Friday, October 3, 2008

ఒక(ప్పటి) ఊపున్న పాట !!

ఈ మధ్య ఆఫీసులో పనెక్కువై, యాహూ పాత మెయిలు చూస్తుంటే, నా మొట్టమొదటి ప్రచురణ కనబడింది. అది చూస్తూనే గుండేలో మరీ కోటి కాకపోయినా, ఓ వెయ్యి వీణలు మోగాయ్. ఇక భరించలేక ఇక్కడ పెడుతున్నాను. అదో పేరడీ పాట.

మృదులాంత్రం (జావా) ఊపులో ఉన్నప్పుడు ౨౦౦౦ లో, మృదులాంత్రం లో అడుగుపెట్టిన, అడుగుపెట్టదలుచుకున్న, ఔత్సాహికులు, పాడుకోదగిన ఊపున్న పాట అది.

అనగనగా ఓ యూఎస్ వుంది
యూఎస్ లోనే ఐటి వుంది
ఐటి వెనకే డాలర్ వుంది
డాలర్ జనులను కదిలించింది
కదిలే జనతా పరుగెత్తింది
పరుగే ప్రైవేట్ కోర్సయ్యింది
ప్రైవేట్ కోర్సే చెసిన జనులా
హెచ్1 వేట మొదలయ్యింది

బాడీషాపర్ నువ్వే కావాలి
నా బాడీషాపర్ నవ్వే కావాలి.
డాలర్ల పంటే పండాలి
యూఎస్ డాలర్ల మోతే మోగాలి.

సాఫ్ట్వేర్ కొమ్మలలోనా ఒ జావా, ఖవ్వాలి పాడి కచ్చ్చేరిచేసే వెళల్లో,
సర్వర్ గుమ్మంలోనా సరదాగా ఒక సర్వ్లెట్ రాసి,హోస్టింగు చేసే వేళల్లో,
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా, కవ్వింతగా

ఆఆ ఆ ఆఅ ఆఆ ఆఆఅ....ఆఆఆఆఆ ఆ

నీ చెలిమే చిటికేసి, నను పిలిచే నీకేసి
నువు ప్రాసెస్ చేసే ,హెచ్1 కోసం నేనొచ్చేసా, పరుగులుతీసి !! (బాడీషాపర్ నువ్వే..)

సిలికాన్ వేలీ చుట్టు , తిరగాలి అనుకుంటూ వూహవూరేగే వెన్నెల దారుల్లో,
నేనున్నా రమ్మంటూ, ఒ ఎంప్లాయర్, గాలాన్నే వేసే వేళల్లో,

నూరేళ్ళకీ సరిపోయె డాలర్స్నీ పండించగా,
ఆ తలపులు చిగురించి , మనసులు కదిలించీ

మరింత మంది సాఫ్ట్వేర్ జనులను యూఎస్ వైపుకు లాగేవేళ,
బాడీషాపర్ నువ్వే కావాలినా బాడీషాపర్ నవ్వే కావాలి...


అనగనగా...

********************************

అప్పుట్లో నేనూ యూఎస్ కోసమ్ ఎగబడ్డాను. అయితే, నా పేపర్స్ రాగానే, అక్కడ యూఎస్ లో భవానాలు కూలాయి.
సరే, కేవలం పేపర్స్ వస్తేనే ఇంత జరిగితే, అక్కడికి వెళితే ఏం జరుగుతుందో అని, లోకకల్యాణార్థం విరమించుకున్నా.

*******************************

ఆ పై పేరడీ అప్పట్లో indiainfo.com అన్న తెలుగు వెబ్ సైట్ లో ప్రచురించబడింది.

Hello Mr.Ravi,We are delighted by your parody song of Nuvve Kavali. And, as you suggested,we put it on the net.http://telugu.indiainfo.com/cinema/slideshow/index.html. Read this andenjoy. Keep sending funny things.All the best,Regards,Yours sincerely,JalapathyTeam memberhttp://telugu.indiainfo.com

(ఇది నా 50 వ టపా. రాయడమే గొప్ప అనుకునే నాకు ఇంత ప్రోత్సాహించీ, ఇన్ని టపాలు రాయించిన బ్లాగ్మిత్రులకు వేల వేల కృతఙ్ఞతలు).

17 comments:

 1. మీ 50వ టపాకు అభినందనలు.

  పారడీ బాగుంది.

  ReplyDelete
 2. ఇలాగే బ్లాగాడిస్తుండండి...
  అన్నట్టు మీ రవి.ఈఎన్‌వీ జీమెయిలుకి ఒక వేగు పంపాను చూడండి.

  ReplyDelete
 3. అహా.. పాటలనూ ఆడిస్తుంటారా? పారెడీ బహు బాగు!

  యాభైవ పోస్టుకు హార్దిక అభినందనలు! మీరు బ్లాగాడిస్తూ ఉండండి, మేం ఆశ్వాదిస్తూ ఉంటాము. :-)

  ReplyDelete
 4. Congratulations Ravi. Keep rocking. it was a nice parody.

