Thursday, December 27, 2007

పోకిరీ ... భవ హారీ ...

మేము మొన్నామధ్యనే ఇల్లు మారాము మా వూళ్ళో. కొత్త ఇల్లు సదుపాయంగానే వుంది. ఇంటి పక్కన ఓ భజన మందిరం కూడాను. అంటే, రాముల వారి ఓ చిన్న గుడి. అంతా బాగుంది అని సంబర పడుతుంటే, ఓ శని వారం వచ్చింది. ఆ శని వారం నిజంగా మాకు 'శని ' వారమే.

ఆ రోజు రాత్రి దాదాపు 7:30 కావస్తొంది. నక్కల వూళలు ఏమి లేవు. ఆ రోజు పౌర్ణమి. ఇంట్లో అంతా యేదో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాము చూస్తున్నాము టీవీ లో. వున్నట్టుండి, భజన మొదలయ్యింది., రాముల వారి గుడి లో.

కర్ణపుటాలు బద్దలయేలా మైకులో గొంతు.
" రామ నామము రామ నామము, రమ్యమైనది రామ నామము.."

పాట పూర్తవగానే ఇంకో పాట.
" గణేశ శరణం, శరణం గణేశ..."

పాట సాగే కొద్దీ, గొంతు లో పిచ్ కూడా అధికం అవసాగింది.

ఆ శబ్దాన్ని నిరోధించడానికి నేను మా ఆఫీసులో క్రైసిస్ మానేజిమెంట్ (ప్రాజెక్ట్ మానేజరు ద్వార అధికముగా వుపయోగించబడు ఓ శబ్దము) తెలివి వుపయోగించా..

ఫాను స్పీడు ఎక్కువ చేసా...మా ఇంట్లో ఫాను తిరిగితే శబ్దం వస్తుంది. గాలి రాదు.

ఈ లోగా, అభిఙ్ఞ వర్గాల ద్వారా, కనుక్కున్న భోగట్టా యేమంటే, భజన రాత్రి అంతా కొనసాగుతుంది !

భజన మందిరం లో కొత్త గొంతు. అలానే పాట కూడా రొటీన్ కి భిన్నంగా వుంది.

" కార్తీక మాసములో..., శివ దేవుని సన్నిధిలో...
కొలిచెదము, నిను తలిచెదము.... "

అరె..ఈ పాట ఎక్కడో విన్నానే అనుకుంటుంటే, గుర్తొచ్చింది. ఈ పాట నేను చిన్నప్పుడు ఆకాశ వాణి కడప కేంద్రం లో యెప్పుడు వస్తుండేది. SP బాలు, P. సుశీల ల పాట (లాంటిది)

"చిరునవ్వుల తొలకరిలో...సిరి మల్లెల వలపులలో...
కలిసెనులే, తొలి హ్రుదయాలే, చిరు వలపుల కలయికలో..."

అయితే కాసేపటి తర్వాత ఓ ఊహించని ట్విస్టు.

"ముక్కంటీ..ముక్కొపీ..ఓ దేవా..మమ్ము బ్రోవా.."
(పాట సరిగా గుర్తుకు లేదు, అయితే రాగం మాత్రం అలాంటిదే)

మీకు గుర్తుకు వచ్చుండాలి. ఇది యే పాటో..అవును మీరు కరెక్టే..
(scroll చేయనవసరం లేదు).

" ముక్కాల ముఖాబ్ లా లైలా.."

ఇలా భజన అంతకంతకూ తీవ్ర స్థాయి దాల్చసాగింది.

నా క్రైసిస్ మానెజిమెంటు టెక్నిక్, మా ఆఫీసు లో లాగానే పని చేయలేదు.

ఇలా కాదనుకుని, మా కంపనీ హెచ్ ఆర్ వారు నుడివిన సుభాషితా రత్నావళి తలుచుకున్నా..ప్రో యాక్టివ్ గా ఆలోచించాలి యెల్ల వేళలా అన్న ఓ సూక్తి గుర్తొచ్చింది.

ఆచరణలో పెట్టా... (నేను అర్థం చేసుకున్న విధానం ఒప్పో కాదో నాకు తెలీదు).

ఓ బ్లాక్ బస్టరు సినిమా పాట ను భక్తి గీతం గా మలిచా ఆ రాత్రంతా కూర్చుని. ఆ ఓరిజినల్ పాట, అదే రాగం లో నేను కష్టపడి రాసిన భజన కింద ఇస్తున్నాను.

