Sunday, January 4, 2009

పసిపాప నవ్వు

నిదురించే ప్రియురాలి పెదవిపైని ముద్దును దొంగిలించాను. అది ఎంత అందమైన దొంగతనం ! అంటాడు గాలిబ్.

నిదురించే పసిపాప పెదవులపై చిరునవ్వును దొంగిలిస్తే?


(మా పాప ౨ నెలల వయసులో ఉన్నప్పుడు, కెమెరా కన్నుకు చిక్కిన నిద్రలో నవ్విన నవ్వు. )

14 comments:

 1. పసిపాప చిరునవ్వు దొంగిలించడం ధూం-2 లో హృతిక్ రోషన్ కి కుడా సాధ్యం కాదు!!!

  మంచి నవ్వుని బంధించారు కెమెరాలో.

  ReplyDelete
 2. మీ పాప ముఖం నుంచి రాలిపడ్డ చిరునవ్వు సుమాన్ని క్రిందపడకుండా బాగా ఒడిసిపట్టారు.

  ReplyDelete
 3. చాలా బావుంది... :))

  ReplyDelete
 4. this is a translation of tagores gitanjali poem by bellaMkoMda

  పసిపాపకంటిపై నిద్ర- ఎక్కడనుంచిఎలా వస్తుందో ఎవరికైనాతెలుసునా? అవును,దీన్ని గురించి ఒక కట్టుకథచెబుతారు. ఎక్కడోఉంటుందట నిద్ర,దేవలోకం లోన.

  ఏ గ్రామంలోనో--ఎక్కడో మిణుగురు పురుగులకాంతులు మిలమిలమెరిసే అడవుల చీకటినీడల మధ్యనిద్ర తీసుకునివచ్చేరెండు పూలమొగ్గలువున్నవట. ఆమొగ్గల నుంచివస్తుందట నిద్ర.నిద్రించేటప్పుడుపసిపాప పెదవిపై తేలిఆడే చిరునవ్వు-అది ఎక్కడ పుట్టిందో

  ఎవరికైనాతెలుసా? అవును,దీన్ని గురించి కూడా ఒకకట్టుకథ చెప్పుకుంటారు.చవితినాటి చంద్రునిపారిపోయిన కిరణం ఒకటివిచ్చుకొనిపోతున్నఒక వసంత మేఘం చలాన్నితాకిందని,

  అక్కడఒకనాటి మంచుకురిసేఉదయాన తొలిగా ఈచిరునవ్వు పుట్టిందనీచెబుతారు.

  నాకెందుకో చలం చేసిందే నచ్చింది. అది కూడా ఇమ్మంటారా?

  ReplyDelete
 5. వావ్..బాబా గారు, దయచేసి చలం గారి అనువాదం కూడా ఇవ్వండీ..

  ReplyDelete
 6. రవి గారికి
  మీ ఫొటో చాలా చాలా బాగుంది. మంచి మధురమైన మెమరీ గా మిగిలి పోతుంది. పాపకూ, మీకూ కూడా. చూడంగానే వెంటనే ఈ కవిత చదవాలనిపించింది. చదివేసాను. (ఎన్నోసారి? తెలీదు) మీతో పంచుకోవాలని అనిపించింది. అదీ చే్సేసాను.
  మీరు ఇంకా కావాలన్నారు.
  ఇదిగో మీకోసం క్రింద ఇవ్వబడిన రవీంద్రుని గీతాంజలిలోని 61 వ పద్యానికి, చలం అనువాదం. పైన ఇచ్చినది బెల్లంకొండ రామదాసు చేసిన అనువాదం
  ఎవరైనా ఈ రెంటినీ విశ్లేషిస్తే వినాలనిఉంది.


  శిశువు కళ్ళపైన తాకిపోయే నిద్ర ఎక్కణ్నించి వొస్తోందో ఎవరికైనా తెలుసా?

  మిణుగురుల మసక వెలుగుల అడివినీడల కిన్నెర గ్రామంలో రెండు ఇంద్రజాలిక కుట్మటాలు వేళ్ళాడుతున్నాయి. శిశువు కళ్ళని ముద్దు పెట్టుకోవడానికి నిద్ర అక్కడినించి బయలుదేరి వొస్తుంది.
  నిదురించే శిశువు పెదిమలపై దోబూచులాడుచుండే ఆ చిరునవ్వు ఎక్కడ పుడుతుందో ఎవరికైనా తెలుసా?

  కరిగిపోయే శరన్మేఘాంచలాన్ని అర్ధచంద్రరేఖా నవ ధవళ కిరణ మొక్కటి తాకిందట.

  ఆ తుషార స్నాత ప్రభాత స్వప్నంలో ఈ చిరునవ్వుకి ప్రధమ జననమని వదంతి, నిద్రించే శిశువు పెదిమలపై దోబూచులాడుతుండే ఆ చిరునవ్వుకి.

