Tuesday, December 30, 2008

నా మొబైల్ కి తెలుగొచ్చేసింది

కొన్ని నెలల క్రితం, ఓపెరా విహరిణి తెలుగు లో రిలీజ్ అయినప్పుడు, వీవెన్ గారు ఓ టపా ద్వారా ఆ విషయం చెప్పారు. అప్పుడు ఓ అనుమానం వచ్చింది. మొబైల్ లో మన తెలుగు బ్లాగులు చూసుకోవచ్చా? అని. ఎందుకంటే, నాకు ఇంటి దగ్గర pc, లాప్టాప్ లేవు. పైగా వీలు చిక్కినప్పుడల్లా వారాంతాలు మా వూరికి ప్రయాణం పెట్టుకుంటూ ఉండడం వల్ల, ప్రయాణంలో బ్లాగులు చదువుకోడానికి అనువుగా మొబైల్ (ఓపెరా మినీ విహరిణి) లో చూసుకోవడం కద్దు. అయితే,నా మొబైల్ ఫోన్ (సోనీ ఎరిక్సన్ w 350-I) లో తెలుగు సదుపాయం లేదు. (అయితే యూనీ కోడు బెంగాలీ ఫాంట్, అరబిక్ వగైరా ఉన్నాయ్) అందుకే తెలుగు బ్లాగులు తెరిచినప్పుడల్లా, డబ్బాలు డబ్బాలు కనిపించేవి. ఫోన్ లో నేటివ్ ఫాంట్ లేకపోతే తెలుగు చదవడం కుదరదని ఓపెరా వారి ఉవాచ. వీవెన్ గారు ఆ విషయం ధ్రువీకరించారు.

ఈ రోజు ఉదయం ఓ అద్భుతం జరిగింది. మొబైల్ ఫోన్ లో ఎందుకో జీమెయిల్ చూసుకుంటుంటే, కొన్ని తెలుగు అక్షరాలు కనిపించాయ్. సరే అని, నా బ్లాగుకు వెళితే, చక్కగా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి. అలానే కూడలి, లేఖిని వగైరా...

నేను నా మొబైల్ సాఫ్ట్ వేరు ను అప్డేట్ చేయలేదు. ఓపెరా కొత్త వర్షను దింపుకోలేదు. నా ఫోన్ లో ఇప్పటికీ తెలుగు ఫాంట్ లేదు. అయితే ఇది ఎలా సాధ్యమయిందో తెలియట్లేదు. ఈ మధ్య మా వూళ్ళో ఓ internet cafe లో కెళ్ళి, పాత చిరంజీవి పాటలు, కొన్ని గేములు ఎక్కించుకు రావడం తప్ప మరే పాపమూ ఎరుగను. ఏదైనా వైరస్సు తగులుకుందో ఏమో మరి. ఒక వేళ అలాంటిదేమైనా ఉంటే, ఆ వైరస్సు మాతకు నమోవాకాలు! :-)

మొత్తానికి ఇది చాలా పెద్ద వింతే నాకు!

మొబైల్ లో నా బ్లాగు :-

9 comments:

 1. బ్లాగు లోకాన్నే కాదు, మీ మొబైల్ ను ఒక ఆట ఆడించారన్న మాట.

  ReplyDelete
 2. మీ టపా చూడగానే, ఆవేశంగా నా మొబైల్ కూడా చెక్ చేశా... కానీ, డబ్బాలు డబ్బాలే!!! :(

  ReplyDelete
 3. :) ఆశగా నా SE P900లోనూ చూశాను. opera mini, opera, net front మూడు బ్రౌజర్లలోనూ! రావట్లేదు. కానీ మీకు రావడం వండర్ గా ఉంది.

  ReplyDelete
 4. ఇలా ఎప్పటినుంచో కనిపిస్తున్నాయి. మొబైల్ లో తెలుగుబ్లాగుల కోసం ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు. నేను ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం కొన్న Nokia 6030 లోనూ చక్కగా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి.

  ఇంకా మీ మొబైల్ లోనే తెలుగు అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదు. పాత Mozilla Versions లో కనిపించినట్టు కనిపిస్తున్నాయి.

  ReplyDelete
 5. @శ్రీధర్ గారు : ఇప్పుడే మా ఆవిడ అందించిన వార్త. ఆవిడ క్రితం వారం నా ఫోన్ వాడుతూ, update service నొక్కిందిట. మీరు వాడే SEP900 కూడా సోనీ ఫోనే కాబట్టి, సెట్టింగ్స్ -> జెనెరల్ లో కెళ్ళి, update service నొక్కి చూడండి.

  @మేధ గారు, మీరు వాడే ఫోనూ సోనీ నే అయితే మీరూ ప్రయత్నించండి.

  @ప్రతాప్ గారు : ఆట లో నేను పావును మాత్రమే :-)

  @నాగప్రసాద్ గారు : Nokia 6030 లో తెలుగు సపోర్ట్ ఉందా? అలా ఉంటే అక్షరాలు కనిపిస్తాయి. నేను చెప్పినది, తెలుగు నేటివ్ ఫాంట్ సపోర్ట్ లేని ఫోన్లలో మాత్రమే. నేటివ్ సపోర్ట్ లేకపోయినా తెలుగు కనిపిస్తుంటే మాత్రం, మీకు, మీ ఫోన్ కు hats off చెప్పాల్సిందే!

  అవును.పాత మంటనక్కలోలా అలుక్కు పోయి కనిపిస్తున్నాయి. పర్లేదు లెండి, ఇదీ తర్వాత వర్షన్ లో మెరుగవుతుంది లెండి.

  ReplyDelete
 6. ఆయా కంపినీలు కొత్త పర్మ్‌వేర్స్ రిలీజ్ చేస్తుంటాయి . ఆయా వెబ్ సైట్స్ లో తెలుగు యూనికోడ్ సపోర్ట్ చేసే కొత్త పర్మ్‌వేర్ ఉండే అవకాషాలు ఉన్నాయి . ఉంటే డౌన్‌లోడ్ చేసుకుని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు .

  ReplyDelete
 7. నాది సోనీ కాదండీ...

  ReplyDelete
 8. నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ సంవత్సరమంతా శుభం చేకూరాలని కోరుకుంటూ...

  ReplyDelete
 9. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.