Monday, November 17, 2008

Appraisal - ఈ డిసెంబరు చలిగా ఉంటుంది.

కార్పోరేట్ కీకారణ్యంలో జనాభాకు యేటా జరిగే తద్దినం తంతు దగ్గర పడింది. బాసుర నక్కలు ఈ పాటికే వ్యూహాలు మొదలెట్టాయ్. ఎవరి నోటి దగ్గర కూడు లాక్కోవాలి? ఎవరికి ఏ సైజు లో పిండం పెట్టాలి. "అమెరికాలో ఎవడికో గజ్జి, దురద., కాబట్టి మన ఎకానమీ కృంగి పోయింది" అని ఏ కారణాలు చెప్పాలి? ఇలా...

ఇక్కడ బెంగళూరు లో దాదాపు ప్రతీ కంపనీలోనూ బాసుర వర్గం ఎక్కువగా తమిళ తంబీలే. ప్రతీ సంవత్సరం ఈ టైమ్ లో వాళ్ళు వాళ్ళ బుద్ధికి పదునుపెట్టి, అస్మదీయులకు ఏదో రకంగా పిండంలో ఎక్కువభాగం ఇచ్చేస్తుంటారు. ఆ అస్మదీయ కాకులూ ఏ మాత్రం సిగ్గు లేకుండా (పడకుండా) ఆ కూడును మింగేస్తుంటాయి. ఈ generalization తప్పే అయినా, నేను చూసిన, విన్న అనేక అనుభవాలు ఇవి. ఈ విషయంలో నాకు మన తెలుగు వాళ్ళే నచ్చుతారు. నాకు తెలుగు బాసు ఎప్పుడూ తగల్లేదనుకోండి, ఇన్నేళ్ళ నా సర్వీసులో.

క్రితం యేడాది నుంచి మా వీరముష్టి (కొరియను) కంపనీలో కొత్త దరిద్రం తీస్కొచ్చి పెట్టేరు. స్కూల్లో పిల్లలకు ఇచ్చినట్టు టీములో ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రేడు/రాంకు ఇస్తారంట. దీనిని forced evaluation system అని హెచ్ ఆర్ వారు నిర్వచించి, ఇది ఈ మధ్య ప్రతీ కంపనీ వాడు పాటిస్తున్న సరికొత్త పద్ధతి అని, క్రికెట్ లో Duckworth - lewis లాగ ఎవడో తెల్ల వాడు ఈ పద్ధతికి రూపకల్పన చేశాడనిన్నీ, ఈ రూలు మా కంపనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ సంస్థల్లోను (subsideries) పాటిస్తారనిన్నీ నమ్మబలికారు.

ఇది వాళ్ళు ప్రకటించిన కొన్ని రోజులకు నాకు మా CEO తో మాట్లాడే అవకాశం వచ్చింది.

మా కంపనీ CEO చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో "ప్రజల వద్దకు పాలన" టైపులో "Lunch with CEO" అనే వినూత్న పథకానికి రూపు దిద్దాడు. అయితే రెండేళ్ళ క్రితం, ఇలాంటిదేదయినా మొదలెడితే ఐదు చుక్కల పూటకూళ్ళ ఇంట్లో తేలే వాళ్ళం. ఖర్చులో కోత కారణంగా, ఇప్పుడు మాత్రం కంపనీలో ఉన్న ఓ మీటింగ్ రూమ్ లో కొన్ని పిజ్జాలు, బిరియానీ, పెరుగన్నం, ఓ హిమ క్రిమి తో ముగించారు. ఉన్న దరిద్రానికి తోడు, ఆ కార్యక్రమంలో నేను భాగం పంచుకునే రోజు సరిగ్గా ఆ lunch లో బిరియానీ పెడితే, అందులో బొద్దింక వచ్చింది. CEO ఆగ్రహోదగ్రులయారు. (వాడికి బొద్దింక వచ్చినా, పామొచ్చినా పెద్ద తేడా లేదు, కొరియా వాడు కాబట్టి. అయితే డ్రామాలాడి సీను రక్తి కట్టించాడు, మా మీద తెగ concern ఉన్నట్టు).

ఆ అవేశం నుండీ వాడు తేరుకోక ముందే, నేను వాణ్ణి అడిగాను, " ఇట్లా ఉద్యోగులకు, రాంకులు ఇవ్వడం కొరియాలో చెల్లుతుందేమో కానీ, ఇండియా లో చెల్లుబాటు కాదేమో" అని.

అదే నేను చేసిన తప్పు.

