Tuesday, February 12, 2008

టీ9 కథా కమామీషు

చాలా రోజులుగా ఓ సాంకేతిక టపా రాయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. ఇందులో, చాలా వరకు మీకు తెలిసిన విషయాలు అయి వుండచ్చు, కొన్ని కొత్త విషయాలు నాకు తెలిసినవి జోడించడం జరిగింది.

టీ9 కి అర్థం టెక్స్ట్ ఇన్ 9 కీస్ అని.

మీరు వాడే మొబైల్ లో సరళ సందేశం పంపడానికి ఉద్దేశించబడ్డ ఎడిటర్ లో, ఓ ఎంపిక టీ9. మామూలుగా మీరు మీ సందేశాన్ని టైప్ చేయడానికి 2 పద్దతులు.

1. మల్టీ టాప్ పద్ధతి.
2. టీ9 లేదా, డిక్షనరీ.

మొదటి పద్ధతి లో, వుదాహరణకు, మీరు 'బెట్' అనే పదం టైప్ చేయాలంటే, మీరు ఈ సీక్వెన్సు పాటించాలి.
2 (2 సార్లు), 3 (2 సార్లు), 8 (1 సారి)

ఇక టీ9 విషయానికి వస్తే, (మీరు డిక్షనరీ మోడ్ లో వుంటే) ఇదే పదాన్ని టైప్ చేయడానికి 2,3,8 ఒక్కోసారి టైప్ చేస్తే చాలు. మీక్కావలసిన పదం రెడీ.

ఈ టీ9 లో పదాల ఎంపిక రెండు విభిన్న తరహాలలో జరుగుతుంది.

1. ప్రెడిక్టివ్ టెక్స్ట్. (వూహాత్మక వ్యాఖ్య అందామా?)
2. కాంటెక్స్ట్ బేస్డ్ టెక్స్ట్.(సందర్భోచిత వ్యాఖ్య)

ఇందాక మనం చర్చించుకున్న 'బెట్ ' పదం ప్రెడిక్టివ్ టెక్స్ట్ కి చెందుతుంది. ఈ టీ9 లో మీరు మీకు కావలసిన పదాన్ని కూడా జోడించుకోవచ్చు. ఎలా అన్నది ఇది మీరు వాడుతున్న మొభైల్ అనుసరించే విధానం బట్టి వుంటుంది. వుదాహరణకు ఎల్జీ వారి మొబైల్ లో, మీక్కవలసిన పదాన్ని, మల్టీ టాప్ పద్ధతి లో టైప్ చేసి, మోడ్ ను టీ9 లో మార్చుకుంటే (* కీ నొక్కడం ద్వారా) చాలు.

ఇంకో విషయం. ఒక్కోసారి, మీకు కావలసిన పదం యొక్క కీ సీక్వెన్స్ లో, వెరే పదాలు వుండే అవకాశం కూడా వుంది. ఉదాహరణకు, మీరు 'హోం ' అనే పదం టైప్ చేయాలనుకోండి. 4,6,6,3 టైప్ చేయాలి. అయితే, మీకు కనబడే పదం 'గుడ్ ' అని వుంటుంది. ఎందుకంటే, గుడ్ అని టైప్ చేయాలంటేనూ, 4,6,6,3 వాడాలి. అయితే, టీ9 , మీకు కావలసిన పదాన్ని వాడుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇక్కడ మళ్ళీ, మీరు వాడే మొబైల్ అనుసరించే విధానం బట్టి ఈ సౌలభ్యం వుంటుంది. వుదాహరణకు, సొనీ ఎరిక్సన్ లో అయితే, మీరు 4,6,6,3 టైప్ చేయగానే, మీకో డ్రాప్ డవున్ మెను కనిపిస్తుంది. మోటొరోలా లో, స్క్రీను కింద భాగాన పదాలు కనిపిస్తాయి.

ఇక కాంటెక్స్ట్ బేస్డ్ టెక్స్ట్.(సందర్భోచిత వ్యాఖ్య) గురించి తెలుసుకుందాం.

