Saturday, May 31, 2008

మొబైల్ ఫోన్ల నూతన పోకడలు

మార్కెట్ లో రోజుకో సెల్ ఫోను విడుదలవుతూందీ మధ్య.

మొబైల్ ఫోన్ వాడకం దార్లు పెరిగే కొద్దీ అటు మొబైల్ సంస్థలు, ఇటు నెట్ వర్క్ ఆపరేటర్లు కొత్త కొత్త పద్ధతులతో మార్కెట్ పై దాడి చేస్తున్నారు. ఓ ఏడాదిన్నర క్రితం 13000 ఖరీదు చేసే (అప్పటికి) నవ నూతన మొబైల్ ఫోను ఇప్పుడో 7500 కి లభిస్తోంది. ఇక మార్కెట్ లో 4000 కే ఎక్స్ టర్నల్ మెమరీ, ఎం పీ 3 లు, బ్లూ టూత్ సుదుపాయాలున్న సెల్ ఫోన్లు లభ్యమవుతున్నాయి.

తొండ ముదిరితే ఊసరవెల్లి. మొబైల్ ముదిరితే, ఓ కెమెరా, ఓ కాం కార్డరూ, ఓ ఎం పీ 3 ప్లేయరూ, వగైరా వగైరా.

ఐతే ఇవి కూడా క్రమంగా పాతబడుతున్నాయి.

ఇక వాడకం దార్లను ఆకర్షించడానికి మొబైల్ సంస్థలు కొత్త కొత్త దార్లను ఎంచుకోవాలిగా.

సెల్ ఫోన్లలో ఈ కొత్త సదుపాయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

మొబైల్ కాం కార్డరు : మొబైల్ కెమెరా పాతబడిపోయింది. ఇక వచ్చే సెల్ ఫోన్లలో కాం కార్డరు (రక రకాల ఫైల్ ఫార్మాట్ ల సపోర్ట్ తో) ఓ తప్పని సరి అంశం కాబోతోంది.

మొబైల్ ఫోన్ కి టీవీ అనుసంధానం : మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా.., సారీ మొబైల్ కెమెరా/కాం కార్డరు ద్వారా తీసిన చిత్రాలను ఓ కేబుల్ వైరు ద్వారా టీవీ కి అనుసంధానించుకోవచ్చు. ఎల్ జీ వారి వ్యూటీ మొబైల్, సోనీ ఎరిక్సన్ కొత్త మాడల్స్ దీనికి ఉదాహరణ.

మల్టి సిం కార్డ్ సపోర్ట్ : ఒకే మొబైల్ ఫోన్ లో జీ ఎస్ ఎం, సీ డీ ఎం ఏ సదుపాయాలు. లేదూ, 2 జీ ఎస్ ఎం - సిం కార్డ్ లను వాడుకోవచ్చు. స్పైస్/ఏర్టెల్ మొబైల్ వారు ఇలాంటి మొబైల్ విడుదల చేసినట్టు గుర్తు. ఐతే, ఈ టెక్నాలజీ ఇంకా అంతగా అభివృద్ధి చెందలేదు. పైగా అభివృద్ధి చెందుతున్న (మన దేశం లాంటి) దేశాల్లో ఇది అంత ఆకర్షణీయమైన సదుపాయం కాదు. అందుకే దీనికంతగా ఆదరణ పెరగలేదు.

ఎఫ్ ఎం, వాయిస్, కాల్ రికార్డింగ్ : వాయిస్ రికార్డింగు తెలిసిన అంశమే. ఎఫ్ ఎం, కాల్ రికార్డింగ్ కొత్తవి. ఇవి కాస్త ఆకర్షణీయమైన ఫీచర్సే. కాల్ రికార్డింగ్ అంటే మీకు వచ్చిన కాల్ అందుకుని, సంభాషణ రికార్డు చేసుకొనే సదుపాయం.

ఇంకో కొత్త అంశం (మన దేశానికి సంబంధించి) వీడియో ఆన్ డిమాండు. అంటే ఓ రకంగా మొబైల్ వెబ్ కాం. మీరు మాట్లాడుతున్నప్పుడు వీడియో తీసి, స్ట్రీమింగ్ ద్వారా మీ మిత్రులకు పంపడం. మన దేశానికి అని ఎందుకు వాడానంటే, ఇది జరగాలంటే 3జీ నెట్వర్క్ తప్పనిసరి. భారతదేశం లో ఇంకా 3జీ నెట్ వర్క్ రాలేదు. (ప్రపంచం ఇప్పటికే 4జీ వైపు అడుగులేస్తున్నది).