కొరియా గాళ్ళకు ఓ భయంకరమైన weakness. వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ కల్చరును విమర్శిస్తే ఏ మాత్రం తట్టుకోలేరు. (కేవలం సిద్ధాంతాల కోసం విడిపోయి, కొట్టుకు చస్తున్న దేశాలు, ఉత్తర, దక్షిణ కొరియాలు. ఇందులో ఉత్తర కొరియా ప్రపంచంలోనే అతి ప్రామాదకరమైన దేశం - నేషనల్ జియోగ్రఫీ వారి ఓ అంచనా ప్రకారం).

ఇక CEO గాడు, మౌలిక విలువలని, కన్ ఫ్యూషియస్ అని తెగ తిన్నాడు నాకు. (కన్ ఫ్యూషియస్ గురించి ఓశో ప్రవచనాల ద్వారా నాకు తెలుసు కొంతవరకు. నాకు తనపై పెద్ద అభిప్రాయం లేదు). చివరికి ఇదో అత్యుత్తమ పద్ధతి అంటూ తేల్చేడు.

నేను నచ్చజెప్పబొయేను, దీని వల్ల బాసురులకు వాళ్ళ అస్మదీయులను పైకి తెచ్చే ఓ అస్త్రం దొరుకుతుందని. వినలేదు వాడు.

గత యేడాది సరిగ్గా అలానే జరిగింది. మా టీములో తమిళ్ మాట్లాడే జనాభా మొత్తం పండుగ చేసుకున్నారు. (నాకు అరవం వచ్చినా,నాలో సీమ రక్తం ప్రవహిస్తూ ఉండటం వల్ల ఆ కుట్రలో పాలు పంచుకోలేదు).

పాలిసీ పెట్టిన ప్రతి యేడాది హెచ్ ఆర్ వాళ్ళు చెప్పే కథ ఏమంటే, "ప్రతీ పాలసీ లోనూ లోపాలుంటాయ్. ఓ మంచి పాలిసీ ని దీక్షగా పాటించడమే దీనికి సమాధానం" అని.

ప్రతి పాలిసీ లో లోపాలుంటే, కంపనీ మొత్తం లేదా టీము మొత్తం ఉన్న డబ్బును సమాన నిష్పత్తిలో పంచుకుంటే చాలు కదా. ఇంత భాగోతం ఎందుకు? దీనికి సమాధానం కూడా హెచ్ ఆర్ వారు ఓ నవ్వుతో దాటేశారు. (ఆ నవ్వులో మూసుకుని కూర్చోవోయ్, నువ్వో పెద్ద పిస్తా గాడివి బయలుదేరావ్ అన్న సందేశం ఉండాలి).

గత యేడాది జీతం సరిగ్గా పెంచనందుకు వాళ్ళు చెప్పిన కథ, "డాలరు విలువ పడిపోయింది. ఓ డాలరు కు 38 రుపాయలు. మన వ్యాపారం దెబ్బ తింది అని."

ఈ సారి ఓ డాలరుకు 48 రుపాయలు, పైగా మా కంపనీ వ్యాపారంలో యేడాది మొదటి అర్థం గత యేడాదికన్నా 10 శాతం ఎక్కువ లాభాలు ఆర్జించింది. (అనేక కంపనీలు, ఆ మాటకొస్తే). అయితే, వాళ్ళు చెప్పెబోయే కట్టుకథ మాత్రం, "అమెరికా లో ఆర్థిక సంక్షోభం!" అని.

కాబట్టి మానసికంగా ప్రిపేర్ అవడం మంచిది.

అన్నట్టు appraisal ను తెలుగు లో ఏమంటారబ్బా??

18 comments:

 1. బాగుంది :-)

  appraisal = అంచనా.

  ఉన్నదున్నట్లు చెప్పాలంటే పై అర్ధం. అంతకన్నా మంచివేమన్నా ఉన్నాయేమో.

  ReplyDelete
 2. మా అప్రైసలు సైకిలు ముందే అయిపోయింది కాబట్టి గుడ్డిలో మెల్ల.
  మీరు చెప్పిన మిగతా విషయాలన్నీ షరా మామూలే :-)

  ReplyDelete
 3. appraisal = విలువ కట్టడం
  బాగుంది.

  ReplyDelete
 4. నా అనుభవంలో,
  Appraisal = ప్రతి సంవత్సరం ఓ మూడు గంటలు చెవిటివాని ముందు శంఖం ఊదటం.

  ReplyDelete
 5. నా అప్ప్రైసల్ మొన్న jul-sep సైకిల్లో అయ్యింది. మాంచి హైక్ ఇచ్చారు.ఆ హైక్ తో రెండు బనీన్లు రెండు కర్చీఫ్ లు కొనుక్కుని మిగాతా డబ్బుల్తో బఠాణీలు కొనుక్కున్నా:)

  ReplyDelete
 6. Good luck Ravi గారు... బాగా రాసారు :-)

  ReplyDelete
 7. బాగుంది. అన్నట్లు సీమలో ఏ ఊరో మీది.

