Sunday, March 1, 2009

దాన వీర మూర్ఖ కేసీ ఆర్ (ఏక పాత్రాభినయము)ముందుగా ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దానవీర శూరకర్ణ అభినయము చవిచూసి రండు.

ఇందలి
పాత్రలు పాత్రధారులు.
సుయోధనుడు
: చంద్రబాబు నాయుడు
కర్ణుడు
: కేసీఆర్
ద్రోణుడు
: సగటు ఓటరు మహాశయుడు
భీష్ముడు
: ప్రజాస్వామ్య వాది, గాంధేయ వాది అయిన ఒక అనుభవజ్ఞుడైన ఓటరు
ఇంకా
దుశ్శాసన (సీపీఐ), శకుని (బాలకృష్ణ) మున్నగు వారు పాల్గొన్నారు.

నేపథ్యము
: ప్రజాస్వామ్యమున ముఖ్య ఘట్టమైన ఎన్నికలు దగ్గర పడినవి. ఎన్నికలన - ఇవి ప్రజాస్వామ్యమునకు, అప్రజాస్వామిక పోకడలకు మధ్య జరిగెడు పరీక్షలేయని చెప్పవచ్చును. ఎన్నికలలో పొత్తులు (పార్టీల యొక్క భావస్వారూప్యమున చేసుకొనెడి ఎంపికలు) సర్వసాధారణము.ఓటరు మహాశయుడు ఎంపిక చేసుకున్నపార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేయును.

నేపథ్యమున - వేర్పాటు వాద బీజములతో అంకురించిన తెలంగాణా ప్రముఖునకు, తెలుగు వారి ఉమ్మడి గౌరవభావములను నిలబెట్టుటకవతరించిన తెలుగుదేశ పక్ష అధినేతకు మధ్య పొత్తు నిలువదని ఓటరు మహాశయుడు ఆక్షేపించుచూ -

ద్రోణ
(ఓటరు) : వేర్పాటు వాద భావ సంజాతుడు, జాతి గౌరవమను అంశమున స్థాపించిన, తెలుగు దేశ పక్షమునతో పొత్తు కలుప అనర్హుడు.

(
కేసీఆర్ నిరాశగా వెనుకకు మళ్ళుచుండగా)

సుయోధనుడు
(చంద్రబాబు) : ఆగాగు.
ఓటరు
దేవా! ఏమంటివి ఏమంటివి.
ఓటు
నెపమున టీఆరెస్ సుతునకిందు నిలువ అర్హత లేదందువా? ఎంతమాట? ఎంతమాట?
ఇది
ప్రభుత్వ ఏర్పాటే కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కాదే! కాదూ, కాకూడదు, ఎంపిక అక్రమమని యందువా?
అయినచో
, అతి జుగుప్సాకరమైన నీ ఎంపిక (selection) ఎట్టిది?
తొట్టి కాంగ్రెస్ నకు పట్టముగట్టితివి కదా, నీది ఎన్నిక?
ఇంత
యేల? అస్మద్ శ్వసురుడు, నందమూరి కుల వృద్ధుడు అయిన రామారావు, లాలూ, ములయంలతో ప్రత్మామ్నాయ ఫ్రంట్ కు నాంది పలుకలేదా? ఆయనదే రకమైన పొత్తు?
నాతో
జెప్పింతువేమయ్యా? మన ప్రజాస్వామ్యమునకు మూలస్థంభమైన కాంగ్రెస్, తీవ్రవాద పుత్రిక ముస్లిం లీగ్ తో సంధి కలుపలేదా? ముస్లిం లీగ్ ఛండాలముగా తెల్లదొరలతో పొత్తును, పొత్తు పర్యవసానముగా పాకిస్తానము ను, పాకిస్తాను, తిరిగి బంగ్లా దేశమును, పిమ్మట కాశ్మీరమును మన దేశమునుండీ వేర్పరిచ లేదా? రకముగా సందర్భావసరములను బట్టి, క్షేత్ర, బీజ ప్రాధాన్యములతో సంకరమైన ప్రజాస్వామ్యము ఏనాడో కలుషితమైనది. అయిననూ, ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యము అని వ్యర్థ వాదమెందులకు?