మీరు ఓ సరళ సందేశం లో 'ఐ లవ్ యూ ' అన్న వాక్యం వాడారనుకోండి. తరువాత సందర్భంలో, మీరు 'ఐ' అన్న పదం టైప్ చేసి, స్పేస్ (ఖాళీ) నొక్కగానే, మీ ఎడిటర్ మీకు 'లవ్ ' అనే పదం సూచిస్తుంది. మీకు అదే పదం కావాలనుకుంటే, రైట్ కీ నొక్కడం ద్వారా దాన్ని ఎన్నుకోవచ్చు, లేదూ, మరో కొత్త పదాన్ని టైప్ చేసుకోవచ్చు.

కొత్తగా వుంది కదూ. ఈ సౌలభ్యం నాకు తెలిసి, కేవలం ఎల్జీ వారి రిలయన్శ్ మొబైల్ లో మాత్రమే లభ్యం.

ఇంకో ఉపయోగం. ఓ పదం లో మొదటి అక్షరం మీకు తెలుసు. క్రితం సారి అదే అక్షరం తో యే పదాన్ని మీరు ఉపయోగించారు తెలుసుకోవాలి. ఇందుకు మీరు చేయవలసింది, మొదటి అక్షరం నొక్కిన తర్వాత '0 ' టైప్ చేయడమే.

టీ9 లో వున్న ఇంకో వుపయోగం, మీరు యే మోడ్ లో వున్నా, మధ్యలో, మీరు ఓ నంబరు వాడుకోవాలంటే, వుదాహరణకు 'టీ 9 ' అనే పదాన్నే తీసుకోండి. 'టీ ' తర్వాత 9 కావాలంటే, మళ్ళీ నంబర్ మోడ్ కు మారవలసిన అవసరం లేకుండా, '9 ' కీ ని నొక్కి పట్టుకోండి. మీకు 9 నంబరు దొరుకుతుంది. ఈ సౌకర్యం కూడా అన్ని మొబైల్స్ లో లేదనుకుంటాను. 'ఆల్ఫా లాంగ్ కీ ' అంటారు దీన్ని సాంకేతిక పరిభాషలో.

ఇంకో విషయం. ఈ టీ9 దిక్షనరీ సదుపాయం మిగతా భాషల్లో కూడా వుంది. మన తెలుగు లో (టీ9 వెర్ 7.2.1) కూడా. అయితే, నాకు తెలిసి, తెలుగు సదుపాయం ఓ సాం సంగ్ మొబైల్ లో మాత్రం చూసినట్టు గుర్తు.

టీ9 గురించి మీకు ఇంకా వివరాలు, ఉపయోగాలు కావలంటే www.t9.com లంకె కు వెళ్ళండి.

5 comments:

 1. This is very good info. Thanks for sharing.
  -Phani

  ReplyDelete
 2. చాలా మంచి విషయం పంచుకున్నందుకు మీకు క్రుతజ్ణతలు...

  ReplyDelete
 3. ఇన్ఫర్మేటీవ్ గా ఉంది.
  నాకసలు సరళ సందేశం పంపే అలవాటే లేదు కనక టీ9 వాడనవసరమే రావట్లేదు :)

  ReplyDelete
 4. నేను మల్టీ టాప్ కన్నా టీ9 నే ఎక్కువ ఉపయోగిస్తాను. మీ వ్యాసం బాగుంది కాని డైరక్టు గా విషయం లో కి వచ్చేశారు దాని తో Context ఏమిటో తెలియక తికమక పడ్డాను.Intro కొంత ఉంటే ఇంకా బాగుండేది.

  ReplyDelete
 5. మీ సూచన బావుంది. నాకూ ఒకింత అలానే అనిపించింది మొదట్లో, లెంత్ ఎక్కువ అయితే,ఆర్ట్ సినిమాలా అవుతుందేమో అనిపించి, కుదించడం జరిగింది. వచ్చే సారి గుర్తుంచుకుంటాను.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.