నం చేస్తారు." అని వినిపించింది టీవీలో. దేరీజ్ సమ్ థింగ్ ఫిషీ అనుకున్నాడు మనసులో.

టీవీలో ఉన్నట్టుండి, ధనూ రాశి ఫలితాలు మొదలయాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14 అని చెప్పడంతో తన అనీజీనెస్ తారాస్థాయికి చేరుకుంది. "కుటుంబ సమస్యలు, బంధుమిత్ర సమస్యలు చీకాకు పరుస్తాయి. బంధు వర్గానికి పదే పదే ఆర్థిక సహాయం చేయవల్సి వస్తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. ఈ రాశి వారు గురు, కుజ గ్రహాలకు శాంతి చేయించి దానాలు చేయాలి" ప్రాంప్ట్గ్ గా అనౌన్స్ చేశాడా టీవీ ధృఢకాయుడు. దాంతో ఉగాది పచ్చడిలో బండెడు వేప్పూత కలిసినట్టు నోరంతా చేదుగా తయారయింది.


"ఎంతసేపలా కలలు కంటూ కూర్చుంటావుబే! డివిజన్ హెడ్డు మీటింగ్ ఉంది, లెగు లెగు"..రఫ్ గా భుజాన్ని చరుస్తూ హెచ్చరించాడు తన ప్రాజెక్ట్ లీడర్. వాడిని లాగిపెట్టి ఒకటి కొడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఒకటి షాడో మనసులో ఎంటరయింది. తన ఆలోచనలను అదుముకుని, కరచరణాలను రుద్దుకుంటూ కాన్ఫరెన్స్ హాలు వైపు నడిచాడు.

దాదాపు ఓ ముప్పై నలభై మంది ఉన్నారక్కడ. ఓ చివర సీటు చూసుకుని సెటిల్ అయాడు.


"Dear all, all of you know that our organisation has gone through tough endeavours and retained it's customer base, and consistently posted good profits during the times. But owing to the current global scenario, and market dynamics, our organisation also have to undergo the metamorphasis. So to sustain our business growth, we have decided to cut the few jobs in order to keep our business interests alive."

హెడ్డు మాట వినిపించుకునీ వినిపించుకోనట్టుగా నటిస్తూ, అటు చివరన కూర్చున్న ఓ అందమైన అమ్మాయి ముఖం చూస్తూ, బిందు ఇప్పుడు తనను చూస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు షాడో. ఇంతలో చలిజ్వరం వచ్చినట్టు సన్నగా జలదరించింది షాడో శరీరం. అనుక్షణం డెడ్ లైన్ల మధ్య పని చేస్తూ, దిన దిన గండం నూరేళ్ళాయుష్షుగా బతుకుతుంటాడు తను. దాంతో ఓ రకమైన సిక్స్త్ సెన్స్ అలవడింది తనకు. ప్రమాద సమయాలలో అప్పుడప్పుడూ హెచ్చరిస్తూంటుంది అది. దాని మాట పెడచెవిని పెడితే ఏం జరుగుతుందో బాగా తెలుసు తనకు. హెడ్డు మాటలు విని సంతోషంతో ఉప్పొంగి పోతున్నట్టుగా, ముఖమంతా నవ్వులమయం చేసుకుంటూ, శ్రద్దాసక్తులు కనబరుస్తూ మొదటి సీటు వైపుకు వెళ్ళాడు షాడో.

టీ సమయం. గుంపులు గుంపులుగా చేరి ముచ్చటించుకుంటున్నారు జనం. ఎవరికి ఏ గతి పట్టనుందో అని. కొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పడం జరిగిందని పుకార్లు వ్యాపించాయి.

ఆ రోజు సాయంత్రం. తన మేనేజరు కేబిన్ కు పిలిచాడు తనను. గుండెలు చిక్కబట్టుకుంటూ తన కేబిన్ కు వెళ్ళాడు షాడో.