ఇక వాల్యూ ఏడెడ్ సర్వీసెస్ విషయానికి వస్తే

పంచాంగం : కొంతమంది నెట్వర్క్ ఆపరేటర్లు ఈ సర్వీసు ఇప్పటికే ఇస్తున్నారు, ఎస్ ఎం ఎస్ ఆధారంగా. అంటే ఫలానా నంబరు కు ఎస్ ఎం ఎస్ చేసి, ఈ రోజు తిథి, నక్షత్రం వగైరా తెలుసుకోండి టైపు. ఐతే ఈ మధ్య వచ్చిన ఓ సాం సంగ్ ఫోన్లో ఈ సదుపాయం కాలెండరు కి అనుసంధానించేరు. అంటే, ఎస్ ఎం ఎస్ అవసరం లేకుండా, ఫోన్లో అంతర్భాగంగానే.మిగిలిన మొబైల్ ఫోన్లలోనూ ఇది మొదలవచ్చు.

ఎస్ ఎం ఎస్ ద్వారా వాణిజ్య ప్రకటనలు : మీ మొబైల్ ఫోన్లో మా ప్రకటనలను అనుమతించండి. మీకు ప్రకటనకు ఇంత చొప్పున ఇచ్చుకుంటాం అన్నది ఓ టైపు. (
http://www.m-earn.com/) ఇది కాక ఇంకో ఎస్ ఎం ఎస్ - 2 అనబడే స్టాండర్డ్ ఇప్పటికే రూపు దిద్దుకుంది. ఇది ఇంకా పూర్తిగా విజృంభించలేదు.

మొబైల్ బ్లాగింగ్ : ఇది ఆరంభ దశ లో ఉంది. రిలయన్స్ వారి సర్వీసు.

ఇవన్నీ కాక ఇంకా..స్త ముందుకెళితే ఎలా ఉంటుంది అని నా ఫ్రెండొకడితో ఓ సారి మాటల సందర్భంలో ఊహించేము. మా మాటల మధ్య ఓ అవుడియా దొర్లిందిలా..

భవిష్యత్తులో ఓ రోజు. మీరు ఏ సినిమాకో వెళుతున్నారు, సకుటుంబ సమేతంగా (ఆ డబ్బుతో ఓ మొబైల్ కొనుక్కోవచ్చు!). మీ ఇంటికి భద్రత లేదు. ఎలా??

మరేం ఫర్లేదు. మీ 'ఫలానా ' మొబైల్ ను వాకిలి కి కాస్త ఎడంగా బిగించి వెళ్ళండి. మొబైల్ ను ఆన్ చేసుంచండి. అలానే బ్లూ టూత్ ను కూడా.

మీ వాకిలికి ఓ సెన్సర్ ఉంది. మీ ఇంటికి దొంగ వచ్చి తలుపు కాస్త కదుపగానే వాకిలికి బిగించిన సెన్సర్ రంగం లోకి దిగుతుంది. అది కాస్త ఎడంగా తన కోసమే కాసుక్కూర్చున్న మొబైల్ కు కన్ను గీటుతుంది, బ్లూటూత్ ద్వారా. వెంటనే మీ మొబైల్, మీకు (మీ ఆవిడకు) ఎస్ ఎం ఎస్ పంపుతుంది. మీరు ఆఘమేఘాల మీద వచ్చి మీ ఇంటిని రక్షించుకుంటారు! లేదూ, కాస్త తక్కువ ధర ఉన్న ఫోన్ ఐతే ఓ అలారం మోగిస్తుంది. దాంతో దొంగ పరారు!

ఎలా ఉంది అవుడియా ?

సమాచార విప్లవం ఆగదు మరి. ఇప్పుడే ఇలా ఉంటే, రాబోయే తరంలో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహ కందకుండా ఉంది. ఎల్ కె జీ చదివే పిల్లలకే ఐ-ఫోన్ వాడకం కంపల్సరీ అనా ఆశ్చర్యం లేదు.

జరుగుతున్నది సమాచార విప్లవం.
ముందున్నది సమాచార (ఆర్) నారాయణ మూర్తుల తరం.


8 comments:

 1. Blog chala informative ga undi...
  kani oka chinna suggestion ...

  Change the color combination.... chadavataniki chala ibbandi ga undi

  ReplyDelete
 2. maa oollo oka service naaku baaga upayoga padina service entante vending machines nunchi coke etc konukkodam
  oka saari gontu endi pothunte, dollar billa dorakka chastunte, ee service viluva telisochindi

  ReplyDelete
 3. annattu maa oollo inko serice kooda naaku nachindi
  sms lo out of office setting chesukodam

  ReplyDelete
 4. 3జీ 4జీ నెట్వర్కుల గురించి ఇంకో టపా రాయండి. లేదంటే ప్రవీణ్ తో రాయిద్దాం.

  ReplyDelete
 5. am about to buy a mobile with camera having 3 Mega Pixels resolution.

  So which one would you recommend?

  ReplyDelete
 6. చక్కని సమాచారం... మీరు టెకీ టపాలు కూడా తరచూ రాయండి.

