Tuesday, May 27, 2008

బుజ్జి గాడు, మేడ్ ఫర్ మాస్

ఈ పాటికి జనాలు ఓ నిర్ణయానికి వచ్చేసుంటారు, ఇదో ముష్టి సినిమా అని. ఐతే ఎవరైనా, నాతో భావ సారూప్యం కలిగిన మాస్ ప్రజ ఉంటే వాళ్ళ కోసం ఈ రివ్యూ. దర్శక పూరీ ఈ సినిమా లో చెప్ప(చూపించ)దల్చుకున్నది కేవలం హీరోఇజాన్ని.ఈ సినిమా చూడాలంటే అది తప్ప మరో కారణం లేదు.

కథ : బుజ్జి, చిట్టి పూవు పుట్టగనే పరిమళించినట్లు, మరీ చిన్న వయసు లోనే ఒకరినొకరు ఇష్టపడుతుంటారు. చిట్టి ఓ రోజు బుజ్జి తో నాతో 12 ఏళ్ళు మాట్లాడద్దు అంది. దానితో బుజ్జి, బుజ్జి దేవదాసు గా మారి, చెన్నై పారిపోతాడు.

పారిపోయిన బుజ్జి, రజనీకాంత్ సినిమాలు చూసుకుంటూ, తీరిక వేళల్లో కోళ్ళ ఫారం లో ఫైట్స్ అవీ చేసుకుంటూ ఆరు పలకల బాడీ తోటి తిరుగుతుంటాడు. 12 యేళ్ళ తర్వాత చిట్టి కోసం వెతుక్కుంటూ వచ్చి, విలన్ల కళ్ళబడతాడు. ఓ కోటి రూపాయలకు శివన్న (మోహన్ బాబు) ను చంపడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. శివన్న ను అటాక్ చేయబోయి మధ్యలో దెబ్బలు తింటాడు. బుజ్జి ధైర్యం, దమ్ము మెచ్చుకుని, శివన్న తన దగ్గరే ఉంచుకుని వైద్యం చేయిస్తుంటాడు.

ఆ శివన్న చెల్లెలే చిట్టి. బుజ్జి, చిట్టి ఎలా కలుసుకున్నారనేదే మిగతా కథ.

ఈ సినిమాలో చెప్పుకోవలసింది., ప్రభాస్ (బుజ్జి) నటన. కాస్తో, కూస్తూ తనకి వప్పిన గోదావరి యాస. పూరీ మార్కు డవిలాగులు.
" కండక్ట్రూ, అద్దాలు అలా.. బద్దలు కొట్టుకుని మనుషులు బస్ బయటకు ఎగరడం చూసావా ఎప్పుడైనా?

"" డిప్రషను మెయింటయిను చేస్తున్నట్టున్నావ్? కొందరమ్మాయిలకు ఇది బావోదు. నీకు పర్లేదు. కంటిన్యూ ఐపో "

" టిప్పర్ లారీ స్కూటర్ ను గుద్దితే ఎలా ఉంటదో, నాతో పెట్టుకుంటే అలా ఉంటది. "

ఫోటోగ్రఫీ, రీ రికార్డింగూ బావున్నాయి. రెండవ హీరోయిను బావుంది, ఐతే ఒక్క పాట కూడా పెట్టకుండా వేస్టు చేసారు. సునీల్,కోటా, ఎంవీఎస్, ఆహుతి ప్రసాద్ తదితరులు ఓకే.ఇక చెప్పుకోకూడనివి, త్రిష , మోహన్ బాబు.

పూరీ కి ప్రకాష్ రాజ్ అరుపులు వినీ వినీ బోర్ కొట్టినట్టుంది. మోహన్ బాబు ని దింపాడు. కనీసం హరి అయినా బాగుండేదేమో.

ఈనను మొదట కరకు గా చూపించి, సడన్ గా సాధు జంతువు గా మార్చారు.దాంతో దెబ్బ తింది.

సందీప్ చౌతా మ్యూజిక్ 'ని 'కొట్టాడు. బాగా దెబ్బలు తగిలాయ్ దానికి.

ఈ సినిమా చూడాలంటే కింద రాసిన 'ఇఫ్ ' కండిషన్లు గుర్తు పెట్టుకోండి.
ఇఫ్ ( మీరు ఎటు తిరిగి తెలుగు సినిమా చూడాలనుకుంటున్నారు )

{

ఇఫ్ (మీ ఇంటి వద్ద మామూలు థియేటర్ - మల్టిప్లెక్స్ కానిది ఉంది)

{

ఇఫ్ (మీరు మాస్ సినిమాలు ఇష్టపడతారు - అంటే, కేవలం శెఖర్ కమ్ముల, యేలేటి చంద్ర శెఖర్ రేంజి కాకుండా కొంచెం కింద)

{

చూడండి.

}

}

ఎల్స్ ఇఫ్ (మీరు ఉన్న జీతాన్నంతా ఇ ఎం ఐ లకి అర్పించి, సోడెక్సొ లతో కడుపు నింపుకునే బడుగు మృదులాంత్రపు జీవి కాదు)

{

వెళ్ళి జేబుకు చిల్లు పెట్టుకోండి.

}

}

ఫైనల్ గా ఓ మాట. కంత్రీ, పరుగు ల కంటే ఈ సినిమా కాస్త బెటర్. ఇక మీరే ఆలోచించుకోండి.

5 comments:

 1. బాగుంది సమీక్ష. "సందీప్ చౌతా మ్యూజిక్ 'ని 'కొట్టాడు. బాగా దెబ్బలు తగిలాయ్ దానికి." :)

  అన్నట్టు, ఈ హరి ఎవరండి, శ్రీహరా?

  ReplyDelete
 2. "సందీప్ చౌతా మ్యూజిక్ 'ని 'కొట్టాడు. బాగా దెబ్బలు తగిలాయ్ దానికి. "

  సూపరు...

  నేనింతకీ ఏ సినిమాకి ముందు బలవ్వాలి చెప్మా ?

  ReplyDelete
 3. పరుగు, కంత్రి రెండూ చూసి దెబ్బతిన్నాను. వారాతం మూడు సెలవురోజులు దొరికినా బుజ్జిగాడిజోలికిపోలేదు. మళ్లీ ఏ గమ్యం లాంటి సినిమానో లేకపోతే ఏ కమ్ములో, ఏలేటో సినిమా తీసేదాకా అటువాపు వెళ్లకూడదనుకున్నాు.

  ReplyDelete
 4. నిజమే. మ్యూజిక్కు కొంచెం బాగున్నా కాస్తో కూస్తో మూలుగుతూ అన్నా నడిచేదేమో. గడిచిన వీకెండ్ కెళ్ళి బలి, మాతో సహా హాల్లో 25-30 మంది. ఇంకేం సాక్ష్యం కావాలి.

  ReplyDelete
 5. @చదువరి గారు : శ్రీహరే.
  @ప్రవీణ్, @రానారె : ఓ శివలింగం (బోడి)సలహా...ఆల్రెడీ చెప్పినట్టు డబ్బులు పెద్దగా బొక్క పడకుండా ఓ సాదా (నాన్ - మల్టిప్లెక్స్) లో చూడండి ఏదైనా..నాకు మల్టిప్లెక్స్ లో దాదాపు 1000 రుపాయలు తుప్పు వదిలింది (ఫామిలీ తో సహా వెళ్ళి).

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.