Friday, October 24, 2008

ప్రాక్సీ తో నా ప్రయోగాలు!

భగవంతునికీ భక్తునికీ అనుసంధానించడానికి అంబికా దర్బారు బత్తి లా, ఆఫీసులో మీకూ (మీ విహరిణికీ) బ్లాక్ చేయబడ్డ సైట్లనూ చూడ్డానికి నేను ప్రయత్నించిన విధానాలు కొన్ని ఇక్కడ. మీరు నాలాంటి బాధితులే అయితే, ఈ ప్రయత్నాలు ఉపయోగపడతాయేమో ప్రయత్నించండి.

డిస్క్లైమర్ : ఇవి నేను ఎప్పుడో యూత్ లో ప్రయత్నించిన అస్త్రాలు. ఇప్పుడు పని చేయకపోతే నన్ను బూతులు తిట్టుకోవద్దు.

ముందుగా నల్లమోతు శ్రీధర్ గారి ఈ టపా చూడండి.

నా ప్రయత్నాలు.

1. మీ కంపనీ ప్రాక్సీ సర్వరు యూనిక్స్ (లైనక్స్) సర్వరా? అందులో మీకు అకవుంట్ ఉందా? అలా అయితే ఇది ప్రయత్నించండి. ముందుగా winaxe అనే ఈ ఉపకరణాన్ని దింపుకోండి. ఇదో x-సర్వర్. అంటే, మీ సర్వరు లో ఉన్న x windows ను మీ windows లో తెచ్చుకోడానికి ఉపయోగపడే మంచి ఉపకరణం. అంటే, మీరు కేవలం telnet ద్వారా మీ సర్వర్ కు లాగిన్ అయి, నల్లగా ఓ తారు డబ్బాను తెరుచుకుని, అందులో మీరు చేయవలసిన యూనిక్స్ పనులు చేసుకోకుండా, మీ windows PC లోనే, ఓ లైనక్స్ ఎక్స్ విండోస్ ను రన్ చేయాలనుకోండి. ఈ ఉపకరణం ఉపయోగపడుతుంది.

ఉపయోగించే విధానం : దింపుకుని, సంస్థాపించుకున్న ఆ ఉపకరణాన్ని, రన్ చేయండి. ఇప్పుడు మీ లైనక్స్ సర్వర్ లో టెల్ నెట్ ద్వారా ప్రవేశించి, షెల్ ప్రామ్ట్ దగ్గర ఇలా టైపించండి.

$export display=xx.xx.xx.xx:0 (xx.xx.xx.xx ఉన్నచోట మీ pc ఐ పీ అడ్రసు).
$netscape (లేదా విహరిణి నామం) లేదూ $gnome-session అని టైపిస్తే, మొత్తం అక్కడి డస్క్ట్ టాప్ మీ pc లో లభ్యం.

ఇప్పుడు మీ pc లో మీ లైనక్స్ సర్వర్ కు సంబంధించిన విహరిణి తయారు! మామూలుగా సర్వరులో సైట్లు బ్లాక్ చేసి ఉండరు కాబట్టి, అక్కడ మీరు చూడాలనుకున్న(బ్లాక్ అయిన) సైట్లు చూసుకోవచ్చు.