భీష్మ
(గాంధేయ, ప్రజాస్వామ్య వాది) : నాయనా, చంద్రబాబు! నువ్వన్నట్టు ఇది ముమ్మాటికీ ప్రభుత్వపు ఎన్నికయే. చిహ్నమున్నవారందరూ పార్టీ నాయకులే. అందులో భావసారూప్యమున్న వారే పొత్తునకు అర్హులు.

సుయోధనుడు
(చంద్రబాబు) : ఓహో! భావ సారూప్యమా, అర్హతను నిర్ణయించునది?
అయినచో
తెలుగు దేశమున, సస్యశ్యామలమై, సంపద్విరామమై వెలుగొందు తెలంగాణమునకు నేడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించెద.
కమ్యూనిష్టు
సోదరా, అనర్ఘ నవరత్నశ్శక్త కిరీటమును వేగముగ దెమ్ము.
బావా
, నటరత్న బాలకృష్ణా, సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును దెప్పింపుడు.
పరిజనులారా
, పుణ్యమూసీనదీ తోయాధికములనందుకొనుడు.
కల్యాణ
భక్తులారా, మంగళ తూర్యారావములు అపస్వరంబుగ మ్రోగనిండు.
వంధిమాగధులారా
, కేసీఆర్ కు కైవారములు గావింపకుడు.
పుణ్యాంగనలారా
, వీరాలాకృత కృపాల ఫాల భాగమున, కస్తూరీ తిలకము తీర్చి దిద్ది, బహుజన సుకృత పరీపాక, సంలబ్ధ సహజ వేర్పాటు వాదికి వాంఛలు చెలరేగ, వీరగంధము దిద్ది తోడుకుని రండు.
నేడీ
శాసనసభా మధ్యమున, సకల రాజకీయ నాయకుల సమక్షమున, శతథా, సర్వథా, బహుధా, సహస్రథా, ప్రజాస్వామ్య విలువలను శాశ్వతముగా ప్రక్షాళన కావించెదను.

శతపరివార
సహిత, సహజ ప్రాజాస్వామ్య వ్యతిరేక మానస, మంజీరా తటనివాస, కేయూర కిరీట హార మణీవలయా, దుర్జన మిత్ర, సముజ్జృంభణ ఝర్జాఝర్జరిత సముపాద్య సమగ్ర అశౌర్యధరా, మిత్రీకృత చంద్రబాబు నాయుడా, మూర్ఖా పరావతరా, తెలంగాణారాజ్య రమా మనోవల్లభా, విజయీభవా, దిగ్విజయీ భవా!

చంద్రబాబు
: సొబగు సొబగు.

కేసీఆర్
: దాతా! నా రక్తము రంగరించి, నీ అరుణారుణ శుభ పాద పద్మ యుగళమునకు సంలేపనము గావించిననూ, నీ ఋణమీగు వాడను గాను. ఎచ్చటా నీతిని పాటించని తెలంగాణీయుడు తమ సర్వ అసమతా దృష్టికి దాసానుదాసుడు. నా తుది రక్తపు బిందువు కూడా, మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము, అహర్నిశము, అవిశ్వాసబద్ధుడనై, అహితుడనై ప్రవర్తింతునని, సర్వ సామంత మహీపాల మండలాధిపతులు, సమస్త ప్రజానీకము విచ్చేసిన, సభామధ్యమున శపథము గావించుచున్నాను.

చంద్రబాబు
: హితుడా! అప్రతిహత ’మూర్ఖవరేణ్యుడగు నీకు, తెలంగాణా రాజ్యమే కాదు, నా హోం శాఖనిచ్చి గౌరవించుచున్నాను.