ఓరిజినల్ పాట:

డోలె డోలె దిల్ జర జరా
నిను ఓర ఓర గాని నరవరా
జాగు మాని చేయ్ కలపరా
జత చేరి నేడు జతి జరుపరా

జర జల్ది జల్ది పెందలకడనే రారా
వడి ఆంత రంగ సంబరమునకే రారా

రాలుగాయివే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడ నిశి కేళి వేళ చిత్త చోరా

చలేగ చలేగ యెహ్ హైన్ ఇష్క్ క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కొ దీవాన
చలేగ చలేగ యెహ్ హైన్ ఇష్క్ క జమాన
కరేగ కరేగ హర్ దిల్ కొ దీవాన

అనువుగా అందిస్తా సొగసుని సందిస్తా
పొదుగుతు కుదురుగ నీలోనా
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
దిల్బర్ దేఖో నా

మిసమిస కన్నే కొసరకు వన్నే వలపుతో వలపన్నీ
నఖశిఖలన్ని నలుగును పన్నే కలబడు సమయాన్నీ

ఒడికి త్వరగా యే..బరిలో కరగా యే..ఒడికి త్వరగా యే..బరిలో కరగా
(Shake it wanna shake it up babe!!)

============================================

నా పాట :

భోలె భోలె ఓ భవ హర
మా మొరలు గనర ఓ సురవరా
జాగు మాని మము బ్రోవరా
గతి నీవె మాకు విశ్వేశ్వరా

మా పూజలన్ని గైకొనగా లేరా
వడి ఆంగ రంగ వైభవముననే రారా

మా మల్లికార్జునుడవు నీవేనురా సారంగపాణి శ్రీ కాళేస్వరా, హే హిమవతనయ చిత్త చోరా

చలేగ చలేగ యెహ్ హై భజన్ క జమాన
మిలెగ మిలెగ యు హి ముక్తి సుహన
చలేగ చలేగ యెహ్ హై భజన్ క జమాన
మిలెగ మిలెగ యు హి ముక్తి సుహన

మనసును అర్పిస్తా స్వాసను బంధిస్తా
బుద్ధిని కుదురుగ నీపైన
ముడుపుతొ మెప్పిస్తా ఒడుపుతొ ఒప్పిస్తా
దిల్బర్ దేఖో నా

మిసమిస వన్నే బుసలను చిమ్మే నాగభరణాన్ని
నఖశిఖలన్ని మసివది పోయి నంది వాహనము తోడి

భువికి త్వరగా యే..
మా మనసు కరుగా యే..
భువికి త్వరగా యే..
మా మనసు కరుగా యే..

(Shake it wanna shake it up babe!!)

==================================

వచ్చే శని వారం భజన అంటూ జరిగితే నేను ఆ భజన లో పాల్గొనడమో ., లేదా, ఆ భజన వీరులలో ఎవరికైన ఈ భజన వినిపించడమో చేయాలి అనుకుంటూ, మరుసటి రోజు పొద్దున 4 గంటలకు నిద్ర పడుతుండగా అనుకున్నా...

(ఎవ్వరి మనసు నొప్పించడం వుద్దేశం కాదు, సరదాగ నవ్వుకోడానికి మాత్రమే. అయితే, ఇందులో కొన్ని మాత్రం నిజాలే. ఇలా పాట రాయడం తప్పేమో మరి, అయితే, ప్రతీకారం తీర్చుకోక పోతె, నా సీమ రక్తం వూరుకునేటట్టు లేదు. పైగా ఇలా రాత్రుళ్ళు దేవుని పేరు మీద జనాల నిద్ర చెడగొట్టడం కూడా విఙ్ఞత అనిపించుకోదు.)

22 comments:

 1. chaala baagundhi mee paata.... kaani oka chinna doubt. ikkada meeru cheppindhi antha nijamena? :)

  ReplyDelete
 2. చాలా బాగుందండి , మీ పాట భజన సంఘం వారెవరైనా చూస్తే ఈ సారి భజనలో కొత్త పాట చేరుతుంది .

  ReplyDelete
 3. kevvu keka....

  vignata spelling maarchandi... kudirinappudu

  ReplyDelete
 4. అప్పుడే కాపీరైటు హక్కులు తీసేసుకోండి మీ పాటకు....
  లేదంటే వచ్చే శనివారం ఈ పాటే వింటారు మీ గుళ్ళో.

  ReplyDelete
 5. too gud andi. keep rocking. akasa vani kadapa kendranni inka gurtu vunchukunanduku naa joharlu.

  ReplyDelete
 6. ఒక్క రోజు కే హింత పని చేసేసారంటే అక్కడే ఉంటే....

  ReplyDelete
 7. ముక్కాలా .. ముక్కాబలా .. హ హ్హ హ్హ
  శివుడు ప్రభుదేవా చేసేలాంటి జిలేబీ మెలికలు తిరుగుతున్నట్టు ఊహించుకుంటేనే ..

  ReplyDelete
 8. నో...
  ఇలా జరగడానికి వీల్లేదు....
  చైనీస్ టార్చర్ కి ఇండియన్ టార్చర్ ఏం తీసిపోదు...

  ReplyDelete
 9. నమస్తే అన్నా! :))) భక్తిపాట భళాభళీ!!
  కైలాసాన్ని కూసాలతో సహా కదిలించేటట్టుంది.

  ReplyDelete
 10. రానారె,
  :-)).