2. మల్టీ ప్రాక్సీ : కొన్ని పెద్ద పెద్ద కంపనీల్లో ఒక్క సర్వరు కాక, లోడ్ బాలన్స్ అవడానికని ఒకటి కంటే ఎక్కువ సర్వర్లను వాడటం కద్దు. మీ కంపనీ లోనూ అలాంటి పరిస్థితి ఉన్నట్లయితే, మల్టీ ప్రాక్సీ అన్న ఉపకరణాన్ని గూగిలించి పట్టండి. ఇలాంటివి చాలా ఉన్నాయ్. (మల్టీ ప్రాక్సీ అనబడే పేరు తోనే ఓ ఉపకరణం ఉన్నది.అయితే, నేను దాన్ని వాడి ఎన్నో ఏళ్ళు గడిచాయ్.ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటో తెలీదు.) ఆ ఉపకరణం దింపుకుని సంస్థాపించండి. అది, డొబర్ మాన్ కుక్కలాగా మీ కంపనీ సర్వర్ లన్నిటినీ వాసన పసికట్టి ఓ లిస్ట్ తయారు చేస్తుంది. ఆ తర్వాత మీరు చూడాలనుకున్న సైట్ మీ కంపనీలో ఏ ప్రాక్సీ లో తెరుచుకునే వీలుందో, దాన్ని వెతికి, తద్వారా మీ ఆర్తి ని తీరుస్తుంది. ఇంకో సౌలభ్యం ఏమిటంటే, ఇందులో మీ pc ఐ పీ అడ్రసు ను మాస్క్ చేసుకోవచ్చు. అంటే, మీరు మీ pc కి మీ బాసు పేరో, మీకు నచ్చనోడి పేరో ఈ ఉపకరణం ద్వారా తగిలించి, వాడు బ్రవుస్ చేస్తున్నట్టూ, మీరు చాలా sincere గా పని చేసుకుంటున్నట్టు డ్రామాలాడవచ్చు. మంచి ఉపకరణం. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయ్ దీనిలో.

3. ఇంకో చిన్న అవుడియా. మీకు కొన్ని పాక్సీ లు తెలుసు http://www.vtunnel.com/, http://www.kproxy.com/ వంటివి.

అయితే ఇవి మీ ఆఫీసులో తెరుచుకోవు! ఇప్పుడో పని చేయండి. ఆ ప్రాక్సీ ల ఐ పీ అడ్రస్ (పింగ్ చేసి) కనుక్కోండి. డాస్ డబ్బా ఒకటి తెరిచి, అందులో ping http://www.kproxy.com/ అని టైప్ చేస్తే తెలిసిపోతుంది.ఇప్పుడు విహరిణి నావిగేషన్ బార్ లో ఈ ఐ పీ అడ్రస్ టైపు చేయండి. ఇది చాలా వరకు పని చేస్తుంది.

4. ఇది చాలా మందికి తెలిసిందే...చాట్ చేసుకోడానికి మీకు అవకాశం లేకపోతే, మీబో ను ఉపయోగించండి. ఇలాంటిదే మరోటి ఉండాలి, సబీర్ భాటియా ది. పేరు మరిచాను.

***************************

ఇవి కాక ఇంకా ఏమన్నా పద్ధతులు తెలుస్తే, దయచేసి నాకు తెలపండి. :-)

5 comments:

 1. మీరు చెప్పినవాటిల్లో రెండోది తప్ప, మిగతావన్నీ తెలుసు.. :)
  అంతకుముందు కంపెనీలో అయితే, ప్రాక్సీ సైట్స్ విపరీతం గా కనుకునే వాళ్ళం... ఏ క్రొత్తది కనుక్కున్నా, మా admin బ్లాక్ చేసేవాడు.. మేమైనా తక్కువ తిన్నామా, అని ఇంకోటి... ఇలా చాలా పోటా-పోటీగా నడిచేది మాకు :)
  ఇప్పుడున్న కంపెనీలో ఇలాంటి బాధలు లేవు, సో ప్రస్తుతానికి క్రొత్త అయిడియాస్ లేవు...

  ReplyDelete
 2. Ravi gaaroo..సూపర్...Baagundi .. నా దగ్గర ultra proxy software ఉంది.. నా సందేహం ఏమిటంటే మనం వీటిని ఉపయొగిస్తున్నపుడు system admin కి తెలెసె అవకాసం ఉందా..??
  proxy గురించి కొంచెం డీప్ గ చెప్తారా?

  ముందు ముందు ఇలాంటి దొంగ పద్దతులు మరికొన్ని చెప్ప వలసింది గా కోరుతూ

  మీ కొత్త అభిమాని

  వేణూరాం

  ReplyDelete
 3. సూపరో సూపరు!

  ReplyDelete
 4. >>1. మీ కంపనీ ప్రాక్సీ సర్వరు యూనిక్స్ (లైనక్స్) సర్వరా? అందులో మీకు అకవుంట్ ఉందా?

  proxy server లొ జనాలకి uid లు ఇస్తారా? మేము ఇవ్వవం.

  ReplyDelete
 5. One cannot even ping to a proxy server in my env.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.