************************************************************************

ఇది
కేవలం నవ్వుకోవటానికి మాత్రమే. అసంబద్ధాలు, ఇతర పొరబాట్లు పట్టించుకోవద్దని మనవి.

31 comments:

 1. బలే బలే శెబాష్. ముఖ్యంగా సుయోధనుడీ ఓపెనింగ్ స్టేట్మెంటు సూపరో సూపరు. కాకపోతే, ఆ స్పీచి చివర, ఆ విధంగా ముందుకెళ్తామని మనవి చేసుకుంటున్నా . అంటాడేమో నని ఎదురు చూశా! :)

  ReplyDelete
 2. శభాష్...
  అవిశ్వాసబద్ధుడనై, అహితుడనై ప్రవర్తింతునని ;-))
  -యువ

  ReplyDelete
 3. ఇరగదీశారు రవి గారూ. నేను గొంతులు మార్చి హావభావాలతో ఈ డైలాగులన్నీ మా ఇంట్లో వినిపించాను. దొర్లి, దొర్లి నవ్వుకున్నాం అంతా.
  కొత్తపాళీగారన్నట్టే కొంచం చంద్రబాబు మార్కు డైలాగులు కూడా కలిపేస్తే బాగుండేది. జై జన్మభూమి.

  ReplyDelete
 4. కేక !! చాలా బాగా వ్రాశారు..

  ReplyDelete
 5. బాగానే ఉన్నది.
  కాని "నీచ వేర్పాటు" అని మీ అక్కసును, తెలంగాణ పై వ్యతిరేకతను వెళ్లకక్కుతున్నారు.

  ReplyDelete
 6. ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమె >>>>> అన్నారు.
  ఎవరు నవ్వుకోవడానికి????
  వేర్పాటు వాదం , నీచాతి నీచా , మూర్ఖాపరావతారా, నీచ వరేణ్యుడవగు నీకు ... వంటి పదజాలం వాడకుండా కాస్త సంయమనం పాటించి వుంటే గుడ్డిలో మెల్లగా బాగుండేది.
  కెసిఆర్ ని పక్కన పెడితే తెలంగాణా పరిస్థితి కర్ణుడు లాంటిదే.
  తెలంగాణా కర్ణుడిని ఆంధ్ర మాత (కుంతి) కన్నప్పటికీ వాడిని పాండవులు తమలో కలుపుకోరు. కన్న తల్లి కూడా పాండవ పక్షపాతంతో వాడిని వాడుకుని వదిలెయ్యాలని చూస్తుంది.
  మూడువందల సంవత్సరాలు తురకల పాలనలో నలిగి పోతూ కూడా తెలంగాణా తన భాషను , సంస్కృతిని కాపడుకోగలిగింది.
  ఇవ్వాళ నాటి తురకల పాలనలో కంటే ఎక్కువగా తన అనంగు సోదరుల అవహేళనలకు గురవుతోంది తెలంగాణా.
  అందుకే తన ఉనికి కోసం, తన స్వాభి మానం కోసం, తన రాష్ట్రాన్ని తను కోరు కుంటున్నది తప్ప ఆంధ్రా లో భాగాన్ని కాదు.
  ఇది అసలు వేర్పాటు వాదమే కాదు.
  ప్రత్యెక తెలంగాణాను వేర్పాటు వాదం గా చిత్రిచడం పెద్ద కుట్ర

  ReplyDelete
 7. హ్హహ్హ... చాలా బావుంది..

  ReplyDelete
 8. "నీచ " అన్నది derogatory గా ధ్వనిస్తుంది కాబట్టి, మార్చాను.

  ReplyDelete
 9. ప్రభాకర్ మందార గారి వ్యాఖ్యలు పూర్తిగా సమర్థిస్తున్నాను. పేరడీలో సమతుల్యత లోపించింది.

