Friday, September 19, 2008

నెట్ వర్క్ లాక్ అంటే?

అనుకున్నట్టుగానే ఐ-ఫోన్ అట్టహాసంతో వచ్చి, ఈ సరికి బాగా చప్పబడిపోయింది. ఇక్కడ మన సగటు భారత దేశపు కొనుగోలుదారుడిని ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఎందుకంటే, మామూలుగా వచ్చే చిన్న చిన్న ఫీచర్స్ కూడా ఇందులో లేవు. (ఉదా: sms forward, బ్లూ టూత్ ద్వారా ఇతర ఫోన్లకు అనుసంధానించడం వగైరా...)ఈ ఐ-ఫోన్ మొదట అమెరికా లో విడుదల అయినప్పుడు, అక్కడ జనాలు ఎగబడ్డానికీ, అక్కడ సక్సెస్ అవడానికీ కారణం, 3జీ ఫీచర్స్ అని నాకో అనుమానం.

నా మిత్రుడు ఒకతను, మొన్నామధ్య ఓ విషయం అడిగాడు. ఐ-ఫోన్ ఎయిర్ టెల్, వొడా ఫోన్ ల ద్వారా విడుదల అయింది కదా, ఫోన్ కొనుక్కుని, ఎయిర్ టెల్ లేదా వొడా ఫోన్ సిమ్ తీసేసి, ఐడియా సిమ్ వేసుకోవచ్చా? అని. ఐ-ఫోన్ సంగతి నాకు తెలియదు. అయితే,ఇదే ప్రశ్నఇంకో రకంగా అడగాలంటే "నెట్ వర్క్ లాక్ అంటే యేమిటి?" సెల్ ఫోన్ ను ఒక్క ఆపరేటర్ (ఎయిర్ టెల్) కి పరిమితం చేయవచ్చా? అని ప్రశ్నిస్తే..

సమాధానం.. వచ్చు. 3 పద్ధతుల ద్వారా. అవేవో చూద్దాం.

౧. MCC - MNC lock : అంటే, mobile country code, mobile network code అని. ప్రపంచంలో ఉన్న మొబయిల్ ఆపరేటర్లను గుర్తించడానికి ఉపయోగపడే సంకేతాలు ఇవి. వీటిని రెంటినీ కలిపి ఉపయోగిస్తారు, సాధారణంగా. ఇది మీరు వాడుతున్న సిమ్ లో పొందుపర్చ బడి ఉంటుంది. మీ సెల్ ఫోన్ బూట్ అవగానే, సిమ్ లో ఉన్న సమాచారాన్నంతా చదువుకుని, అందులో ఉన్న MCC, MNC సంకేతాన్ని కూడా తెలుసుకుంటుంది. ఆ సంకేతాన్ని కేవలం సంబంధిత ఆపరేటర్/కారియర్ కు పరిమితం చేయడం ద్వారా, మీ మొబయిల్ ఫోన్ ను ఇతర నెట్ వర్క్ లో పని చేయించకుండా ఆపగలుగుతారు.

దీన్నే ఇంకో రకంగా కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మొబయిల్ ఫోన్ కంపనీ వారు (నోకియా/సోనీ వగైరా) ఒకే మొబయిల్ ను అనేక దేశాల్లో విడుదల చేయవచ్చు, ఆయా దేశాలకు సంబంధించిన సమాచారాన్ని, ఫీచర్లను పొందుపరిచి. అంటే, ఉదాహరణకు సోనీ 350 I అన్న ఫోన్ ఉందనుకోండి. ఈ ఫోన్, భారతదేశంలో హిందీ భాషలో, కొన్ని భారతదేశానికి సంబంధించిన ఫీచర్లతో మార్కెట్లో ప్రవేశించింది. ఇదే ఫోన్, తిరిగి, గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేయాలనుకోండి. మామూలుగా అయితే, మళ్ళీ తిరిగి మొబైల్ సాఫ్ట్ వేర్ ను పూర్తిగా మార్చాలి. (అరబిక్ భాష, నమాజు సమయాలు వగైరా లాంటి ఆయా దేశపు ఫీచర్లను పొందుపరిచి). అయితే, MCC MNC lock ద్వారా సాఫ్ట్ వేర్ ని తిరిగి రాయాల్సిన అవసరాన్ని పూర్తిగా లేదా కొంతవరకు నిరోధించవచ్చు. (గల్ఫ్ దేశాలకు సంబంధించిన)MCC MNC సంకేతాన్ని గ్రహించి, ఇక్కడ భారతదేశపు ఫోనే (భారత దేశానికి చెందిన సాఫ్త్వేర్నే) ఆ దేశానికి అనుగుణంగా ప్రవర్తింపజేయవచ్చు.తద్వారా మొబయిల్ సంస్థలు development cost ని తగ్గించవచ్చు.

చివరకు వచ్చేసరికి కొనుగోలుదారుడికీ లాభం. మొబయిల్ ఖరీదు తగ్గడం ద్వారా.