"డియర్ రాజూ, చాలా ఏళ్ళుగా మీరు కంపనీకి సేవలు అందిస్తున్నారు. ఈ కంపనీకి మీరు ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు మీకు ముఖ్యమైన విషయం గురించి చర్చించాలని ఇక్కడకు పిలిపించడం జరిగింది...."

ఊపిరి బిగబట్టాడు షాడో.

"ఇది వరకు మనం కేవలం సిస్టం సైడు ప్రాజెక్ట్ లను చేపట్టాం. ఇకపై మన పరిధిని విస్తరించుకునే ప్రయత్నంలో, ఎంటర్ప్రయిజ్ టెక్నాలజీ లో మొదటి సారిగా అడుగుపెట్టబోతున్నాం. మనకొక జపాను అసైన్మెంటు వచ్చింది. మీకున్న అనుభవం, ఇదివరకు ఒకానొక క్లయింటు ఇచ్చిన ఫీడ్ బాక్ దృష్ట్యా, మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పజెబుతున్నాం. మీకు అంగీకారమేనా? " అనౌన్స్ చేశాడు, మేనేజరు.

హఠాత్తుగా గుర్తుకు వచ్చింది షాడోకి. ఇది వరకు జపాను కు సంబంధించిన ఓ అసైన్ మెంట్ లో భాగంగా జపాను వెళ్ళాడు తను. అక్కడ ఫ్యుజీశాన్ అనే క్లయింటు తగిలాడు తనకు. అప్పుడు, తన ద్వారా తీరిక సమయాల్లో జావా, ఎంటర్ ప్రయిజ్ టెక్నాలజీ లు నేర్చుకుని తనకు ప్రియ శిష్యుడయ్యాడు తను. తన ప్రాజెక్ట్ ను డెడ్ లైన్ కు ముందే డెలివరీ చేయటం మాత్రమే కాక, ఫ్యుజీశాన్ అభిమానం కూడా చూరగొన్నాడు తను.

చిరునవ్వులు చిందిస్తూ తల ఊపాడు షాడో. ప్రాంప్ట్ గా మేనేజరుకు థాంక్స్ చెప్పి బయటకు వచ్చేశాడు. ఫ్యుజీ శాన్ కు మనసులోనే ధన్యవాదాలు చెబుతూ సిస్టం షట్ డవున్ చేసి, బిందు మొహం లో కనబడబోయే ఆశ్చర్యాన్ని ఊహించుకుంటూ ఇంటి దారి పట్టాడు.


************************************************

(రచయిత మధుబాబు కు క్షమాపణలతో. కేవలం నవ్వుకోవటానికి మాత్రమే)

20 comments:

 1. Woh ! perfectly imitated the style of Madhu babu !

  ReplyDelete
 2. బాగుంది :-)

  షాడో బ్రాండ్ సిగరెట్టేమిటి? ;)

  ReplyDelete
 3. @సూర్యుడు
  పనామా! అదే కదా

  శ్రావ్య నువ్వు చెప్పిందే రైటు నీకే నా ఓటు
  బాగా రాసారు

  ReplyDelete
 4. హతోస్మీ! షాడోని కూడా సాఫ్‌ట్వేరులోకి లాగారూ!
  బాగుంది. మీరు కూడా డిటెక్టివ్ నవలలు వ్రాయవచ్చు.

  ReplyDelete
 5. biMdhu is not kulakarNi kODalu :(

  friend of kulakarNi mEna kODali!

  ReplyDelete
 6. @సూర్యుడు: పనామా - పరమ చెత్త సిగరెట్టు!

  ReplyDelete
 7. @Sravya : Is it? So, I also can write few paradies of shadow..:-)

  @Indian minerva : ThanQ

  @సూర్యుడు : థాంకులు. పనామా సిగరెట్టు..

  @కన్నగాడు : థాంకులు.