  ReplyDelete
 10. హ హ్హ హ్హా భలే భలే... మీ పోస్టు, దాన్ని చూసి తెలంగాణా అంటూ కామెంట్లు

  ReplyDelete
 11. తెదే, తెరాసల రాజకీయ దృక్పథాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళిద్దరి పొత్తుపై చేసిన మీ పేరడీ వ్యాఖ్యానం బాగుంది. ఎటొచ్చీ కర్ణ దుర్యోధనుల మైత్రి - పునాది ఏదైనా కావచ్చుగానీ - పటిష్టమైనది, చచ్చేదాకా తెగలేదు. కానీ ఇక్కడి మైత్రి మాత్రం..

  పుణ్య మూసీనదీ తోయాధికముల.. - ఈ 'అధికమ'దిరింది. :)

  ReplyDelete
 12. @samatalam గారు : ఈ టపా రాజకీయ నాయకుల (ఏ పార్టీ అయినా) మీద, ప్రజలను సిద్ధాంతాల పేరుతో విడదీసి, పబ్బం గడుపుకునే వారి మనస్తత్వం మీద రాసినది.అక్కసుతో కాదు. నేను పుట్టినది, పెరిగినది రాయలసీమలో. కనీసం ఆంధ్రా (కోస్తా) లో ఉండి ఉంటే, అక్కసు అనడానికి ఆస్కారం ఉండేది. ఈ టపా వల్ల నాకు వ్యక్తిగతంగా ఒరిగే లాభము ఏ మాత్రం లేదు. గమనించండి.

  @ప్రభాకర్ గారు, @హరి గారు : వేర్పాటు వాదం అనడం కూడా derogatory యే నంటారా? నా ఉద్దేశ్యంలో కాదు.

  తెలంగాణా ఒక్కటే కాదు, మొత్తం భారతదేశమే అనేక వేల యేళ్ళు గా రకరకాల దాస్యాల్లో మగ్గింది. సరే. ఒకవేళ తెలంగాణా తన స్వాభిమానాన్ని నిలుపుకోవాలనుకుంటుంది. అలా అనుకున్నా, ప్రత్యేక తెలంగాణా పరిష్కారమేనా? కేసీ ఆర్ గారు అక్షరాలా నూటికి నూరు శాతం సదుద్దేశంతోనే పార్టీ స్థాపించారా? టీడీపీ (ఈ పార్టీ కి గల భావజాలాన్నీ గమనించండి) తో పొత్తు వెనుక నిస్వార్థ పూర్తిత " స్వాభిమాన " భావజాలం ఉందా? విజ్ఞులయిన మీరే ఆలోచించుకోగలరు.


  కామెంటిన అందరికీ నెనర్లు.

  ReplyDelete
 13. బాబూ తెలుగు పండితా...

  అక్కసు అనడం కంటే.... నీ సొమ్మేం పోయిందని నువ్వు బాధ పడతావ్ అనుంటే బావుండేది....

  రాయలసీమ వాసులకు ఎందుకు బాధ ఉంటది... మీదేం పోయిందని...

  ఢిల్లీ లోని అప్పటి కాంగ్రెస్ ఆంధ్రా చెంచాలు వంచన చేసి తెలంగాణ ని అధర్మంగా వాళ్ళతో కలుపుకున్నాయి... మావాళ్ళేమో బ్రిటిష్ వాళ్ళకి అపొసిట్ పోరాడ లేదు...మావాళ్ళు ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోయ లేదు.. .. మోసిన అంధ్రులు ధనిక తెలంగాణ ని పేద అంధ్ర తో కలుపుకుని అంధ్ర ప్రదేశ్ చేశారు..గానీ కనీసం అందులో తెలంగాణ పేరు కూడా లేదు... ఎందుకుంటది.. ఉంటే ఇది ఇద్దరి సమ్మతం తో జరిగిన కలయిక అయి ఉండేది...

  .. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసారు...

  ఇందుల మీది ఏం పోతదని... మీకు అక్కసు...... నాదేం పోయింది...నేనూ ఒక రాయేస్తా అనుకుంటున్నవ్...