  అనానిమస్ గారు, నిజంగానే జరిగింది. ఆ పాట కూడా ఆ వేదన లోనే పుట్టింది.

  కొత్తపాళీ గారు, మీ వూహ కు జోహార్లు. :-))

  వరప్రసాద్, రాధిక, శ్రీనివాస్, ప్రవీణ్, కార్తిక్, రమ్య, రాకేశ్వర రావ్ గారు,

  మీకందరికీ ధన్యవాదాలు.

  ReplyDelete
 11. అయ్య బాబోయ్, మీ పాట అదిరిపోయిందండి. బ్లాగాడిస్తా అంటే ఏమో అనుకున్నా, ఇరగదీసేసారు. ఆ మర్నాటి సాయంత్రం ఏమయ్యిందో తెలుసుకోవాలని ఉంది.
  - మీ క్రొత్త అభిమాని శ్రీనివాస్

  ReplyDelete
 12. ఓహ్.. ఇది మీ టపానా? నేను తెలుగు బ్లాగు పుస్తకంలో చదివాను. భలేగా రాశారు. నాకు వినాయక మండపాల దగ్గర, అయ్యప్ప పూజలు దగ్గర మీ టపా చట్టుక్కున గుర్తొచ్చి, పుసుక్కున నవ్వు వస్తుంది. :-)

  ReplyDelete
 13. మా ఊరు గుర్తుకు తెప్పించారు. నేను మా ఊర్లో ఉన్నప్పుడు, మా ఇంటికి దగ్గర ఉన్న గుడిలో ఒక్క శనివారమేమిటీ, ఏకాదశి, పండగలు, పర్వదినాలు అంటూ భజనలతో చుక్కలు చూపించేవాళ్ళు. అలాగె పొద్దున్నే 5 గంటలకు "రాములమ్మ" పాట పెట్టే వారు.
  నీ కొండకొచ్చినం, నీకు టెంకాయ్ కొట్టినం.
  ఓ...వెంకటేశా...శ్రీనివాసా అని.

  ReplyDelete
 14. నా ఈ టపా ఇప్పుడు తవ్వకాల్లో ఎవరు వెలికి తీసారబ్బా?
  ఇలాంటివి నాకు ఇష్టం, బాగా రాశాను (రాసే వాణ్ణి). అనవసరంగా, రామాయణాలు, ఓషోలు వీటిలోకి దిగాను. ఖర్మ.

  పూర్ణిమ, రానారె, నాగప్రసాద్ : గుర్తు చేసినందుకు వందల నెనర్లు.

  ReplyDelete
 15. ravi gaaru..late ga chadivaa aina sare late comment...meee veeravesam talchukoni navvochindi.meee pata konchem pichi ga unna ,manage chesaaru..ika vaalla patalu aithe karna kathoram

  ReplyDelete
 16. oho superoooo super super ante super anthe!inkaa ilaantivi vunte cheppandi please

  ReplyDelete
 17. హహహ భలే రాసారు. మీ పాట నిజంగానే బావుంది !

  ReplyDelete
 18. ఓ ఐదు సంవత్సరాలు మాత్రమే ఆలశ్యంగా ఈ వెబ్ సైట్ చూస్తున్నాను. భజన పాటల గురించి చాలా బాగా వ్రాసారు. అటువంటి కార్యక్రమాలు చుట్టుపక్కలవారికి ఎంత బాధాకరమో నేను అనుభవించినవాడినే. కాని ఇటువంటి వ్యాసాలు వ్రాసేవాళ్ళు ఎందుకని చివర్లో "ఎవరినీ ఉద్దేశ్యించి కాదు. . సరదాగా నవ్వుకోటానికి మాత్రమే" అని అంత apologetic గా వ్రాస్తారు? సంఘంలో ఉన్న ఇటువంటివి ఎత్తిచూపిస్తున్నప్పుడు క్షమాపణలు చెప్పవలసిన అవసరం లేదని నా అభిప్రాయం.

  ReplyDelete
 19. "పోకిరీ.. భవహారీ.." అన్న టైటిల్ చదివే ఒక ఐదు నిముషాలు నవ్వుకున్నా... ఈ పోస్టు మహా "ప్రమాదం" (తెలుగు, తమిళ్ కూడా). ఆఫీస్ లో ఉన్నప్పుడు చదవడం అస్సలు మంచిది కాదు. ఇలాంటి భజన పాటొకటి నే కూడా విన్నా చిన్నప్పుడు -

  హారతీ జయహారతీ
  హారతీ శుభహారతీ
  భక్తులు కలసీ దేవికి పట్టే ఆరతీ...
  గైకొనుము తల్లీ గైకొనుము తల్లీ
  అమ్మా..!

  దీనికి మూలం ప్రేమాభిషేకంలోని

  వందనం అభివందనం
  నీ అందమే ఒక నందనం
  నిన్నకు నేడుకు సంధిగ నిలిచిన సుందరీ
  పాదాభివందనం పాదాభివందనం
  సారీ..!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.