  @సిరిసిరి మువ్వ : కాడెవరు సాఫ్ట్ వేర్ కనర్హం. ఆర్థిక మాంద్యం వల్ల ఉద్యోగం ఊడితే, డిటెక్టివ్ నవల్లు రాస్తా...:-)

  @oremuna : I'll verify..

  @శ్రీనివాస్ : షాడో నవల లో incidents ను పర్ఫెక్ట్ గా మన జీవిత సంఘటనలకు అన్వయించడం కుదరదు (పేరడీ కోసమైనా). గంగారాం గుర్తొచ్చాడు, అయితే లెంత్ ఎక్కువవుతుందని కట్ చేశా.

  @netizen : అవును.

  @మహేష్ : థాంకులు. ఎప్పుడైనా వీలయితే మరిన్ని రాస్తా.

  ReplyDelete
 8. ఎమిటి అండి మధుబాబు గారికి పొటి గా వదము అని అనుకుంటునారా

  పాపం మధుబాబు గారు వెరె క్యారెక్టరు వెతుకొవలి అంటె కొంచం కష్టమెనండి

  చాలా బాగా రాసారు నాకు అనుమానం షాడొ నవలలు అని చదివెసర ఎమిటి అంత కచిత్తముగా ఆయన ఎలా రాస్తారొ అలాగె రాసి పారెసారు

  ReplyDelete
 9. ఇదేంటి, ఈ టపా నేనెలా మిస్సయ్యాను? మధుబాబు రాసిందే చదువుతున్నట్లనిపించింది. భలే రాశారు రవి గారు. షాడో కి ఇంతమంది అభిమానులు బ్లాగ్లోకంలో ఉన్నారని తెలీదు. మా ఇంట్లోనే అనుకున్నాను. మా అన్నయ్య కొడుకు పేరు శ్రీకర్(షాడో అసిస్టెంట్). ధృడకాయుడు, బే, ఆలోచన మనసులో ఎంటరవడం,..భలే వాడారు ఇవన్నీ!

  ReplyDelete
 10. @Sri గారు : షాడో కు ఒకప్పుడు నేను వీరాభిమానిని లెండి. ఇప్పుడు కూడా. అయితే రెగ్యులర్ గా చదవట్లేదు.

  @సుజాత గారు : నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది.ఇంతమంది అభిమానులా? అదీ ఈ కాలం లో???

  ReplyDelete
 11. hmmmm nenu kooda shadow ki picha fan ni 10th public exams appudu subjects chadavakunda ee novels chadivanu ofcourse adhi dobbesindi anukondi inka pefect asalu novel chaduvuthunnatle anipinchindi hats off

  ReplyDelete
 12. హ్హహ్హహ్హ... చాలా బాగా వ్రాసారు...
  ఈ టపా ఎలా మిస్ అయ్యనబ్బా...?!
  అసలే గత వారం రోజుల నుండీ, మళ్ళీ షాడో నవల్స్ చదవడం మొదలు పెట్టా! అచ్చు గుద్దినట్లు మధుబాబు గారు రాసినట్లే ఉంది!!!
  ధృడకాయుడు మాత్రం అల్టీ!!! :))

  ReplyDelete
 13. నేనూ మధుబాబు గారి అభిమానినే

  ReplyDelete
 14. bindu kulakarni gari menakodalu kadandi.....kulakarni gari menakodalu name PRANAVI.......

  ReplyDelete
 15. సూపరో సూపర్. కాని రవి గారు, కులకర్ణి గారి మేనకోడలు పేరు ప్రణవి, బిందు కాదు. (షాడో భార్య ఐతే బిందూనే అనుకోండి.)

  "అనుక్షణం డెడ్ లైన్ల మధ్య పని చేస్తూ, దిన దిన గండం నూరేళ్ళాయుష్షుగా బతుకుతుంటాడు తను. దాంతో ఓ రకమైన సిక్స్త్ సెన్స్ అలవడింది తనకు."

  హహ్హహ్హహా!

  ReplyDelete
 16. అదిరింది సార్

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.