  ReplyDelete
 5. భలే ఉందండీ మీ పాట!మీ టపాలు 50 నిండిన సందర్భంగా మీకివే మా అభినందనలు! తొందరలొనే 100 కొట్టాలని ఆశిస్తున్నాను!

  ReplyDelete
 6. మాస్టారూ...మీ "పాట" "టపా" అదిరాయ్.
  మీ పాటకి 'నువ్వే జావాలి ' అని పేరు పెట్టండి :)

  ReplyDelete
 7. బలే ఉందండీ మీ పేరడీ! ఇంకేవైనా పేరడీలు రాస్తే అవికూడా టపాయించండి. చదివి నవ్వుకుంటాం.
  యూఎస్ కవలభవనాలు కూలడానికి మీ వీసా కారణమనుకొన్నారా, అయ్యో కాదండీ!
  అసలు విషయం (ఇది మనలోనే ఉండాలి సుమండీ), నేనూ మా ఆవిడా ఆ భవనాలని దర్శించి, అక్కడ మొదటి అంతస్తులో ప్రపంచంలోని రకరకాల జెండాలు పెట్టడం చూసి, మన భారత జెండా లేకపోవడాన్ని తీవ్రంగా ఖండించి దాన్ని ఎక్కడం మానేసి ఓ శాపమిచ్చి వెళ్ళిపోయాం.
  అంతే ఆ తర్వాత మూడు నెల్లకే అవి ఫట్టు :-)

  ReplyDelete
 8. రవిగారూ, పేరడీ అదిరింది. అమెరికాలో భవనాలు కూలడంలో మీ హేండూ (లెగ్గూ) ఉందన్నమాట. నేను అప్పటికే కొన్ని నెలల ముందు లండన్ వచ్చాను. న్యూయార్క్ టీములో కొన్నాళ్ళు పని చెయ్యడానికి నాకు ఇక్కడినుంచే వీసా ఇప్పించారు. సెప్టెంబరు 17న ప్రయాణం. ఇంకెక్కడి ప్రయాణం లెండి. :-)

  ReplyDelete
 9. మీ అర్థ శతకానికి అభినందనలు. శతకం వైపు దూసుక వెళ్ళండి.

  ReplyDelete
 10. మీ 50వ టపాకు అభినందనలు.
  పారడీ చాలా బాగుంది. రిషిగారు చెప్పింది కూడా బాగుంది :)

  ReplyDelete
 11. యాభయ్యవ టపాకు అభినందనలు. పారడీ బాగుంది.
  9/11 కుట్రకు ఇంతమంది భాగస్వాములున్నారని నాకు తెలియదు. హమ్మా! నాగమురళి, కామేశ్వరరావు, రవి, ఇంతమంది కుట్రదారులా! ఎవరికి చెప్పాలి సుమా? మీరంతా మా బిన్‌ లాడెన్‌ నుంచి కీర్తిని లాగేసుకుందామనే - నేనొప్పుకోను - ఒప్పుకోనంటే ఒప్పుకోనంతే.

  ReplyDelete
 12. అర్ధశతకానికి అభినందనలు... ప్యారడీ బావుంది... :)

  ReplyDelete
 13. రవి, ముందుగా 50వ టపాకు అభినందనలు. కానీ మరీ నిదానంగా ఉంది నీ బ్లాగ్ నడక.. పరుగెత్తు.

  ReplyDelete
 14. రవి గారు ముందుగా అర్ధ శత టపా శుభాభినందనలు. పేరడి అదిరింది.

  ReplyDelete
 15. As usual నెనర్లు :-). ఓ యేడాది క్రితం, onsite lO ల్యాప్ టాపు, ఇన్టర్నెట్, తేరగా దొరకడంతో ఈనాడు ఆదివారం లో తెలుగు బ్లాగర్ల గుంపు మీద వ్యాసం చూసి ఆవేశంతో, త్రివిక్రం అనబడే ఒకాయన బ్లాగు ను మొట్టమొదటి సారి చూసి, నేను మొదలెట్టాను.

  రాసిన వాటిలో 80 % ఉబుసుపోక అలా సాయంత్రం ఓ అరగంట ఆఫీసులో కూర్చుని రాస్తే, మిగిలిన 20 % బుర్ర వాయగొట్టుకుని, ఎప్పుడో రాసుకున్న నోట్స్ తిరగేసి రాసినవి.

  నాకసలు, రాయడమే పెద్ద విషయంగా కనిపిస్తే, నా టపా లు చదివి, ఇంత సీను రావడం చాలా చాలా పెద్ద విషయం.

  నెనర్లు మరోసారి.

  ReplyDelete
 16. �� చాలా హాస్యస్ఫోరకంగా ఉందండీ రవిగారూ.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.