  Gitanjali: 61
  The sleep that flits on baby's eyes—does anybody know from
  where it comes? Yes, there is a rumour that it has its dwelling where,
  in the fairy village among shadows of the forest dimly lit with glowworms,
  there hang two timid buds of enchantment. From there it
  comes to kiss baby's eyes.
  The smile that flickers on baby's lips when he sleeps—does
  anybody know where it was born? Yes, there is a rumour that a
  young pale beam of a crescent moon touched the edge of a vanishing
  autumn cloud, and there the smile was first born in the dream of a
  dew-washed morning—the smile that flickers on baby's lips when he
  sleeps.

  (ఈ పద్యం ఇంకా కొంచెం ఉంటుంది)

  కావాలంటే
  http://www.scribd.com/doc/8279725/Gitanjali-Song-Offerings

  ReplyDelete
 7. ష్ష్! నెమ్మదిగా మాట్లాడండి! పాపాయి నిద్ర లేస్తే మీకు దెబ్బలు పడతాయి అమ్మ చేతిలో!

  ఇలాంటి ఫొటో ఒకటి ఇక్కడ పెడతారని, మీరు పాపాయి పద్యాలు (కామేశ్వర రావు గారా బ్లాగులో పెట్టింది..గుర్తులేదు) చదివి "మా ఇంట్లో కూడా మరో కొద్ది రోజుల్లో చిన్న పాపాయి రాబోతోంది" అని రాసినప్పటి నుంచి చూస్తున్నాను.

  ఈ ఫొటో చూసి ఎవరి ముఖాన చిరునవ్వు ఉదయించదు చెప్పండి? చిరునవ్వే కదు ఆనందభాష్పం కూడా కంటి చుక్కై రాలుతోంది ఇక్కడ!అద్భుతం!

  ReplyDelete
 8. @డాక్టర్ గారు, @కొ.పా గారు, @మేధ గారు : నెనర్లు.

  @శ్రీ గారు : అవును, పసిపాప చిరునవ్వు దొంగతనం చేయడం హృతిక్ రోషన్ కు ఆరు పలకలు తెచ్చుకున్నంత వీజీయేం కాదు. :-)

  @విజయమోహన్ గారు : ఆ సుమం అలా దొరికింది. అదృష్టం కొద్దీ అంతే :-)

  @బాబా గరు : నా దగ్గర గీతాంజలి పుస్తకమే ఉన్నది. ఒకప్పుడు నేనూ కొన్ని అనువాదాలు ప్రయత్నించాను. ఓ రోజు చలం అనువాదాలు కొన్ని 8 వ తరగతి తెలుగు వాచకం లో చదివి, నా అనువాదాలు చూసుకుని సిగ్గేసి, రాయడం మానుకున్నాను.

  అడిగిన వెంటనే చలం అనువాదం అందించినందుకు ధన్యవాదాలు. నేనూ మీ లానే రవీంద్రుని కవితలు వీలు చిక్కినప్పుడల్లా చదువుకుని మురిసిపోతుంటాను. అయితే, నాకు crescent moon, gardener బాగా ఇష్టం, గీతాంజలి కన్నా కూడాను.

  @సుజాత గారు : ఆ పాప బొమ్మ - పాప అమ్మ తీసింది. :-) ఇంతకు మునుపు ఓ ఫొటో పెట్టాను ఇక్కడ.

  మీ స్పందన మనసు లోతుల్లోనుండీ వచ్చినట్లు అర్థమయ్యింది. పాప నవ్వు మిమ్మల్ని స్పందింపజేసినందుకు ఆనందంగా ఉంది.

  ReplyDelete
 9. Ravi
  Sooper photo..Lovely smile of kiddo

  ReplyDelete
 10. రవి గారు, పాపాయి నవ్వు చాలా బాగుంది.

  బాబా గారు, అనువాదాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నాకు కూడా చలందే నచ్చింది, ఎందుకంటే విశ్లేషించలేను.

  ReplyDelete
 11. బాబా గారు., ఇంతకు మునుపు మీరు పంపిన అనువాదాలు అలా చదివి వదిలేశాను. అయితే మళ్ళీ చదివిన తర్వాత ఒక్క విషయం ...

  crescent moon కు బెల్లంకొండ వారు చవితి చంద్రుడు అని చెబితే, చలం అర్ధచంద్రరేఖ అన్నారు. నాకు మాత్రం "నెలవంక" అనే పదం నచ్చుతుంది.

  నిన్న రాత్రి గీతాంజలి నిన్న రాత్రి చాలా సేపు చదువుకున్నా...

  ReplyDelete
 12. "లోలోన ఆనందపడు నోరు లేని యోగి"!
  కొంచెం పెద్దయ్యాక అప్పుడప్పుడు నిద్దట్లో మంచి కలగని కిలకిలా నవ్వే నవ్వు, వీనులకి కూడా ఆనందాన్నిస్తుంది, మిస్సవ్వకండి (అవును స్వానుభవంతోనే చెప్తున్నా:-)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.