౨. SID/NID Lock : System Identification number & Network identification number పూర్తిగా చెప్పాలంటే.

ఇక్కడ system అంటే, సెల్ల్యులార్ system అని అర్థం.SID అన్నది 15 బిట్ నంబరు. ఇది base station (మొబైల్ టవరు) ద్వారా సెల్ ఫోన్ కి పంపబడే సంకేతం. ఈ SID సంకేతం అందుకున్న తర్వాత, సెల్ ఫోన్, తన సాఫ్ట్వేర్ లో భాగమైన PRL (Preferred Roaming list) ద్వారా, హోం నెట్వర్క్, లేదా రోమింగ్ అన్న దాన్ని నిర్ధారిస్తుంది.ప్రతి ఆపరేటర్ కు ఈ SID రేంజ్ అన్నది ఆ దేశపు టెలికామ్ అథారిటీ నిర్ణయిస్తుంది.

ఇక NID అన్నది SID కి ఒక ఉపవ్యవస్థ. (sub system).ఇది 2 బైట్ నంబరు.

ఓ ఆపరేటర్ కు సంబంధించిన SID-NID రేంజి ను ముందుగానే తెలుసుకుని, ఆ పరిధి కి ఆవల ఉన్న SID లను ఫిల్టర్ చేసి, ఓ మొబయిల్ ఫోన్ ను ఒక్క ఆపరేటర్కు మాత్రమే పనిచేయించవచ్చు.

౩. MIN Lock : మీ GSM మొబయిల్ లో *#06# అని టైప్ చేసి చూడండి. మీకో నంబరు కనబడుతుంది. దాన్ని IMEI నంబర్ అంటారు. ఈ నంబరు మొబైల్ తయారీదారు వారి ఫాక్టరీ లో తయారయిన మొబయిల్ ను గుర్తించేకి ఉద్దేశింపబడ్డది. MIN నంబరు కూడా అలాంటిదే. ఇది మీ నెట్వర్క్ ఆపరేటర్ (airtel/vodaphone/bsnl)మీ మొబయిల్ ను గుర్తించడానికి ఉపయోగించే ఓ (10 అంకెల) నంబరు . చాలా సందర్భాల్లో, MIN నంబరు, మొబయిల్ నంబరు ఒకటిగానే ఉంటాయి. ఒక్కొక్క ఆపరేటర్ కు ఈ MIN పరిధి నిర్ణయించబడి ఉంటుంది. ఆ పరిధి ని నియంత్రించడం ద్వారా మొబయిల్ ను ఒక్క ఆపరేటర్ కు నియంత్రించవచ్చు.

*******************************

అయితే, పై చెప్పిన పద్ధతులు సాఫ్ట్ వేర్ ద్వారా నియంత్రించవలసినవే, సాధారణ మొబయిల్ వాడకందారు కు వీటితో అవసరం పడదు.

ఓ పక్క మొబయిల్ సంస్థలు (ముఖ్యంగా CDMA మొబయిల్ తయారీ లో ఉన్నవి), తమ ఆపరేటర్ల కోసం ఇలా మల్లగుల్లాలు పడుతుంటే, హాకర్లు, పై చెప్పిన lock లను చేదించే పనిలో పడ్డారు. ఇది పైకి కనిపించకపోయినా చాలా ప్రమాదకారి. దీని వల్ల Reliance వంటి ఆపరేటర్లకు చాలా నష్టం. వీరి మొబయిల్ ఫోన్ లు స్మగుల్ కాబడి, pirated సాఫ్ట్వేర్ ద్వారా ఇతర దేశాల్లో చలామణి అవబడే అవకాశం ఉంది. ఈ వ్యవహారాలకు కేంద్ర బిందువు చైనా.

6 comments:

 1. మిగతావాటి గురించి పెద్ద ఐడియాలేదుగానీ, MCC-MNC lock ని బ్రేక్ చెయ్యడం ఈజీనే అనుకుంటున్నాను.

  ReplyDelete
 2. ఓహో! మంచి సమాచారం.

  ఐఫోనులో నెట్‍వర్క్ లాక్ ఏ పద్ధతితో చేస్తారో? దానిని ఆల్రడీ జెయిల్ బ్రేకు చేసే ఎన్నో పద్ధతులు చలామణీలో ఉన్నాయి.

  ReplyDelete
 3. నిజమే ఫోన్ ని లాక్ చెయ్యడం చాలా సులువు అలానే అన్లాక్ చెయ్యడం ఇంకా సులువు.

  ReplyDelete
 4. @ప్రవీణ్ : లంకె బావుంది. తీరిగ్గా చదవాలి ఆఫీసులో :-)

  @falling angel, @ప్రతాప్ : వీజీయే. లక్షలు గుమ్మరించి, సాఫ్ట్వేరు తయారు చేసి, చివరికి ఆ బైనరీ ని కాపాడుకోవడం పెద్ద సమస్య. దీన్నుండీ కోట్ల నష్టం.పైగా పైకి కనిపించదు.

  ReplyDelete
 5. Ravigaru, I don't know in what industry you work, but I work for a major handset maker.

  Frankly, they don't give a shit :)

  ReplyDelete
 6. Good information ravi gaaru ... Expecting this type of technical information from you..

  Thank you.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.