  ReplyDelete
 14. ఇక పొతే .. నీలో మాంచి కళా పొషణ ఉన్నది... కొంచెం నిశ్పక్షపాతంగా వ్యవహరిస్తూ రాస్తే అందరికీ ఆమొదయొగ్యం గా ఉంటది...

  ReplyDelete
 15. @వంశీ కిరణ్ :

  "రాయలసీమ వాసులకు ఎందుకు బాధ ఉంటది... మీదేం పోయిందని..."

  నేను రాయలసీమ వాసినే కానీ రాయలసీమ "వాది" ని కాను. గమనించాలి. ఇక ఏం పోయిందని అంటారా?

  రాయలసీమలో గుక్కెడు నీళ్ళు తాగడానికి గతిలేక వూళ్ళు విడిచి వలస పోయిన వాళ్ళు నాకు తెలుసు. ఉన్న ఒక్క సీజను పంట పండక, పండే పంట చేతికి రాక, వచ్చినా గిట్టుబాటు ధర దొరక్క ఆత్మహత్యలు చేసుకునే రైతుల చావుల సంఖ్య కొన్ని వేలలో ఉన్నదిక్కడ.

  వీటన్నిటికీ ప్రత్యేక రాయలసీమో, ప్రత్యేక తెలంగాణాయో సమాధానం కాదు. అది పళ్ళూడగొట్టుకునేకి ఇంకో రాయి మాత్రమే.

  ఇక కాంగ్రెసు పెద్దలంటారా? ఎవరో ఒక రకమైన పెద్దలు. ఒకప్పుడు రతనాల సీమ కాదా ఇది? ఇక్కడ బెళ్ళారిలో ఇన్ని గనులను పెట్టుకుని, రాయలసీమను దరిద్రంగా మార్చలేదా? ఇప్పుడూ ఈ ప్రత్యేక తెలంగాణా కూడా ఉన్నదాన్ని ఇంకా దోచుకునేకే. మీ తెలంగాణా (ఆ మాటకొస్తే అక్కడ తెలుగు ఉన్నది కాబట్టి, మాకూ సొంతమే) మీద మీ ప్రేమ, రాజకీయనాయకులపై అభిమానంగా మార్చుకోకండి.

  ReplyDelete
 16. రవి, మీ పాయింట్ నాకు అర్థం కాలె...

  రాయల సీమ ప్రజల కష్టాలు... మరి దానికి ఏదొ ఒక సొల్యుషన్ ఉన్నదో... క్రియేట్ చేస్తరో ...మీ ఇష్టం... మీరు "వాది" అయివున్నట్లయితే.. కేవలం కష్టాలే కాదు.. అవి ఎలా తీర్చాల్నో కూడా చూస్తరు...ఆలోచిస్తరు..

  మాకు జరిగిందానికి.... జరుగుతున్నదానికి.... సొల్యుషన్ మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే... ఎందుకంటే.... దీనికోసం కావలసినంత చరిత్ర ఉంది... మీకు కావాలంటే కొంచెం వెతికితే బొలెడు దొరుకుతుంది...

  తెలుగు ఉన్నది కాబట్టి మాకూ సొంతమే అంటే.. తెలంగాణ లో ఉంటామంటే మాకే అభ్యంతరం లేదు... అంటే మనం ఇప్పుడు అంధ్రతో కలిసి ఉన్నాము కదా... అలాగే మాతో కలిసి ఉండండి... కేవలం పళ్ళూడకొట్టించుకోటమే కదా..

  నాకు సంబందించినంత వరకు...నేను పట్టించుకునేది ఎక్కువగా మా ఆత్మగౌరవ సమస్య...
  ఆత్మగౌరవ పోరాటం పళ్ళూడ కొట్టించుకోటం కొరకే అయితే.... పళ్ళు కాదు.. ప్రాణాలైనా బానే ఉంటుంది కదా!!! ..