  ReplyDelete
 8. :) బాగుంది. కాకపోతే తెలుగు బాసురులు తమిళ బాసురులకంటే ఒక పది పదిహేను ఆకులు ఎక్కువ చదివారు, వాళ్ళు బాగుపడరు, పక్క వాడిని బాగు పడనియ్యరు. అమ్మ పెట్టపెట్టదు, అడుక్కు తినానియ్యదు అనే రకాలు

  ReplyDelete
 9. భలే ఉంది మీ appraisalO పాఖ్యానం!

  ReplyDelete
 10. నన్ను అది ఫిల్ చేసి పంపించమన్నారు కాని నేను ఇంక పంపించలేదు.
  నెలైంది. ఎప్పుడు పంపించిన ఉపయోగం ఉండటం లేదు. ఈ సారి ఎందుకు
  పంపించలేదు అనడిగితే అదే చెప్తా.

  - కిరణ్
  ఐతే OK

  ReplyDelete
 11. @పూర్ణిమ : అంతే లెండి. ఒకరి బాధ ఇంకొకరికి నవ్వులాట అవుతుంది :-).

  @అబ్రకదబ్ర : estimation = అంచనా కదా?

  @ప్రవీణ్ : పోన్లెండి, గుడ్డిలో గుడ్డి కంటే బెటరే.

  @కొ.పా గారు : అర్థం సరేనండీ, పదం దొరకట్లేదు.

  @రాజు : చెవిటి వాడికి మిషను కొని పెట్టి ప్రయత్నిద్దామంటారా?

  @మధు : ఇంకేం. కూడు, గుడ్డ అయాయి. గూడు వచ్చేసారికి వస్తుంది.:-)

  @వేణూ శ్రీకాంత్ : good luck అప్రైసల్ కా, రాసినందుకా?:-) anyway, మీక్కూడా ..

  @చిలమకూరు విజయమోహన్ : పుట్టినది కడప జిల్లా అయినా , చదువు సంధ్య అన్నీ అనంతపురం లో.

  @laxmi గారు : ఎవరి బాధలు వారివి :-)

  @సుజాత గారు : నెనర్స్ :-)

  @కిరణ్ :
  చేరినవాడికి అప్రైసల్ తప్పదు.
  అప్రైసల్ అయిన వాడికి బాధ తప్పదు.
  అనివార్యమగు ఈ విషయమున ధీరులు మోహమునందరు.

  ReplyDelete
 12. అప్రైజల్ అంటే..సొంత డబ్బా(స్వోత్కర్ష)అనొచ్చేమో..

  ReplyDelete
 13. appraisal = estimating (the value of something/somebody) = అంచనా.

  కానీ తెలుగులో 'అంచనా' అనేది అంత సూటయినట్లనిపించలేదు. అందుకే నేను భుజాలెగరయ్యటం - మొదటి వ్యాఖ్యలో :-)

  ReplyDelete
 14. పూర్వకాలపు అత్తాకోడళ్ళు ఈ కాలంలో బాసూ-తాబేదార్లగా పుడుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది :-)
  అయితే కోడళ్ళ గొంతు వినిపించినంత అత్తగార్ల గొంతు వినిపించక పోవడం ఆశ్చర్యం!
  Appraisalకి "అంచనా" నచ్చకపోతే "మదింపు" వాడుకోవచ్చు (కాస్త ఘాటుగా కూడా వినిపిస్తుంది!).

  ReplyDelete
 15. @భైరవభట్ల గారు : నేను పూర్వకాలపు అత్త గారినే అయినా ఒకింటి కోడలుగా ఈ టపా రాసాను :-).

  "మదింపు" - ఇది బావుంది.

  ReplyDelete
 16. మల్టీ నేషనల్ కంపెనీల లో ...ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ఈ కష్టాలు కొత్త కాదండి .. కాలం మారుతుంది,., విలువలు మారుతున్నాయి.. మనిషి ఆలోచనలు మారుతున్నాయి.. అంతా డబ్బు మాయమై పోయింది కదండీ ...

  ReplyDelete
 17. >>వీరముష్టి (కొరియను) కంపనీలో
  మరీ అలా మన(కొరియన్) కంపెనీల గురించి మనమే పొగుడుకుంటే బావుండదేమో..!

  >>స్కూల్లో పిల్లలకు ఇచ్చినట్టు టీములో ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రేడు/రాంకు ఇస్తారంట
  మాకు ఈ పధ్ధతి ఆల్రెడీ పెట్టేశారు.. :(

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.