  @రానారె: 3జీ, 4జీ ల మీద నాకు తెలిసిన సమాచారం తక్కువ. రవి కి బాగా తెలిసనట్టుంది.

  రవి, ఇంకో టపా రెడీ చెయ్యండి మరి.

  ReplyDelete
 7. @ చక్రవర్తి గారూ:
  ఏ మొబైల్ కొనాలి. చెప్పలేనండి. మీరు మీ బడ్జెట్, మీ అభిరుచులు, ఇంకా మీక్కావలసిన సదుపాయాలు, వీటన్నిటినీ ఆలోచించుకుని, కాస్త గూగిలిస్తే, అంతర్జాలం లో చక్కటి సమీక్షలు కనబడతాయి., మీరే ఎన్నుకోవచ్చు.

  ఐతే, కొన్ని సూచనలు.

  మీరెందుకు మొబైల్ కమెరా కొనాలనుకుంటున్నారు?
  1. మీకు ఫోటొగ్రఫీ హాబీ.
  2. మీ ఫామిలీ కోసం (భవిష్యత్తు లో గుర్తుఒస్తున్నాయి అని పాడుకోవడం కోసం)
  3. క్రేజ్

  మీ సమాధానం 1 లేదా 2 ఐతే కమెరా కొనుక్కోవడం ఉత్తమం (ఖర్చు పెట్టగలిగితే). ఎందుకంటే, మొబైల్ కమెరా లలో రెసొలుషన్ ఉన్నప్పటికీ జూమింగ్ సదుపాయం ఉండదు. I mean, for the best resolution, no zooming facility in many digital mobile cameras.

  ఇక మీ సమాధానం క్రేజ్ ఐతే, ఇంకో సూచన.
  మీ డిజిటల్ కెమెరా మీద 3 ఎంపీ అని రాసుందా లేక 3 ఎంపీ ఎన్ హాన్సెడ్ అని జాగ్రతగా గమనించండి. 3 ఎంపీ ఎన్ హాన్సెడ్ అంటే, కెమెరా 2 ఎం పీ నే ఉంటుంది. కొన్ని ప్రత్యేక సాఫ్ట్వేర్ పద్ధతుల ద్వారా (డిదరింగ్, దిజిటల్ ఎన్ హాన్స్మెంట్) బొమ్మను 3 ఎం పీ గా మారుస్తారు సోనీ 550ఇ కె/జెడ్ ఇలాంటిదే. ఇందులో కాస్త బొమ్మ క్వాలిటీ ఒరిజినల్ 3 ఎం పీ లా ఉండదు. ఐతే ఖరీదు తక్కువ ఉంటుంది.

  ఇక కెమెరా క్వాలిటీ సెన్సర్ మీద ఆధర పడి ఉంటుంది. నాకు తెలిసి మొబైల్ కమెరా సెన్సర్ లలో తోషిబా పయనీరు. చాలా మొబైల్స్ లో వాడుతున్నారు.ఐతే సోనీ, తోషిబా దొందూ జపాను వే కాబట్టి, సోనీ వారి మొబైల్ మంచిది అని ఊహ.


  @ నర్సింగ రావ్ గారూ:
  నెనర్లు. మారుస్తున్నాను.

  @ అనానిమస్ గారూ :
  బావుంది. వెకేషన్ ప్రోగ్రాం అంటారు దీన్ని. మంచి సూచన నాకు :-)

  @ రానారె, ప్రవీణ్ :
  తొండ ముదిరితే ఊసరవెల్లి. మెకానికల్ ఎంజినీఉ ముదిరితే సాఫ్ట్వేర్ ఇంజినీరు. నేనీ కోవకు చెందిన వాణ్ణి :-)...నా మొహం, నాకేం తెలుసండీ 3జీ, 4జీ గురించి. భయంకరంగా రీసెర్చి చేసి రాయాలి. ఇంకో ఇబ్బంది. సాంకేతిక టపాలు రాస్తే, టపా ఉపయోగ పడాలి (ప్రవీణ్, వీవెన్ గారు, నల్లమోతు స్రీధర్ గారూ అలా రాయగలుగుతారు), నా విషయంలో ఐతే కేవలం నాకు తెలుసు అని రాసినట్టుంటుంది. :-) నాకు తెలిసిన సాంకేతిక విషయాలు ఎండ్ యూజర్ కు ఎలా ఉపయోగపడతాయో (ఉపయోగ పడేట్టు ఎలా రాయాలో)ఊహించలేక పోతున్నాను.

  ReplyDelete
 8. బాసూ .. కేక..

  నెనర్లు.. 3MP / 3MP Enhaced.. ఇలాంటివి కూడా ఉంటాయని ఇంతవరకూ నాకు తెలియదు .. ఏది ఏమైనా.. కొనేముందు మీలాంటి వారి సలహా ఎంతైనా పనికొచ్చేటట్టుంది.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.