  ReplyDelete
 17. @velugu గారు,
  "మాకు జరిగిందానికి.... జరుగుతున్నదానికి.... సొల్యుషన్ మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే... ఎందుకంటే.... దీనికోసం కావలసినంత చరిత్ర ఉంది... మీకు కావాలంటే కొంచెం వెతికితే బొలెడు దొరుకుతుంది..."

  చరిత్ర ఉంది. ఒప్పుకుంటాను. interpret చేసుకునే విధానాలు కూడా బోలెడు రకాలుంటాయ్. ఒకప్పుడు పాలనా సౌలభ్యం అన్న పేరుతో, ఓ తెల్ల దొర (లార్డ్ కర్జన్) దేశాన్ని ముక్కలు చేసి, రావణ కాష్టం రగిల్చాడు. అదీ చరిత్రే. ఇక్కడా అదే సమస్య miniature రూపాన్ని ఇక్కడ
  అన్వయించుకోవచ్చు.

  సరే, అవన్నీ అటుంచి, ప్రత్యేక తెలంగాణాయే పరిష్కారం అన్నది మీ అభిప్రాయం ఎలాగో, వేర్పాటు వాదం అన్నది నా అభిప్రాయం అనుకోండి.

  భావ ప్రకటన స్వేచ్చ అన్నది ఒకటుంది, పైగా బ్లాగు అన్నది వ్యక్తిగతం కాబట్టి ఈ టపా , నాకోసం, నాతో బాటు నవ్వుకునే వాళ్ళకోసం రాశాననుకోండి.

  ReplyDelete
 18. భలే రాసారు రవి గారు.

  ReplyDelete
 19. భళారే...... బాగున్నదయా మీ బ్లాగు!!

  ReplyDelete
 20. "పరిజనులారా, పుణ్య ’మూసీ ’ నదీ తోయాధికములనందుకొనుడు..."
  రవిగారూ, పొట్ట చెక్కలైపోయిందంటే నమ్మండి. భలే భలే.

  ReplyDelete
 21. This comment has been removed by the author.

  ReplyDelete
 22. Ravi..
  Sooper blog.. today ppl who are suffering because of this linguistic division of the states will surely understand what it means to have sooo many different states and how u are treated in one another..

  ReplyDelete
 23. varajeshకేక !! చాలా బాగా వ్రాశారు..

  ReplyDelete
 24. Congress , telugu desam lo (politicians) - Vayo vruddhulu , Guru vruddhulu, darma vruddhu anukonu prabuddhula buddhi, ippati variku nidhura poyinadhaa yemi?
  Ippude lechi telangaana telangaana ani aavulinchu chunnaru?

  Avibaajya Andhra Pradesh ni mukkalu chekkaluga cheyuta – Andhra Pradesh ki sreyaskarama?
  Binna baasha latho,Binna samskrutu latho , binna naagarikatha latho raastram chinna binnam ayyinacho prajalakadhi soubaagyama?
  Raastram lo prajalandharu oke kutumbhamu ga oke paalana kindha unduta kshemamu kadha?

  Ee politicians valla adhikaarma kosam separate telengaana,separate raayala seema ..bla bla ani ,
  Manalo manam mitri bandham tegettu chestunnaru , telengana kooda ivvaleni andhra vallau ani godava chestunnaru,
  Indharamu vantulu vesukunna cho, yevariki yevariki enta enta vacchunu

  First vote to a good politician then you will get good results.

  ReplyDelete
 25. @అర్జునా : లెస్స పలికితివి.
  సొబగు సొబగు. :-)

  ReplyDelete
 26. well said arjun,
  but better to write in telugu script eventhough a bit difficult.

  ReplyDelete
 27. రవి గారు ముందు అంత కష్టపడి రానినందుకు మీకు నా చప్పట్లు
  చప్పట్లు

  మన మిత్రులు ఎదొ చిన్న విషయం లొ మీతొ విబెదిస్తున్నారు కని మీరు రాసిన దానికి వారి విబెదించెదానికి ఎక్కడ పొలిక వుందొ నాకు అర్థం కావటం లెదు

  కాని మీ రచనకి నా జొహరులు

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.